"మీరు ఎవరైతోనైనా స్నేహం చేసేముందే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఒకసారి స్నేహం చేశాక, ఆ వ్యక్తిలో మీకు చాలా తప్పులు కనిపించొచ్చు. వీలైతే సరిదిద్దండి. లేదంటే జన్మాంతం భరించండి!"
స్వరాభిషేకం ప్రోగ్రాంలో అనుకుంటాను... యస్ పి బాలు చెప్పిన ఈ విషయం నాకెప్పుడూ గుర్తుంటుంది. ఆ వీడియో బిట్‌ని కూడా రెండుమూడు సార్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. ఒకరిద్దరితో దాని గురించి చెప్పాను కూడా.
చెప్పింది యస్ పి బాలు కాబట్టి ఆ మాట అంత బాగా గుర్తుంది నాకు.
వందలాదిమంది ఆహూతుల సమక్షంలో, స్టేజీ మీద యస్ పి బాలు చెప్పిన ఈ అద్భుతమైన మాటను, ఆయనకు అంతకు ముందెప్పుడో రామోజీరావు చెప్పారట.
కట్ చేస్తే -
ఇట్లా నేను ఒకరిని భరిస్తున్నాను. బహుశా నన్ను కూడా ఎవరైనా ఇలాగే భరిస్తూండవచ్చు.
- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 75/100.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani