ఫ్లయిట్ అలవాటు కాకముందు నాకు ఫ్లయిట్ అంటే చాలా భయంగా ఉండేది. నేను ఎక్కువగా తిరిగిన చెన్నై, ముంబై ఫ్లైట్స్‌లో ఆ ఒక్క గంటకే నా మైండ్ డైవర్ట్ చేసుకోడానికి చాలా చేసేవాణ్ణి. నోటింగ్ ప్యాడ్‌లో రాయడమో, ఏదైనా బుక్కో మ్యాగజైనో చదవడమో, మొబైల్లోని నోటింగ్ యాప్‌లో ఏదైనా టైప్ చెయ్యడమో... ఏదో ఒకటి చేస్తూ... మొత్తానికి ల్యాండ్ అయ్యిందిరా బాబూ అని రిలాక్స్ అయ్యేవాణ్ణి.
అలాంటి స్టేజ్ నుంచి, ఎవరైనా వైజాగ్‌కి ట్రెయిన్లో వెళదాం అంటే, "ఎందుకు, ఫ్లైట్లో వెళ్దాం" అనేసే వరకు నాకు బాగా అలవాటైపోయింది ఫ్లయిట్.
ఆమధ్య యు యస్ వెళ్ళినప్పుడు కూడా, సుమారు 26 గంటల ఫ్లయిట్ జర్నీ కూడా నన్నేం భయపెట్టలేదు.
కట్ చేస్తే -
నిన్నటి అహ్మదాబాద్ బోయింగ్ ఫ్లయిట్ దుర్ఘటన నిజంగా దారుణం.
ఎంతమంది కలలు ఎలా కొన్ని సెకన్లలోనే బూడిదైపోయాయి?
ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది... జీవితం గాలి బుడగ లాంటిది కదా అని. ఎప్పుడు టప్ మంటుందో ఎవ్వరికీ తెలీదు.
In the blink of an eye, everything can change. Life gives no warnings.
- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 55/100.
ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది... జీవితం గాలి బుడగ లాంటిది కదా అని. ఎప్పుడు టప్ మంటుందో ఎవ్వరికీ తెలీదు.
In the blink of an eye, everything can change. Life gives no warnings.
- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 55/100.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani