ఈరోజు మా ఇంటి నుంచి ఆఫీసుకి వెళ్తున్నప్పుడు రోడ్లన్నీ రోజులాగే రొటీన్‌గా, బోసిగా కనిపించాయి.
ఇది నేను ఊహించలేదు.
ప్రభుత్వం, పార్టీ ఏదున్నా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం అనేది ఒక మినిమమ్ ఆనవాయితీ.
జెండాల్లేవు, బ్యానర్స్ లేవు, ఫ్లెక్సీల్లేవు, రోడ్ల వెంట తెల్ల సున్నం లేదు. ఇవ్వాళ రాష్ట్ర అవతరణ దినోత్సవం అని తెలిపే ఎలాంటి సెలబ్రేషన్ లుక్ లేదు. (ఉంటే గింటే ఆ సెక్రెటేరియట్ చుట్టుపక్కల ఉండొచ్చు. అది లెక్కలోకి రాదు.)

రియల్ ఎస్టేట్ రంగం చచ్చుపడిపోయింది. అన్ని బిజినెస్‌లు డౌన్ అయ్యాయి. గచ్చిబౌలి, హైటెక్‌సిటీ వంటి హై ప్రొఫైల్ ప్రాంతాల నుంచి, చిన్న చిన్న లొకాలిటీల్లో కూడా బిజినెస్‌లు మూతపడిపోయి వందలాది "టు లెట్"లు దర్శనమిస్తున్నాయి.
ఎక్కడా మనీ ఫ్లో లేదు. ఎక్కడా ఎలాంటి ప్రోగ్రెస్ కనిపించదు.
రాజకీయాలు మారొచ్చు. పాలకులు మారొచ్చు. కాని, వారి కింద పనిచేసిన అధికారులు మారిపోయారా? ఎందుకిలా?
ఇక్కడెవ్వరూ శాశ్వతం కాదు.
ఒక్కరే, ఒక్క పార్టీనే పాలించాలని రూలేం లేదు. కాని, ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు రాష్ట్రాన్ని ఎవరైనా ఎంత అభివృద్ధి చేయాలి?
రాజకీయాలు ఎలా ఉన్నా రాష్ట్రాభివృద్ధి కదా ముఖ్యం?
ఒక్కరే, ఒక్క పార్టీనే పాలించాలని రూలేం లేదు. కాని, ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు రాష్ట్రాన్ని ఎవరైనా ఎంత అభివృద్ధి చేయాలి?
రాజకీయాలు ఎలా ఉన్నా రాష్ట్రాభివృద్ధి కదా ముఖ్యం?
చాలా బాధనిపించింది.
ముందు కేసీఆర్ మీదే కోపమొచ్చింది. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల మీద కోపం వచ్చింది. తెలంగాణ కోసం పోరాడిన లక్షలాది ఉద్యమకారుల మీద, విద్యార్థుల మీద, రచయితలు-కవులు-కళాకారుల మీద, వేలాది తెలంగాణ ఎన్నారై కార్యకర్తల మీద ఎక్కడలేని కోపమొచ్చింది.
ఇందుకోసమేనా మీరంతా తెలంగాణ కోసం కొట్లాడి సాధించుకొన్నది అని.
అంతిమంగా...
పనిచేస్తున్న ప్రభుత్వాన్ని నిర్దాక్షిణ్యంగా పడగొట్టి... అంతకు మించిన అద్భుతమైన ఇంకేదో మార్పును ఆశించిన తెలంగాణ ప్రజలపైన ఎనలేని జాలి కలిగింది.
పనిచేస్తున్న ప్రభుత్వాన్ని నిర్దాక్షిణ్యంగా పడగొట్టి... అంతకు మించిన అద్భుతమైన ఇంకేదో మార్పును ఆశించిన తెలంగాణ ప్రజలపైన ఎనలేని జాలి కలిగింది.
- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 40/100.
100 Days, 100 Posts. 40/100.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani