కమర్షియల్ సినిమానా, కాన్స్‌కు వెళ్లే సినిమానా... చిన్న సినిమానా, భారీ బడ్జెట్ సినిమానా... కొశ్చన్ ఇది కాదు. నువ్వు చేస్తున్న సినిమాలో నీకెంత ఫ్రీడమ్ ఉంది? నువ్వేం చేయగలుగుతున్నావు అన్నదే అసలు ప్రశ్న.
తను అనుకున్న జీవనశైలిని సృష్టించుకోడాన్ని మించిన ఆనందం ఇంకొకటి ఉండదు. అది బిచ్చగాడయినా ఒకటే. బిలియనేర్ అయినా ఒకటే. ఎవడి పిచ్చి వాడికానందం.
మరోవిధంగా చెప్పాలంటే - అది సినిమానా, పుస్తకాలా, పెయింటింగా, ఇంకొకటా అన్నది కూడా కాదు ప్రశ్న. నువ్వు చేస్తున్నపనిలో నీకెంత ఆనందం ఉంది అన్నదే అసలు ప్రశ్న.
ఆ ఆనందమే స్వేఛ్చ. ఆ స్వేఛ్చకోసమే అన్వేషణ.
అది నేనయినా, నువ్వయినా, ఎవరయినా.
ఇంతకుముందులా ఇప్పుడు సినిమాలంటే ప్యాషన్ ఒక్కటే కాదు. ఒక పాష్ ప్రొఫెషన్. ఒక ఎఫెక్టివ్ అండ్ పవర్‌ఫుల్ ప్లాట్‌ఫామ్. ఇది నేపథ్యంగా ఉంటే చాలు... దీనికి అవతల ఎన్నో సాధించడం మనం ఊహించనంత సులభం అవుతుంది.
మనలో చాలా మంది, అవకాశం ఉండి కూడా అనవసరంగా ఇంత మంచి ప్లాట్‌ఫామ్‌ను అశ్రధ్ధ చేస్తారు. అసలు పట్టించుకోరు. ఎవరో ఏదో అనుకుంటారనో, లేదంటే మనం చేసే ఒక పని, మనమే చేసే ఇంకోపనిమీద వ్యతిరేక ప్రభావం చూపిస్తుందనో అనుకొంటారు. అదంతా ఉట్టి అవివేకం. దేని దారి దానిదే.
మన గురించి అనుకునేవాళ్లెవరూ మన ఫోన్ బిల్స్ కట్టరు, మన ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయరు. అవసరంలో మనల్ని ఆదుకోరు. అలాంటి ఎవరో ఏదో అనుకుంటారని మనం అనుకోవడం పెద్ద ఫూలిష్‌నెస్.
ఈ యాంగిల్‌లో చూసినప్పుడు, అనవసరంగా మనల్ని మనమే అణగతొక్కేసుకుంటున్నామన్నమాట!
ఈ యాంగిల్‌లో చూసినప్పుడు, అనవసరంగా మనల్ని మనమే అణగతొక్కేసుకుంటున్నామన్నమాట!
అదొక పనికిరాని మైండ్‌సెట్. జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో మనకు అడుగడుగునా అడ్డుపడే మైండ్‌సెట్. జీవితంలో ఆనందాన్ని అనుభవించనివ్వని మైండ్‌సెట్.
కట్ చేస్తే -
సినిమా ఇప్పుడొక బిగ్ బిజినెస్.
ఇండస్ట్రీలో సక్సెస్ స్టోరీలనే ఆదర్శంగా తీసుకో. ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకో. నెగెటివ్ మనుషులు, నెగెటివ్ వాతావరణం నీ చుట్టూ లేకుండా చూసుకో. ఖర్మకొద్దీ మనచుట్టూ ఎక్కువగా ఉండేది వాళ్ళే. ఎప్పటికప్పుడు ఫిల్టర్ వేసి చూసుకో.
అండ్, ఫైనల్లీ... చిన్న సినిమానా, పెద్ద సినిమానా అన్నది అసలు ఆలోచించకు. ఎప్పుడూ ఒక సినిమా చేస్తుండటం ముఖ్యం. ట్రాక్ మీదుండటం ముఖ్యం. లైమ్‌లైట్‌లో ఉండటం ముఖ్యం. ఇదొక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది.
In cinema, no one gives you a chance—you take it. Be so bold that the screen can't ignore you.
- మనోహర్ చిమ్మని
చాలా బాగా చెప్పారు. సినిమాల గురించి తెలుసుకోవాలంటే మీ బ్లాగ్స్ చదివితే చాలు.వేరే పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు.
ReplyDeleteThank you so much sir. So nice of you.
Delete"ఎప్పుడూ ఒక సినిమా చేస్తుండటం ముఖ్యం. ట్రాక్ మీదుండటం ముఖ్యం. లైమ్‌లైట్‌లో ఉండటం ముఖ్యం"
ReplyDeleteనిజమే నండి. కాని తరచు శ్రమ వృధా అవుతూ ఉంటే లైమ్ లైట్ రాదు కదా?