Wednesday, 2 January 2013

లోన్ వుల్ఫ్

నేను పూర్తిగా సినిమా మనిషిని కాదు. ఈ బ్లాగ్ లోని కొన్ని పోస్టులు చదివితే ఈ విషయం మీకు ఇట్టే తెల్సిపోతుంది. ఏదో బై మిస్టేక్ ఇటుగా వచ్చాను. వచ్చినందుకు ఇరుక్కుపోయాను. కారణాలు ఏవయితేనేం - నేను అనుకున్నది చేయలేకపోయాను ఇక్కడ.

మొట్టమొదటిసారిగా - ఎవరి హామీల మీదా నమ్మకం పెట్టుకోకుండా, పూర్తిగా, అన్ని బాధ్యతలు నేనే తీసుకుని - ఒక మైక్రో బడ్జెట్ సినిమా చేయబోతున్నాను. "అంతా ఓకే... ఆల్ హాప్పీస్ " అనుకుంటున్న సమయంలో చిన్న జెర్క్ ఒకటి మొన్న(31 నాడు) ఫోన్ రూపంలో! నో ప్రాబ్లమ్. ఓ రెండు రోజుల తర్వాత ఫేస్ చేయబోతున్నాను.

ఇంకా చెప్పాలంటే, ఈ చిన్న చిన్న జెర్కులు ఏవీ నన్నూ, నా ఇప్పటి కమిట్ మెంట్ ను ఆపలేవు. నాకు తెలుసు ఆ విషయం.

నేను ముందే ఇంకో బ్లాగ్ పోస్ట్ లో చెప్పినట్టు - ఈ సీరీస్ లో మొదటి సినిమా షూటింగ్ ప్రారంభమయిన రోజునుంచి
సరిగ్గా 9 నెలల్లో 3 మైక్రో బడ్జెట్ సినిమాలు పూర్తి చేయబోతున్నాను నేను. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు.

మొదటి సినిమాకు ఈ మాత్రం సమయం తీసుకోవటం నాకు చాలా అవసరం. ఇదివరకులాగా ప్రతిదానికీ కాంప్రమైజ్ కాదల్చుకోలేదు. పైగా, "లోన్ వుల్ఫ్" లా అన్నీ నేనే చూసుకుంటున్నాను. నాకు ఇన్వెస్ట్ చేసే వాళ్లని కూడా చాలా జాగ్రత్తగా ఎన్నుకుంటున్నాను. ఈ అనుభవం తో నా  "మనుటైమ్ మూవీ మిషన్" ఫిలిం బ్యానర్ కింద రేపు నేనే ఒక ఫాక్టరీ ప్రారంభించవచ్చు. ఒక డిజిటల్ స్టూడియో పెట్టవచ్చు.   ఏదీ రాకెట్ సైన్స్ కాదు. ఏదీ అసాధ్యం కాదు. నేను చేయగలను. 

ఏ జెర్కులు ఎదురయినా, ఏవి అడ్డం వచ్చినా ఈ ఒక్క సినిమాకే. తర్వాతంతా "రిన్స్ అండ్ రిపీట్" పధ్ధతే.


Tuesday, 1 January 2013

హేపీ న్యూ ఇయర్!

హీరో శివాజీ తో తెలుగులో ఒక చిత్రం చేశాను. తెరవెనక జరిగింది వేరు. అది వేరే విషయం.

వివిధ
కలం పేర్లతో డైరెక్ట్ గా ఇంగ్లిష్ లో కొన్ని  డిజిటల్/కిండిల్  బుక్స్ ని "అమేజాన్" కోసం రాసాను. ఫారిన్లో ఆవి బాగా సేల్ అవుతున్నాయి. రాయాల్టీ కూడా ప్రతీ నెల నా అకౌంట్లో డైరెక్ట్ గా పడిపోతోంది!  ఇంకా "ఫైవర్", “క్లిక్ బ్యాంక్” వంటి సైట్స్ లో కూడా హాబీ కోసం ఏవేవో చేస్తున్నాను. ఆదాయం డైరెక్టుగా నా పేపాల్ అకౌంట్లోకి ముందు, ఆ తర్వాత నా హైదరాబాద్ బ్యాంక్ అకవుంట్లోకి నేరుగా వచ్చి పడుతున్నాయి.

ఇన్
‌ఫర్మేషన్ మార్కెటింగ్ లో ఎక్స్ పర్ట్ నయ్యాను. ఈ ఫీల్డులో చాలా మందికి (ఫారిన్ లో) ఒక పెయిడ్ "మెంటర్" గా కూడా పనిచేస్తున్నాను.  కొంత రిలీఫ్ …

ఎప్పట్లాగే మరొక సంవత్సరం గడచిపోయింది. గొప్పగా సాధించినవి ఏవీ లేవు …

2012 లో, నేను నేర్చుకున్న పాఠాలు  మాత్రం చాలా ఉన్నాయి. ఆ రకంగా చూస్తే - 2012 ఒక గురువుగా, “నేను ఏ పాఠాలనయితే తప్పనిసరిగా నేర్చుకొని తీరాలో” వాటిని నేర్పించింది. సో, 2012 కు నా బిగ్ థాంక్స్ చెప్పక తప్పదు. 

2012 లో నేను ప్రధానంగా నేర్చులున్న పాఠాలు రెండు:

1. నా స్టీరింగ్ వేరొకరి చేతికి ఇచ్చి, నేను అనుకున్నట్లుగా గమ్యం చేరుకోవాలనుకోవడం చాలా పెద్ద తప్పు. ఈ పాఠం ద్వారా నేను నేర్చుకొన్న నీతి ఏంటంటే, ఇక ముందు ఏ చిన్న విషయానికయినా సరే ఒకరి మీద ఆధార పడవద్దు.

2. అప్పులో, ఇతర కమిట్మెంటులో అందరికీ ఉంటాయి. ట్రిలియన్ల డాలర్ల అప్పున్న అమెరికా నుంచి, బిలియన్ల డాలర్ల డాలర్ల అప్పున్న మన ఇండియా దాకా అన్ని దేశాలకూ, అందరికీ ఏదో ఓ రూపంలో ఈ అప్పులు/కమిట్మెంట్ లు ఉన్నాయి. టాటా, బిర్లాలు, అంబానీలయినా - వారికి వ్యక్తిగత సంపద ఎంత ఉన్నా - వారందరి వ్యాపార వ్యవహారాల్లో వారెన్నో వందల వేల కోట్లు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బ్యాంకులకు అప్పు ఉన్నారు. సో, అప్పుల గురించి అంత బాధ పడాల్సిన పని లేదు.

బిసినెస్
ఈజ్ బిజినెస్. మనం ఎవరినీ చీట్ చేయనంతవరకూ, చేయాలనుకోనంతవరకూ నో ప్రాబ్లమ్. బిజినెస్ లలో ఆటు పోట్లు సహజం. వాటిని తట్టుకుని ముందుకు పోవటమే మనం చేయాల్సిన పని. ముందు మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేసుకుంటూ పోతే - మనీ అదే మన వెంట పడుతుంది. అప్పుడు అప్పులు అవే అదృశ్యమవుతాయి. 

మన టెన్షన్ అంతా మన ప్రధాన లక్ష్యం పైన ఉండాలి తప్ప - మనల్ని వేటాడుతున్న కష్టాల మీద, కమిట్ మెంట్ల మీద ఉండకూడదు.

2012 జనవరి 4 అర్థరాత్రి జరిగిన యాక్సిడెంట్, సర్జరీలు, ఆ తర్వాత సుమారు 9 నెలల బెడ్ రెస్ట్... నన్నూ, నా ఆలోచనా ధోరణినీ, నా దృక్పథాన్నీ సమూలంగా మార్చివేశాయి. 

ఇంతకుముందులాగా - ఇప్పుడు నేను ఎన్నో పడవల మీద కాళ్లు పెట్టట్లేదు. నా ఇతర వ్యాపకాలన్నింటికీ విరామం ఇచ్చేసి, కనీసం ఒక సంవత్సరం పాటు నా పూర్తి ఫోకస్ ని సినిమా మీదే పెడుతున్నాను. మ్యాజిక్ 
ఏంటంటే, ఇలా నిర్ణయం తీసుకున్న తర్వాత నుంచీ అసలు సీనే మారిపోయింది. అన్ని పనులూ నాకు అనుకూలంగా చక చకా జరిగిపోతున్నాయి!

ఒక విధంగా - ఇది నా ఫిలిమ్ కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్. ఈ విషయంలో నాకున్న రిసోర్సెస్ అన్నిటినీ ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. నా నెట్ వర్క్ నంతా వినియోగించుకోవాలనుకుంటున్నాను.

2013 లో కనీసం 3 మైక్రో బడ్జెట్ సినిమాలను తీస్తాను. నా ముందు చేతులు కట్టుకుని నిల్చోవటానికి కూడా అర్హత లేని కొంతమంది మనుషులను నమ్మి, నేను కోల్పోయిన సమయాన్ని వెనక్కి తెచ్చుకోలేను. కానీ, నేను కోల్పోయిన డబ్బునీ, అన్నింటినీ మించి, నేను కోల్పోయిన నా క్రియేటివ్ ఫ్రీడమ్ నీ మళ్లీ నా చేతుల్లోకి తెచ్చుకుంటాను.

హేపీ న్యూ ఇయర్ ...   

Saturday, 29 December 2012

రాజధాని నగరంలో


ఇది పూర్తిగా నా నేచర్ కి సరిపడని అంశం. నేను ఆలోచించడానికే అసహ్యించుకొనే అంశం. పైగా ఈ బ్లాగ్ లో దీని గురించి ఇప్పటికే ఒకసారి రాశాను. అయినా, రెండోసారి కూడా ఈ అంశంపైన రాస్తున్నాను అంటే ... అంతగా చలించిపోయాను …

పరిచయం లేని ఒక వ్యక్తితో మాట్లాడ్డానికే మనం ఆలోచిస్తాం. పరిచయం లేని ఒక వ్యక్తిని అసలు తాకలేం. అది ఆడవాళ్లయితే  ఇంకాస్త దూరంగా జరుగుతాం. ఇక, అంగీకారం లేకుండా, సాక్షాత్తూ జీవిత భాగస్వామితో కూడా అసలేమీ చేయలేం. అలాంటిది - 

దేశ రాజధాని నడి వీధుల్లో - నడుస్తున్న బస్సులో -
ఒక అమ్మాయిని రేప్ చేయడం ...
అమానుషంగా గ్యాంగ్ రేప్ చేయడం ...
అత్యంత హీనమయిన రాక్షసత్వపు హింసతో చావు అంచులదాకా చేర్చడం ...

కనీసం - "ఈ శరీరం మా రాక్షస క్రీడకు ఉపయోగపడిందే" అన్న కృతజ్ఞత కూడా లేకుండా - ఒక నిర్జీవమయిన సిమెంట్ బ్యాగ్ ని తోసేసినట్టు - నడుస్తున్న బస్ లోంచి కిందకి తోసివేయడం ...

అసలు ఏ యుగంలోకి వెళ్తున్నాం మనం? ఏ అనాగరిక యుగంలోనయినా ఇలాంటి హింస ఉందా?? అత్యంత హేయమయిన ఈ సంఘటన గురించి, నా మనసులోని ఫీలింగ్స్ అన్నింటిని సంపూర్ణంగా ఈ బ్లాగ్ లో పెట్టలేకపోతున్నందుకు కూడా నేను నిజంగా సిగ్గు పడుతున్నాను.

కనీసం ఈ సంఘటనతోనయినా దేశం కళ్లు తెరిచింది. డిల్లీ వీధులు ఉలిక్కి పడ్డాయి. పొలిటీషియన్లు తమ కుంభకర్ణ నిద్రలోంచి ఒక్క క్షణం అదిరిపడుతూ లేచారు.

డిల్లీ లోనూ, దేశంలోని ప్రతిమూలా, ప్రతిరోజూ ఈ రేప్ సంఘటనలు జరుగుతూనే ఉన్నా - రొటీన్ జీవితపు టెన్షన్లలో ఎన్నడూ పట్టించుకోని మనం కూడా ఇప్పుడు ఈ సంఘటన గురించి ఆలోచిస్తున్నాం. ఫేస్ బుక్కుల్లొ నిరసనల్ని "లైక్" చేస్తున్నాం. నేరుగా మన ఆక్రోశాన్ని పోస్ట్ చేస్తున్నాం. కవితలు రాస్తున్నాం. బ్లాగులు రాస్తున్నాం. ఇంకా ఏదో చేయాలనుకుంటున్నాం. ఏమీ చేయలేమనే మన నిస్సహాయతకు బాధపడ్తున్నాం.   

సింగపూర్ స్థాయి వైద్యం మన దేశంలో లేదా? ఆ స్థాయి వైద్యులు మన దగ్గర లేరా? పెద్ద జోక్. అంతా ఐ వాష్. హై డ్రామా.

చివరికి తన మరణంతో దేశం మొత్తం కనీసం కొన్ని క్షణాలయినా ఆలోచించేలా, ఆలోచించి సిగ్గుపడేలా చేసి శెలవు తీసుకుంది నిర్భయ …

మన పొలిటీషియన్లు ఏ కొత్త చట్టాలు తెస్తారో, ఏం సాధిస్తారో చూడాలి. ఉన్న చట్టాల్ని అమలు చేయడానికే మనకు గతి లేదు. ఇంక కొత్త చట్టాలు తెచ్చి వీళ్లేం సాధిస్తారో మనకు తెలీని కొత్త విషయం కాదు.

మన  అమ్మాయిలు, మన అబ్బాయిలు - ఎవరినీ ఇబ్బంది పెట్టని పూర్తి స్వేఛ్ఛతో, స్వఛ్ఛంగా, వారి ఇష్టా రాజ్యంగా తిరిగే దేశం కావాలి మనకు. అదెలాగూ ఈ కుళ్లిపోయిన పొలిటికల్ వ్యవస్థలో సాధ్యం కాదు. కనీసం మన అబ్బాయిలను మనం మంచి నడవడితో పెంచుదాం. మానవ మృగాల సంఖ్య కొంతయినా తగ్గించుకుందాం.   

Tuesday, 25 December 2012

ఇంగ్లీష్, హిందీల్లో అయితే ఓకే!


 సుమారు ఒక డజన్ డబల్ మీనింగ్ డైలాగుల్ని పట్టించుకోకుండా వదిలేస్తే - మారుతి ఈ సినిమాను చాలా బాగా తీశాడు. తన మొదటి (హిట్) సినిమా
"ఈ రోజుల్లో" తో పోలిస్తే ఇది చాలా అర్థవంతమయిన సినిమా. పేరెంట్స్ తప్పకుండా తమ పిల్లలతో కలిసి మరీ చూడొచ్చు. అలా చూడాల్సిన సినిమా ఇది. నాతోపాటు సినిమాకు వచ్చిన నా మిత్రులు దయానంద్, ఫ్రతాప్ కూడా ఇదే మాట అన్నారు. ఒకరు లెక్చరర్, ఒకరు సెక్రెటేరియట్ లో ఆఫీసర్. 

సంధ్య 70 ఎం ఎం లో ఇవాళ మార్నింగ్ షో "బస్ స్టాప్" చూశాను...

రివ్యూ రాయుళ్ల రాతలను మాత్రమే పట్టించుకొనేవాళ్లు, అర్థం లేని హిపోక్రసీ ఉన్న పేరెంట్స్ (పిల్లలు కూడా) - ఈ సినిమా చూడకపోవటం ద్వారా ఒక మంచి అవకాశాన్ని కోల్పోతారని నా ఉద్దేశ్యం. ఈ రెండు వైపులా అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది, అసలు ప్రాబ్లం రాకుండా చూడటం సాధ్యమా, అసలీ కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు... ఇటువంటి ప్రశ్నలన్నింటికీ ఈ సినిమాలో సమాధానాలు దొరుకుతాయి. ఎట్ లీస్ట్ ఒక మంచి అవగాహన వస్తుంది. పెద్దలూ, పిల్లలూ "అదర్ సైడ్" నుంచి కూడా కొంచెమయినా ఆలోచించడం ప్రారంభిస్తారు. 

హిందీ లో వచ్చిన "ఢెల్లీ బెల్లీ" ని ఆకాశానికి ఎత్తేసి ఒప్పుకునే ఇదే రివ్యూ రైటర్స్, ఈ చిత్ర విమర్శకులు... ఈ బస్ స్టాప్ ను కూడా ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి. "ఢెల్లీ బెల్లీ" లోనూ ఇప్పటి తరం యువత లైఫ్ స్టయిల్ నే చూపారు. నిజ జీవితంలో వారు ఎలా మాట్లాడతారో అవే డైలాగులను పచ్చిగా వాడారు. ఆ జీవన్ శైలినే చూపారు. ఈ "బస్ స్టాప్" లోనూ అంతే.

ఎటొచ్చీ మన తెలుగు దగ్గరికి వచ్చేటప్పటికే ఎక్కడలేని హిపోక్రసీలు అడ్డొస్తాయి. హిందీ, ఇంగ్లీషు సినిమాల్లో అయితే ఎంత పచ్చి బూతు అయినా "చాలా నేచురల్ గా" ఉంటుంది వీరందరి కళ్లకూ, చెవులకూ!

ఇంకా ఎన్నాళ్లీ "మాస్క్" లు? ఇకనుంచయినా కొంచెం ఎదగడానికి ట్రై చేస్తే బాగుంటుంది.

ఒక్కటి మాత్రం నిజం. కొన్ని "టూ మచ్" గా అనిపించినా, ఆ పదో పన్నెండో డబల్/డైరెక్ట్ మీనింగ్ డైలాగులు, సీన్లు లేకుండా అయితే ఈ సినిమా అసలు ఆడేది కాదు. ఆ స్పైసీ కోటింగ్ ఉంది కాబట్టే సినిమాలో ఇచ్చిన సందేశం అంత స్వీట్ గా నిలబడింది.   ఈ విషయంలో మారుతికి కంగ్రాట్స్ చెప్పక తప్పదు. తన తొలి సినిమా "ఈ రోజుల్లో" లాగానే,  ఇది కూడా లేటెస్ట్ ఫిలిం మేకింగ్ ఫార్మాట్లో తీసిన సినిమానే కావటం మరో చెప్పుకోదగ్గ విశేషం.

కొంతమంది రివ్యూయర్స్ రాసినట్టు అతనిది వల్గారిటీ కాదు. క్రియేటివ్ స్ట్రాటజీ.  

అత్యంత అసహ్యకరమయిన సీన్


మా చిన్నతనంలో, దాదాపు మేం చూసిన ప్రతి రెండో సినిమాలో ఒక రేప్ సీన్, ఒక క్లబ్ సాంగ్ తప్పనిసరిగా ఉండేవి.

అప్పటి జ్యోతి లక్ష్మి, జయమాలినిలను తెర మీద క్లబ్ సాంగ్స్ లో చూస్తున్నప్పుడు ... ఆనాటి ఆ డ్రెస్సింగ్, ఆ డాన్స్ మూమెంట్స్ కే తెగ "ఇదయి" పోయేవాళ్లం. ఇప్పటి హీరోయిన్ల కాస్ట్యూమ్‌స్, డాన్స్ మూమెంట్స్ తో పోలిస్తే అప్పటిదంతా అసలు లెక్కలోకి రాదు. చెప్పాలంటే - జీరో.

అయితే
- ఆనాటి ఆ క్లబ్ సాంగ్స్ ఇచ్చిన కిక్ ని ఇప్పటి సినిమాల్లోని ఏ "పబ్" సాంగ్ కూడా ఇవ్వలేకపోతోంది. అది వేరే విషయం.     

కట్ చేస్తే -

ఆ రోజుల్లో "ఏస్కో కొక్క కోలా" వంటి క్లబ్ సాంగ్స్ ని ఎంత బాగా ఫీలయ్యి, ఎంత బాగా ఎంజాయ్ చేసే వాళ్లమో ... రేప్ సీన్ రాగానే, ఎంతో చికాగ్గా "ఎప్పుడయిపోతుందిరా బాబూ!" అనుకొనే వాళ్లం. త్యాగరాజు గానీ, సత్యనారాయణ గానీ బయట కనిపిస్తే, మళ్లీ ఇంకో సినిమాలో రేప్ సీన్స్ చేయకుండా 'బాగా తన్నాలి' అనిపించేది. 

సినిమాలో ఆ రెండు నిమిషాల సీన్ కే అంత కృతకంగా, జుగుప్సగా ఫీలయ్యేవాళ్లం …

క్రమంగా సినిమాల్లో రేప్ సీన్లు తగ్గిపోయాయి. తగ్గిపోయాయంటే, అట్లా ఇట్లా కూడా కాదు. ఆశ్చర్యకరంగా చాలా చాలా తగ్గిపోయాయి. ఎప్పుడో ఒకటీ అరా ఏదయినా సినిమాలో వస్తే - అది కూడా అయితే కట్ షాట్స్ లో, లేదంటే సింబాలిక్ గానో "జరిగింది" అని చూపిస్తున్నారు తప్ప ... వెనకటి సినిమాల్లో లాగా చీర లాగటం నుంచి చివరిదాకా చూపించటం లేదు.     

ఆ మధ్య విశ్వనాథ్ "శంకరాభరణం" లో ఇలాంటిదే ఒక సీన్; ఇటీవల రాజమౌళి "విక్రమార్కుడు" లో అమిత్ కుమార్ నటించిన ఇంకో సీన్ ... ఇవీ ఈ మధ్య కాలం లో వచ్చిన సినిమాల్లో, నేను చూసిన సినిమాల్లో, నాకు బాగా గుర్తున్న రేప్ తరహా సీన్లు! (అమిత్ కుమార్ ని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసింది నేనే!) ఈ రెండు ఉదాహరణల్లోనూ - ఎక్కడా చేజ్ లు, చీర లాగటాలు, టార్చర్లు లేవు. జస్ట్ సింబాలిక్ కట్ షాట్స్! అంతే.  

ఇక నేను పాయింట్ కి రాక తప్పదు... 

దాదాపు
ప్రతి సినిమాలోనూ ఎడా పెడా రేప్ సీన్లు పెట్టిన ఆ కాలంలో బయట ఎలాంటి అఘాయిత్యాలు లేవు. ఇప్పుడు సినిమాల్లో రేప్ సీన్లు తగ్గిపోయాయి. బయట దారుణంగా పెరిగిపోయాయి!

ఇప్పటి సినిమాల్లో అసలు రేప్ సీన్లకి విలువే లేదు. ఇంకా చెప్పాలంటే - నేటి రొటీన్ కమర్షియల్ సినిమాల ఫార్మాట్ లో అయితే "రేప్ సీన్" అనేది ఒక అత్యంత అసహ్యకరమయిన సీన్! అసలు ముట్టుకోకూడని సీన్!!

కాల్పనికమయిన సినిమా రంగంలోనే ఇంత భారీ మార్పులుచోటు చేసుకొన్న ఈ రోజుల్లో - సాక్షాత్ దేశ  రాజధాని  ఢిల్లీ లోనే దాదాపు ప్రతిరోజూ ఒక రేప్ జరుగుతోంది! గత సంవత్సరం ఒక్క ఢిల్లీ లోనే - 365 రోజుల్లో 453 రేప్ కేసులు రిజిస్టర్ అయ్యాయి!!   ఇంక రిజిస్టర్ కాని కేసులు ఎన్నుంటాయో ఎవరయినా ఇట్టే ఊహించవచ్చు.
  
నిన్నటి "సాక్షి" పత్రికలో - యండమూరి, తణికెళ్ల భరణి, చంద్రబోస్, మంజులా నాయుడు, అమల, యస్వీ కృష్ణా రెడ్డి, సంధ్య, మృణాలిని మొదలయిన వాళ్లంతా అతి  హేయమయిన మొన్నటి ఢిల్లీ రేప్ సంఘటన పైన వారి ఆక్రోశాన్ని, నిరసనను పలు విధాలుగా వెల్లడించారు. అన్నిటిలోకీ నన్ను బాగా కదిలించింది శేఖర్ కమ్ముల ఫీలింగ్స్!

వెరీ సెన్సిటివ్, సెన్సిబుల్ సినిమాలను తీయడానికి ఇష్టపడే అంత సాదా సీదా శేఖర్ కమ్ములే తన అవేదనను అంత తీవ్రంగా, అంత బాహాటంగా వెల్లడించగలిగాడంటే ... ఆయన ఏ స్థాయిలో చలించిపోయుంటాడు? హేట్సాఫ్ టూ శేఖర్! శేఖర్ ఫీలింగ్స్ తో నేను 100% ఏకీభవిస్తున్నాను.     

మన దేశ పౌరుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చివేసి, రెడ్ హేండెడ్ గా దొరికిన పాకిస్తానీ టెర్రరిస్ట్ కసబ్ ను ఉరి తీయడానికి మనకు సంవత్సరాలు పట్టింది. మన పార్లమెంట్ మీద దాడి చేసిన ఇంకో టెర్రరిస్ట్ అఫ్జల్ గురు కి 2004 లోనే మన సుప్రీం కోర్టు ఉరి శిక్ష విధించింది. ఇప్పటికి ఎనిమిదేళ్లు అయిపోయింది. మన వాళ్లు ఉరి తీయాలా వద్దా అనేది ఇంకా 'పరిశీలిస్తున్నారు!'  

ఇక
, యాసిడ్ దాడి కేసులను నాన్ బెయిలబుల్ కేసులుగా చేసి, అలాంటి నేరం చేసే వారికి మరింత తీవ్రమయిన శిక్ష పడేలా చేయటం కోసం పంపించిన ప్రతిపాదనలు మన కేంద్ర ప్రభుత్వం టేబుల్ మీద రెండేళ్ల నుంచీ ఇంకా పెండింగులో ఉన్నాయట!!

ఇలాంటి అసమర్థ, అమానవీయ వ్యవస్థలో మనం సిగ్గు పడుతూ బ్రతకడానికి ప్రధాన కారణం - మన పొలిటీషియన్లు. (అందరూ కాకపోవచ్చు. కానీ, చాలా మంది మాత్రం అవును.) కనీసం ఇప్పుడయినా వాళ్లు కళ్లు తెరచి, వాళ్ల  బాధ్యతలను గుర్తిస్తే బాగుండు. కానీ, అది ఉట్టి పగటి కల.

నా రొమేనియన్ రైటర్ ఫ్రెండ్ ఒకరు ఎన్నో ఏళ్లుగా ఇండియా చూడ్డానికి రావాలనుకొంటోంది. ఎంతో ప్లాన్ చేసుకొని, చివరికి వచ్చే నెలలో రావటానికి అన్నీ ప్లాన్ చేసుకొంది.

మొన్నటి న్యూస్ ని ఇంటర్నెట్ లో చదివీ, చూసీ, వినీ అంతా తెలుసుకొన్న ఆ రచయిత్రి ఇప్పుడు ఇండియా రావటమే కాన్సిల్ చేసుకొంది. మొన్నటి ఢిల్లీ రేప్ ఘటన ఒక్కటే కాదు... ఆ మధ్య ఒక ఫారిన్ టూరిస్టు ను కూడా గ్యాంగ్ రేప్ చేసిన ఘన చరిత్ర మన దేశ రాజధాని ఢిల్లీ కి ఉంది. ఈ పాత న్యూస్ ను కూడా ఆ రైటరే గుర్తు చేసింది నాకు!    

ఇప్పుడు నేను నిజంగా సిగ్గు పడుతున్నాను. ఎందుకో మీకు తెలుసు...