Thursday, 25 December 2025

జీవితంలో మనకి మనం చెప్పుకునే 10 పచ్చి అబద్ధాలు


1. నాకింకా సమయముంది.

2. నేను ఈ పని కొంచెం ఫ్రీ అయ్యాక, తర్వాత చేస్తాను.

3. ప్రమోషన్ వచ్చాక నేను రిలాక్స్ అవుతాను. 

4. ఈ న్యూ ఇయర్ నుంచి రోజూ వాకింగ్‌కు వెళ్తాను. 

5. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక నేను ట్రావెల్ చేస్తాను. 

6. కొంచెం ఈ టెన్షన్స్ తగ్గాక, నా ప్రియమిత్రుల్ని రెగ్యులర్‌గా కలుస్తాను.  

7. నేను కొంచెం డబ్బు సంపాదించాక, నా కుటుంబంతో ఆనందంగా గడుపుతాను.

8. వచ్చే ఆదివారం ఊళ్ళో ఉన్న అమ్మానాన్నలకు కాల్ చేస్తాను.  

9. నేను రిటైరయ్యాక నాకిష్టమైన పనులన్నీ చేస్తాను. 

10. నా అన్ని బాధ్యతలు పూర్తిచేసుకున్నాక, నేను కోరుకొన్న జీవితం జీవిస్తాను. 

కట్ చేస్తే - 

నన్ను క్షమించాలి.
దశాబ్దాల అనుభవంతో చెప్తున్నాను...

మీరనుకొంటున్న ఆ అనుకూల సమయం మీ జీవితంలో ఎన్నటికీ రాదు. మీకంత సమయం లేదు. 

మీ అతి చిన్న కోరికల లిస్టు, అలా లిస్టుగానే మిగిలిపోతుంది. 

చిన్న చిన్న ఆనందాలే జీవితం. 
ఆ ఆనందాల్ని అనుభవించడానికి కూడా డబ్బు కావాలి. 
బాగా సంపాదించుకున్నాక, "అయ్యో నేనేం చెయ్యలేకపోయానే" అని బాధపడటానికి కాదు.  

- మనోహర్ చిమ్మని 

Creativity Is the Weapon


The film industry is not a peaceful garden.

It’s a battleground — loud, chaotic, unpredictable. Every day, someone is fighting for a role, a script, a chance, a moment of recognition. 

And more than that, we’re fighting our own inner wars too — doubt, fear, ego, insecurity, comparison.

But here’s the truth most people forget:

Creativity is the only energy that keeps us alive in this war.

Not talent.
Not contacts.
Not money.
Just Creativity.

It sharpens your mind.
It lifts your spirit.
It gives you direction when everything outside feels directionless.
It pulls you out of the darkness you create inside yourself.

When you create — a scene, a shot, a line, a tune — you step out of the battlefield and step into your soul.

And in that moment, every war inside you slows down.

Cinema tests us.
Creativity strengthens us.
And when both meet, something magical happens —
You stop fighting for survival and start fighting for excellence.

In this industry, wars will come.
But if your creativity is alive, focused, and fearless…

No battle can break you.

- Manohar Chimmani 

Be in the War for the One Thing — Cinema


If you want everything, you’ll get nothing.

If you want one thing badly enough, you can bend a year to your will.

Cinema is not a hobby. It’s a battlefield.

It demands your time, your attention, your ego, your excuses. It doesn’t reward half-belief or weekend passion. It rewards obsession, discipline, and the courage to go all in.

If cinema is your one thing, then stop negotiating with yourself.

Go offensive.

Offense means you don’t wait for permission. You don’t wait for funding to feel confident. You don’t wait for the “right time.” You write before you’re ready. You shoot before you feel safe. You learn while bleeding.

Defense is comfort.
Offense is creation.

Achieving anything meaningful in cinema requires a ruthless clarity. This matters more than distractions, opinions, and temporary pleasures.

Trends will come and go. Noise will rise and fall. But focused work compounds quietly.

Write script after script. Make film after film. Let multiple projects breathe at once — the way the Guinness Record holder Darshakaratna Dasari garu once did, turning discipline into destiny.

Make mistakes fast. Fail forward. Build momentum. Respect the craft, but don’t worship fear.

Cinema doesn’t belong to the most talented — it belongs to the most committed.

If you stay in the war long enough, with intention and integrity, something shifts. Skill sharpens. Vision clears. Confidence becomes earned, not borrowed.

Do this, and 2026 won’t just happen to you.

2026 will be yours.

Not by luck.
By focus.
By offense.
By choosing cinema — every single day.

-Manohar Chimmani 

Wednesday, 24 December 2025

సినిమాల్లో అనుకున్నట్టుగా అన్నీ జరగవ్!


సూపర్ స్టార్లు, మెగా స్టార్లు ఉన్న సినిమాలు కూడా ఊహించనివిధంగా వాయిదా పడుతుంటాయి. డబ్బుల్లేక కాదు. భారీ బడ్జెట్లుంటాయి. టాప్ ప్రొడ్యూసర్స్, టాప్ డైరెక్టర్స్ పనిచేస్తుంటారు. అయినా సినిమాలు ప్లాన్ చేసినట్టుగా జరగవు. 

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా, ఊహించని ఇంకేదో కొత్త సమస్య వస్తుంది. పనులు వాయిదా పడతాయి. సినిమా ఆగిపోతుంది.  

అన్ని సినిమాలకు ఇలా అవుతుందని కాదు. కాని, సినిమా ఇండస్ట్రీలో ఇది చాలా మామూలు విషయం. 

సినిమాలే కాదు, ఇంకెన్నో బిజినెస్‌లలో కూడా ఇలా జరుగుతుంటుంది. ప్రతిచోటా రిస్క్ ఉంటుంది.  

మరోవైపు, ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు అనౌన్స్ చేస్తుంటారు. వాటిల్లో కనీసం 25% సినిమాలు అసలు టేకాఫ్ కావు. వాటి రీజన్స్ వాటికుంటాయి.  

కట్ చేస్తే - 

ఇవన్నీ తెలియని బయటివారు ఏదేదో అనుకుంటుంటారు. అది సహజం. ఎందుకంటే వారికి తెర వెనుక జరిగే విషయాలు తెలీవు కాబట్టి. 

అయితే - ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నిస్తూ, ఇండస్ట్రీ గురించి సగం సగం తెలిసినవాళ్ళు కొందరు మాట్లాడే మాటలు, చేసే కామెంట్సే మనకు చిరాకు తెప్పిస్తుంటాయి. బాధ పెడుతుంటాయి. 

ఇలాంటి మన చుట్టూ మనకి వినిపించే పనికిరాని శబ్దాల్ని మనం పట్టించుకుంటే సినిమాల్లోనే కాదు, ఏ విషయంలోనూ మనం ఒక్క అడుగు ముందుకు వెయ్యలేం. 

- మనోహర్ చిమ్మని      

Four Words for 2026


I don’t believe in long resolutions anymore.

I believe in clear words.

For 2026, I’m carrying just four of them:
Films.
Freedom.
Writing.
Spirituality.

Cut to - 

Films—because cinema is not just what I do, it’s how I think, observe, and communicate with the world. It’s the battlefield where discipline, imagination, and execution meet. Beyond passion, cinema is also a space for serious money rotation.

Freedom—because without inner freedom, success is just another cage. I want the freedom to choose my stories, my pace, my people, and my risks.

Writing—because writing keeps me honest. It sharpens my thinking, records my journey, and turns experience into meaning. When I write, I understand myself better. 

Spirituality—because ambition without awareness leads to emptiness. Spirituality keeps me grounded, detached, and aligned while I stay active in the world.

These four words are not goals.
They are directions.

If I stay true to them, outcomes will take care of themselves.

-Manohar Chimmani 

Tuesday, 23 December 2025

Getting Lost in the Right Direction


There are phases in life where clarity doesn’t come as a map. It comes as movement.

Right now, I’m exploring. I’m experimenting. With cinema. With writing. With creativity. And through all three, with life itself.

To an outsider, it may look like uncertainty. But inside, it feels aligned.

Being “lost” doesn’t always mean being confused. Sometimes it simply means you’ve stopped following borrowed paths and started walking your own. When the direction is right, even wandering has purpose.

Cinema teaches me how to observe life.
Writing teaches me how to understand it.
Creativity teaches me how to stay alive within it.

Not every experiment needs to succeed. Not every attempt needs validation. Exploration itself sharpens instinct. It strips away noise. It brings you closer to what truly matters.

I’ve learned that structure can come later. First, there must be curiosity. First, there must be play. First, there must be the courage to move without guarantees.

It feels good to be lost—
when the direction is honest,
the intent is clear,
and the journey itself is the lesson. 

This is not confusion.
This is conscious exploration.

- Manohar Chimmani 

కొత్త జ్ఞానోదయాలు!


మనం ఏదేదో అనుకొని ప్రోత్సహిస్తూ కొందరికి అవకాశం ఇస్తాం. ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ గురించి నలుగురికి నాలుగు మంచి మాటలు చెప్తాం. కాని, అది పెద్ద తప్పు అని తర్వాత వారి ఒరిజినల్ ప్రవర్తన ద్వారా నిరూపించుకుంటుంటారు. 

వీళ్ళు మన గురించి మంచి మాటలు చెప్పకపోయినా ఫరవాలేదు. కాని, నెగెటివ్ ప్రచారం చేస్తారు. 

దీన్నే గ్రాటిట్యూడ్ అందామా? 

కట్ చేస్తే -

నాకు ఇలాంటి అనుభవాలు ఒక డజన్ పైనే ఉంటాయి. అయినా సరే, నా పరిధి దాటి ఎవరికైనా సహాయమే చేస్తుంటాను. ఇప్పటికీ.

ఎవరో నన్ను గుర్తించాలని కాదు. అది నాలో సహజంగా అలా వచ్చింది. అంతే. 

కాని, ఇలా సహాయం చేయడం, ప్రోత్సహించడం అనేది అంతిమంగా నాకు తలవంపులు తెచ్చేది కావద్దు కదా...  

- మనోహర్ చిమ్మని 

The Today Rule


Big goals fail for one simple reason:
they are always postponed to tomorrow.

The mind loves planning. 
It feels productive.
But progress doesn’t happen in plans — it happens in today.

The Today Rule is simple:
What can I do today to move the ball toward my one goal?

Not everything.
Not perfectly.
Just something real.

One page written.
One WhatsApp sent.
One call made.
One scene blocked.
One hard decision taken.

Today is the only day that exists. Yesterday is memory. Tomorrow is imagination. If you wait for motivation, clarity, or the “right time,” you’ve already lost momentum.

The people who win don’t work harder in the future. 
They execute consistently in the present.

Every day, ask the same question.
Answer it honestly.
Act immediately.

Small daily actions compound into inevitable success.

That’s the power of the Today Rule.

- Manohar Chimmani 

"రిస్క్-ఫ్రీ"గా ఎంత చిన్న బడ్జెట్‌లో సినిమా తీయగలం?


ప్రపంచంలోని ఏ ఫిలిం ఇండస్ట్రీలో అయినా థియేట్రికల్ సక్సెస్ అనేది జస్ట్ 5 శాతం మాత్రమే. 

ఓటీటీలో, ఆన్‌లైన్లో చూడ్డం... అదంతా వేరే. 

కట్ చేస్తే - 

మీకు తెలుసా? 
మొన్న ఒక్క నవంబర్ నెలలోనే తెలుగులో 39 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఒకే ఒక్క సినిమా హిట్ అయింది. అది చాలా చిన్న బడ్జెట్ సినిమా. అంతా కొత్తవాళ్ళతో తీసిన ఇండిపెండెంట్ సినిమా.

అది...
"రాజు వెడ్స్ రాంబాయి".

ఇంకో సినిమా, "ఆంధ్రా కింగ్ తాలూకా"కు బాగుంది అన్న టాక్ వచ్చింది కాని, రావల్సిన కలెక్షన్ రాలేదు. 

సినిమాల హిట్-ఫ్లాప్‌ల విషయంలో పెద్ద సినిమా, చిన్న సినిమా అని ఏం ఉండదు.

పోస్ట్ కోవిడ్ రోజుల నుంచి ప్రేక్షకులు కూడా క్రమంగా ఓటీటీలకే పరిమితం అవుతున్నారు. థియేటర్స్‌కు వెళ్ళి సినిమా చూసే ప్రేక్షకులు ఇంకా ఇంకా తగ్గిపోతున్నారు.      

ఈ నేపథ్యంలో -
"రిస్క్-ఫ్రీ"గా ఎంత చిన్న బడ్జెట్‌లో సినిమా తీయగలం? 
ఎంత మంచి కంటెంట్ ఇవ్వగలం?
ఏ స్థాయి హిట్ ఇవ్వగలం?...
అన్నదే ఇప్పుడు ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ విషయంలో ఒక కొత్త చాలెంజ్ అయింది.  

- మనోహర్ చిమ్మని 

Monday, 22 December 2025

హిట్ సినిమాకో లెక్కుంది!


ఆమధ్య మేం చేసిన రోడ్ క్రైం థ్రిల్లర్ "ఎర్ర గులాబి" ప్రొడ్యూసర్ యువన్ శేఖర్ ఒకసారి ఒక మాటన్నాడు. 

"ఏమైనా సరే, మీరు ఇప్పుడు ఒక హిట్ ఇవ్వాలి" అని. 

నాకు కూడా నిజంగా ఒక హిట్ ఇవ్వాలనే ఉంది. కాని, మంచి బడ్జెట్‌తో దానికి సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్ ఒకరు దొరకాలి.

దొరకరు.
మనమే క్రియేట్ చేసుకోవాలి.

నేనిప్పుడు ఆ పనిలోనే ఉన్నాను. 

కట్ చేస్తే - 

ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ డైరెక్టర్ అయినా సినిమా హిట్ కావాలనే చేస్తారు.

కాని, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ వుడ్‌లో అయినా...
ఎక్కువలో ఎక్కువ ఒక 5% సినిమాలు మాత్రమే హిట్ అవుతాయి. 

ప్రపంచంలో ఎక్కడైనా ఇదే లెక్క.

ఆ 5% హిట్స్‌లో మనం ఉండాలి. 
అదీ అసలు లెక్క. 

- మనోహర్ చిమ్మని