నిత్యా మీనన్ న్యూస్ ఐటమ్ ఒకటి చదివాను ఇందాకే.
ఒక నెల క్రితం ఇంటర్వ్యూ అనుకుంటాను, అందులో ఆమె చెప్పింది నాకు బాగా నచ్చింది.
మన రొటీన్ థియరీలు, ప్రాక్టికాలిటీలు, పనికిరాని ఈగోలు పక్కనపెట్టి ఆలోచిస్తే మాత్రం నిత్యా మీనన్ అభిప్రాయం కరెక్టే అనిపిస్తుంది.
అసలు విషయమేంటంటే -
మనం సినిమాలు తీసేటప్పుడే "ఇది థియేటర్ కోసం తీస్తున్నాం, ఇది ఓటీటీ కోసం తీస్తున్నాం" అని ఒక కేటగరైజేషన్ చేసుకొని తీయటం సరైన ఆలోచన కాదు.
అసలు సినిమా అంటూ తీస్తే - తప్పకుండా దాని ప్రధాన లక్ష్యం థియేటర్‌లో ప్రదర్శించడమే కావాలి.
ఆ సినిమాలోని కంటెంట్, దాని బిజినెస్ పొటెన్షియాలిటీని బట్టి, తర్వాత అది థియేటర్‌కు వెళ్ళగలుగుతుందా, ఓటీటీ దగ్గరే సెటిలవుతుందా, అసలు మార్కెట్లో ఎవరైనా దాన్ని పట్టించుకుంటారా లేదా అన్నది తర్వాత విషయం.
నిజమే కదా?

సో... ముందైతే, సినిమా అంటూ తీస్తే... అది థియేటర్ రిలీజ్ కోసమే తీయాలి. ఓటీటీలు, శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, రీమేక్ రైట్స్ ఎట్సెట్రా అన్నీ తర్వాతెలాగూ ఫాలో అవుతాయి.
అది చిన్న సినిమా అయినా, భారీ బడ్జెట్ ప్యానిండియా సినిమా అయినా ఇక్కడ మర్చిపోకూడని పాయింట్ ఒక్కటే...
Cinema is a battle ground!

.jpg)