మన ఆలోచనలు, అయిడియాలు, రాతలు నచ్చినవాళ్ళు మన బ్లాగ్ వైపు వస్తారు. నచ్చితే చదువుతారు. లేదంటే, ఆసక్తిగా అనిపించిన ఇంకోవైపు వెళ్ళిపోతారు.
స్పష్టంగా ఒక చాయిస్ ఉంటుంది ఎవరికైనా.
నా బ్లాగ్ చదవండి అని ఎవరూ ఎవరిని బలవంతపెట్టరు. కాలర్ పట్టుకోరు.
నా బ్లాగ్ చదవండి అని ఎవరూ ఎవరిని బలవంతపెట్టరు. కాలర్ పట్టుకోరు.
మన కంటెంట్ నచ్చకపోతే - మళ్ళీ ఇటువైపు రాకుండా ఉండటానికి వందకి వంద శాతం చాన్స్ ఉంది ఎవరికైనా.
కాని చదివి... లాజికల్‌గా ఎలాంటి సంబంధం లేని, నిర్మాణాత్మకం కాని, చెత్త కామెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. అలాంటి శ్రమ ఎవరూ తీసుకోవద్దు.
నేను కూడా అంతే. అలా నా సమయం వృధా కానీయను.
నేను కూడా అంతే. అలా నా సమయం వృధా కానీయను.
కట్ చేస్తే -
నా రెడీ రెఫరెన్స్ కోసం... అప్పుడప్పుడూ నేను కొన్ని యాడ్స్ వంటి పోస్టులు రాస్తుంటాను. ఆన్‌లైన్‌లో రెడీగా ఉంటుందని ఇక్కడ రాసుకుంటాను. జస్ట్, వీటి లింక్ పంపించేస్తే సరిపోతుంది నాకు.
ఇలాంటి పోస్టులు... నాకు, నా టార్గెట్ కస్టమర్స్‌కు సంబంధించిన విషయాలు.
నేను టార్గెట్ చేసినవారికి తప్ప ఇవి నచ్చవు, చదవరు. చదవాల్సిన అవసరం లేదు. అలా పక్కకెళ్ళిపోవచ్చు.
చదివి అనవసరంగా సెటైరిక్ కామెంట్స్ చెయ్యడం వల్ల మీ సమయం వృధా. నేను ఆ కామెంటర్‌కు అదే స్థాయిలో సమాధానమిస్తూ నా సమయం వృధా చేసుకోలేను.
గమనించాల్సిన ఆ కొందరు ఎవరో దీన్ని గమనిస్తే చాలు.
Thanks.
Thanks.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani