"ఈ దేశంలో బీజేపీ పాలనలో దేశంలో ఒక్కటన్న మంచి పని జరిగిందా? అధికార దుర్వినియోగం చేస్తూ, దౌర్జన్యంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొడుతున్నరు. ఇప్పటికే 11 రాష్ట్రాల ప్రభుత్వాలను కూలదోశారు. చెప్పుకోడానికి సిగ్గుండాలె. తెలంగాణలో మూడు తోకలు లేవు. "తీసేస్తం, కూలగొడతం" అంటరు. ఎట్లా తీసేస్తరు? పోగాలం వచ్చింది కాబట్టి అట్ల మాట్లాడుతున్నరు!"
- కేసీఆర్
దేశాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పనికొచ్చే పనులు చేయాలన్న ఉద్దేశ్యం వారికి ఎంతమాత్రం లేదన్నది ఈ ఎనిమిదేళ్ళలో అతి స్పష్టంగా నిరూపించుకొన్నారు.
మరి అన్ని లక్షల కోట్ల అప్పు తెచ్చి వారు ఎక్కడెక్కడ ఏమేం సాధించారన్నది వారికే తెలియాలి.
మరి అన్ని లక్షల కోట్ల అప్పు తెచ్చి వారు ఎక్కడెక్కడ ఏమేం సాధించారన్నది వారికే తెలియాలి.
వారి ఎజెండా స్పష్టం... సున్నితమైన విషయాలను కెలికి ప్రజల మధ్య గొడవలు పెట్టడం, తద్వారా ఎన్నికల్లో లాభపడాలనుకోవడం.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలను కూలగొట్టడం... వినని వారిని రకరకాల పద్ధతుల్లో భయపెట్టడం.
ఇంతే.
ఈ రెండు తప్ప వారు ఇంకేదీ చేయలేరు, చేయరు.
దురదృష్టవశాత్తు...ఇలాంటి ప్రభుత్వాన్ని, వారి పార్టీని, వారి నాయకున్ని గుడ్డిగా వెనకేసుకొచ్చేవారిలో విద్యావంతులు, విద్యాధికులు కూడా ఉండటం అత్యంత విషాదం.
దురదృష్టవశాత్తు...ఇలాంటి ప్రభుత్వాన్ని, వారి పార్టీని, వారి నాయకున్ని గుడ్డిగా వెనకేసుకొచ్చేవారిలో విద్యావంతులు, విద్యాధికులు కూడా ఉండటం అత్యంత విషాదం.
దీనికే చెక్ పెట్టదల్చుకున్నారు కేసీఆర్.
అందుకే జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారు, జాతీయపార్టీని ప్రకటించబోతున్నారు కేసీఆర్.
తర్వాత జరిగేదంతా ఉద్యమమే.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani