గణాంకాలతో, ఖచ్చితమైన నిజాలతో కేసీఆర్ గారు మాట్లాడిన ప్రతి ఒక్క అంశం దేనికదే గొప్పది. ఉన్నదున్నట్టుగా ఆ స్పీచ్ ట్రాన్స్‌క్రిప్షన్ రాస్తే, ఏ ఒక్క పదం కూడా మనం స్కిప్ చేయలేం.
కేసీఆర్ గారి అంత పెద్ద స్పీచ్‌లోంచి, కేవలం రెండే రెండు మాటల్ని ఇక్కడ నేను కోట్ చేస్తున్నాను:
"బీజేపీ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఈ ప్రభుత్వ కాలం ఇంకా 18 నెలలే!"
"లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఒక తిరుగుబాటు చేసి పిలుపిస్తే, నలభై యాభై రోజులల్లో జైళ్ళల్లోంచి పుట్టిన జనతాపార్టీ ఈ దేశం మీద జెండా ఎగురేసింది. That is the power of democracy."
కట్ చేస్తే -
ఈ రెండు ముక్కలు చాలు. రేపు ఏం జరగబోతోందో మనకు అర్థం కావడానికి.
అసలెలాంటి ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా లేని కాలంలోనే... ఈ దేశంలోనే... అతి తక్కువ కాలంలో జనతాపార్టీ సాధించగలిగిన అద్భుతం ఇప్పుడెందుకు సాధ్యం కాదు?
సంకల్పం గొప్పది, శక్తివంతమైనది అయినప్పుడు... ఈ సర్వ ప్రపంచం, ఈ అనంతవిశ్వం కూడా పాజిటివ్‌గా కుమ్మక్కై ఆ సంకల్పాన్ని నిజం చేయడానికి అన్నివిధాలుగా, అన్నివైపులనుంచీ సహకరిస్తాయి.
కేసీఆర్ సంకల్పం కూడా అంత గొప్పది, అంత శక్తివంతమైందని ఇంతకు ముందే, మన కళ్ళముందే చూశాం.
దేశ రాజకీయాల్లో ఇప్పుడు చూడబోతున్నాం.
^^^
("కేసీఆర్ 2.0" ఈరోజు ప్రారంభించాను. వచ్చేది ఎలక్షన్ ఇయర్. లక్ష్యం సాధించేదాకా ఈ బ్లాగ్ సీరీస్ కొనసాగుతుంది. - మనోహర్ చిమ్మని)
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani