Sunday, 29 November 2026

రిసార్ట్ గదిలో బుక్ ర్యాక్!


ఒక రిసార్ట్ గదిలో బుక్ ర్యాక్ ఉండటం నేను చూడ్డం ఇదే మొదటిసారి. 

మొన్నటి నా హిమాలయ యాత్రలో 6 రోజులపాటు యాండ్రెట్టాలో నేనున్న గదిలోని బుక్ ర్యాక్ ఇది. దీనిలో నేను రాసిన పుస్తకాల్లో ఒక 2 పుస్తకాలు: సినిమా స్క్రిప్ట్ రచనాశిల్పం, కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్, పాలపిట్ట కథ 2026 పుస్తకం పెట్టాను. ఇదే గదిలోకి ఇంకెవరైనా తెలుగువారు వచ్చినప్పుడు వాటిని చూడొచ్చు, కొన్ని పేజీలు చదవొచ్చు... అని.   

జస్ట్ అలా పెట్టాలనిపించింది, పెట్టాను. :-) 

ప్రాపర్టీ యజమాని డెన్నిస్ కూడా సంతోషంగా ఫీలయ్యాడు, అభినందించాడు.

"ఇంగ్లిష్‌లో ఉంటే నేనూ చదివేవాన్ని. ఈసారి నువ్వు ఇంగ్లిష్‌లో రాసే బుక్ నేను కొనుక్కొని చదువుతాను" అన్నాడు. 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani