నువ్వు సంతోషంగా కనిపిస్తున్నావంటే నీకు సమస్యల్లేవని కాదు. వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం నీకున్నాయని.
మనకు బాధలున్నాయి, కష్టాలున్నాయి, సమస్యలున్నాయి... అని ఎప్పుడూ ఏడుస్తూ కూర్చోలేం కదా!
పోనీ, ఎప్పుడూ ఏడుస్తూ కూర్చుంటే పనులవుతాయన్న గ్యారంటీ ఏమైనా ఉందా? అలాగ్గాని ఉంటే, ఈ ప్రపంచమంతా ఏడుపులతో నిండిపోతుంది.
కట్ చేస్తే -
మనం ఆరోగ్యంగా ఉండాలంటే యాక్టివ్‌గా ఉండాలి. ప్రతి చిన్న విషయంలో సాధ్యమైనంతవరకు పాజిటివ్‌గానే ఉండాలి.
అప్పుడే ఏదైనా ఆలోచించగలుగుతాం. ఏదైనా చెయ్యగలుగుతాం. సాధించగలుగుతాం.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani