హిమాచల్ ప్రదేశ్‌లోని పాలంపూర్, యాండ్రెట్టా, న్యూగల్ ఖాడ్ పరిసరాల్లో ఒంటరిగా తిరుగుతూ గడపటం అనేది... నాకు సంబంధించి, నా జీవితంలో ఒక పెద్ద మార్పు.
ఈ పదకొండు రోజుల్లో ఒక అయిదు రోజులు నాకిష్టమైన ఒక రిట్రీట్‌లో గడిపాను. ఆ వివరాలు ఇంకో పోస్టులో చెప్తాను.
కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలోను, మన గురించి మనం ఆలోచించుకొనే సుధీర్ఘమైన ఇన్‌ట్రాస్పెక్షన్ సమయంలోనూ... ఇలాంటి ఒంటరి ప్రయాణాలు తరచూ అవసరం అని నేను అనుకుంటున్నాను.
పనిలో పని, మంచి "లొకేషన్ స్కవుటింగ్" కూడా చేసినట్టయింది. :-)
పనిలో పని, మంచి "లొకేషన్ స్కవుటింగ్" కూడా చేసినట్టయింది. :-)
కట్ చేస్తే -
నేను డైరెక్టర్‌గా షూటింగ్ పూర్తిచేసిన రోడ్ క్రైమ్ థ్రిలర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ త్వరలోనే ప్రారంభమవుతుంది. నా డైరెక్షన్లో ఇంకో కొత్త సినిమా షూటింగ్ కూడా ఈ డిసెంబర్లోనే మొదలవుతుంది.
ఎప్పటినుంచో అనుకుంటూ వాయిదాలు వేస్తూ వస్తున్న నా నంది అవార్డు పుస్తకం "సినిమా స్క్రిప్టు రచనాశిల్పం" మూడో ప్రింటుతో పాటు, నా ఇంకో కొత్త పుస్తకం "డ్రగ్ - Become Addicted to Success" కూడా డిసెంబర్లో రాబోతున్నాయి.
అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాక్షలు.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani