అన్నీ ఇప్పుడు మీ చేతుల్లోనే ఉన్నాయి!
Build a Business Around Your Passion.
Live Life to the Fullest.
అందరికీ జీవితం ఒక్కటే. అందరూ భూమ్మీదే పుట్టారు. ప్రపంచంలో అద్భుత విజయాలు సాధించినవారెవ్వరూ ఆకాశంలోంచి ఊడిపడలేదు. వారికేం అతీత శక్తులు లేవు.
వారూ మనలాగా మనుషులే.
అయితే – కొందరు అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకుంటూ, విజయాలు సాధించుకొంటూ ముందుకెళ్తుంటారు. జీవితాన్ని అద్భుతంగా ఎంజాయ్ చేస్తుంటారు. వీరికి పూర్తి వ్యతిరేకంగా, చాలామంది ఉన్నచోటే ఆగిపోతారు.
అన్నీ మనకు తెలిసినవే కదా అనిపిస్తుంది. కాని, ఏదీ సాధించకుండానే అలా సంవత్సరాలు గడిచిపోతుంటాయి. ఎందుకలా?
ఎందుకంటే –
మనీ, రిలేషన్‌షిప్స్…
ఈ రెండూ బాగున్నప్పుడే జీవితంలో అన్నీ బాగుంటాయి.
రెండిట్లో ఏది ముందు అంటే తప్పకుండా “మనీ”నే ముందు.
ఎవరికైనా సరే, ముందు చేతినిండా పని ఉండాలి. ఆ పని సరిపోయినంత ఆదాయాన్ని ఇస్తూ ఉండాలి. అలా సరిపోయినంత ఆదాయం ఉన్నప్పుడు రిలేషన్‌షిప్స్ బాగుంటాయి. రిలేషన్‌షిప్స్ బాగున్నప్పుడు మరింత బాగా డబ్బు సంపాదిస్తారు.
కొందరి విషయంలో ఇది రివర్స్‌లో ఉండవచ్చు. “రిలేషన్‌షిప్స్” బాగున్నప్పుడే వీరు ఏదైనా చేయగలుగుతారు. ఎంతయినా సంపాదించగలుగుతారు.
అనుభవాల నేపథ్యాన్ని బట్టి, రెండూ కరెక్టే.
నిజానికి ఇదంతా మన మైండ్‌సెట్ మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
ఒక '10X పర్సనల్ కోచ్'గా –
మనీ, రిలేషన్‌షిప్స్…
ఈ రెండు విషయాల్లోనూ
నేను మీకు సహాయపడగలను.
మనీ:
మీ ప్యాషన్ చుట్టూరా ఒక మంచి బిజినెస్ ప్రారంభించి, మీరు డబ్బు ఎలా సంపాదించుకోవచ్చు అన్న విషయంలో మీకు ప్రాక్టికల్‌గా, అప్పటికప్పుడు అమల్లో పెట్టి ముందుకెళ్లగలిగే సలహా ఇచ్చి గైడ్ చేయగలను. మీ దగ్గర కూడా ఎన్నో మంచి ఆలోచనలుండీ, మీ కెరీర్ విషయంలో కన్‌ఫ్యూజన్‌తో మీరు ఏదీ నిర్ధారించుకోలేకపోతున్నా సరే… నేను మీకు సహాయపడగలను.
రిలేషన్‌షిప్స్:
మీ వ్యక్తిగతం కావచ్చు, మీ వివాహబంధంలో కావచ్చు, మీ స్నేహ సంబంధాల విషయంలో కావచ్చు, బయట ఉద్యోగపరమైన-వృత్తిపరమైన సంబంధాల విషయంలో కూడా కావచ్చు… మీరు ఎదుర్కొంటున్న చాలెంజెస్‌ను పరిష్కరించుకోవడంలో నేను మీకు సహాయపడగలను.
మీ వయస్సు ఎంతైనా కావచ్చు. “ఇంక ఇంతే… ఎలా రాసిపెట్టివుంటే అలా జరుగుతుంది” అని మీరు అనుకోవడానికి వీల్లేదు.
మంచి ఆరోగ్యం కోసం మనం డాక్టర్‌ను ఎలాగయితే సంప్రదిస్తామో… మంచి సంపాదన, మంచి జీవితం కోసం మీకు పర్సనల్‌గా ఒక కోచ్ కూడా అంతే అవసరం.
ఒక అతిచిన్న దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి బయటపడి హైదరాబాద్ వచ్చాను. మెషినిస్ట్‌గా వర్క్‌షాపుల్లో పనిచేసుకొంటూ – మళ్ళీ చదువుకొన్నాను. యూనివర్సిటీలో రెండు పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సులు చదివి, యూనివర్సిటీ టాపర్‌గా రెండు గోల్డ్ మెడల్స్ సాధించాను. మూడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేశాను. రచయితనయ్యాను. పుస్తకాలు రాశాను. రచయితగా నంది అవార్డు సాధించాను. తర్వాత ఫిలిం డైరెక్టర్ అయ్యాను, ప్రొడ్యూసర్ అయ్యాను. అయిదు సినిమాలు డైరెక్ట్ చేశాను.
ఇంకెన్నో చేశాను, చేస్తున్నాను, చేయబోతున్నాను...
ఎక్కడో దూరం నుంచి ఒంటరిగా సిటీకి వచ్చి, ఎవ్వరి సహాయం లేకుండా, నేనే ఈ స్థాయికి రాగలిగినప్పుడు... ఈ డిజిటల్-ఏఐ యుగంలో మీరు మరింత ఈజీగా ఏదైనా సాధించగలుగుతారు.
నేను జీవితంలో ఎన్నో సాధించినవాన్ని, ఎన్నో కష్టనష్టాలు చూసినవాన్ని, అనుభవించిన వాన్ని. మీరు మళ్ళీ కొత్తగా అవన్నీ అనుభవించి కనుక్కోవల్సిన అవసరం లేకుండా, మళ్ళీ మీ జీవితంలో ఎలాంటి డబ్బుపరమైన, వ్యక్తిగతమైన ఇబ్బందులు రాకుండా ఒక '10X పర్సనల్ కోచ్'గా నేను మీకు సహాయపడగలను.
రెండూ సాధ్యమే.
10X స్పీడ్‌లో - ఊహించనంత వేగంగా - ఈ రెండిటినీ మీరు సాధిస్తారు.
జీవితం ఒక్కటే.
ఒంటరి పోరాటం చేస్తూ,
మీలో మీరే బాధపడుతూ
మరింత సమయం వృధా చేసుకోకండి.
నా పర్సనల్ కోచింగ్ అంతా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. అవసరం అనుకుంటే పర్సనల్‌గా కూడా కలుస్తాము.
మీరు నాతో చర్చించే ప్రతి విషయం గోప్యంగా నా మనస్సులోనే ఉంటుంది. మీ సమస్యలు నా సమస్యలవుతాయి. మీరూ నేనూ కలిసి, వాటికి పరిష్కారం కనుక్కొంటాము.
మీరు నాతో చర్చించే ప్రతి విషయం గోప్యంగా నా మనస్సులోనే ఉంటుంది. మీ సమస్యలు నా సమస్యలవుతాయి. మీరూ నేనూ కలిసి, వాటికి పరిష్కారం కనుక్కొంటాము.
మీ కెరీర్ బాగుంటుంది. మీరు డబ్బు సంపాదిస్తారు. మీ రిలేషన్‌షిప్స్ బాగుంటాయి. మొత్తంగా, ఇకనుంచీ మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు ఆనందంగా, అద్భుతంగా జీవిస్తారు. ఇదంతా, మీరూహించనంత వేగంగా సాధ్యం అవుతుంది!
నేను మీ కోచ్‌ను మాత్రమే.
ఈ జర్నీలోని ప్రతి స్టెప్‌లో నేను మీ వెంట ఉండి గైడ్ చేస్తాను.
పనిచెయ్యాల్సింది, సాధించాల్సింది మాత్రం మీరే.
In working with you, I bring my multi-passionate, diverse background and real-world experience. Your success is my success.
మీకు సహాయపడుతూ నేను కూడా కొత్త విషయాలు నేర్చుకొంటాను. కొత్త లక్ష్యాలు సాధిస్తాను. ఇది నా ప్యాషన్.
ముందే చెప్పినట్టు, అంతా మన మైండ్‌సెట్ మీద ఆధారపడి ఉంటుంది.
ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూస్తూ, మీ జీవితంలో మీరు వృధా చేసుకొంటున్న ప్రతి ఒక్క రోజుకీ ఎంత విలువ ఉందో ఇప్పటికయినా తెలుసుకున్నారా? మీ పర్సనల్ లైఫ్, మీ కెరీర్, మీ డబ్బు సంపాదన విషయంలో ఇప్పుడు మీరు నిజంగా సీరియస్‌గా ఉన్నారా?
"నాలో ఉన్న స్కిల్స్‌తో గాని, మార్కెట్‌కు అవసరమైన కొత్త స్కిల్స్ నేర్చుకుని గాని – నేను ఏదైనా సాధించగలను, ఎంతైనా డబ్బు సంపాదించగలను" అన్న నమ్మకం, ఆత్మవిశ్వాసం మీమీద మీకు ఉండాలి.
అలాంటి పాజిటివ్ మైండ్‌సెట్, అంత ఫైర్ మీలో ఉన్నా కూడా - పరిస్థితుల ప్రభావం వల్ల మీలో ఆత్మవిశ్వాసం రోజురోజుకూ సన్నగిల్లుతూ ఉంటుంది. ఏం చేయాలో తెలిసి ఉండీ, అన్నీ చేయగలిగిన సత్తా ఉండీ ఏదీ చేయలేకపోతుంటారు.
ఇదిగో - ఇలాంటి సమయంలోనే అనుభవంతో కూడిన ఒక హెల్పింగ్ హాండ్, ఒక ఆసరా అవసరం అవుతుంది. అలాంటి ఆసరా మీకు ఒక పర్సనల్ కోచ్ నుంచి, లేదా ఒక మెంటార్ నుంచి మాత్రమే దొరుకుతుంది. అమెరికా, బ్రిటన్ వంటి అభివృధ్ధి చెందిన దేశాల్లో ఇదంతా ఒక అతి మామూలు విషయం.
మీ లైఫ్, మీ కెరీర్, మీ డబ్బు సంపాదన విషయంలో ఇప్పుడు మీరు నిజంగా సీరియస్‌గా ఉన్నట్టయితే మాత్రం ఇక ఆలస్యం చేయకండి. ఈరోజే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించండి.
మీరూ డబ్బు సంపాదిస్తారు.
వ్యక్తిగతంగా మీరు కోరుకున్న మంచి జీవితాన్నీ ఎంజాయ్ చేస్తారు.
ఇంకొక్క క్షణం కూడా వృధా చేయకుండా - నా ప్రీమియమ్ కోచింగ్ ఫీజు, ఇతర వివరాలు పూర్తిగా తెలుసుకోడానికి - నాకు వాట్సాప్ చేయండి.
మీ సక్సెస్, మీ సంపాదన, మీ వ్యక్తిగత జీవితం, మీ ఆనందం... అన్నీ ఇప్పుడు మీ చేతుల్లోనే ఉన్నాయి!
10X Personal Coaching is Selective, Exclusive, and by Invitation Only.
– మనోహర్ చిమ్మని
10X Personal Coach
Writer | Blogger | Nandi Award Winner
WhatsApp: +91 9989578125
Email: richmonkmail@gmail.com

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani