Saturday, 28 November 2026

సోషల్ మీడియా విన్ విన్


ఎన్ని లైకులు, ఎంత మంది ఫాలోయర్స్, కామెంట్స్ ఏమొచ్చాయి... ఇవన్నీ కాదు. 

ఎప్పటికప్పుడు వాళ్ళు మార్చే ఏ అల్గారిధమో కూడా కాదు.   

ప్లాట్‌ఫామ్ ఏదైనా కావచ్చు. సోషల్ మీడియాను మనకు నచ్చినట్టు మనం ఉపయోగించుకోవాలి. పర్సనల్ రిలాక్సేషన్ కోసం కావచ్చు. ప్రొఫెషనల్ గోల్స్ కోసం కావచ్చు. మనక్కావల్సినట్టు మనం సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకోవాలి.   

సోషల్ మీడియాను మనం ఎంత బాగా ఉపయోగించుకోవాలంటే... దీనికోసం ప్రతిరోజూ మనం వెచ్చించే ఆ 30 నిమిషాలో, గంట సేపో... ఎలాంటి మొహమాటం లేకుండా సంపూర్ణంగా వాడేసుకోవాలి.   

మనమిక్కడ మన సమయం వెచ్చిస్తున్నాం అంటే... అది పర్సనల్‌గా మనకు సంతోషాన్నివ్వాలి. పాజిటివ్ ఎనర్జీనివ్వాలి. మన రోజువారీ టెన్షన్స్ నుంచీ, స్ట్రెస్ నుంచీ మనం చిటికెలో డైవర్ట్ అయిపోవాలి. ప్రొఫెషనల్‌గా అయితే మనం అనుకున్న రిజల్ట్స్ వచ్చేలా ఎడాపెడా వాడేసుకోవాలి.   

నో కాంప్రమైజ్.  

కట్ చేస్తే -

నీకేంటి, నాకేంటి. 
విన్ విన్. 
క్విడ్ ప్రో కో. 

ఒప్పుకోం కానీ, ప్రపంచమంతా బ్రతికేది ఈ కాన్‌సెప్ట్ మీదే.

సోషల్ మీడియా క్రియేటర్స్ అంతా వారి వారి ప్లాట్‌ఫామ్స్‌ను మనం వదలకుండా ఉండేందుకు చేసే రిసెర్చ్ కోసం ఎప్పటికప్పుడు బిలియన్ల డాలర్స్ ఖర్చుపెడుతున్నారు. అంతకు వేల రెట్ల లాభాల్ని, ప్రయోజనాల్ని, డేటాను వాళ్ళు మన ద్వారా సాధిస్తున్నారు. 

పరోక్షంగా వారు సేకరించే డేటాలో మన పర్సనల్ విషయాలు కూడా ఎన్నో ఉంటాయి. అవన్నీ మనం పెద్దగా పట్టించుకోం. 

పనికొచ్చేవీ పనికిరానివీ పోస్ట్ చేస్తూ, మనిషికొక మీడియా సంస్థగా మారిపోయాం. 

మనకు ఆనందాన్నిచ్చినంతవరకు... ఇంకొకర్ని మనం ఇబ్బంది పెట్టనంతవరకు... తప్పేం లేదు.    

కానీ, గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే... సోషల్ మీడియా క్రియేట్ చేసి వాళ్ళు మనల్ని బాగా వాడుకుంటున్నారు, ఉపయోగించుకొంటున్నారు. మనం కూడా సాధ్యమైనంత బాగా సోషల్ మీడియాను మన కోసం వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. 

లేదంటే ఇక్కడ మనం వెచ్చించే ప్రతి నిమిషం ముమ్మాటికీ వ్యర్థం. 
   

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani