Monday, 9 November 2026

5200 రోజుల ఆత్మీయ స్నేహం


జీవితంలో ఒక దశ తర్వాత చెయ్యాలనుకున్నది చేసేసుకుంటూ పోవడమే. 

మిగిలిందంతా జస్ట్ బుల్‌షిట్! 

కట్ చేస్తే -   

21 ఆగస్టు 2012 నాడు, నేను అనుకోకుండా సృష్టించిన నా ఈ బ్లాగ్ వయస్సు చూస్తుండగానే 14 ఏళ్ళు దాటింది. 

దాదాపు 5200 రోజుల ఆత్మీయ స్నేహం మా ఇద్దరిదీ! 

ఎందరో అద్భుతమైన మిత్రులు నాకు ఇక్కడే పరిచయమయ్యారు. నా జీవితంలో ఎన్నో ముఖ్యమైన మలుపులకు, ఆలోచనలకు ఈ బ్లాగే కారణమయ్యింది.  

తీవ్రమైన ఆలోచనల్లో నేను ఎటెటో కొట్టుకుపోతున్న సున్నితమైన సమయాల్లో నన్ను కాపాడింది కూడా నా బ్లాగే.  

మొన్నటి నా బెస్ట్ సెల్లర్ పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" ఆలోచన నాలో రావడానికి కూడా నాకత్యంత ఇష్టమైన నా ఈ బ్లాగింగ్ అలవాటే కారణం. 

థాంక్స్ టు మై బ్లాగింగ్ హాబీ... ఇప్పుడు నా ఇంకో కొత్త పుస్తకం ప్రింట్‌లో ఉంది! 

డిసెంబర్లో రిలీజ్. 

ఈ మధ్య రెండురోజులు మనసు బాగోలేక ఈవైపు చూడనందుకు నిజంగా ఏదో కోల్పోయినట్టుగా ఫీలయ్యాను.     

2012 నుంచీ ఎడిక్ట్ అయిన నా బ్లాగింగ్ గురించి, పరోక్షంగా అది నాకు ఇస్తున్న ఎన్నో ఆనందాల గురించి నేను ఎంత చెప్పుకున్నా తక్కువే. 

"Sometimes I think of blogging as finger exercises for a violinist; sometimes I think of it as mulching a garden. It is incredibly useful and helpful to my “real” writing." ~Kate Christensen 

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani