మనిషన్న తర్వాత ఏదో ఒక ఎడిక్షన్ ఉంటుంది. ఎడిక్షన్ అంటే అది ఏ తాగుడో, జూదమో, ఇంకేదో కానక్కర్లేదు. చచ్చేంత ఇష్టం ఉండే ఏదైనా పాజిటివ్ అలవాటు కూడా కావచ్చు.
నాకున్న ఏకైక ఎడిక్షన్ బ్లాగింగ్.
కనీసం ఒక అయిదారు సార్లు ఇంక బ్లాగింగ్ బంద్ చేద్దామనుకున్నాను. కాని, అలా జరగలేదు.
కట్ చేస్తే -
21 ఆగస్ట్ 2012.
సుమారు 14 ఏళ్ల క్రితం, నేను నా బ్లాగింగ్ జర్నీ ప్రారంభించాను. ఇప్పటికీ ఎలాంటి బోర్ ఫీలింగ్ లేకుండా, ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహంతో నా బ్లాగ్‌లో ఏదో ఒకటి రాస్తూనే ఉన్నాను.
నాకు తోచింది.
నాకు నచ్చింది.
నేను రాయాలనుకున్నది.
నా గోల.
నా గొడవ.
నా ఇష్టం.
పనికొచ్చేదో, పనికి రానిదో... ఏదో ఒకటి రోజూ కాసేపు ఇలా రాయడం చాలా అవసరం నాకు. అంతలా ఎడిక్టయ్యాను.
ఏదో రాసి ఎవర్నో ఉద్ధరించాలని కాదు ఇక్కడ విషయం. నన్ను నేను ఉద్ఢరించుకోవడం కోసం మాత్రం నాకు నిజంగా తప్పనిసరి.
ఇంతకు ముందు చాలా సార్లు నాకు నేనే చెప్పుకున్నట్టు - రాయడం అనేది నాకు సంబంధించినంతవరకు - ఒక థెరపీ. ఒక యోగా. ఒక ఆనందం. ఒక స్పిరిచువల్ ఎక్సర్‌సైజ్.
వెనుక ఎన్ని వేధిస్తున్నా, వెంటాడుతున్నా... వాటితో పొరాడుతూనే నవ్వుతూ ఉండటం ఎలా, నలుగురికీ నవ్వుని పంచటం ఎలా అన్నది ఇలాంటి ఒక క్రియేటివ్ యాక్టివిటీ వల్లే సాధ్యమవుతుంది. అది బ్లాగింగ్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, డాన్స్, పాడటం, రాయటం... ఇంకేదైనా కావచ్చు. జస్ట్ ఒక క్రియేటివ్ యాక్టివిటీ చాలు. దానికోసం రోజూ కొన్ని నిమిషాలు చాలు.
నాకు నా బ్లాగింగ్ ఉంది.
మరి, మీకేముంది?
ఎవరేమనుకుంటారో అన్న మైండ్‌సెట్ లోంచి బయటపడగలిగితే చాలు... బ్లాగింగ్, మనతో మనం మాట్లాడుకోడానికి ఒక మంచి ఔట్‌లెట్‌లా పనిచేస్తుంది. ఎన్నో కొత్త స్నేహాలను అందిస్తుంది. కొత్త ఆలోచనలొస్తాయి. కొత్తగా కొన్ని ప్రారంభిస్తాం.
నా బ్లాగింగ్ వల్లే ఇప్పుడు కొత్తగా నేను ఇంకో పుస్తకం పూర్తిచేశాను. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నాను.
డ్రగ్ - Become Addicted to Success.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani