Tuesday, 10 November 2026

హిమాలయాలకు మొదటిసారి


ఎంతకూ బ్రేక్ చెయ్యలేని ఒక రొటీన్‌నో, ఒక స్టకప్‌నో బ్రేక్ చెయ్యాలంటే ఒక మార్పు తప్పనిసరి.

ప్రయాణానికి మించిన మార్పు లేదు. 

అది కూడా, ఇంతకు ముందు మనం ఎప్పుడూ వెళ్ళని ప్రదేశమైతే ఇంకా మంచిది.    

హిమాలయ యాత్ర అనగానే నాకు మా సాదిక్ గుర్తొస్తాడు. నాతో ఎన్నోసార్లు అన్నాడు... "ఒక్కసారి నాతో హిమాలయాలకు రా, మనూ. నువ్వేం మిస్ అవుతున్నావో నీకు అర్థమవుతుంది. సముద్రం ఒక్కటే కాదు, హిమాలయాలు కూడా నీకు అంతే సంతోషాన్నిస్తాయి" అని.

ఇప్పుడు సాదిక్ లేడు. 

దటీజ్ లైఫ్. 

ఎన్నాళ్ళుంటామో తెలీదు. ఇన్ని టెన్షన్స్, ఇన్ని మాటలు, ఇన్ని అపార్థాలు, ఇన్ని మాస్క్‌లు, ఇన్ని ఈగోలు, ఇంత గందరగోళం నిజంగా అవసరమా... ఇంత చిన్న జీవితానికి?

నిజంగా కొన్ని నమ్మలేం...
మనదాకా వచ్చే దాకా.
మనమే అనుభవించేదాకా. 

ఒకప్పుడు ఒక్క ఫోన్ కాల్‌తో అయిపోయే పనులు, ఇప్పుడు సంవత్సరం అయినా కదలట్లేదంటే ఎంత చికాగ్గా ఉంటుంది? 

కారణాలతో పనిలేదు. పనులు కదలాలి. పని జరగాలి.   

కట్ చేస్తే -

అనుకోకుండా చండీఘర్, ఢిల్లీ ప్రయాణాలు పడ్డాయి. ఇదే సమయంలో ఈ హిమాలయ యాత్ర కూడా కనెక్ట్ చేసుకున్నాను. 

మధ్య హిమాలయాల్లోకి వచ్చే ధౌలధర్ పర్వతశ్రేణుల ప్రాంతంలో నా ప్రయాణం ఉంటుంది. సుమారు వారం రోజులపాటు నేను ఉండేది కూడా అక్కడే.   

నా ప్రోగ్రాం మొత్తం తెలుసుకున్న మా అబ్బాయిలు కూడా "హాప్పీగా వెళ్ళిరా, డాడీ" అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  

ఒక్కన్నే వెళ్తున్నాను. లాప్‌టాప్ కూడా వెంట తీసుకెళ్ళటం లేదు. 22 వరకు నా మొబైల్ కూడా వాడను. కాల్స్, మెసేజెస్ లేవు. 

కొన్ని తెల్ల కాగితాలు, పెన్నులు, ఒకటిరెండు బుక్స్ మాత్రం తీసుకెళ్తున్నాను. 

పదిరోజులకి బ్లాగ్ పోస్టులు ముందే పోస్ట్ చేసి, స్కెడ్యూల్ చేశాను. ఎలాంటి బ్రేక్ లేకుండా అవి రోజూ కనిపిస్తుంటాయి.

తోచినప్పుడు ఇన్‌స్టాలో ఫోటోలు ఎక్కిస్తూవుంటాను. 

22/23 నాడు పునర్దర్శనం. 

“It is not the mountain we conquer, but ourselves.” 
— Sir Edmund Hillary

"Fitness first. Everything else follows."
— Rich Monk

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani