ఒకే ఖచ్చితమైన నిర్ణయానికి కట్టుబడివుండే రోజులు కావివి.
పరిస్థితులనుబట్టి, క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారి నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.
కట్ చేస్తే -
నేను చాలా సార్లు అనుకున్నాను. నా అతి దగ్గరి ఫ్రెండ్స్‌కు చెప్పాను. మా టీమ్‌లో కూడా చాలామందితో చాలాసార్లు చెప్పాను కూడా.
"నేనొక "అకేషనల్ ఫిలిం మేకర్"ని. ఎప్పుడూ రెగ్యులర్‌గా సినిమాలు చెయ్యాలనుకోలేదు. ఇప్పుడు కూడా అంతే. ఒకటో రెండో సినిమాలు హాయిగా ఆ ప్రాసెస్‌ను ఎంజాయ్ చేస్తూ చేస్తాను. ఇంక ఆ తర్వాత సినిమాలు చేయను" అని.
మధ్యలో అప్పుడప్పుడూ కొంచెం టెంప్ట్ అయినా కూడా, కంట్రోల్ చేసుకున్నాను.
ఇప్పుడు నాకెలాంటి బాదర బందీల్లేవు. ఉద్యోగాలు సద్యోగాల్లేవు. పూర్తిగా ఫ్రీ. చెయ్యాలనుకుంటే చిన్న సినిమాలు నేను రెగ్యులర్‌గా చెయ్యొచ్చు. కాని, నాకంత ప్యాషన్ లేదు. అంత సమయం వృధా చేసుకోలేను.
ఇది ఒక్కరి నిర్ణయం మీద నడిచే ప్రొఫెషన్ కాదు. ఎన్నెన్నో ఈగోలు, నిర్ణయాలు, యాటిట్యూడ్‌లు అనుక్షణం ఇబ్బందిపెడుతుంటాయి. ఏదీ మనసుకి ఎక్కించుకోనట్టే అన్నీ నవ్వుతూ భరిస్తుండాలి.
అంతా బావున్నట్టే ఉంటుంది. ఒక్కసారిగా సీన్ మారిపోతుంది. ఇదంతా ఇప్పుడు నాకవసరమా? అనుకున్న హిట్ సాధిస్తే కోట్లు వస్తాయి నిజమే. కాని, దాని కోసం ఎన్ని భరించాలి?
సో, జస్ట్ ఒకటో రెండో... మనకి నచ్చిన వాతావరణంలో, అలాంటి లైక్‌మైండెడ్ టీమ్‌తో కుదిరితేనే సినిమా.
ముందే చెప్పినట్టు, జస్ట్ ఆ ప్రాసెస్ ఎంజాయ్ చెయ్యటం కోసమే. లేదంటే లేదు.
Creativity is courage. Film is a battlefield.
Every idea you dare to express must fight fear, doubt, rejection, budgets, egos, and time itself — and only the bravest stories survive to see the light.
Creativity is courage. Film is a battlefield.
Every idea you dare to express must fight fear, doubt, rejection, budgets, egos, and time itself — and only the bravest stories survive to see the light.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani