నెమ్మదిగా సింగిల్ థియేటర్స్ అన్నీ... అన్నిచోట్లా అదృశ్యం అవుతాయి. మాల్స్, మల్టిప్లెక్సెస్‌లోని కాంపాక్ట్ థియేటర్స్ తప్ప, పెద్ద థియేటర్స్ అనేవి దాదాపు ఇంక ఉండవు. ఇది నా ప్రెడిక్షన్ కాదు. మనకు ఇష్టంలేని నిజం.
బిగ్ స్క్రీన్ మీద మాత్రమే చూసి థ్రిల్ ఫీల్ కావాలనిపించే అతి కొన్ని అత్యంత భారీ స్థాయి విజువల్స్, భారీ స్టార్‌డమ్ ఉండే సినిమాలకు తప్ప... థియేటర్స్‌కు వెళ్ళి సినిమా చూడాలన్న కోరిక సగటు ప్రేక్షకుని జీవనశైలిలోంచి చాలా త్వరగా అదృశ్యమైపోతోంది.
వినడానికి కష్టంగా ఉంటుంది. కాని, ఇది మనం నమ్మితీరాల్సిన నిజం.
చాలా మంది పాయింట్ అవుట్ చేస్తున్నట్టు... టికెట్ రేట్స్ ఇష్టమొచ్చినట్టు పెంచుతుండటం, క్యాంటీన్స్‌లో విపరీతమైన ధరలు వంటివి ఈ మార్పుకు ఒక ప్రధాన కారణం కావచ్చు. కాదనలేం. ఎందుకంటే - సినిమా స్టార్‌లను ఎక్కువగా ఆదరించేది, సినిమాలు ఎక్కువగా చూసేది, సినిమాల కోసం ఎక్కువగా ఖర్చుపెట్టేది... మధ్యతరగతి వాళ్లు, దిగువ మధ్యతరగతి వాళ్లే.
అయితే - దీన్ని మించిన కారణాలు కూడా అనేకం ఉన్నాయి...
కరోనా తర్వాత సగటు మనిషి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడున్న సగటు మనిషి జీవనశైలికి సినిమా ఒక ఆప్షన్ మాత్రమే. సినిమాను మించిన ప్లాట్‌ఫామ్స్, టైమ్‌పాస్‌లు ఇప్పుడు చాలా ఉన్నాయి. వీటిలో - ఓటీటీలు, సోషల్ మీడియా అనేవి టాప్‌లో ఉంటాయి. సింగిల్ థియేటర్స్ కనుమరుగు కావడానికి ఈ రెండు కూడా అతి ముఖ్యమైన కారణాలని నేను భావిస్తాను.
కట్ చేస్తే -
మనిషి జీవనశైలిలో వచ్చిన ఈ మార్పుని ఎవ్వరూ ఆపలేరు. కాని, సినిమా కూడా ఎక్కడికీ పోదు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏ ఐ) వంటి కొత్త ఆవిష్కరణలు ఇంకెన్ని పుట్టుకువచ్చినా, సినిమాపై వాటి ఎఫెక్టు గురించి ఎవరు ఎంత భయపెట్టినా... సినిమా మాత్రం చావదు. దానికి అంతం లేదు.
జస్ట్... సినిమాను ప్రదర్శించే ప్లాట్‌ఫామ్స్ మాత్రమే మారుతుంటాయి.
Trends change. Tech evolves. But cinema stays—because stories never die.
- మనోహర్ చిమ్మని
మీరు చెప్పింది నిజం. మార్పు తప్పదు.
ReplyDeleteసినిమా ఉంటుంది. ఎందుకంటే ఎమోషన్స్ ను సృష్టించడం ఏ ఐ వల్ల కాకపోవచ్చు.
Yes sir. Thank you.
Delete