Monday, 22 December 2025

వర్చువల్ ఆఫీస్ ఆలోచన ఇంకోసారి... ఎందుకంటే...


నాలుగు గోడల మధ్య ఆఫీస్ కల్చర్ రోజులు పోయాయి.

ఎక్కడికెళ్తే అక్కడే పని.
ఎక్కడ ఇష్టంగా ఉంటే అక్కడ్నుంచే పని. 

ఇండిపెండెంట్ సినిమాలకైతే నా దృష్టిలో అసలు ఆఫీసే అవసరం లేదు. పనినిబట్టి, అవసరాన్ని బట్టి, టీమ్ ఎక్కడ కలిస్తే అదే ఆఫీస్. 

డిజిటల్ ఆఫీస్ అన్నమాట.
వర్చువల్ ఆఫీస్ అని కూడా అనొచ్చు. 

ఇలాంటి వర్చువల్ ఆఫీసులతో ఇండిపెండెంట్ సినిమాలు తీసి మిలియన్లలో డాలర్స్ కొల్లగొట్టిన ఫిలిం మేకర్స్ హాలీవుడ్‌లో చాలామంది ఉన్నారు.

రాబర్ట్ రోడ్రిగ్జ్... ఒక పెద్ద ఉదాహరణ.   

కట్ చేస్తే -

మొన్నీమధ్యే నాకు తెలిసిన ఒక డైరెక్టర్ కొత్తగా ఆఫీస్ తీసాడు. ఇన్వెస్టర్స్, ప్రొడ్యూసర్స్, మీడియేటర్స్ బోలెడంత మంది ఇచ్చిన ప్రామిస్‌లను, హామీలను నమ్మి ఆ పనిచేశాడు. 

నిజానికి అది ప్రొడ్యూసర్ చేయాల్సిన పని.
రాంగ్ డెసిషన్.  

అయినా జాగ్రత్త పడలేదు మన డైరెక్టర్. మళ్ళీ టెంప్ట్ అయ్యాడు. మళ్ళీ మనుషుల్ని, వారి మాటల్ని నమ్మాడు. స్టార్ హోటల్లో సినిమా ఓపెనింగ్ చేస్తే కోట్లు పెట్టిస్తాం అన్నారు. గుడ్డిగా నమ్మాడు.  

రాంగ్ డెసిషన్ నంబర్ టూ. 

స్టార్ హోటల్లో ఓపెనింగ్ అయింది. 

మాట ఇచ్చినవాళ్లంతా, కోతలు కోసినవాళ్లంతా బంధుమిత్ర సమేతంగా వచ్చి తిని. టైం పాస్ చేసి, ఫోటోలు దిగి వెళ్లారు. తర్వాత ఒక్క కాల్, ఒక్క మెసేజ్ లేదు. 

అవసరార్థం మనుషులు. అంతే.

తప్పు వాళ్లది కాదు. 
డైరెక్టర్ ది. 
ఎవరు ఎలాంటి వ్యక్తిత్వాలో తెలీకుండా నమ్మి నిర్ణయాలు తీసుకోడం మూర్ఖత్వం. 

ఆఫీసు, ఫర్నిచర్, 18 నెలల మెయింటెనెన్స్, స్టార్ హోటల్లో ఓపెనింగ్... అన్ని కలిపి కొత్తగా ఇంకో 20 లక్షలు నష్టం. 

ఇలాంటివి సినిమా ఫీల్డులో సర్వసాధారణం. 
తెలిసి చేసే తప్పులు ఇలా ఉంటాయి. 

ముఖ్యంగా డైరెక్టర్స్ లైఫ్ ఒక రేంజ్‌లో కిందామీదా అవుతుంటుంది. 

ఇలా అప్‌కమింగ్ వాళ్ళకే కాదు, టాప్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్‌కు కూడా జరుగుతుంటుంది. 

ఒక్కొక్కరి అనుభవం ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది.

ఎప్పటికప్పుడు ఇలాంటి మనుషులతో జ్ఞానోదయాల సిరీస్ నడుస్తుంటుంది... ముఖ్యంగా ఫిలిం డైరెక్టర్స్‌కు.  

అందుకే ఎవరు చేసే పనులు వాళ్ళు చెయ్యాలి.
టెంప్ట్ కావద్దు. 

ముఖ్యంగా సినిమా.
ప్రతిరోజూ, ప్రతి క్షణం ఇక్కడ ఏదో ఒక టెంప్టేషన్ ఉంటుంది. ఈ టెంప్టేషన్‌ను గెలవటం ఇక్కడ అంత ఈజీ కాదు. అది గెల్చినవాడు నిజంగా తోపు.      

ఇలాంటి ఎపిసోడ్స్ చూసినప్పుడల్లా నేను సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడుతుంటాను… 

“తాడి చెట్టు కిందకి వెళ్తే, అక్కడ కల్లే తాగాలి” అని. 

కట్ చేస్తే -

ఇలాంటి నష్టం ఒక్క డబ్బుతోనే కాదు, పనికిరాని ఈగోలతో కూడా జరుగుతుంటుంది. 

కావల్సినంత బడ్జెట్ ఉండీ, భారీ స్టార్స్ ఉన్న సినిమాలు కూడా సంవత్సరాలుగా ఆగిపోతుంటాయి. 

అల్టిమేట్‌గా నష్టం ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లకే.

అందుకే, "మనం ఎప్పుడూ ఒక దట్టమైన అడవిలో ఉన్నట్టు ఫీలవుతూ, ప్రతి నిమిషం అలర్ట్‌గా ఉండాలి. ఏ మూల నుంచి ఏ జంతువు వచ్చి మనల్ని ఎలా ఎటాక్ చేస్తుందో తెలీదు" అంటాడు పూరి జగన్నాధ్.    

ఇప్పటికైనా అర్థమైందా, ప్రదీప్? 

- మనోహర్ చిమ్మని  

Sunday, 21 December 2025

కొత్త అసిస్టెంట్ డైరెక్టర్స్‌కు అవకాశం!


పూర్తిగా న్యూ టాలెంట్‌తో, మొన్నీ మధ్యే నేను షూటింగ్ పూర్తిచేసిన రోడ్-క్రైమ్-డ్రామా "ఎర్ర గులాబి" ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది.  

కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పద్ధతిలో తాజాగా నేను చేస్తున్న రెండు ఇండిపెండెంట్ ఫీచర్ ఫిలిమ్స్ ప్రి-ప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పుడు జరుగుతోంది.  

ఈ సిస్టమ్‌లో నాతో కలిసి మా టీమ్‌లో పనిచేయాలనుకొనే కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఇన్వెస్టర్లు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. 

అలాగే - సినిమాల పట్ల ఆసక్తి, ప్యాషన్, సీరియస్‌నెస్ ఉన్న న్యూ టాలెంట్ నా వాట్సాప్ చానల్ "MC Renegade Film Club" లో జాయిన్ కావచ్చు. నా కొత్త సినిమాల ప్రకటన, ప్రారంభం, షూటింగ్, ప్రోగ్రెస్ లాంటి వివరాల అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఈ చానెల్లో పోస్ట్ చేస్తుంటాము. ముఖ్యంగా కొత్తవారికి అవకాశాలు, ఆడిషన్స్ వివరాలు ఈ చానెల్లోనే ముందుగా పోస్ట్ చేస్తాము. 

కట్ చేస్తే -

నాకు ఇప్పటికిప్పుడు ఇద్దరు కొత్త అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలి. వెంటనే టీమ్‌లోకి తీసుకుంటాను. 

ప్రధాన అర్హతలు:
-----------------------
1. అసిస్టెంట్ డైరెక్టర్‌కు ఉండాల్సిన అన్ని బేసిక్ అర్హతలు.
2. యూట్యూబ్ వీడియోల ఎడిటింగ్.
3. Canva/Photoshop లో డిజైనింగ్. 

మీ పూర్తి వివరాలు తెలుపుతూ నాకు ఈమెయిల్ చెయ్యండి. వాట్సాప్ కూడా చెయ్యొచ్చు. కాల్స్ మాత్రం చెయ్యొద్దు.

Email: okafilmmaker@gmail.com
WhatsApp (text message only): +91 9989578125

ఇది అవకాశం మాత్రమే. ఉద్యోగం కాదు.
AD వర్క్ Online/Off Line లలో జరుగుతుంది. 

ఇంటర్వ్యూ ఉంటుంది. సెలక్టు అయితే కనీసం 6 నెలలపాటు నాతో పాటు మా టీమ్‌లో పనిచేస్తా అని అగ్రిమెంట్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. 

"Movies are like an expensive form of therapy."
- Fedirico Fellini 

- మనోహర్ చిమ్మని 

The Rich Monk and Spirituality


I live in two worlds that many people believe can’t coexist.

One is visible: awards, books, films, deadlines, money, survival.
The other is invisible: silence, awareness, detachment, the inner “me.”

I write. I direct films. I create content. I earn my living through creativity. I don’t apologize for that. Passion must feed itself to survive.

But none of this pulls me away from my spiritual center.

Spirituality, for me, is not an escape from work or ambition. It’s the lens through which I see them clearly. It reminds me that success is temporary, failure is instructional, and identity is far larger than a title or an award.

I don’t need to renounce the world to stay inwardly free. I engage fully—with cinema, writing, people, money—while remaining unattached to outcomes. I work hard, work smart, but I don’t let work own me.

The “Rich Monk” is not a contradiction. It’s a balance.

To create without ego.
To earn without fear.
To live outwardly active, inwardly still.

In the end, everything I write, every film I make, is just another way of listening to that quiet inner voice—and honoring it while staying in the world. 

- Manohar Chimmani 

Saturday, 20 December 2025

అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ... చిన్న సినిమాలదే హవా!


పెద్ద సినిమాలు, పెద్ద గ్యాంబ్లింగ్.
వాటితో పోలిస్తే చిన్న బడ్జెట్ సినిమాలు నిజంగా రిస్క్-ఫ్రీ. 

పెద్ద సినిమాల విషయంలో, ఇప్పుడు ఏదీ ఎవ్వరూ వివరించి చెప్పే అవసరం లేదు. ఎవరికి ఎంత మార్కెట్ ఉంది, ఎన్ని కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు, అసలంత మార్కెట్ ఉందా వారికి, హిట్ అయితే ఎంత వస్తుంది, ఫట్ అయితే పరిస్థితి ఏంటి... అన్నది ఎవరైనా ఈజీగా గెస్ చేయొచ్చు.

జస్ట్ సింపుల్ లాజిక్. 

అయితే ఇవన్నీ పట్టించుకోకుండా ఆడే 'కాసినో' గ్యాంబ్లింగే పెద్ద సినిమాలు. 

ఈ పెద్ద సినిమాల అంకెలు బయటికి ప్రొజెక్ట్ చేసుకునేవి వేరు, లోపలి అసలైన అంకెలు వేరు.   

కట్ చేస్తే - 

ఇంతకుముందైనా ఇప్పుడైనా ఎప్పుడైనా... నిజంగా చిన్న సినిమాలదే హవా. 

ఒక మంచి స్ట్రాటెజీతో, 
మార్కెట్ అవగాహనతో చేస్తే - 
చిన్న సినిమాలకు మినిమమ్ గ్యారంటీ ఉంది.
హిట్ కొడితే 100 కోట్లు!

ఫట్ అయినా పెద్ద ఫరక్ పడదు. పెద్ద సినిమాల ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్ అంత కాదు ఈ చిన్న సినిమాల బడ్జెట్. 

Small-budget renegade films are a gold mine. But you can’t win the game if you don’t even play it.

- మనోహర్ చిమ్మని     

Quiet Rebel


I don’t scream.
I observe.

I don’t chase attention.
I choose intention.

While the world performs,
I listen.

Renegade Cinema is quiet resistance —
to shortcuts,
to noise,
to fear.

I make films slowly, honestly,
with responsibility for every frame.

No hype.
No approval-seeking.
Just truth.

The loudest rebellion today
is staying real.

Welcome to Renegade Cinema.

- Manohar Chimmani 

అందరి 24 గంటలు ఒకటే కాదు!


తన జీవిత కాలంలో మొత్తం 151 సినిమాలు చేసిన గిన్నిస్ రికార్డ్ దర్శకులు, గురువు గారు "దర్శకరత్న" దాసరి నారాయణరావు 1980, 1981, 1982 ల్లో - వరుసగా మూడేళ్ళూ - సంవత్సరానికి 10 సినిమాలు చేశారు.

అలాగని ఏదో చుట్టచుట్టి అవతల పడేసిన సినిమాలు కావవి. వాటిల్లో 80% సినిమాలు హిట్లు, సూపర్ హిట్లు, సిల్వర్ జుబ్లీలు!

స్వప్న, శ్రీవారి ముచ్చట్లు, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు, సీతారాములు మొదలైనవి ఆ లిస్ట్ లోనివే. 

హిందీ సినిమాలు యే కైసా ఇన్సాఫ్, జ్యోతి బనే జ్వాల కూడా ఆ లిస్టులోనివే. 

కట్ చేస్తే -

ఫిలిం నెగెటివ్ వాడిన ఆరోజుల్లోనే సంవత్సరానికి అన్ని సినిమాలు చేయగలిగినప్పుడు, ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో సంవత్సరానికి ఒక్క సినిమా అయినా ఎందుకని చెయ్యలేకపోతున్నాం? 

Cinema rewards courage, not comfort.

- మనోహర్ చిమ్మని    

Thursday, 18 December 2025

సినిమాలెందుకు తీస్తారు?


1. డైరెక్టర్స్ అయినా, ప్రొడ్యూసర్స్ అయినా సినిమాలు తీయాలనుకునేది, సినిమాల మీద వారికున్న ప్యాషన్‌తో. 

2. కొంతమందికి బై-డిఫాల్ట్ కొన్ని కోరికలుంటాయి. జస్ట్ అందుకోసం కూడా కొందరు సినిమాలు తీస్తారు. దీనిమీద నేను కామెంట్ చెయ్యను.

3. ఎక్కువమంది ప్రొడ్యూసర్స్ సినిమాల్ని ఒక బిజినెస్ దృక్పథంతోనే చేస్తారు. వీరిలో సగం మంది ఈ బిజినెస్‌నే ఎన్నుకోడానికి కారణం... ఈ బిజినెస్ ఇచ్చే ఫేమ్, సెలెబ్రిటీ స్టేటస్. 

4. ఈ ఒక్క ఫిలిం బిజినెస్‌లోనే మనీ మ్యాటర్స్‌ను భారీ స్థాయిలో (నలుపు తెలుపుల్లో) అడ్జస్ట్‌మెంట్స్ చేసుకునే వీలుంటుంది. అందుకని కూడా ఇతర రంగాల్లోని భారీ బిజినెస్‌మెన్ ఇక్కడ భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టి, సినిమాలు తీస్తారు. 

5. సినిమాల బడ్జెట్స్ అంకెల విషయంలో బయటికి కనిపించేవి వేరు, నిజమైన లోపలి అంకెలు వేరు. ఈ సినిమా ప్లాట్‌ఫామ్ వేదికగా, నేపథ్యంలో వేరే బిజినెస్ సామ్రాజ్యాలను కూడా క్రియేట్ చేసుకుంటారు.   

కట్ చేస్తే -

ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న ప్రొడ్యూసర్స్‌లో ఎక్కువ భాగం 4, 5 కేటగిరీల్లోకి వస్తారని మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.

- మనోహర్ చిమ్మని 

ఇప్పుడంతా యూట్యూబ్ మార్కెటింగ్!


పుస్తకాలు, న్యూస్ పేపర్లు, మ్యాగజైన్స్‌ని చదవటం దాదాపు పూర్తిగా మర్చిపోయారు జనం. సోషల్ మీడియాలో కూడా ఒక్క లైన్‌కు మించి ఏదైనా ఉంటే అసలు చదవట్లేదు. 

ఎక్కువ చదివే టైమ్, ఓపిక లేదిప్పుడు ఎవరికీ.
కాని, వీడియోలు మాత్రం ఎక్కువగా చూస్తున్నారు.
గంటలకొద్దీ చూస్తున్నారు.
దాదాపు ఎడిక్ట్ అయ్యారు. 

ఇంకోటేదో వచ్చేదాకా ఇదొక ట్రెండ్ అంతే. 

కట్ చేస్తే -


ఇప్పుడు పూర్తిగా ఫ్రీ అయిపోయాను కాబట్టి, నా పూర్తి సమయం సినిమాలవైపు పెడుతున్నాను.

ఫిట్‌నెస్ కోసం ఎప్పుడూ చేతినిండా పని ఉండాలి, డబ్బూ బాగా రావాలి అంటే సినిమాను మించింది ఇంకేముంటుంది? 

నా యూట్యూబ్ చానెల్ బయోలో, నా యూట్యూబ్ వీడియోల్లోని డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ లింక్స్ ఉన్నాయి. లైక్‌మైండెడ్ క్రియేటివ్ ఫ్రీక్స్, ఇన్వెస్టర్లు, ఔత్సాహిక ప్రొడ్యూసర్స్, కోప్రొడ్యూసర్స్ నన్ను కనెక్ట్ కావచ్చు.   

చిన్న గ్యాప్ వచ్చింది... వీడియో ఎడిటింగ్ సమస్య వల్ల. 

నాకు కావల్సిన వీడియో ఎడిటర్ వెంటనే దొరికితే, ఇకనుంచి రెగ్యులర్‌గా వీడియోలు అప్లోడ్ చేస్తాను.  

ప్రొఫెషనల్ రైటర్-డైరెక్టర్‌గా యూట్యూబ్ మార్కెటింగ్ కూడా నాకు అవసరం.
చాలా చాలా అవసరం. 

కొన్నిటి విలువని కొంచెం ఆలస్యంగా గ్రహిస్తాం మనం. 

చూడాలి, యూట్యూబ్ కంటిన్యూ చేస్తానా... లేదంటే నాకెంతో ప్రియమైన నా బ్లాగింగ్‌తోనే బండి లాగిస్తానా...   

Dependency kills plans at the most crucial moments. Do great things with what you already have — and what’s fully under your control. 

- మనోహర్ చిమ్మని  

Wednesday, 17 December 2025

The Renegade Cinema


Renegade Cinema isn’t about being edgy for attention. It’s about honesty. About choosing truth over trend, responsibility over hype. I believe films should have a spine — emotionally and economically. Art matters, but so does owning the consequences of what you put out into the world.

I’m drawn to characters who don’t fit. People who are restless, flawed, searching. If that feels familiar, good. That’s the point. Real life isn’t polished. Neither is my cinema.

I don’t follow formulas. I observe life. I don’t wait for permission. I take the shot.

If a film makes you uncomfortable, questions your choices, or stays with you after the screen goes dark — it’s working.

This isn’t content.
This is cinema with intent.

Welcome to Renegade Cinema. I’m fully in. Now. 

- Manohar Chimmani 

Tuesday, 16 December 2025

తెర మీది సినిమా నథింగ్!


మనుషుల మీద ఇంట్రెస్ట్ పోయింది నాకు.
వందకి వంద శాతం. 

చెప్పేదొకటి.
చేసేదొకటి.

మాటలకు, చేతలకు మధ్య
భూమ్యాకాశాల అంతరం.
అస్సలు ఏమాత్రం సింక్ అవ్వదు. 
ఏదీ సింక్ అవ్వదు. 

కట్ చేస్తే - 

అలా అందరూ ఉండలేరు కాని, 
'ఆర్జీవీ'లా ఉండటమే కరెక్టు. 
చాలా విషయాల్లో. 

- మనోహర్ చిమ్మని