Sunday, 26 December 2021

ఈ పూల దారులు, ఆ నీలి తారలు

I like gardening. It’s a place where I find myself when I need to lose myself. 
– Alice Sebold in “Above and beyond”.

నిజంగా ఇంత అందంగా ఈ హోం గార్డినింగ్ చెయ్యటానికి చాలా ఓపిక కావాలి. ఇది కూడా ఒక మంచి క్రియేటివ్ టాలెంటే. 

గార్డెనింగ్ అనేది మనకిష్టమైన రంగులతో సృష్టించుకొనే ఆర్ట్, పెయింటింగ్ లాంటి మరొక కళారూపం. ప్రపంచంలో ఉన్న ఎన్నెన్నో హాబీల్లో స్వచ్ఛతను, సంతోషాన్ని సమపాళ్లలో ఇచ్చే హాబీ ఇదొక్కటే.  

ప్యూర్ ప్లెజర్‌ అన్నమాట. 

ఇది నేర్చుకొంటే వచ్చే అభిరుచి కాదు. ఎంతో ఆసక్తి, ప్యాషన్ సహజంగా ఉండాలి. ఒకసారి దీనికి ఎడిక్ట్ అయితే చాలు, చివరి క్షణం వరకూ మానుకోలేరు. ప్రపంచంలోని ఏ డ్రగ్ కూడా దీన్ని మించిన 'హై' ఇవ్వలేదు. అయితే - ఇది సిగరెట్స్, మందు, డ్రగ్స్ లాంటి నెగెటివ్ ఎడిక్షన్ కాదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక పాజిటివ్ ఎడిక్షన్.  

ఇంకో కోణంలో మనం గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే - ఈ అభిరుచి ఉన్నవాళ్ళు మానసికంగా చాలా మెచ్యూర్డ్‌గా, కామ్‌గా ఉంటారు. లోపల ఇంకేమైనా అసంతృప్తి, బాధలు, కష్టాలు ఉన్నా సరే... కామ్‌గా, కంటెంటెడ్‌గా సులభంగా ఉండగలుగుతారు.

ఈ హాబీ ఉన్నవాళ్ళలో వయస్సు కూడా అంత త్వరగా దగ్గరికి రాదు. కనీసం ఒక పదేళ్ళు తక్కువగా కనిపిస్తారు. 

ఒక నిర్ణయం తీసుకుంటే ఇక దాన్నించి వెనక్కివెళ్ళలేరు. అవసరమైతే బండరాయిలా ఉంటారు. అదే వారి శక్తి.   

గార్డెనింగ్‌ను "గ్రాండ్ టీచర్" అని కూడా అంటారు. ఎలాంటి క్లాసులు తీసుకోకుండానే ఎన్నో నేర్పిస్తుంది. వాటిల్లో చాలా ముఖ్యమైనది - ఓపిక. ఈ గ్రాండ్ టీచరే నేర్పించే ఇంకెన్నో ముఖ్యమైన విషయాల్లో ఒకటి - నమ్మకం.   

హోం గార్డెనింగ్ నాకు చాలా ఇష్టం. హైద్రాబాద్‌లోని బిజీ జీవితం, ఎప్పుడూ వెంటాడే ఏదో ఒక స్ట్రెస్ నన్ను దీన్నుంచి చాలా దూరంగా విసిరేశాయి. అయితే, చెప్పుకోడానికి ఇదొక సాకు మాత్రమే. నిజంగా చేయాలనుకొంటే ఏదీ దేనికీ అడ్డు కాదు. 

ఏదేమైనా, ఈ ప్యాషన్ ఉన్నవాళ్ళంటే నాకు చాలా గౌరవం, ఇష్టం. నేను చేయలేకపోతున్నానే అని ఏ మూలో చిన్న బాధ.   

కట్ చేస్తే - 

నాకున్న లిమిటెడ్ సర్కిల్లో ఇంతమంచి హాబీని, మారిషస్‌లో షూటింగ్ చేస్తున్న సమయంలో, అక్కడ ఒక నేటివ్ తెలుగువారింట్లో చూశాను. పాండిచ్చేరిలో ఒక డాక్టర్ ఇంట్లో చూశాను. మణికొండలో ఈమధ్యే ఒక ఆర్టిస్ట్ ఇంట్లో చూశాను. 

మళ్ళీ దాదాపు అంతే ఫాంటాబ్యులస్ స్థాయిలో ఈ హోమ్ గార్డెనింగ్ ప్యాషన్‌ను ఇంకొక చోట చూశాను. అయితే - ఈ ప్యాషనేట్ గార్డెనర్ నా స్టుడెంట్ కావడం నేను చాలా గర్వంగా, సంతోషంగా ఫీలయ్యే విషయం. 

I wish my student a very happy Green, Gardenish & Gorgeous Birthday! 
***

#HappyBirthday #MyStudent #ManoharChimmani #Nagnachitram #MyBlog #TeluguBlog #Gardening #HomeGardening #GoGreen #GoingGreen #HobbyGardener 

Saturday, 25 December 2021

ఈ బ్లాగ్ నాకు చాలా ఇచ్చింది

సినిమా ప్యాషనేట్స్ అయిన కొంతమంది లైక్‌మైండెడ్ మిత్రుల నెట్‌వర్క్‌ను సృష్టించుకొనే ప్రయత్నంలో భాగంగానే ముందు నేనీ బ్లాగ్‌ను సృష్టించాను. 

ఊరికే సినిమా టిడ్‌బిట్స్, రొటీన్ వార్తల్లాంటివి రాయకుండా... నా అనుభవంలో నాకు తెలిసిన ఫిలిం ఇండస్ట్రీ లోపలి విషయాలను లైటర్‌వీన్‌లో రాస్తూ పంచుకోవాలన్నది నా ఆలోచన. అందుకే, ఈ బ్లాగ్‌కు నగ్నచిత్రం అని పేరు పెట్టాను.  

దీన్ని కొంచెం సీరియస్‌గా, కొంచెం ఈజీగా, కొంచెం కేర్‌లెస్‌గా తీసుకొంటూ, ఎప్పుడో తోచినప్పుడు మాత్రం ఒక పోస్ట్ ఏదో రాయాలి కాబట్టి రాస్తాను అన్నట్టుగా అలా రాస్తూపోయాను. 

నెమ్మదిగా బ్లాగింగ్ ఎంత శక్తివంతమైందో నాకర్థమైంది. నా దినచర్యలో భాగమైంది. 

తర్వాత్తర్వాత, నా ఫ్రీలాన్సింగ్ క్రియేటివ్ యాక్టివిటీ మొత్తానికి దీన్నే ఒక "హబ్‌"లా ఉపయోగించుకొంటూ, ఏ ఒక్కదానికీ పరిమితం చేయకుండా అన్నీ దీన్లోనే రాయడం ప్రారంభించాను. 

21 ఆగస్టు 2012 నాడు, అనుకోకుండా సృష్టించిన ఈ "నగ్నచిత్రం" వయస్సు 9 ఏళ్ళు దాటింది.

ఇవాళ్టికి సరిగ్గా 3409 రోజుల ఆత్మీయ స్నేహం మా ఇద్దరిదీ!       

కట్ చేస్తే - 

మనం ఎంత వద్దనుకొన్నా - చాలాసార్లు మనం రాసుకోకూడని, రాసుకోవాల్సిన అవసరం లేని వ్యక్తిగత విషయాలు, మరీ వ్యక్తిగతమైన కొన్ని సెన్సిటివ్ ఆలోచనలు కూడా మన బ్లాగ్ పోస్టుల్లో బాహాటంగా వచ్చేస్తుంటాయి. 

తర్వాతెప్పుడో ఒక 2, 3 ఏళ్ల తర్వాత చూసుకున్నప్పుడు - నేను ఇలా రాశానా? అసలు ఇదెందుకు రాశాను? ఇది రాయాల్సింది కాదు... ఇలా అనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని బ్లాగుల విషయంలో మరీ సిల్లీగా అనిపిస్తుంది. 

కాని - అదంతే. 

ఏం తప్పుకాదు. బ్లాగ్ ఇలాగే రాయాలని కాని, బ్లాగ్‌లో ఇవి మాత్రమే రాయాలని కాని ఎలాంటి రూల్స్ లేవు. 

మనవాళ్ళు ఎవరైనా చదివితే ఏమనుకుంటారు? బయటివారైనా సరే, చదివి ఏమనుకుంటారో... అనే ఇలాంటి ఘర్షణ ఎప్పుడూ ఉంటుంది. 

"అసలు అలాంటి ఎవరేమనుకుంటారో అన్న ఘర్షణ, భయం లేకుండా నేను అసలు ఒక్క బ్లాగ్ పోస్ట్ కూడా ఇప్పటివరకు పోస్ట్ చేయలేదు" అంటాడు జేమ్స్ ఆల్టుచర్. 

నా బ్లాగులో కూడా అలాంటి మరీ ఇబ్బందికరమైన టూ మచ్ పర్సనల్ థింగ్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని ప్రొఫెషనల్లీ పర్సనల్ పోస్టులు, కొన్ని మరీ ఓపెన్ సెల్ఫ్ ప్రమోషన్స్!

అయితే - జేమ్స్ ఆల్టుచర్ లాగే, నేను కూడా వాటి గురించి ఇప్పుడు అసలు పట్టించుకోవటం లేదు. 

మన జీవితంలోని మంచి, చెడుల గురించి... సుఖ సంతోషాల గురించీ మనకి మనం నెమరేసుకొంటూ, ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎప్పటికప్పుడు చాలా ఉంటుంది. 

ఇలాంటి "ఫ్లో రైటింగ్" వల్ల శాస్త్రీయంగా చాలా లాభాలున్నాయి.  

ఈ లాభాలు పొందటం కోసం నాకు దొరికిన ఒక అద్భుత సాధనం - బ్లాగింగ్. 

నమ్మరు కాని, బ్లాగింగ్ నిజంగా మనకు ఆరోగ్యాన్నిస్తుంది. మనల్ని ఆరోగ్యంగా ఉండనిస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. భౌతికంగానే కాదు, మానసికంగా కూడా. 

ఎవరేమనుకుంటారో అన్న మైండ్‌సెట్ లోంచి బయటపడగలిగితే చాలు... బ్లాగింగ్, మనతో మనం మాట్లాడుకోడానికి ఒక మంచి ఔట్‌లెట్‌లా పనిచేస్తుంది. ఎలాంటి హిపోక్రసీ, ఇన్‌హిబిషన్స్ లేకుండా అన్నీ పంచుకోగలిగిన ఒక అత్యంత ఆత్మీయమైన అతిదగ్గరి స్నేహితురాలు అవుతుంది. 

“No matter who you are, no matter what you do, no matter who your audience is: 30 percent will love it, 30 percent will hate it, and 40 percent won't care. Stick with the people who love you and don't spend a single second on the rest. Life will be better that way.”

Welcome to my beautiful world of Creative Souls!  
***

#Nagnachitram #MyBlog #TeluguBlog #ManoharChimmani #BloggingHobby #ILoveBlogging #GoBlogIt #BloggersWorld #BlogAddict 

Friday, 24 December 2021

చివరాఖరికి స్పిరిచువాలిటీ!

1926 లో చలం "మైదానం" రాశాడు. నా ఫేవరేట్ ప్రపంచస్థాయి రచయితల్లో చలం ముందు వరసలో ఉంటాడు. ఆకాలంలోనే ఆయన రాయగలిగిన ఆ అందమైన తెలుగు శైలిని ఇప్పుడు 2020 ల్లో కూడా ఎవ్వరూ రాయడం లేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.

అలాంటి చలం... ఆరోజుల్లోనే... ఎంత అగ్రెసివ్, ఎంత అన్‌ట్రెడిషనల్ టాపిక్స్ పైన రచనలు చేశాడో అందరికీ తెలిసిందే. ఆ టాపిక్స్ అప్పుడే కాదు, ఇప్పటి మన హిపోక్రసీ నేపథ్య సమాజంలో కూడా సంచలనాత్మకమైనవే!

అలాంటి రచయిత కూడా చివరికి స్పిరిచువాలిటీ అంటూ రమణ మహర్షి ఆశ్రమం చేరాడు.

ఈ స్పిరిచువల్ "ట్రాన్స్‌ఫార్మేషన్" కేవలం క్రియేటివ్ రంగాలవారిలోనే వస్తుందని కాదు. చరిత్రలో అలెక్జాండర్ వంటి రారాజు నుంచి, సాధారణ రొటీన్ మనుషుల విషయంలోనూ జరుగుతుంది.

లైఫ్ అంతా ఉవ్వెత్తు కెరటాల్లా రకరకాలుగా ఎగిసిపడి, మిడిసిపడి, యుధ్ధాలు చేసి, దేన్నీ లెక్కచేయకుండా ఎన్నోరకాలుగా ఎంజాయ్ చేసి, చివరాఖరికి వచ్చేటప్పటికి స్పిరిచువాలిటీ అంటారెందుకు అన్నది నా హంబుల్ కొష్చన్!  

అయితే - నేనిప్పుడు ఇలాంటి లాజిక్స్ గురించి అసలు పట్టించుకోవడం లేదు. 

మిగిలిన ఒకటి రెండు బాధ్యతలు, కమిట్‌మెంట్స్ త్వరత్వరగా ముగించుకొని, ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా ఫ్రీ అయిపోయి... నేను కోరుకొన్న ఫ్రీడంతో బ్రతకాలని చాలా పనులు ఒకేసారి చేస్తున్నాను. 

ఆ పనులన్నీ అలా చేస్తూనే - మినిమలిజమ్ వైపు, లాప్‌టాప్ లైఫ్‌స్టైల్ వైపు ఏకకాలంలో ప్రయాణిస్తున్నాను కూడా. 

After all, spirituality is a personal thing. 

Thursday, 23 December 2021

అందరి అంతిమ గమ్యం ఆధ్యాత్మికమే

క్రియేటివిటీ, స్పిరిచువాలిటీ .. ఈ రెండూ నాకత్యంత ఇష్టమైన అంశాలు.

ఈ రెండూ చూడ్డానికి విభిన్నధృవాల్లా అనిపిస్తాయి. కానీ, రెండింటి సోల్ ఒక్కటే.

ఆనందం.

పల్ప్ ఫిక్షన్ రాసే ఒక రచయితలో, కమర్షియల్ సినిమాలు చేసే ఒక దర్శకునిలో ఆధ్యాత్మిక చింతన ఉండకూడదా?

ఆధ్యాత్మిక చింతన ఉన్న ఒక ఆర్టిస్ట్ బొమ్మలువేసి ఎగ్జిబిషన్ పెట్టకూడదా?

భారీ వ్యాపారాల్లో మునిగితేలే ఒక బడా వ్యాపారవేత్త ఒక ఆధ్యాత్మిక చిత్రం నిర్మించకూడదా?

ఎవరి వృత్తి, వ్యాపారం ఏమైనా కావొచ్చు. వారు ఏదైనా చేయొచ్చు. ఏ స్థాయికైనా ఎదగొచ్చు. కానీ, చివరికి అందరి అంతిమ గమ్యం ఆధ్యాత్మికమే అవుతుంది.

ఆ మార్పు తప్పదు.

ఒక అలెగ్జాండర్ కావొచ్చు. ఒక అశోకుడు కావొచ్చు. ఒక చలం కావొచ్చు. ఒక మహేష్‌భట్ కావొచ్చు. అందరూ అంతిమంగా ఆధ్యాత్మికానందం వొడికి చేరినవాళ్లే.

ఈ నిజాన్ని చరిత్ర పదేపదే రుజువుచేసింది.

నిజానికి ఈరెండూ కలిసినప్పుడే మనం కోరుకున్న స్వేఛ్చ, ఆనందం మన సొంతమవుతాయి.

ఈ నిజాన్ని కూడా చరిత్ర పదేపదే రుజువు చేసింది.

అంతే తప్ప, అన్నీ వదిలేయడమే ఆధ్యాత్మికం కాదు .. కాకూడదు. 

దీనికి ఫినిషింగ్ టచ్ ఏంటంటే - 

90 శాతం మందికి యాభై దాటితే గాని అసలు ఈవైపు చూడాలన్న ఆలోచన రాదు. ఆలోచించరు. కనెక్ట్ కారు.  

జీవితంలో అన్నీ అయిపోయాకనో, లేదంటే జీవిత చరమాంకంలో ఏదైనా ఓ పెద్ద కుదుపు వచ్చాకనో కాకుండా... వయసులో ఉన్నప్పటినుంచే మనిషి తన మనసుని కొంత ఆధ్యాత్మికత వైపు కూడా మళ్ళించుకోగలిగితే మాత్రం... ఆ ఆనందమే వేరు. 

Wednesday, 22 December 2021

మార్పే శాశ్వతం!

ఇంగ్లిష్‌లో ఓ సామెత ఉంది.. "మైండ్ చేంజెస్ లైక్ వెదర్!" అని.

ఇప్పుడు నేను మళ్లీ ఒక రెండేళ్ళో, మూడేళ్ళో వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నాను. వాటిలో మొదటిది కొన్ని వారాల్లో ప్రారంభమై, ఏకధాటిగా ఒకే షెడ్యూల్లో షూటింగ్ పూర్తిచేసుకుంటుంది. 

ఇంతకుముందులా సినిమాల మీద ప్యాషన్ కాదు. అవసరం. 

అత్యంత వేగంగా నేను కోరుకొన్న ఫ్రీడం ఈ ఒక్క పని నుంచే నాకు సాధ్యమవుతుంది. ఇదొక్కటే ఇప్పుడు నాకు బాగా ఉపయోగపడే ప్లాట్‌ఫామ్. ఇదొక్కటే అంత ఎఫెక్టివ్ అండ్ పవర్‌ఫుల్ ప్లాట్‌ఫామ్.  

అనుకోని ఒక చిన్న సెట్‌బ్యాక్‌తో అనవసరంగా ఇంత మంచి ప్లాట్‌ఫామ్‌ను బాగా అశ్రధ్ధ చేశాను. అసలు పట్టించుకోలేదు.    

నేను సినిమాల్లో ఉన్నన్ని రోజులు కొన్ని పనులు చేయలేను అని మొన్నటివరకూ అనుకొనేవాణ్ణి. కానీ అది నిజం కాదని నేనే ప్రాక్టికల్‌గా తెలుసుకున్నాను. 

ఎవరో ఏదో అనుకుంటారనో, లేదంటే మనం చేసే ఒక పని, మనమే చేసే ఇంకోపనిమీద వ్యతిరేక ప్రభావం చూపిస్తుందనో అనుకోవడం ఉట్టి అవివేకం. దేని దారి దానిదే. 

మన గురించి అనుకునేవాళ్లెవరూ మన ఫోన్ బిల్స్ కట్టరు, మన ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయరు. అవసరంలో మనల్ని ఆదుకోరు. అలాంటి ఎవరో ఏదో అనుకుంటారని మనం అనుకోవడం పెద్ద ఫూలిష్‌నెస్.

ఈ యాంగిల్లో చూసినప్పుడు, అనవసరంగా మనల్ని మనమే అణగతొక్కేసుకుంటున్నామన్నమాట!

అదొక పనికిరాని మైండ్‌సెట్. జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో మనకు అడుగడుగునా అడ్డుపడే మైండ్‌సెట్. జీవితంలో ఆనందాన్ని అనుభవించనివ్వని మైండ్‌సెట్. 

మర్చిపో.  

ఎవరైనా, ఎన్ని పనులైనా, ఏకకాలంలో చేయొచ్చు. అది ఆయా వ్యక్తుల సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచస్థాయిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ అంతా ఏకకాలంలో ఎన్నోరకాల పనుల్లో, వృత్తుల్లో, వ్యాపకాల్లో, వ్యాపారాల్లో మునిగితేలుతున్నవాళ్లే!  

మన ప్రయారిటీలనుబట్టి, ఏయే పనులు ఎప్పుడు చేయాలో, అప్పుడు అలా వాటికవే జరుగుతూపోతుంటాయి. అలా చేయడానికి మనం అతి సహజంగా అలవాటుపడిపోతాం.

ఇప్పుడు నేనొక అరడజన్ పనుల్ని అత్యంత వేగంగా, విజయవంతంగా చేయగలుగుతున్నాను. నేను చేస్తున్న ఏపనీ నా మరోపనికి అడ్డురావడంలేదు. విచిత్రంగా అన్ని పనులూ చాలా ఈజీగా జరిగిపోతున్నాయి.

ఒకప్పుడు నేను చేయడానికి ఇష్టపడని పనుల్ని ఇప్పుడు యాడ్స్ ఇచ్చి మరీ చేస్తున్నాను. 

నాకే అర్థం కావడం లేదు... ఇంత మార్పు ఏమిటో. 

ఇంకోవైపు... "ఇదింక వద్దు" అనుకుంటే చాలు, అది ఇప్పటివరకూ నాకు ఎంత ఇష్టమైనదైనా సరే, ఆ క్షణం గుడ్ బై చెప్పేస్తున్నాను.

ఈ బ్లాగ్ కూడా ఇప్పుడు నిజంగా కొన్నిరోజులే.  

అలాగని నా రైటింగ్ హాబీని వదిలేస్తున్నానా? అదెప్పటికీ జరగదు...

ఇదంతా నన్ను ఎటు తీసుకెళ్తోందో తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు. 

Minimalism? Law of Least Effort?... ఏమో, తెలీదు. 

ఒక్క విషయం మాత్రం గుర్తుకొస్తోంది -
Everything is spiritual in this world.

BECOME HERO !!


నిజంగా సినీఫీల్డు మీద చచ్చేంత ప్యాషన్, ఏమైనా సరే సాధించాలన్న తపన ఉన్న యాస్పయిరింగ్ హీరోలకు, కొత్త ఆర్టిస్టులకు ఇదొక పనికొచ్చే పోస్ట్.  

హీరోగా ఇంట్రొడ్యూస్ కావాలనుకొనే కొత్త ఆర్టిస్టులు... ఈ పోస్ట్ చదివాక, ఈజీగా ఒక డెసిషన్ తీసుకోవచ్చు.  

కట్ చేస్తే -

సినీఫీల్డులో హీరోగా మీ ప్రవేశానికి టాలెంట్ ఒక్కటే సరిపోదు. 

బై డిఫాల్ట్ ఎవరికైనా టాలెంట్ ఉండాల్సిందే. అయితే - ఆ టాలెంట్ మిమ్మల్ని ఇండస్ట్రీకి పరిచయం చేయగలిగినవారి దృష్టికి తీసుకెళ్ళగలగాలి. అదెలా సాధ్యమవుతుందో మీకు తెలిసుండాలి. 

చాలా సందర్భాల్లో ఒక కొత్త హీరో బయటినుంచి పరిచయమవడం అన్నది చాలా అరుదుగా జరిగే అంశం. డబ్బు, ఇండస్ట్రీ లింక్స్, కాంటాక్ట్స్ లేకుండా దాదాపు ఇది అసాధ్యం. 

కేవలం అతి కొద్ది మంది విషయంలో మాత్రమే టాలెంట్ సపోర్ట్ చేస్తుంది. అది షార్ట్ ఫిలిమ్స్‌లో మీ యాక్షన్ గుర్తించి కావచ్చు. అంతకు ముందు చిన్న చిన్న కారెక్టర్స్‌లో మీరు ప్రూవ్ చేసుకున్న మీ నటన చూసి కావచ్చు. ఇలా కొద్దిమందికి మాత్రమే సాధ్యమవుతుంది. 

ఎవరో ఒకరిద్దరిని ఉదాహరణగా తీసుకొని, "నేనూ అలాగే హీరో అవుతా" అని అనుకోవడం ఇప్పుడున్న భారీ కాంపిటీషన్‌లో దాదాపు అసాధ్యం. విలువైన మీ సమయం... ఏళ్లూ దశాబ్దాలూ... వృధాకావడం తప్ప వేరేదేం జరగదు.  

సినిమా అంటేనే - ప్రతిరోజూ లక్షల్లో ఖర్చు. 

అంతా కొత్తవాళ్లతోనే, ఒక మాడరేట్ స్థాయిలో సినిమా తీయాలంటేనే... కనీసం ఓ 2 కోట్లు అవుతుంది. మరీ తక్కువలో తక్కువ అనుకుంటే కనీసం ఓ 60 లక్షలవుతుంది. 

కొత్త హీరోలకు చాన్స్ ఇచ్చే సినిమాలు 99% చిన్న బడ్జెట్ సినిమాలే. ఈ చిన్న బడ్జెట్ సినిమాలకు ఎప్పుడూ ఒక పెద్ద సమస్య ఉంటుంది. డబ్బు! 

ఒక కొత్త హీరోను ఇంట్రొడ్యూస్ చెయ్యాలనుకున్నప్పుడు, ఎవరైనా టాలెంట్‌కే ఫస్ట్ ప్రెఫరెన్స్ ఇస్తారు. అందులో డౌట్ లేదు. అయితే - అలా టాలెంట్ ఉన్నవాళ్ళు వందల్లో ఉంటారు. సో, వారిలో ఎవరి ద్వారా ప్రాజెక్టుకు సపోర్ట్ ఉంటుందో వారికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. 

ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది... 

కొత్త హీరోలను ఎక్కువగా వారి బంధువులో, ఫ్రెండ్సో ప్రొడ్యూసర్స్‌గా ఉండి ఇంట్రొడ్యూస్ చేస్తారు. కొంతమంది కొత్త హీరోలు వారే స్వయంగా బడ్జెట్లో కొంత భాగం ఇన్వెస్ట్ చేస్తారు. వారికి ఆ స్థోమత లేనప్పుడు, వారి సర్కిల్లో తెలిసినవారి ద్వారా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయిస్తారు. 

ఓవర్‌నైట్‌లో  హీరోలయిపోతారు!  

ఇది ఎప్పుడూ జరిగేదే.  

ఈమధ్య కూడా - ఈ పధ్ధతిలో హీరోలుగా పరిచయమై నిలదొక్కుకున్న హీరోలెవరైనా గుర్తొస్తున్నారా మీకు? తప్పకుండా వస్తారు. ఇది చాలా మామూలు విషయం. 

కొత్త హీరోల ఇంట్రడక్షన్ వెనకున్న ఈ ఆర్థిక కోణాన్ని అర్థం చేసుకోలేక - చాలా మంది తప్పుగా అనుకుంటారు... డబ్బులు పెడితేనే  చాన్స్ ఇస్తారనీ, ప్రొడ్యూసర్లు - డైరెక్టర్లు వాళ్లకు తెలిసిన వాళ్లకే చాన్స్ ఇస్తున్నారనీ... రకరకాలుగా అనుకుంటారు. 

ఏదీ ఊరికే రాదు, ఊరికే అందరూ హీరోలవ్వలేరు. హీరోలయ్యాక వారికి కూడా ఊరికే కోట్లల్లో రెమ్యూనరేషన్ ఇవ్వరు. 

ప్రతిదానికీ ఓ లెక్కుంటుంది.  ఈ  రియాలిటీని అర్థం చేసుకుంటే చాలు. జీవితంలో మీ టైం వేస్ట్ కాదు.

ఆసక్తి ఉందా? 

సినీఫీల్డులో హీరోగా మీ కెరీర్ పట్ల చచ్చేంత ప్యాషన్ ఉందా? 

అయితే - ఆసక్తి, ప్యాషన్ మాత్రమే సరిపోవు. స్థోమత ఉండాలి. మీ కుటుంబ నేపథ్యం మీకు సహకరించాలి. అలా లేనప్పుడు, మీకోసం బడ్జెట్‌లో కొంత భాగమయినా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చే కాంటాక్ట్స్ మీకుండాలి.  

ఓకే అనుకుంటే... నిజంగా ఆ సీరియస్‌నెస్, ఆ స్థోమత, ఆ కాంటాక్ట్స్ మీకు ఉన్నట్టయితే... మీ పూర్తి వివరాలతో నాకు వాట్సాప్ పెట్టండి. 

ఒక పాపులర్ ఓటీటీ కోసం, అతి త్వరలో షూటింగ్‌కి వెళ్తున్న మా కొత్త ఫీచర్ ఫిలిం ప్రాజెక్టులో మీరు హీరోగా బెస్ట్ పాజిబిలిటీస్ ఆలోచిద్దాం.     

Welcome to Glamour World! 
SEE YOU ON THE SETS...  

– Manohar Chimmani
Nandi Award Winning Writer, Film Director, Blogger
Creativepreneur, 10X Passion Coach 

WhatsApp: +91 9963866298


(మీ కాంటాక్ట్స్‌లో సినీఫీల్డు వైపు ఆసక్తి ఉన్నవారికి, ఫిలిం ప్రొడక్షన్‌లో ఇన్వెస్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్నవారికి, ఇన్వెస్ట్ చేస్తూ హీరోగా పరిచయం కావాలని ప్రయత్నిస్తున్నవారికి దయచేసి ఈ లింక్ షేర్ చేయండి. థాంక్ యూ!)

Monday, 20 December 2021

టీమ్ అంతా ఎక్కడ కలిస్తే అదే ఆఫీస్!

కేఫే మిలాంజ్. బియాండ్ కాఫీ.  
ఇరానీ హోటల్. కాఫీడే. 
కేబీఆర్ పార్క్. నెక్లెస్ రోడ్డు. 
ఐమాక్స్ లాబీలు. ట్యాంక్ బండ్. 
యాత్రి నివాస్. సినీ ప్లానెట్... 

ఈ డిజిటల్ & సోషల్ మీడియా యుగంలో... మైక్రో బడ్జెట్ సినిమాలకు ఇప్పుడు ఇవే నిజమైన ఆఫీసులు! 

కట్ చేస్తే - 

ఇదివరకులా కాదిప్పుడు... 
సినిమా నిర్మాణానికి సంబంధించిన పని ఏదయినా ఇప్పుడు ఊహించని విధంగా సూపర్‌ ఫాస్ట్‌గా జరిగిపోతున్న రోజులివి. మొబైల్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఈమెయిల్, స్కైప్, జూమ్... ఇలా ప్రతి ఆధునిక మీడియా సాధనం సినిమా నిర్మాణానికి ఏదోరకంగా బాగా ఉపయోగపడుతోంది.

ఇవన్నీ పక్కనపెట్టి, ఇదివరకులా పాత చింతకాయ పచ్చడి పధ్ధతిలో, ఎప్పుడూ ఒకే నాలుగు గోడల మధ్య పని చేయడానికి ఎవరూ ఇష్టపడటంలేదు.

కొత్త నటీనటులు, టెక్నీషియన్ల ఎన్నిక దాదాపు ఆన్‌లైన్ ద్వారానే జరిగిపోతోంది. ఫోటోలు, వీడియో క్లిప్స్ ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నప్పుడు .. ఇంక ప్రత్యేకంగా ముంబై, ఢిల్లీ లకు వెళ్లాల్సిన అవసరమేలేదు. స్క్రీన్‌టెస్టులంటూ వారాలకి వారాలు అవుటాఫ్ ద సిటీ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు.

అయితే - వీటి ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసుకున్నవాళ్లని చూడ్డానికి మాత్రం ఒక్కసారి మాత్రం డైరెక్ట్ ఆడిషన్ అవసరమౌతోంది. దానికి ఆఫీస్ అవసరం ఎంతమాత్రం లేదన్నది అందరికీ తెలిసిందే.

ఇక కథా చర్చలు, మేకింగ్ ప్లానింగ్స్, అన్నీ కాఫీడేల్లో, నెక్లెస్ రోడ్ చెట్లక్రింద, ఐమాక్స్‌లో, కేబీఆర్ పార్కులో, టాంక్‌బండ్ మీదా... చక చకా అయిపోతున్నాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా స్మూత్‌గా జరిగిపోతున్నాయి.

కేవలం సినిమా షూటింగ్ సమయంలో మాత్రం ఒక్క నెలపాటు... ఏ గెస్ట్‌హౌజ్‌ లోనో, లేదంటే... ఓనర్స్ అభ్యంతర పెట్టని .. ఏ బ్యాచిలర్ పెంట్ హౌస్ లోనో, లేదంటే... ఓ నెల పాటు ఒక ఎయిర్ బి ఎన్ బి ఫ్లాట్ తీసుకొని గాని... పనులు పూర్తిచేసుకోగలిగితే చాలు.

పోస్ట్ ప్రొడక్షన్‌కి మళ్లీ మామూలే. ఎక్కడ పని జరుగుతోంటే అక్కడే అవసరమైన టీమ్ మెంబర్లు వాలిపోతారు. అంతే. ఫైనల్ కాపీ రెడీ!

ఇక బిజినెస్ కోసం అయితే ఇప్పుడు అసలు ఆఫీసే అక్కర్లేదు! పని, వాళ్ళ ఆఫీసుల్లోనే కాబట్టి, మనకు ప్రత్యేకంగా ఆఫీసు అవసరం లేదు. 

సో... ఇప్పుడంతా...
కేఫే మిలాంజ్. బియాండ్ కాఫీ. నెక్లెస్ రోడ్డు. ఐమాక్స్ లాబీలు. ట్యాంక్ బండ్. యాత్రి నివాస్. సినీ ప్లానెట్... కాఫీడేలు, ఇరానీ హోటల్లూ, పార్కులు, బ్యాచిలర్ రూముల్లోనే మన "చిన్న సినిమా"లనబడే "మైక్రో బడ్జెట్ సినిమా"ల నిర్మాణం అంతా జరిగిపోతుందన్నమాట!

ఎనర్జీ లెవెల్స్ పెంచే ఇంతమంచి నేచురల్ లొకేషన్స్‌ని మించిన ఆఫీస్ ఏముంటుంది? ఇలాంటిచోట్ల పనిజరిగినప్పుడే ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు మెరుపుల్లాంటివి వస్తాయి. 

పైగా, నెలకో లక్ష రూపాయలు ఆఫీసు మెయింటేన్ చేసే ఖర్చులు మిగుల్తాయి. ఆ లక్షతో హాయిగా ఒక్క రోజు షూటింగ్ చేసుకోవచ్చు!   

ఇదంతా హాలీవుడ్లో ఎప్పుడో ఉంది. ఇప్పుడూ ఉంది. కేన్స్ వంటి ఫిలిం ఫెస్టివల్స్‌లోనూ, హాలీవుడ్‌లోనూ సంచలనాలు సృష్టించిన "ఎల్ మరియాచి", "బ్లెయిర్‌విచ్ ప్రాజెక్ట్", "పారానార్మల్ యాక్టివిటీ", "బిఫోర్ సన్‌రైజ్", "ఫర్ లవర్స్ ఓన్లీ", "న్యూలీ వెడ్స్"... వంటి ఎన్నో ఇండిపెండెంట్ సినిమాలకు వాటి నిర్మాణ సమయంలో ఆఫీసుల్లేవు! 

అయితే - ఇక్కడ మనం గొప్పల కోసం షో చేసుకోవటమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఇదంతా ఎవరూ పాటించరు. ఎవరూ నమ్మరు. కానీ, నిజం మాత్రం ఇదే.  

నేను కూడా ఇప్పుడు నా టీమ్ తో కలిసి, ఇలాంటి మల్టీ లొకేషన్ ఆఫీస్ లోనే  పనిచేస్తున్నాను. దీనికి మేం ముద్దుగా పెట్టుకున్న పేరు... "డిజిటల్ ఆఫీస్!"

కట్ టూ ఫినిషింగ్ టచ్ - 

ఇంతా చెప్పాక కూడా "మీ ఆఫీస్ ఎక్కడ?" అని ఎవరైనా అడిగితే ఏం చెయ్యలేం. "స్టాప్ బ్లాక్"లో అక్కణ్ణించి మాయమై పోవటం తప్ప! 

***

(Off the track:
సరిగ్గా ఈ టైమ్‌కు... న్యూ ఢిల్లీలోని చాణక్యపురిలో ఉన్న యు ఎస్ ఎంబెస్సీలో వీసాకోసం ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాడు మా అబ్బాయి. ఆ టెన్షన్ తప్పించుకొనే ప్రయత్నంలో భాగంగా, ఇలా ఈ బ్లాగ్ రాస్తూ కూర్చున్నాను. ఇంకో గంటలో మా అబ్బాయి గుడ్ న్యూస్ ఇస్తాడని నమ్మకం.)

Sunday, 19 December 2021

మీరు కొత్తవారా? న్యూ టాలెంటా?

మీరు కొత్తవారా? న్యూ టాలెంటా? సినిమా మీద నిజంగా మీలో అంత ప్యాషనుందా? 

ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటరయ్యి, నిజంగా బిజీగా ఉండే 5 శాతం మందిలో మీరూ ఉండాలనుకొంటున్నారా? 

యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్ విభాగాల్లో ఆన్‌లైన్ కోచింగ్‌లో చేరండి. నిజంగా ఇండస్ట్రీకి పనికొచ్చే మెలకువలు నేర్చుకోండి. ఇండస్ట్రీలోకి ఈజీగా ఎంటర్ అవ్వండి. 

ఇంట్రెస్టుందా? కింద లింక్ ఉంది. క్లిక్ చేయండి. చదవండి. మీ విలువైన సమయం... నెలలూ, సంవత్సరాలూ, దశాబ్దాలూ... వేస్ట్ కావద్దు అనుకుంటే ఆ లింక్ ఫాలో కండి. 

కట్ చేస్తే - 

నిజంగా మీలో అంత ప్యాషన్ ఉందనుకోండి. ఇప్పుడు షూటింగ్‌కి రెడీ అవుతున్న మా ప్రాజెక్టులో మీకు వెంటనే అవకాశం కూడా రావచ్చు.  

ఈ అద్భుత అవకాశాన్ని ఓన్ చేసుకొనే అవకాశం మీకు ఈ నెల 24 వ తేదీ వరకే ఉంటుంది. 

ఇంకేం ఆలోచిస్తున్నారు? 

వెంటనే ఈ లింక్ క్లిక్ చేయండి. ఫాలో కండి. 

వెల్‌కమ్ టు ఫిలిం ఇండస్ట్రీ!   

The coaching link: 

Saturday, 18 December 2021

CASTING CALL for NEW HERO, HEROINES !!

మనోహర్ చిమ్మని దర్శకత్వంలో, కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పధ్ధతిలో మేం చేస్తున్న ఫీచర్ ఫిలిం కోసం - కేవలం హైద్రాబాద్‌లో ఉన్న "కొత్త హీరో హీరోయిన్స్" (18-28) వెంటనే కావాలి.

క్రింది అంశాలు జాగ్రత్తగా చదివి, తగిన అర్హతలు ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోండి: 

1. బడ్జెట్ పరంగా మాత్రమే ఇది దాదాపు జీరో బడ్జెట్ సినిమా. కాని, వాల్యూ & క్వాలిటీ పరంగా కనీసం కోటిన్నర బడ్జెట్‌కు తక్కువకాని రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఇది.
2. టాలెంట్ ప్రధానంగా అవకాశం ఇస్తాము. ఎవరికీ ఎలాంటి రెమ్యూనరేషన్ ఉండదు. 
3. ఈ డిసెంబర్‌లోనే, మేము చెప్పిన రోజు నుంచి షూటింగ్‌కు రావడానికి ఎలాంటి ఇబ్బంది లేనివారే అప్లై చేసుకోవాలి. 
4. ఎన్నిక చేసిన రోజు నుంచి వర్క్‌షాప్ ఉంటుంది. తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. 
5. ఇప్పుడు వస్తున్న ట్రెండీ యూత్ సినిమాల స్థాయిలో నటించడానికి మీ కుటుంబం నుంచి మీకు 100% అనుమతి ఉండాలి. 
6. ఫాస్ట్ ఫిలిమ్‌మేకింగ్ పధ్ధతిలోనే పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తిచేయడానికి ప్లాన్ చేసిన ఈ సినిమా,  జనవరిలోనే ప్రముఖ ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ప్రమోషన్ బాగా ఉంటుంది. 
7. దయచేసి ఇతర క్యారక్టర్స్ కోసం ఫోన్స్, మెసేజెస్ చెయ్యవద్దు. అవసరమైతే మేమే కాస్టింగ్ కాల్ పోస్ట్ చేస్తాము.  
8. కాస్టింగ్ డైరెక్టర్స్‌కు ఇది మంచి అవకాశం. ముందు మాకు వెంటనే వాట్సాప్ చేయండి. మనం మాట్లాడుకుందాం. ప్రాజెక్ట్ వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ కావచ్చు.  
9. కొత్త హీరో హీరోయిన్స్... మీ పూర్తి బయోడేటా/ప్రొఫైల్, కేవలం 3 ఫోటోలు (ఉంటే వీడియో లింక్స్) వెంటనే పంపించండి. ప్రాథమికంగా ఆడిషన్‌కు ఎన్నిక చేసినవారికి మాత్రం మా టీమ్ నుంచి కాల్ వస్తుంది.  

All the best!

- MANOHAR CHIMMANI
Film Director, Nandi Award Winning Writer
About Manohar Chimmani: http://bit.ly/manutime

- PRADEEP CHANDRA
Producer, Music Director
P C Creations

PS: Strictly NO CALLS Please!

Friday, 17 December 2021

సినిమాలో కథారచయిత స్థానం ఎక్కడ?

చాలా సార్లు ప్రి-రిలీజ్ ఈవెంట్స్‌లో నాకు నచ్చని ఒక విషయం గమనించాను... కొవిడ్ లాక్‌డౌన్‌కు ముందు, ఆ తర్వాత కూడా. 

మొన్న వరంగల్‌లో జరిగిన శ్యామ్ సింగరాయ్ ప్రి-రిలీజ్ ఫంక్షన్‌లో కూడా ఇదే విషయం గమనించాను. 

ఎంతసేపూ కెమెరామన్ బాగా చూపించాడు, ఎడిటర్ బాగా కష్టపడ్డాడు, ఆర్ట్ డైరెక్టర్ నిద్రపోలేదు, నిర్మాత బాగా ఖర్చుపెట్టాడు, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో టీమ్ అంతా అసలు నిద్రపోలేదు... అని ఇవన్నీ ప్రతి ఒక్కరూ చెప్తారు.

కాని, అంత పెద్ద ప్రాజెక్టుకి పునాదిలాంటిది అయిన కథ గురించి, కథా రచయిత గురించి మాత్రం చెప్పరు! 

హీరో, హీరోయిన్స్, డైరెక్టర్ కూడా అంతే. ఒక్క రచయిత పేరు తప్ప... మిగిలిన అందరినీ మెచ్చుకుంటారు, పదే పదే థాంక్స్ చెప్తారు. రచయిత మాత్రం ఏ ఒక్కరికీ గుర్తుకురాడు. 

ఇలాంటి సంస్కృతి ఈమధ్యే వచ్చింది. అంతకు ముందు ఇలా లేదు. సినీ కథా రచయితకు ప్రముఖ స్థానం ఇచ్చేవారు. మంచి గౌరవం ఉందేది.    

కట్ చేస్తే - 

ఇప్పుడు డైరెక్టర్స్‌లో దాదాపు 60 శాతానికి పైగా కథ కూడా వారే రాసుకుంటున్నారు. అది వేరే విషయం. కాని, కథ వేరే వ్యక్తి అందించినప్పుడు ఆ రచయిత పేరు చెప్తే వచ్చే నష్టం ఏంటి వీరికి? 

"రచయిత ఫలానా సో అండ్ సో. ఈ సినిమాకు మంచి కథ అందించారు" అని ఒక్క మాట చెప్తే ఏం పోతుంది? అందరికీ ఇచ్చినట్టు స్టోరీ రైటర్‌కూ ఒక్క నిమిషం మైక్ ఇవ్వచ్చు కదా? సమస్య ఎక్కడ? 

అంత ఇన్‌సెక్యూరిటీనా? కథ వేరే రచయితది అని చెప్తే డైరెక్టర్ వాల్యూ ఏమైనా పడిపోతుందా? రచయితకు ప్రమోషన్ ఇవ్వటం ఎందుకు అనా? 

ఆ రచయిత కథ విని ఇంప్రెస్ అయ్యే కదా ఆ హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ ప్రాజెక్టుకి ఒప్పుకొంది? కథ లేకుండా సినిమా ఎలా ఉంటుంది? 

ఇలాంటి చిన్న చూపు... విజయేంద్రప్రసాద్ గారి విషయంలో చెయ్యగలరా? 

నిజానికి విజయేంద్రప్రసాద్ గారికి ఒక కథా రచయితగా ఇలాంటి ఫంక్షన్స్‌లో మాట్లాడే అవకాశం కూడా ఎక్కువ ఇస్తారు. అలా ఇవ్వాలి కూడా. 

నా ఉద్దేశ్యంలో ఇది కథా రచయిత పట్ల గౌరవం లేకపోవడం, చిన్నచూపు మాత్రమే కాదు. కావాలని ఇలా చేసే ఆయా ప్రొడ్యూసర్ డైరెక్టర్స్, హీరోహీరోయిన్స్ మీన్ మెంటాలిటీని కూడా ఇది బహిర్గతం చేస్తుంది.

వాళ్లేంటో వాళ్లకై వాళ్లే చెప్పుకోవడమన్నమాట! 
***

#TeluguCinema #Writer #ScreenplayWriter #ScriptWriter #Tollywood #ManoharChimmani #NagnachitramBlog #WriterValue #FilmWriter #MovieWriter