నిజంగా సినీఫీల్డు మీద చచ్చేంత ప్యాషన్, ఏమైనా సరే సాధించాలన్న తపన ఉన్న యాస్పయిరింగ్ హీరోలకు, కొత్త ఆర్టిస్టులకు ఇదొక పనికొచ్చే పోస్ట్.
హీరోగా ఇంట్రొడ్యూస్ కావాలనుకొనే కొత్త ఆర్టిస్టులు... ఈ పోస్ట్ చదివాక, ఈజీగా ఒక డెసిషన్ తీసుకోవచ్చు.
కట్ చేస్తే -
సినీఫీల్డులో హీరోగా మీ ప్రవేశానికి టాలెంట్ ఒక్కటే సరిపోదు.
బై డిఫాల్ట్ ఎవరికైనా టాలెంట్ ఉండాల్సిందే. అయితే - ఆ టాలెంట్ మిమ్మల్ని ఇండస్ట్రీకి పరిచయం చేయగలిగినవారి దృష్టికి తీసుకెళ్ళగలగాలి. అదెలా సాధ్యమవుతుందో మీకు తెలిసుండాలి.
చాలా సందర్భాల్లో ఒక కొత్త హీరో బయటినుంచి పరిచయమవడం అన్నది చాలా అరుదుగా జరిగే అంశం. డబ్బు, ఇండస్ట్రీ లింక్స్, కాంటాక్ట్స్ లేకుండా దాదాపు ఇది అసాధ్యం.
కేవలం అతి కొద్ది మంది విషయంలో మాత్రమే టాలెంట్ సపోర్ట్ చేస్తుంది. అది షార్ట్ ఫిలిమ్స్‌లో మీ యాక్షన్ గుర్తించి కావచ్చు. అంతకు ముందు చిన్న చిన్న కారెక్టర్స్‌లో మీరు ప్రూవ్ చేసుకున్న మీ నటన చూసి కావచ్చు. ఇలా కొద్దిమందికి మాత్రమే సాధ్యమవుతుంది.
ఎవరో ఒకరిద్దరిని ఉదాహరణగా తీసుకొని, "నేనూ అలాగే హీరో అవుతా" అని అనుకోవడం ఇప్పుడున్న భారీ కాంపిటీషన్‌లో దాదాపు అసాధ్యం. విలువైన మీ సమయం... ఏళ్లూ దశాబ్దాలూ... వృధాకావడం తప్ప వేరేదేం జరగదు.
సినిమా అంటేనే - ప్రతిరోజూ లక్షల్లో ఖర్చు.
అంతా కొత్తవాళ్లతోనే, ఒక మాడరేట్ స్థాయిలో సినిమా తీయాలంటేనే... కనీసం ఓ 2 కోట్లు అవుతుంది. మరీ తక్కువలో తక్కువ అనుకుంటే కనీసం ఓ 60 లక్షలవుతుంది.
కొత్త హీరోలకు చాన్స్ ఇచ్చే సినిమాలు 99% చిన్న బడ్జెట్ సినిమాలే. ఈ చిన్న బడ్జెట్ సినిమాలకు ఎప్పుడూ ఒక పెద్ద సమస్య ఉంటుంది. డబ్బు!
ఒక కొత్త హీరోను ఇంట్రొడ్యూస్ చెయ్యాలనుకున్నప్పుడు, ఎవరైనా టాలెంట్‌కే ఫస్ట్ ప్రెఫరెన్స్ ఇస్తారు. అందులో డౌట్ లేదు. అయితే - అలా టాలెంట్ ఉన్నవాళ్ళు వందల్లో ఉంటారు. సో, వారిలో ఎవరి ద్వారా ప్రాజెక్టుకు సపోర్ట్ ఉంటుందో వారికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు.
ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది...
కొత్త హీరోలను ఎక్కువగా వారి బంధువులో, ఫ్రెండ్సో ప్రొడ్యూసర్స్‌గా ఉండి ఇంట్రొడ్యూస్ చేస్తారు. కొంతమంది కొత్త హీరోలు వారే స్వయంగా బడ్జెట్లో కొంత భాగం ఇన్వెస్ట్ చేస్తారు. వారికి ఆ స్థోమత లేనప్పుడు, వారి సర్కిల్లో తెలిసినవారి ద్వారా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయిస్తారు.
ఓవర్‌నైట్‌లో హీరోలయిపోతారు!
ఇది ఎప్పుడూ జరిగేదే.
ఈమధ్య కూడా - ఈ పధ్ధతిలో హీరోలుగా పరిచయమై నిలదొక్కుకున్న హీరోలెవరైనా గుర్తొస్తున్నారా మీకు? తప్పకుండా వస్తారు. ఇది చాలా మామూలు విషయం.
కొత్త హీరోల ఇంట్రడక్షన్ వెనకున్న ఈ ఆర్థిక కోణాన్ని అర్థం చేసుకోలేక - చాలా మంది తప్పుగా అనుకుంటారు... డబ్బులు పెడితేనే చాన్స్ ఇస్తారనీ, ప్రొడ్యూసర్లు - డైరెక్టర్లు వాళ్లకు తెలిసిన వాళ్లకే చాన్స్ ఇస్తున్నారనీ... రకరకాలుగా అనుకుంటారు.
ఏదీ ఊరికే రాదు, ఊరికే అందరూ హీరోలవ్వలేరు. హీరోలయ్యాక వారికి కూడా ఊరికే కోట్లల్లో రెమ్యూనరేషన్ ఇవ్వరు.
ప్రతిదానికీ ఓ లెక్కుంటుంది. ఈ రియాలిటీని అర్థం చేసుకుంటే చాలు. జీవితంలో మీ టైం వేస్ట్ కాదు.
ఆసక్తి ఉందా?
సినీఫీల్డులో హీరోగా మీ కెరీర్ పట్ల చచ్చేంత ప్యాషన్ ఉందా?
అయితే - ఆసక్తి, ప్యాషన్ మాత్రమే సరిపోవు. స్థోమత ఉండాలి. మీ కుటుంబ నేపథ్యం మీకు సహకరించాలి. అలా లేనప్పుడు, మీకోసం బడ్జెట్‌లో కొంత భాగమయినా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చే కాంటాక్ట్స్ మీకుండాలి.
ఓకే అనుకుంటే... నిజంగా ఆ సీరియస్‌నెస్, ఆ స్థోమత, ఆ కాంటాక్ట్స్ మీకు ఉన్నట్టయితే... మీ పూర్తి వివరాలతో నాకు వాట్సాప్ పెట్టండి.
ఒక పాపులర్ ఓటీటీ కోసం, అతి త్వరలో షూటింగ్‌కి వెళ్తున్న మా కొత్త ఫీచర్ ఫిలిం ప్రాజెక్టులో మీరు హీరోగా బెస్ట్ పాజిబిలిటీస్ ఆలోచిద్దాం.
Welcome to Glamour World!
SEE YOU ON THE SETS...
– Manohar Chimmani
Nandi Award Winning Writer, Film Director, Blogger
Creativepreneur, 10X Passion Coach
Creativepreneur, 10X Passion Coach
WhatsApp: +91 9963866298
(మీ కాంటాక్ట్స్‌లో సినీఫీల్డు వైపు ఆసక్తి ఉన్నవారికి, ఫిలిం ప్రొడక్షన్‌లో ఇన్వెస్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్నవారికి, ఇన్వెస్ట్ చేస్తూ హీరోగా పరిచయం కావాలని ప్రయత్నిస్తున్నవారికి దయచేసి ఈ లింక్ షేర్ చేయండి. థాంక్ యూ!)
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani