Friday, 3 July 2026

"కోపరేటివ్ ఫిలిం మేకింగ్" అంటే?


1992 లోనే, హాలీవుడ్‌లో రాబర్ట్ రోడ్రిగ్జ్ ఇదే పద్ధతిలో "ఎల్ మరియాచి" సినిమా తీశాడు. 

సోషల్ మీడియా లేని కాలంలోనే, 2007లో, నా రెండో సినిమా "అలా" ఈ పద్ధతిలోనే తీశాను. 2011లో ఆర్జీవీ "దొంగల ముఠా" కూడా ఇదే పద్ధతిలో తీశాడు. ప్రపంచవ్యాప్తంగా ఇంకెందరో ఇండిపెండెంట్ ఫిలిమ్మేకర్స్ ఇప్పటికీ ఇదే పద్ధతిలో ఎన్నెన్నో అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు. 

ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో మనం చూసే సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు ఈ కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పద్ధతిలో తీసినవే.     

కట్ చేస్తే - 

కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పద్ధతిలో - పాతవాళ్లయినా, కొత్తవాళ్లయినా - ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు రెమ్యూనరేషన్ ముందు ఇవ్వటం అనేది అసలు ఉండదు.  

సినిమా పూర్తయ్యి, రిలీజయ్యి, లాభాలు వచ్చాకే ఆ లెక్కలు. దీనికి ఒప్పుకున్నవాళ్లే సినిమాలో పనిచేస్తారు.

సినిమాలో పనిచేసే ప్రతి ఒక్కరి ఇన్వెస్ట్‌మెంట్ కంట్రిబ్యూషన్... మనీ/పని ఏదయినా... ఏదో ఒక రూపంలో ఎంతో కొంత ఉంటుంది.   

ఎందుకంటే - 
ఇండిపెండెంట్ కోపరేటివ్ సినిమాలకు అసలు ప్రొడ్యూసర్ ఉండడు! 

సినిమా కోసం అనుకున్న బడ్జెట్‌ను ఓ నలుగురయిదుగురు -లేదా- అంతకంటే ఎక్కువ మంది లైక్‌మైండెడ్ ఫిలిం ప్యాషనేట్స్ తలా కొంత షేర్ చేసుకుంటారు.   

సినిమా బడ్జెట్ కోటి కావచ్చు, రెండు కోట్లు కావొచ్చు. అలా మేం పూల్ చేసుకున్న బడ్జెట్‌ను ఫిలిం మేకింగ్‌కు, ఫిలిం ప్రమోషన్‌కు మాత్రమే వాడతాం.   

నో కాల్ షీట్స్.
నో టైమింగ్స్.
నో ట్రెడిషనల్ ఫిల్మ్ మేకింగ్ రూల్స్.
అంతా రెనగేడ్ ఫిల్మ్ మేకింగ్.  

ప్రొడ్యూసర్స్, స్టార్స్ లేని ఇండిపెండెంట్ సినిమాల విషయంలో, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఈ ఒక్క పద్ధతే ఎక్కువగా విజయవంతంగా నడుస్తోంది.  

ఈ కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పద్ధతిలో ప్లాన్ చేసి తీసే సినిమాలు మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. మంచి బిజినెస్ చేస్తాయి. ప్రొవైడెడ్, సరైన స్ట్రాటజీతో చేయగలిగితే. 

కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పద్ధతిలో ఇప్పుడు మేం రెండు సినిమాలు చేయబోతున్నాం: 

ఒకటి, కామెడీ థ్రిల్లర్. 
రెండోది, హారర్.

మేం చేయబోతున్న ఈ రెండు పక్కా కమర్షియల్ సినిమాల్లో, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్లో పనిచేయాలన్న ఆసక్తి, ప్యాషన్ ఉన్న కొత్త అసిస్టెంట్ డైరెక్టర్స్ నాకు DM చేయటం ద్వారా అప్లైచేసుకోవచ్చు. ఈమెయిల్ చేస్తే ఇంకా మంచిది. 

email: richmonkmail@gmail.com 

ఇది అవకాశం మాత్రమే. 
ఉద్యోగం కాదు. 
ఇంటర్వ్యూ ఉంటుంది.

సెలక్టు అయినవాళ్ళు "6 నెలలపాటు/ఒక సినిమా పూర్తయ్యే దాకా టీమ్‌లో పనిచేస్తా" అని అగ్రిమెంట్ సైన్ చెయ్యాల్సి ఉంటుంది.  

ఆర్టిస్టులకోసం ప్రత్యేకంగా యాడ్ పోస్ట్ చేస్తాం. ఆడిషన్స్ ఉంటాయి. వయస్సు 18 నుంచి 28 లోపు ఉండాలి.

ప్రొడక్షన్/ఇన్వెస్ట్‌మెంట్ ఆసక్తి ఉన్నవాళ్ళు కూడా నాకు DM చేయొచ్చు. 

కలిసి పనిచేద్దాం.
కలిసి ఎదుగుదాం. 

- మనోహర్ చిమ్మని

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani