Thursday, 16 July 2026

20/20 ఫిలిం మేకింగ్ !!


ఒక్క క్రికెట్ లోనే కాదు...
ఈ 20/20 వేగం దాదాపు ప్రతి ఫీల్డు లోనూ వచ్చింది.
మనిషి జీవితంలోనూ వచ్చింది.

టైం లేదు.
వేగంగా పరుగెత్తాలి.
కొత్త అనుభూతులు కనుక్కోవాలి.

కట్ టూ 20/20 సినిమా - 

సంవత్సరానికి ఒకటో రెండో వచ్చే వందల కోట్ల భారీ బడ్జెట్ ప్యానిండియా సినిమాలను వదిలేయండి. ఈ సినిమాల సంఖ్య చాల తక్కువ. అది వేరే విషయం.

ఇప్పుడు ఫిలిం మేకింగ్ టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. ఫిలిం మేకింగ్ శైలి, పద్ధతులు పూర్తిగా మారిపోయాయి. 

ఇప్పుడు సినిమాలు వేరు. ఇంతకుముందు సినిమాలు వేరు. 

Content is king. 
Commercial success is the ultimate goal.

ప్రతినెలా ఏదో ఓ కొత్త సినిమా సంచలనం ప్రపంచంలో ఏదో ఓ మూల ఆవిష్కరింపబడుతున్నది మనం చూస్తున్నాం. 

స్క్రిప్ట్, డబ్బు రెడీ గా ఉంటే చాలు. కేవలం 90 రోజుల్లో ఒక మార్కెటేబుల్ సినిమాని పూర్తిచేసి, రిలీజ్ చేయగల సౌకర్యాలు వచ్చాయి. అలా చేస్తున్నారు కూడా. 

జస్ట్... ఒక సినిమా టైటిల్, పోస్టర్, టీజర్‌తోనే ప్రమోషన్, మార్కెటింగ్, బిజినెస్... అన్నీ చేసెయ్యగల మార్కెటింగ్ ట్రెండ్స్ వచ్చాయి.

Ideas are the currency of the 21st century. 

ఇప్పుడు ఎవరైనా సరే, చిన్న బడ్జెట్లో, ఒక ఇండిపెండెంట్ సినిమా చేయొచ్చు. మనం క్రియేట్ చేసే మార్కెట్‌ను బట్టి థియేటర్స్‌లో, ఓటీటీల్లో రిలీజ్ చేయొచ్చు.  

సినిమా అనేది ఇప్పుడు ఒక క్రియేటివ్ బిజినెస్ మాత్రమే కాదు. పక్కా కార్పొరేట్ బిజినెస్.  

ఫిలిం ఆర్ట్ పైన, మార్కెట్ పైన, బిజినెస్ పైన కనీస అవగాహన ముఖ్యం. ఎప్పటికప్పుడు మార్కెట్ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూవుండటం, కొత్త గ్యాప్స్ ఫిలప్ చేసుకుంటూవెళ్ళటం ముఖ్యం. 

ఇంకా చెప్పాలంటే... ఇప్పుడు హిట్టా, ఫట్టా అన్నది కూడా కాదు ముఖ్యం. హిట్ రేంజ్‌లో బజ్ క్రియేట్ చెయ్యటం ముఖ్యం. 

ఆట ముఖ్యం. 
ఆటలో ఉండటం ముఖ్యం. 
ఆటలో మజా ముఖ్యం. 

సినిమా జరుగుతున్న ప్రాసెస్‌లో, దీని చుట్టూ మన పనులు ఇంకెన్నో సులభంగా అవుతాయి. కొత్త కాంటాక్ట్స్, లీడ్స్ మనకు కనెక్ట్ అవుతాయి. రకరకాల రూపాల్లో మనీ మనల్ని ఫాలో అవుతుంది.          

ఇదే ఇప్పటి ట్వంటీ ట్వంటీ ఫిలింమేకింగ్! 

Make Movies That Make Money. 

Interested? DM me. 

- మనోహర్ చిమ్మని   

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani