Wednesday, 1 July 2026

20/20 ఫిలిం మేకింగ్!


ఎన్నిరోజులు షూట్ చేశాము, ఎంత బడ్జెట్ పెట్టాము అన్నది కాదు పాయింట్. కంటెంట్ బాగుందా, ప్రేక్షకులు మెచ్చారా లేదా అన్నది పాయింట్.  

20/20 వేగం క్రికెట్‌లోనే కాదు, ఇప్పుడు అన్నిట్లోనూ వచ్చేసింది.  

ఫిలిం మేకింగ్‌లో కూడా ఈ వేగం ఎప్పుడో వచ్చేసింది. కాని ఇప్పుడు గుర్తిస్తున్నారు.

గుర్తించే పరిస్థితి తాజాగా వచ్చింది.  

కట్ చేస్తే -

1999 లో వచ్చిన బ్లెయిర్‌విచ్ ప్రాజెక్ట్, 2007 లో వచ్చిన పారానార్మల్ యాక్టివిటీ సినిమాల తర్వాత, మళ్ళీ అలాంటి సంచలనం సృష్టించిన సూపర్ నాచురల్ హారర్ సినిమా "అబ్సెషన్." 

ఈమధ్యే రిలీజైన ఈ సినిమా బడ్జెట్ మిలియన్ డాలర్ల లోపే.

కాగా, అది సాధించిన కలెక్షన్లు 373 మిలియన్లు!

అతి తక్కువ లొకేషన్స్‌లో, కేవలం 20 రోజుల్లో షూట్ చేసిన ఈ సినిమా డైరెక్టర్ కర్రీ బేకర్ వయస్సు 26 ఏళ్ళు. 

ఇలాంటి మిరకిల్స్ అన్నీ కేవలం ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ ద్వారానే సాధ్యమవుతాయని మరోసారి రుజువైంది. 

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani