Thursday, 2 July 2026

నానక్‌రామ్‌గూడా నాస్తాల్జియా


నానక్‌రామ్‌గూడాలోని రామానాయుడు స్టూడియో ఇప్పుడొక జ్ఞాపకం. నాస్తాల్జియా. 

నా మొదటి సినిమాలో ఏవీయస్‌తో కోర్ట్ సీన్ ఇక్కడ చేశాము. ఆ సీన్లో చిత్రం శ్రీను, జూనియర్ నాగార్జున, శివారెడ్డి వంటి ఆర్టిస్టులు కూడా ఉన్నారు. వేణుమాధవ్, షకీలా, అల్లరి సుభాషిణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం లతో ఒక మంచి నైట్ సీన్ కూడా షూట్ చేశాము.  

అంతకు ముందు గురువుగారు దాసరి గారి సినిమాకు నేను పనిచేసినప్పుడు కొన్ని రోజులు నానక్‌రామ్‌గూడాలో షూట్ చేశాము. 

నవనీత్ కౌర్ రాజకీయాల్లోకి వెళ్ళి ఎం పి కాకముందు, హీరోయిన్‌గా షూటింగ్‌లో ఉన్న ఆమెతో కలిసి ఇక్కడే ఒక సినిమా ప్రపోజల్ గురించి రెండుసార్లు మాట్లాడాను. ఇలాంటి జ్ఞాపకాలు చాలా వున్నాయి. 

కట్ చేస్తే -   

స్టూడియోలో లాస్ట్ షూటింగ్ అయిపోయింది. ఇంక స్టూడియో ఉండదు. దాన్ని ప్రాపర్టీ చేస్తున్నామని సురేష్ బాబు చెప్పటం ఇప్పుడే ఒక వీడియోలో చూశాను.

అంత విశాలమైన ఆ స్టూడియో స్థలం విలువ... ఇప్పుడు వేల కోట్లు. 

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani