Saturday, 28 February 2026

The Math & Myth of the 100CR Indie: A Director’s Strategy for High-Leverage Cinema


The number 100 Crores usually conjures images of massive studio backlots, A-list superstars, and bloated marketing budgets. In the traditional model, a 100CR film is a game of Capital and Labor.

But I’m an Indie director. I don’t have a studio’s treasury or a thousand-person army. My game is different. My game is Specific Knowledge and Permissionless Leverage.

Following the principles of The Almanack of Naval Ravikant, here is exactly how we are going to bridge the gap between "Independent" and "Exponential."

1. Escaping the "Budget Trap" with Specific Knowledge

In the cine field, most people think a bigger budget equals a better film. This is a linear mindset. Specific Knowledge is non-linear. My specific knowledge isn't just "directing"—it’s the ability to find high-concept stories that can be told with elite technical precision but minimal physical overhead. By using cutting-edge tech (Virtual Production, AI-assisted post-production, and lean crews), we decouple the quality of the output from the cost of the input.

2. Using Media as a Force Multiplier

Naval says: "Code and media are permissionless leverage."

Instead of spending 20CR on traditional billboards, the 100CR Indie Mission relies on building a digital community during the process.

  • We aren't just making a movie; we are creating a Media Loop. * Every behind-the-scenes clip, every technical breakdown, and every manifesto post is a "Permissionless" soldier working to build an audience before the first trailer even drops.

3. The Power of "Skin in the Game"

To hit 100CR as an Indie, you cannot be a "Director-for-Hire." You must be an Owner. By keeping the production lean and retaining equity, the "break-even" point drops significantly. When the cost of production is low and the leverage of media is high, the upside becomes infinite. We aren't looking for a paycheck; we are looking for a Value Unlock.  

4. Judgment is the Ultimate Asset

As the director of this mission, my most important job isn't being the loudest person on set. It’s making the right calls on:

  • The Story: Choosing themes that are globally resonant but locally rooted.
  • The Tech: Choosing tools that save time without sacrificing the "Cinematic Soul."
  • The People: Partnering with "High-Signal" collaborators who understand that 1% of the right effort beats 100% of the wrong "hustle." 

The Path Forward

The 100CR Indie Mission isn't a dream; it’s a calculation. It’s the result of applying modern economic principles to the ancient art of storytelling.

We are no longer asking for permission to be successful. We are building the infrastructure to make success inevitable.

- Manohar Chimmani

Thursday, 26 February 2026

అందరికీ అవకాశాలు, రెమ్యూనరేషన్స్ ఇప్పించే డైరెక్టర్స్‌కు మాత్రం...


ఆమధ్య హైద్రాబాద్ బుక్ ఎగ్జిబిషన్లో ఒక మిత్రుడి స్టాల్ ఎదురుగా నేను, మా కవి యాకూబ్, ఇంకొందరు మిత్రులం నిల్చుని మాట్లాడుకుంటున్నాం. అప్పుడే కవి గోరటి వెంకన్న వచ్చారు. మా యాకూబ్ నన్ను వెంకన్నకు పరిచయం చేశాడు...

"వీడు నా క్లాస్‌మేట్, ఫ్రెండ్... ఫిలిం డైరెక్టర్" అని. 

"ఫిలిం డైరెక్టరా?!" అని నన్ను హగ్ చేసుకొని షేక్ హాండిచ్చారు వెంకన్న. తర్వాత నా భుజం మీద చెయ్యేసి, ఒక మాటన్నారాయన... 

"డైరెక్టర్... లైఫ్ చాలా దారుణమైన నరకం కదా అన్నా?!" అని.  

కట్ చేస్తే -

ఇవ్వాళ మధ్యాహ్నమే నా డైరెక్టర్ మిత్రుడు ఒకరితో కాసేపు ఫోన్లో మాట్లాడాను. ప్రస్తుతం ఒక వంద కోట్ల సినిమా మీద ఫోకస్ పెట్టి, ఆ సినిమా ప్రిప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా తిరుగుతున్నాడు నా మిత్రుడు. 

"మీరు మీ మొహమాటాలన్నీ పక్కనపెట్టి, ముందు ఆ అడ్వాన్స్ ఏదో తీసుకోండి. మీ రెమ్యూనరేషన్... అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి కనీసం ఈ సినిమా నుంచైనా! ఏంటో, పేరుకే డైరెక్టర్... మీకు చిన్న సినిమాలకు డబ్బులు రావు, ఇప్పుడు చేస్తున్న పెద్ద సినిమాక్కూడా అంతే అంటే ఎట్లా?!"... ఇదీ నా డైరెక్టర్ మిత్రుని భార్య ఆవేదన. 

(అప్పట్లో సినిమా హిట్ అయినా సరే, డైరెక్టర్‌కు మొండి చెయ్యే అని కొంతమంది డైరెక్టర్ మిత్రుల ద్వారా తెలిసింది!)  

కట్ చేస్తే -

డైరెక్టర్ అనేవాడు చాలామందికి అవకాశాలిస్తాడు, రెమ్యూనరేషన్స్ ఇప్పిస్తాడు. ప్రొడ్యూసర్‌కు ఎక్కడికక్కడ డబ్బు వృధా కాకుండా తన బాధ్యత కాని ఎన్నెన్నో విషయాల్ని కూడా తన భుజాలమీద మోస్తుంటాడు. తన జేబులోంచి కూడా ఎంతో ఖర్చుపెడుతుంటాడు.  

కాని, టీంలో అందరికీ డబ్బిచ్చే ప్రొడ్యూసర్... ఒక్క డైరెక్టర్ పేమెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆపేస్తుంటాడు-లేదా-నిర్దాక్షిణ్యంగా కోతలుపెడుతుంటాడు. ఇంకా చెప్పాలంటే, అసలేమీ ఇవ్వకుండా పెండింగ్‌లో పెడతాడు. 

ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అడిగినట్టుగా నిర్మొహమాటంగాతన పేమెంట్ గురించి అడగలేకపోతాడు డైరెక్టర్. 

అప్పులు, ఆకలి మధ్య, ఎప్పుడూ చెదరని చిరునవ్వుతో, వందమంది టీమ్‌తో కలిసి పనిచేస్తుంటాడు. అవసరమైనప్పుడు బయటనుంచి అప్పుతెచ్చి కూడా టీమ అవసరాలకు అడ్జస్ట్ చేస్తుంటాడు. 

ప్రొడ్యూసర్స్ అందరూ ఇలాగే ఉంటారని కాదు. కాని, చాలామంది ప్రొడ్యూసర్స్ మాత్రం... ఒక్క డైరెక్టర్ పేమెంట్ విషయంలోనే ఎందుకో ఇవ్వాలంటే బాధపడుతుంటారు.   

గోరటి వెంకన్న ఇలాంటి డైరెక్టర్స్‌ జీవితాలు ఎందరివి చూసుండకపోతే ఆరోజు నాతో ఆమాట అనుంటారు?   

- మనోహర్ చిమ్మని            
          

Wednesday, 25 February 2026

Direction, Leverage, and Specific Knowledge: The Naval Way


If you’re a director, you aren’t just a "creative"—you are the CEO of a vision. 

Most people in the film industry trade their time for money, but The Almanack of Naval Ravikant teaches us how to build wealth and impact by escaping the "hourly rate" mindset.

For a filmmaker, these three Naval pillars are game-changers:

1. Specific Knowledge: Find Your "Uncopyable" Voice

Naval defines specific knowledge as the thing you do that feels like play to you, but looks like work to others.

  • The Director’s Take: Don't just "direct." Find the intersection of your unique obsessions—maybe it’s a specific sub-genre, a technical lighting style, or a way of coaxing performances that no one else can replicate. When you have specific knowledge, you aren't competing; you’re the only one who can do what you do.

2. Leverage: The Force Multiplier

In the "Cine field," we often get stuck in the grind. But Naval talks about three types of leverage: Labor, Capital, and Code/Media.

  • The Director’s Take: Media is the ultimate "permissionless" leverage. Every film you finish is a digital asset that works for you while you sleep. It’s a piece of code that broadcasts your talent to the world 24/7 without you needing to be in the room.

3. Judgment over Sweat

Naval says, "In an age of infinite leverage, judgment is the most important skill." As a director, you are paid for your decisions (the "calls"), not just for being the first person on set.

  • The Director’s Take: One great decision on a script or a casting choice is worth a thousand hours of "hustle." Protect your mind, stay curious, and focus on the high-leverage choices that move the needle.

"Build or buy equity in a business [or a project]... if you don’t own a piece of a business, you don’t have a path towards financial freedom." — Naval Ravikant

As a director, you aren't just making a movie; you are building your personal brand as an intellectual property. Use your "specific knowledge" to create "media leverage," and let your "judgment" guide your career.

- Manohar Chimmani 

Directing with Leverage: Lessons from The Almanack of Naval Ravikant


As a film director, I see cinema not just as art — but as leverage.

In The Almanack of Naval Ravikant, Naval Ravikant speaks about specific knowledge, leverage, accountability, and long-term games. These ideas apply powerfully to a director’s life.

Specific Knowledge is your voice — your lived experiences, your emotional depth. That’s your unfair advantage.

Leverage in cinema means creating stories that outlive you — films that travel across time and geography.

Accountability is when your name stands on the poster. That changes how you choose stories.

Cinema is not a one-film race.
It is a long-term game of reputation, relationships, and legacy.

A director who thinks like a philosopher doesn’t just make movies.
He builds freedom.

- Manohar Chimmani 

Tuesday, 24 February 2026

అసలు సినిమాలెందుకు ఆగిపోతాయి?


నా చిన్నప్పటినుంచీ వింటున్నాను... బోలెడన్ని సినిమాలు రిలీజ్ కాకుండా ప్రసాద్ ల్యాబ్‌లో కుప్పలుగా పేరుకుపోయి ఉన్నాయని. అది అబధ్ధమేం కాదు. 100% నిజం. 

ఇప్పుడయితే ల్యాబ్స్ అవసరం కూడా లేదు. డిజిటల్ హార్డ్ డిస్కులు... ప్రొడ్యూసర్ దగ్గరో, డైరెక్తర్ దగ్గరో ఒక డబ్బాలో వేసి పడుంటాయి.  

ప్రతి సంవత్సరం ప్రారంభమయ్యే 250+ సినిమాల్లో... కొన్ని సినిమాలు పూర్తికాకపోవటం, పూర్తయినా రిలీజ్ కాకపోవటం అనేది ఒక అత్యంత సర్వసాధారణమైన విషాదం. 

ఈ పరిస్థితి ఒక్క తెలుగు సినిమాలకే పరిమితం కాదు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అంతటా ఉన్నదే.

అన్నేసి కోట్లు కుమ్మరించి కూడా అసలెందుకీ పరిస్థితి? ఎందుకు సినిమాలు ఆగిపోతాయి? 

ఈ పరిస్థితికి సాధారణంగా 90 శాతం కారణం ఒక్కటే అయి ఉంటుంది... డబ్బు.  

* మనం ఎలాంటి కథతో సినిమా తీస్తున్నాం, దాని టార్గెట్ ఆడియెన్స్ ఎవరు, ఎవరితో తీస్తున్నాం, వారికి ఫీల్డులో ఉన్న మార్కెట్ ఏంటి, మనం ఆ మార్కెట్‌కు లోబడే ఖర్చు పెడుతున్నామా, మార్కెట్ పరిమితి దాటి రిస్కు తీసుకుంటున్నామా, కొత్తవాళ్ళతో తీసినప్పుడు మనం ఎదుర్కొనే రిస్కులేంటి, వాటికి సొల్యూషన్ ఏంటి... ఇవన్నీ అలోచిస్తే ఒక్క సినిమా కూడా మధ్యలో ఆగిపోదు.

* సినిమాలు ఆగిపోవడం ఎక్కువగా ముందు అనుకున్న బడ్జెట్ దాటిపోవటం వల్ల జరుగుతుంది. సగం సినిమా షూటింగ్ తర్వాత డబ్బులు అయిపోతే ఇంక చెయ్యడానికి ఏముంటుంది? 

* కొన్ని సినిమాలు పూర్తవుతాయి. కానీ, వాటిని కొని రిలీజ్  చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ రారు. స్వంతంగా రిలీజ్ చేసుకొనే శక్తి నిర్మాతకి ఉండదు. 

* సినిమా బిజినెస్ అన్ని వ్యాపారాల్లా కాదు. ముందే ఒక ఖచ్చితమైన్ ప్లాన్‌తో, ప్రొడ్యూసర్-డైరెక్టర్‌ల మధ్య ఒక స్పష్టమైన అవగాహనతో... అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తే ఎలాంటి సమస్యలు రావు. అలా కాకుండా ఓవర్‌కాన్‌ఫిడెన్స్‌తో ఎవరిదారిన వారు గుడ్డిగా వెళితే మాత్రం అంతిమ ఫలితం ఇలాగే ఉంటుంది.

* అరుదుగా కొన్ని సినిమాలు ఎవరో ఒకరి "ఈగో" సమస్య వల్ల కూడా ఆగిపోతాయి. 

సరిగ్గా చేసుకుంటే ఈ "షో బిజినెస్‌"ని మించిన బిజినెస్ లేదు.  డబ్బూ, డబ్బుతోపాటు ఓవర్‌నైట్‌లో మనం ఊహించనంత ఫేమ్ కూడా ఈ ఒక్క బిజినెస్‌లోనే సాధ్యం. 

ఒక్క హిట్ గానీ ఇచ్చామా... ఇంక అంతే. ప్రొడ్యూసర్ అయినా, డైరెక్టర్ అయినా... అప్పటివరకూ పడ్డ కష్టాలన్నీ హుష్ కాకి అయిపోతాయి! ఆ తర్వాత ఇంక మీరు ఏది అనుకుంటే అదే!! 

కానీ, ఆ హిట్టు రావడం అంత ఈజీ కాదు... 

- మనోహర్ చిమ్మని    

మీడియా పని ఏంటంటే...


ఒక హీరోయిన్ పెళ్ళవుతోంది. సుమారు ఒక అయిదారేళ్ళ రిలేషన్‌షిప్ తర్వాత, తనకు నచ్చిన ఇంకో హీరోని పెళ్ళిచేసుకుంటోంది. 

ఆమె నేషనల్ క్రష్‌గా పాపులారీటీ తెచ్చుకొంది. దాదాపు అన్ని ముఖ్యమైన భాషల ఫిలిం ఇండస్ట్రీల్లో ఒక టాప్ హీరోయిన్‌గా పనిచేస్తోంది.  

కట్ చేస్తే - 

సోషల్ మీడియాలో ఇందాకే ఒక పోస్టు చూశాను... అతను, దాదాపు పదేళ్ళ క్రితం ఆ హీరోయిన్‌ను పరిచయం చేసిన ఒక నటుడు/నిర్మాత/రచయిత. 

"హీరోయిన్‌గా ఇప్పటి ఆమె కలను నేను అప్పుడే విజువలైజ్ చేశాను... మేమిద్దరం టచ్‌లోనే ఉన్నాం" అని!  

ఇది 2023 లో అతనొక ఇంటర్వ్యూలో చెప్పిన మాట. దాన్ని ఎన్‌డీటీవీ లాంటి మీడియా ఇప్పుడు కోట్ చెయ్యటం అవసరమా?  

- మనోహర్ చిమ్మని

సంపాదించినదాంట్లో నువ్వెంత ఖర్చుపెట్టావన్నదే నీ విలువ !!


"మనం ఏ సామాన్లతో ఎక్కామో వాటితోనే దిగుతాం. మిగిలి పోయిన తినుబండారాలు, న్యూస్ పేపర్లు రైల్లోనే వదిలేస్తాము. జీవితం కూడా అంతే. బ్రతుకు కంపార్ట్‌మె౦ట్‌లోకి ఏమీ లేకుండా కాలు పెట్టిన మనం, వెళ్ళేటప్పుడు కూడా అలాగే పోవాలి. సంపాదించినది కేవలం సుఖంగా బ్రతకటానికి మాత్రమే. కూడబెట్టి వారసులకు పంచటానికి కాదు."  

- యండమూరి వీరేంద్రనాధ్, 
"ఒక దెయ్యంతో నా ప్రేమ కథ" పుస్తకం నుంచి

కట్ చేస్తే -

ఒకసారి రామ్‌గోపాల్ వర్మ కూడా ఇలాంటిదే ఇంకో మాట చెప్పాడు... 

"నువ్వు ఎన్ని వందల కోట్లు సంపాదించావన్నదానికి అసలు విలువే లేదు. ఆ సంపాదించినదాంట్లో నువ్వెంత ఖర్చుపెట్టావన్నదే నీ విలువ" అంటాడు వర్మ. 

బిల్ గేట్స్ లాంటి ప్రపంచస్థాయి బిలియనేర్లు కూడా వాళ్ళు సంపాదించినదాంట్లోంచి ఒక్క పైసా వాళ్ళ వారసులకు ఇవ్వలేదు. వాళ్ళకు నచ్చిన చారిటీస్‌కు రాసేశారు. వాళ్ళకు ఇష్టమైనవిధంగా బ్రతుకుతున్నారు. 

కట్ చేస్తే - 

ఇప్పుడే ఫేస్‌బుక్‌లో వీరేంద్రనాధ్ గారి పోస్ట్ చూశాక ఇది రాయాలనిపించింది... 

వీరేంద్రనాధ్ పోస్ట్ ద్వారానే నాకు ఇంకో విషయం తెలిసింది... మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలకు సహాయం చేశారని. 

దేన్నీ లెక్కచెయ్యకుండా విచ్చలవిడిగా జీవితాన్ని అనుభవించినవాళ్ళంతా చివరికి ఆధ్యాత్మిక జీవితానికి అంకితమైపోయినట్టు, ఒకప్పుడు చారిటీ వైపు అసలు ఆలోచించనివాళ్ళంతా చివరి దశలో చారిటీకి, వ్యక్తిగత ఇష్టాలకు, వ్యక్తిగత జీవితానికి ఊహించనంత డబ్బు ఖర్చుపెడతారన్నది నేను అధ్యయనం చేసిన ఇంకో జీవిత వాస్తవం. 

- మనోహర్ చిమ్మని 

Monday, 23 February 2026

సినిమా తీయడానికి డబ్బొక్కటేకాదు... గట్స్ కావాలి!


"ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు" అన్నారు. కానీ, "సినిమా తీసి చూడు" అని మాత్రం ఎవరూ అనలేకపోయారు. ఎందుకంటే, ఇది ఆ రెండింటి కంటే చాలా కష్టం.    

ఇక్కడ విషయం డబ్బు ఒక్కటే కాదు. చాలా ఉంది. అన్ని వ్యాపారాల్లానే సినిమా కూడా ఇప్పుడు ఒక వ్యాపారమే. కాకపోతే ఇదొక కళాత్మక వ్యాపారం. బిగ్ బిజినెస్. అంతిమంగా దీని గోల్ కూడా సేమ్ టూ సేమ్... రూపాయి పెడితే నాలుగు రూపాయలు లాభం రావాలన్నదే. ఇందులో ఎలాంటి డౌట్ లేదు.

మొన్నటివరకూ మన చుట్టూ సమాజంలో ఒక గుడ్డి వాదన ఉండేది. ఏ వ్యాపారంలో అయినా పెట్టుబడి పెట్టొచ్చు కానీ, సినిమాల్లో పెట్టొద్దు అని. ఇదొక "హెవీ గ్యాంబ్లింగ్" అని వాళ్ల ఉద్దేశ్యం. ఆ మాటకొస్తే, అసలు వ్యాపారమే ఒక గ్యాంబ్లింగ్. మన జీవితమే ఓ పెద్ద గ్యాంబ్లింగ్. ఈ నిజాన్ని ఇప్పటి తరం బిజినెస్‌మెన్ గుర్తించారు కాబట్టే "అబ్బో సినిమాల్లోనా!" అని ఇంతకుముందులా భయపడటంలేదెవ్వరూ. 

ఒక అధ్యయనం ప్రకారం... హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా, సినిమా ప్రొడ్యూసర్లలో 41 శాతం మంది ఎప్పుడూ లాభాల్లో ఉంటారు. ప్రపంచంలోని ఏ ఇతర బిజినెస్‌లతో పోల్చుకున్నా, సినిమా బిజినెస్‌లోని ఈ సక్సెస్ రేటు ఇంకే బిజినెస్‌లో లేదు.   

సినిమా తీయడానికి డబ్బొక్కటేకాదు, గట్స్ కావాలి. అవసరం లేనివాటికి అనవసరంగా టెంప్ట్ కాకుండా, ఫీల్డుమీద కొంచెం అవగాహనతో, మార్కెట్ స్టడీ చేస్తూ సినిమాలు చేస్తే మాత్రం ఎలాంటి భయాలు ఉండవు, నష్టాలుండవు. 

కాని, అడుగడుగునా టెంప్ట్ అవుతాం. ఏమీ కాదు అనుకుంటాం. తర్వాత లబోదిబో అంటాం. అది వేరే విషయం.  

కట్ చేస్తే - 

ఇతర అన్ని వ్యాపారాల్లో బాగా డబ్బు సంపాదించొచ్చు. కానీ, రాత్రికి రాత్రే ఫేమ్‌నూ, ఒక సెలబ్రిటీ హోదానూ, ప్రపంచవ్యాప్త గుర్తింపునూ తెచ్చుకోవడం మాత్రం ఒక్క సినిమాల్లోనే సాధ్యం.  

ఫిలిం బిజినెస్‌లో అయితే... ఒక వంద టీవీ చానెళ్ళూ, రెండొందల వెబ్‌సైట్స్, ఫిల్మ్ మేగజైన్స్, న్యూస్ పేపర్లు, యూట్యూబ్ చానెళ్ళు, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్... ఇవన్నీ ఓవర్‌నైట్‌లో ఎవ్వరూ ఊహించని రేంజ్‌లో ఫేమ్ క్రియేట్ చేస్తాయి. పాపులర్ ఫిగర్‌ను చేస్తాయి. సెలబ్రిటీ హోదాను అందిస్తాయి.   

ఈ అడ్వాంటేజ్ ప్రపంచంలోని మరే ఇతర బిజినెస్‌లో లేదు.   

దటీజ్ సినిమా.  

Emotion builds connection. Strategy builds collections.

-మనోహర్ చిమ్మని

Friday, 20 February 2026

Live Young, Not Backward


Emotional scars are real.
Grudges feel justified.
Memories can be heavy.

But when you live inside old wounds, 
you slowly become old — 
no matter your age.

The past is a closed set. 
The shoot is over.
Yet many people keep replaying 
the same scene in their head, 
carrying yesterday’s hurt 
into today’s opportunity.

Youth is not about numbers.
It’s about direction.

Young minds look forward.
Old minds look backward.

When you drop the grudge, 
you drop the weight.
When you forgive, 
you move faster.
When you stop rehearsing pain, 
you start performing life.

Live young.
Be young.
Be unapologetically you.

- Manohar Chimmani 

Thursday, 19 February 2026

డైరెక్టర్స్ అప్పుల్లో ఎందుకుంటారు?


ఒక్కొక్క డైరెక్టర్ నుంచి జస్ట్ ఒక్కో అనుభవం తీసుకొని రాయాలనుకొన్నా... ఇది కనీసం ఒక వంద ఎపిసోడ్ల సీరీస్ అవుతుంది. 

సో, చాలా చాలా క్లుప్తంగా సింగిల్ లైన్ ఆర్డర్‌లా, సమ్మరీ మాత్రమే రాస్తున్నా. 

కట్ చేస్తే -  

ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్న పదిమంది ప్రొడ్యూసర్స్ ఒక్కొక్కరి దగ్గర కనీసం ఒక నలుగురు డైరెక్టర్స్ చొప్పున కథ ఓకే చేయించుకొని లైన్లో ఉంటారు. 

అలాగని వీళ్లంతా కొత్త డైరెక్టర్సేం కాదు. అప్పటికే మంచి హిట్స్ ఇచ్చినవారై ఉంటారు. 

ఇలాంటి సిచువేషన్లో ఒక కొత్త డైరెక్టర్ వెళ్ళి ప్రొడ్యూసర్‌కు కథ చెప్పి ఒప్పించుకోవడం, మంచి బడ్జెట్‌తో సినిమా తీయడం అనేది ఒక భ్రమ. 

మరెలా? 

డైరెక్టర్ కొంత డబ్బు పెట్టుకొని, సినిమా ఆఫీస్ ఓపెన్ చేసి పని ప్రారంభిస్తే... 50/50 చాన్సెస్‌తో కొత్త ఇన్వెస్టర్స్ గాని, కో-ప్రొడ్యూసర్స్ గాని దొరకొచ్చు. 

"దొరకొచ్చు" అంటే వాళ్లేం అలా వెళ్తుంటే కనిపించరు. అలాంటివాళ్లను డైరెక్టర్సే తయారుచేసుకోవాలి.  

అలా ఒక ఇద్దరో ముగ్గురో, నలుగురో అయిదుగురో లైక్‌మైండెడ్ కలిసినప్పుడు ఒక చిన్న సినిమా తయారవుతుంది.  

అది హిట్ అయిందా నో ప్రాబ్లం. పోయిందా, అత్యుత్సాహంతో మనవాళ్ళు ఇచ్చే కమిట్‌మెంట్స్ అన్నీ మీదపడిపోతాయి. ఉన్నట్టుండి ఆ డైరెక్టర్ అప్పుల్లో పడిపోతాడు. ఈ అప్పులు లక్షల్లో ఉంటాయి. కోట్లల్లో కూడా ఉండొచ్చు.   

ఇలాంటి ఒక్క చిన్న దెబ్బ నుంచి కోలుకోడానికి కొందరు డైరెక్టర్స్‌కు జీవితకాలం కూడా సరిపోదంటే అతిశయోక్తి కాదు.   

ఇక "5 కోట్ల ఇన్వెస్టర్‌ను ఇప్పిస్తాం", "10 కోట్ల ప్రొడ్యూసర్‌ను ఇప్పిస్తాం" అని నానా కోతలు కోసి, కథలు చెప్పి మోసం చేసే బ్యాచ్‌లు ఇండస్ట్రీ నిండా కోకొల్లలుగా ఉంటాయి. వీళ్ల పుణ్యమా అని అత్యుత్సాహంతోనో, అమాయకంగానో లక్షలు లక్షలు పోగొట్టుకొనే డైరెక్టర్లు బోలెడంతమంది ఉంటారు.   
సమాజంలో అత్యంత గౌరవనీయమైన స్థానంలోనో, అతి పెద్ద హోదాలోనో ఉన్న ఎంతోమంది సోకాల్డ్ ఇన్వెస్టర్లు "వచ్చే బుధవారం 5 కోట్లు పంపిస్తా, మీరు స్టార్ట్ చేయండి" అని చాలా నమ్మకంగా ప్రామిస్‌లు చేస్తారు. 

99.9 శాతం ఆ మాటలన్నీ నీటిమూటలే.

రాజకీయరంగం నుంచి అయితే ఇలాంటి ప్రామిస్‌లను వందకి వంద శాతం నమ్మొద్దు.      

"మరి ఈ డైరెక్టర్స్ అంత అమాయకులా, చదువుకోలేదా"... అని అనిపించొచ్చు. కానే కాదు. పీజీలు, పిహెచ్‌డీల్ చేసినవాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. అయినా బోల్తా పడతారు.  
అవతలివారి స్థాయి, "పని అయిపోతుంది కదా" అన్న ఆశ... వారిని అలా టెంప్ట్ చేస్తుంది. 

అంతే.

తిరిగి లేవలేని ఊబిలో కూరుకుపోతారు.    

కట్ చేస్తే - 

ఎలాంటి సిచువేషన్లో అయినా టెంప్ట్ కాని ఒక 20 శాతం మంది జ్ఞానులైన డైరెక్టర్స్ మాత్రం బాగుంటారు. ఎక్కడా ఎలాంటి తప్పటడుగు వేయరు. 

ఇలాంటి స్థితప్రజ్ఞులను చూసైనా నేర్చుకోవాలి అనుకునే లోపే, చాలామంది డైరెక్టర్స్ చేతులు కాలిపోయుంటాయి. ఆకుల కోసం వారి అన్వేషణ ఒక మొగిలిరేకులు సీరియల్‌లా సాగుతూవుంటుంది.

సో, ఇదింతే.
ఈ సిస్టమ్ ఇలాగే ఉంటుంది. 
ఈ వ్యవస్థ ఇలాగే ఉంటుంది. 

ఇదొక బిజినెస్.

బిజినెస్‌ను బిజినెస్ లాగే ఆలోచిస్తే సమస్యలుండవు. 
ఫ్లాప్ సినిమాలు తీసినా అప్పుల్లో ఉండరు. 

అయితే ఈ టెక్నిక్ నేర్చుకోవడం అందరికీ సాధ్యం కాదు. 

కట్ చేస్తే -

ఇదంతా - డైరెక్టర్స్ అప్పుల్లో ఉండటానికి కారణమైన జస్ట్ ఒక్క టెంప్లేట్ మాత్రమే. ఇంకో 99 రకాల కారణాలతో, ఇంకో 99 టెంప్లేట్స్ ఉంటాయన్నది చాలా బాధాకరమైన, నమ్మశక్యం కాని రియాలిటీ.   

ఇలాంటి నేపథ్యం పట్ల కనీసం 1% అయినా అవగాహన లేని బయటి వ్యక్తులు డైరెక్టర్స్‌కు నానా ఉచిత సలహాలిస్తుంటారు. అది వేరే విషయం.  

Cinema is not for the comfortable.
It tests your patience, your money, your sanity.
In the end, it doesn’t reward the most talented —
It rewards the last one still standing. 


- మనోహర్ చిమ్మని   

జస్ట్ నా హంబుల్ డౌట్...


పొద్దున్నే నన్నొక ఫిలిం డైరెక్టర్స్ గ్రూపులో పడేశారు. జస్ట్ ఇందాకే ఆ గ్రూపులో ఒక పోస్ట్ చూశాను. సారాంశం కొంచెం అటూఇటూగా ఇది... 

డైరెక్టర్స్ అసోసియేషనే - అసోసియేషన్ మెంబర్స్ కథలు విని - వాటిల్లో మంచి కథల్ని ప్రొడ్యూసర్స్‌కు కనెక్ట్ చెయ్యాలని!

నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే - ఇది "ప్రాక్టికల్లీ ఇంపాజిబుల్" అని నేను అనుకుంటున్నా.

ఏ అసోసియేషన్ అయినా మెంబర్స్‌ని ఎడ్యుకేట్ చెయ్యగలదు. సమస్య వచ్చినప్పుడు సపోర్ట్ ఇవ్వగలదు. కాని, డైరెక్టర్ స్వయంగా చేసుకోవాల్సిన పనిని అసోసియేషన్ చెయ్యలేదు.

అసోసియేషన్ మెంబర్స్ కథల్ని విని, రికమెండ్ చేస్తే ప్రొడ్యూసర్స్ వినాలన్న రూలేం లేదు. వింటారని నేననుకోను.  

అదే కాని నిజంగా జరిగితే - ఆ కథలు విని రికమండ్ చేసేవాళ్ళు ఖాళీగా ఎందుకుంటారు? జస్ట్ నా హంబుల్ డౌట్...    

- మనోహర్ చిమ్మని

Monday, 16 February 2026

సినిమాల్లోకి ఎంట్రీనే ఉంటుంది... ఎక్జిట్ మన చేతుల్లో ఉండదు!


నాకు తెలిసి 'సినిమా కష్టాలు' పడకుండా ఇండస్ట్రీలో పైకివచ్చినవారు లేరు!

ఎంత సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నా సరే, ఎంత డబ్బున్నా సరే, ఎంతో టాలెంట్ ఉండి మరెంతో టాప్ రేంజ్‌లోకి వచ్చినా సరే... ఏదో ఒక టైమ్‌లో, ఏదో ఒక రూపంలో ఈ సినిమా కష్టాలనేవి ఈ రంగంలో ఉండేవాళ్లను తప్పక ఎటాక్ చేస్తాయి.

ఈ స్టేట్‌మెంట్‌కు ఎలాంటి రిలాక్సేషన్ లేదు. ఉండదు.

సినిమా కష్టాలకు సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవాటితో అస్సలు సంబంధం ఉండదు అని చెప్పడమే ఇక్కడ నా పాయింట్. 

మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే -

సినిమాల్లోకి ఎంట్రీనే ఉంటుంది. 
ఎక్జిట్ మన చేతుల్లో ఉండదు!
"వన్ వే" అన్నమాట. 

సినిమా ఎవ్వర్నీ వదలదు, దీన్లోకి ఎంటరయినవాడు సినిమానీ వదల్లేడు!!

దటీజ్ సినిమా.

ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇద్దరికీ వర్తిస్తుంది ఇది.  

అయితే, సినిమాను ఒక పక్కా క్రియేటివ్ బిజినెస్‌గా, ఒక ప్రొఫెషన్‌గా మాత్రమే తీసుకొని, ఆ పరిధిలోనే కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు, నియమాలు పాటిస్తే మాత్రం ఏ కష్టాలూ ఉండవు. 

బాగా సంపాదించొచ్చు కూడా!  

స్పిరిచువల్‌గా చెప్పాలంటే... ఒక రకమైన 'డిటాచ్‌డ్ అటాచ్‌మెంట్' అన్నమాట.

అయితే ఇది చెప్పినంత సులభం కాదు. అందరివల్ల కూడా కాదు.


- మనోహర్ చిమ్మని      

From Practice to Power — The Hidden Strength of Blogging


“Sometimes I think of blogging as finger exercises for a violinist. Sometimes I think of it as mulching a garden. It is incredibly useful and helpful to my ‘real’ writing.”

— Kate Christensen

Blogging is often where writers sharpen their swords.

For many male bloggers, it becomes a training ground — a space to test arguments, refine ideas, build clarity, and strengthen intellectual muscle.

Post by post, they build authority. Paragraph by paragraph, they build discipline. It is practice — yes — but powerful practice.

And then there are women who blog.

For female bloggers, blogging is not just practice. It is expression. It is reclamation.

It is carving space in a noisy world and saying, My voice matters too.

Where men may use blogging to sharpen thought, women often use it to shape identity — navigating career, relationships, creativity, healing, ambition, and reinvention.

A blog becomes both mirror and window... reflecting who they are, and revealing who they are becoming.

And for women who read blogs, something even more beautiful happens...

They find resonance.

One honest post about self-doubt can feel like companionship. One vulnerable story can dissolve isolation. One courageous opinion can ignite confidence.

Blogging, then, is not “small writing.”
It is soil work.
It is mulching experience into wisdom.
It is practicing scales before playing life’s symphony out loud.

What begins as a simple post can grow into presence.
What begins as rehearsal can become revolution.

- Manohar Chimmani 

సినిమా అంటే జస్ట్ షూటింగ్ మాత్రమేనా?!


Angels dance with those who are already on the dance floor.

ట్రాక్ మీదున్నప్పుడే ఎవరైనా మనల్ని పట్టించుకునేది. ఏ ఫీల్డు అయినా అంతే. 
   
సో, చిన్న సినిమానా పెద్ద సినిమానా అన్నది కాదు పాయింట్. అసలు సినిమా అంటూ ఒకటి చేస్తుండటం చాలా అవసరం. 

ఎవరికోసమో కాదు. మనకోసం.  

కట్ చేస్తే -

మొన్నొక రోడ్ క్రైమ్ సినిమా చేశాను. పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా జరుగుతోంది. 

ఇండిపెండెంట్ సినిమా కదా... నానా కష్టాలుంటాయి. ప్రొడ్యూసర్, డైరెక్టర్లకు తప్ప మిగిలినవాళ్ళకు వీటిగురించి అవసరం ఉండదు. అసలు తెలుసుకోరు, పట్టించుకోరు. నిజానికి వాళ్ళకా అవసరం లేదు. కాని, "మన సినిమా" అన్న మమకారం ఎంతో కొంత ఉండాలి.   

విషయం ఏంటంటే - ఈ సినిమా జరిగినన్నాళ్ళూ దాదాపు ప్రతి ఒక్కళ్ళూ నాకు రోజూ గుడ్మార్నింగులూ, పండగలకు-అకేషన్స్‌కు గ్రీటింగ్స్, "ఇంక మిమ్మల్ని వదిలేది లేదు" అన్న రేంజ్‌లో మాటలు, సోషల్ మీడియాలో లైకులు గట్రా... ఓ భలే ఓవర్ యాక్టింగ్ ఉండేది. 

మరి ఇప్పుడు? 
ఒక వాట్సాప్ హాయ్ ఉండదు.
ఒక కాల్ ఉండదు. 

మళ్ళీ ఏదైనా ప్రి-రిలీజ్ ఈవెంట్ అన్నామా... మొత్తం వాలిపోతారు. 

సీన్ రిపీట్. 

గుడ్మార్నింగ్స్, గుడీవెనింగ్స్, గుడ్ నైట్స్. హాప్పీ సంక్రాంతులు, ఉగాదులు, దసరాలు, ఇండిపెండెంట్ డేస్... గట్రా. 

నిజానికి, ఈ డ్రామా అంతా నా మొదటి సినిమా నుంచీ చూస్తూనే ఉన్నాను కాబట్టే ఒక్కొక్కళ్ళ ఓవర్ యాక్షన్ అంతా బాగా ఎంజాయ్ చేశాను.            

ఆర్టిస్టులైనా, టెక్నీషియన్స్ అయినా, 95 శాతం కొత్తవాళ్లకు సినిమా అంటే జస్ట్ షూటింగ్ మాత్రమే.

"ఓస్ ఇంతేనా?!" అనుకుంటారు. 

ఇలాంటి మిడిమిడి జ్ఞానపు అల్ప సంతోషులకు తర్వాత కనిపిస్తుంది అసలు బొమ్మ. 

మిగిలిన ఏ 5 శాతం మంది అయితే సినిమాల్ని సీరియస్‌గా పట్టించుకుంటారో... వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యాటిట్యూడ్ ఇలా ఉండదు. నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు. అది వారి పదవ సినిమా అయినా, మొదటి సినిమాలాగే ఉంటారు.   

ఈ 5 శాతం మందే ఏ కొంచెమైనా సాధించగలుగుతారు... సినిమాల్లో అయినా, జీవితంలో అయినా.  

ఏ డైరెక్టర్ అయినా తన టీమ్ కోసం, సినిమాను సీరియస్‌గా తీసుకొనే ఆ 5%  కోసమే ప్రయత్నిస్తాడు. కాని అదంత ఈజీ కాదు. 

కట్ చేస్తే -

ఇప్పుడు మళ్ళీ ఓ కొత్త ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది. 

కాని, ఈసారి సీన్ రిపీట్ కావడం నాకిష్టం లేదు. 

- మనోహర్ చిమ్మని      

Sunday, 15 February 2026

Even a Long Life is a Short Ride


We plan as if we have endless tomorrows.

We postpone as if time is waiting patiently for us. But life moves quietly — and faster than we realize.

That script you want to write.
That call you want to make.
That apology. 
That risk.
That new beginning.

Small or big... Creative or personal.
Don’t postpone it.

In cinema, the difference between a dreamer and a director is action. The same applies to life.

Ideas are common. Intentions are common. Execution is rare.

You don’t need perfect timing.
You need decision. 

Because one day, “later” becomes “too late.”

Start messy. Start unsure. But start. Just start. 

What is one thing you’ve been postponing? Do it today — and tell me what it is.

- Manohar Chimmani 

సినిమానే పని, ప్యాషన్, ఆక్సిజన్... అన్నీ...


కొన్నాళ్ళు పూర్తిగా సినిమాలకు అంకితం అవుతున్నాను. ఆ జర్నీ ఆల్రెడీ మొదలైంది. 

నిజంగా నాకిప్పుడేం పనిలేదు. సినిమానే పని, ప్యాషన్, ఆక్సిజన్... అన్నీ.

పక్కా కమర్షియల్.  

ఈ జర్నీలో జెర్క్‌లూ, ఎదురు దెబ్బలూ, ఊహించని స్టకప్‌లూ సర్వసాధారణం. భారీ భారీ నిర్మాతలకు, దర్శకులకే ఇలాంటివి తప్పలేదు, తప్పవు. 

దటీజ్ సినిమా. 
పెద్ద ఫరక్ పడదు. 
 
కట్ చేస్తే -

నా సోషల్ మీడియాలో గాని, నా బ్లాగ్‌లో గాని... దాదాపు పూర్తిగా సినిమా కంటెంటే ఉంటుంది. 
 
క్లాస్, మాస్, క్లాసికల్లీ మాస్.

పోస్టులకు, ఫోటోలకు కూడా సంబంధం ఉండకపోవచ్చు. 

నాకు నచ్చిన కంటెంట్. నాకు నచ్చకపోయినా ప్రొఫెషనల్లీ నేను పోస్ట్ చెయ్యాలనుకున్న కంటెంట్. ఔత్సాహికులకు పనికొచ్చే కంటెంట్. పనికిరాని కంటెంట్ అనిపించే పరోక్షంగా పనికొచ్చే కంటెంట్... అన్నీ ఉంటాయి.

నా అశేష మేధావి మిత్రబృందంలో చాలామందికి ఈ కంటెంట్ నచ్చకపోవచ్చు. నా పోస్టుల మీద, నా బ్లాగ్-పోస్టుల మీద, నిర్మాణాత్మక విమర్శలు ఓకే. హిపోక్రసీ రాతలు మాత్రం వద్దని మనవి. దానికంటే నన్ను అన్‌ఫ్రెండో, బ్లాకో చెయ్యటం బెటర్.

పైన నిర్భయంగా పోస్ట్ చేసేవాడు కింద కామెంట్స్ పట్టించుకోవద్దు" అన్న సూత్రం అక్షరాలా పాటిస్తున్నాను. 

Peace.

ఓం నమశ్శివాయ. 

- మనోహర్ చిమ్మని   

Friday, 13 February 2026

హైద్రాబాద్‌లో "తెలుగు బ్లాగర్స్ మీట్" మళ్ళీ ఎప్పుడో?


"లేఖిని" వీవెన్ గారు అనుకుంటాను... ఆ మధ్య నన్ను బ్లాగర్స్ మీట్‌కు పిలిచారు. వెళ్ళాలని అనుకున్నాను. చివరి నిమిషంలో అనుకోని పని తగలటం వల్ల మీట్‌కి వెళ్ళలేకపోయాను. 

బహుశా మొన్న డిసెంబర్ రెండో ఆదివారం, "తెలుగు బ్లాగుల దినోత్సవం" నాడు మళ్ళీ కలిసే వుంటారు. 

కొత్త పరిచయాలు, కొత్త విషయాలు, కొత్త వాతావరణం... అప్పుడప్పుడూ ఇలాంటి మార్పు కొంత అవసరం. 

ఇలాంటి మీట్‌లు సంవత్సరానికి ఒక రెండో మూడో జరుగుతుండాలి. బ్లాగర్ మిత్రులు ఈసారి ఏదైనా ప్లాన్ చేస్తున్నట్లైతే నన్ను తప్పక పిలుస్తారని ఆశిస్తున్నాను. 

Blogging is the art of turning your silent thoughts into timeless footprints.

- మనోహర్ చిమ్మని 

ఆకాశవాణి, కర్నూలు ఎఫ్ ఎం...


చిన్నప్పటినుంచే నాకు బాగా చదివే అలవాటుండేది. అదొక్కటే అప్పట్లో నాకున్న ఇష్టం, ఎడిక్షన్. 

తర్వాత ఇంకో రెండు మూడు ఇలాంటి ఇష్టాలు, ఎడిక్షన్లు యాడ్ అయ్యాయి...  

చందమామ, బాలమిత్ర, సోవియట్ ల్యాండ్, స్పుత్నిక్, సాక్షి వ్యాసాలు, విశ్వనాథ, బుచ్చిబాబు, చలం, లత సాహిత్యం, యధ్ధనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, కొమ్మూరి వేణుగోపాలరావు, ఆర్కే నారాయణ్, వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి రంగాచార్య వంటివారి రచనలు ఎంత బాగా చదివేవాన్నో... విశ్వప్రసాద్, మధుబాబుల డిటెక్టివ్‌లు కూడా అంతే బాగా చదివేవాన్ని. 

రమణి, రసికప్రియ, కాగడా, విజయచిత్ర, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ, స్క్రీన్ పత్రికలు కూడా వదల్లేదు.
    
దాదాపు వీటన్నిటికి పూర్తి వ్యతిరేక ధృవం అయిన కమ్యూనిస్ట్ సాహిత్యం, రష్యన్ సాహిత్యం, అరుణతార, సృజన పత్రికలు కూడా రెగ్యులర్‌గా చదివేవాణ్ణి. దీని ప్రభావమే నా మీద ఎక్కువగా ఉండి తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీలో చేరినప్పుడు నేను ఆర్ యస్ యు (రాడికల్ స్టుడెంట్స్ యూనియన్) వైపు ఉండటానికి కారణమైంది. 

ఓయూలో పీజీలో చేరడానికి ముందు నేను ఒక మూడేళ్ళపాటు హెచ్ ఎం టి లో మెషినిస్ట్‌గా పని చేశాను. అప్పుడు - సీతాఫల్ మండి నుంచి హెచ్ ఎం టి దాకా కంపెనీ బస్‌లో వెళ్లే ఆ 45 నిమిషాల సమయంలో, బస్ ఎక్కగానే నిద్రపోకుండా, ఇంగ్లిష్ నవలలు చదవడం నాకు బాగా అలవాటయ్యింది.
  
అప్పట్లో సీతాఫల్ మండి, తార్నాకాల్లో ఇంగ్లిష్ నవలలు అద్దెకిచ్చే షాపులుండేవి. రోజూ ఒకే సమయానికి వెళ్ళి, అద్దెకు నవల్స్ తెచ్చుకొని చదవటం అప్పట్లో అదొక క్రేజ్.  
  
సిడ్నీ షెల్డాన్, హెరాల్డ్ రాబిన్స్, ఫ్రెడ్రిక్ ఫోర్సైత్, జెఫ్రీ ఆర్చర్‌ల ఫిక్షన్ బుక్స్ దాదాపు అన్నీ నేను చదివాను అన్న విషయం ఇప్పుడు గుర్తు చేసుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది.
 
తర్వాత ఒక రెండేళ్ళు... నా ఇంకో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం... నవోదయ విద్యాలయ (గుంటూరు) లో పనిచేశాను. కాని, అది రెసిడెన్షియల్ సెటప్ కాబట్టి ఎక్కువగా చదివే అవకాశం అక్కడ నాకు ఉండేది కాదు. 

అక్కడి కొలీగ్స్, స్టుడెంట్స్, పరిచయాలు, ఏదో ఓ పని, లైబ్రరీ క్లాసులు, సాయంత్రం మద్దిరాల వాగులో ఫిషింగ్... అదంతా వేరే ఇంకో అద్భుత జ్ఞాపకం. 
  
కట్ చేస్తే - 

వీటన్నిటికి దూరంగా... అప్పటివరకు నాకు తెలియని-లేదా- నేను పట్టించుకోని ప్రపంచ సాహిత్యంతో, ప్రపంచస్థాయి నో-హిపోక్రసీ సీరియస్ సాహిత్యంతో నాకు బాగా పరిచయమైంది ఆలిండియారేడియో లైబ్రరీలో!

నా మూడో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఆలిండియా రేడియో, కర్నూలు ఎఫ్ ఎం లో నేను దాదాపు ఒక పదేళ్ళు పనిచేశాను. ఆ టెన్-టూ-ఫైవ్ ఉద్యోగంలో, నాకు జస్ట్ ఒక రెండు మూడు గంటలకంటే అసలు పని ఉండేది కాదు. మిగిలిన టైమంతా లైబ్రరీలోని పుస్తకాలతో గడిపేవాణ్ణి. 

షేక్స్‌పియర్, విక్టర్ హ్యూగో, దస్తయేవ్‌స్కీ, మిల్టన్, జేన్ ఆస్టిన్, జేమ్స్ జాయ్స్, జార్జ్ ఆర్వేల్, నీషే, మిలన్ కుందేరా, కుశ్వంత్ సింగ్, సాల్మన్ రష్దీ, అగాథా క్రిస్టీ, అరుంధతీ రాయ్, నాన్సీ ఫ్రైడే, శోభా డే, డానియెల్ స్టీల్, మారియో పుజో, పావ్‌లో కోయిల్యూ, గోర్కీ, పవుస్తోవ్‌స్కీ, మార్క్ ట్వేన్, బెర్నార్డ్ షా, ఆల్బర్ట్ కామస్, ఐన్ రాండ్, రారా, కొకు, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, తిలక్, పాలగుమ్మి పద్మరాజు, ఆరుద్ర, డాక్టర్ సినారె, తాపీ ధర్మారావు వంటి ఎంతో మంది రచనల్ని నేను కర్నూల్లోనే చదివాను.

నా జీవితం మొత్తంలో నేను ఎక్కువగా పుస్తకాలను చదివింది కూడా కర్నూలు ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నప్పుడే. 

థాంక్స్ టూ ఎస్ పి గోవర్ధన్ గారు... అప్పటి మా స్టేషన్ డైరెక్టర్... ఆయనకు కూడా బాగా చదివే అలవాటుండేది. వొరేషియస్ రీడర్! దాదాపు ప్రతి రెండు నెలలకొకసారి మా లైబ్రరీకి కొత్త బుక్స్ ఆర్డర్ పెడుతుండేవారు.

గోవర్ధన్ గారు నాకు ఎప్పుడూ "ఇది చదువు, అది చదువు" అని అసలేం సజెస్ట్ చేసేవాడు కాదు. కాని, ఆయన పెట్టే పుస్తకాల ఆర్డర్‌లో మాత్రం నా టేస్టును బట్టి కూడా బుక్స్ బాగానే కనిపించేవి. 

అప్పట్లో సికింద్రాబాద్ "బుక్ సెలక్షన్ సెంటర్" నుంచి మాకు రెగ్యులర్‌గా "న్యూ అరైవల్స్" క్యాటలాగ్స్ వచ్చేవి. మా సర్ నన్ను కూడా సెలక్ట్ చెయ్యమనేవారు. ఇంకేముంది... పండగే!  
స్వయంగా నేనే ఎన్ని బుక్స్ సెలక్టు చేశానో, ఎన్ని చదివానో చెప్పలేను.   

అప్పటి మా ఫార్మ్ రేడియో ఆఫీసర్ లక్ష్మి రెడ్డి గారు, మా ఎనౌన్సర్ శ్యామసుందర శాస్త్రి, స్టెనోగ్రాఫర్ లక్ష్మి కూడా... అప్పుడప్పుడూ, వారి ఫ్రీ టైమ్‌లో, ఏదో ఒక పుస్తకం చదువుతుండేవారు. 

గాడ్‌ఫాదర్ నవల్లోని క్యారెక్తర్స్ గురించి శాస్త్రి బాగా చర్చించేవాడు నాతో. 
 
ఇంజినీరింగ్ అసిస్టెంట్ మిత్రుడు అపోలిన్ డిసౌజా మాతృభాష కొంకణి. మంగళూరు నేటివ్ కాబట్టి సహజంగానే అతనికి కన్నడ కూడా తెలుసు. కన్నడ లిపి, తెలుగు లిపి చాలా దగ్గరగా ఉంటాయి. తెలుగు లిపికి సంబంధించి డిసౌజాకు కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్పాను. అంతే. తన మాతృభాష తెలుగు కాకపోయినా, తెలుగు నేర్చుకొని, దాదాపు లైబ్రరీలో ఉన్న పాపులర్ తెలుగు నవల్స్ అన్నీ చదివేశాడు! 

ఇక రాయడం విషయానికొస్తే - 

యూనివర్సిటీలో స్టుడెంట్‌గా ఉన్నప్పుడే నేను రాయడం ప్రారంభించాను. బాగా అలవాటయ్యింది కూడా క్యాంపస్‌లోనే. నేను రాసినవి న్యూస్‌పేపర్లు, మ్యాగజైన్స్‌లో అచ్చయ్యేవి. 150, 200, 250... పారితోషికం మనీయార్డర్స్ రూపంలో వచ్చేది.

అయితే - కథలు రాయడం సీరియస్‌గా ప్రారంభించిందీ, ఎక్కువగా రాసిందీ కూడా నేను కర్నూలు ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నప్పుడే!
   
ఆ సమయంలోనే నేను రాసిన ఒక కథ పబ్లిష్ అయినప్పుడు, అది అన్నలకు కోపం తెప్పించి, ఒక విరసం రచయిత ద్వారా నాకు మైల్డ్‌గా వార్నింగ్ పంపించేదాకా వచ్చింది. 

ఆంధ్రభూమిలో పబ్లిష్ అయిన నా ఇంకో కథ... నాకు మద్రాస్ నుంచి కాల్ చేయించి, సినిమారంగానికి కనెక్ట్ చేసింది. 

కర్నూల్ ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నప్పుడే నేను "సినిమా స్క్రిప్టు రచనాశిల్పం" పుస్తం రాశాను. దానికి ప్రభుత్వం నంది అవార్డు ప్రకటించింది కూడా నేను అక్కడ ఉన్నప్పుడే.  
     
కర్నూలు ఎఫ్ ఎం లో పనిచేస్తున్నప్పుడు నేను కొన్ని ఫీచర్స్, నాటికలు కూడా రాశాను. ప్రసారం అయ్యాయి.  బహుశా ఆ స్పూల్ టేప్స్ ఇంకా అక్కడి టేప్స్ లైబ్రరీలో ఉండే ఉంటాయి. 

ఆమధ్య రెండుమూడుసార్లు నేను బెంగుళూరు నుంచి హైద్రాబాద్‌కు కార్లో వస్తున్నప్పుడు కొన్ని గంటలు కర్నూల్లో ఆగాను. అప్పుడు నేనున్న క్రిష్ణారెడ్డి నగర్‌కు వెళ్ళి, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అప్పటి మా నైబర్స్‌ను కలిశాను. చలపతి దాబాకు వెళ్ళాను. అదొక గొప్ప అనుభూతి.   

మా కర్నూలు ఎఫ్ ఎం రేడియో స్టేషన్‌కు కూడా వెళ్లాలనుకున్నాను కాని, కుదర్లేదు. 

నేను పనిచేసిన కర్నూలు ఆలిండియా రేడియో స్టేషన్‌ను మళ్ళీ ఒకసారి తనివితీరా చూడ్డం కోసమే, ఈసారి స్పెషల్‌గా, ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోవాలని చాలా ఏళ్ళుగా అనుకొంటున్నాను. నా అప్పటి కొలీగ్ మిత్రులు... మా  మోహన్ రెడ్డి, కామేశ్‌తో కలిసి అదెప్పుడో ఒకసారి త్వరలోనే జరుగుతుంది.  

మర్చిపోయాను... నేను కర్నూలు రేడియోలో పనిచేస్తున్నప్పుడే మా ఎనౌన్సర్ శ్యామసుందర శాస్త్రితో కలిసి, ఒకసారి యండమూరి వీరేంద్రనాథ్‌ను మా స్టుడియోలో ఇంటర్వ్యూ చేశాను. బహుశా ఆ స్పూల్ టేప్ కూడా ఇప్పటికీ ఉండే ఉంటుందక్కడ. 

ఇలాంటి ఎన్నో మంచి జ్ఞాపకాలనిచ్చిన కర్నూలు ఆలిండియా రేడియో ఎఫ్ ఎం లో నేను పనిచేసిన రోజులను మళ్ళీ గుర్తుచేసుకోడానికి కారణమైన ఇవాళ్టి "వరల్డ్ రేడియో డే" కి థాంక్స్ చెప్పకుండా ఎలా ఉండగలను? 

అప్పటి నా రేడియో కొలీగ్స్‌కు, ఇప్పుడు రేడియోలో పనిచేస్తున్నవారందరికీ... వరల్డ్ రేడియో డే సందర్భంగా నా హార్దిక శుభాకాంక్షలు!

- మనోహర్ చిమ్మని 
        
(#WorldRadioDay సందర్భంగా 2022లో నేను రాసిన బ్లాగ్ పోస్ట్, స్వల్ప మార్పులతో!)   

Be Love, Not Just In Love


“It’s not a question of being in love with someone. It’s a question of being love.”
— Osho

Valentine’s Day is not just about finding the right person. It is about becoming the right presence.

Being in love is beautiful.
But being love is powerful.

When you are love — in your thoughts, in your words, in your silence — every relationship becomes sacred. Not because of who stands beside you, but because of what flows from within you.

This Valentine’s Day, don’t just celebrate a person. Celebrate the love you are capable of being.

Tell me — are you looking for love, or are you becoming it? 

- Manohar Chimmani 

Wednesday, 11 February 2026

మనకు తెలియకుండా మన చుట్టూనే ఎన్నెన్నో...


ఇవ్వాళ సాయంత్రం ఒక మిత్రున్ని కలిశాను.

చాలా రోజుల తర్వాత ఇంకా చాలా ముఖ్యమైన మీటింగ్. 

కష్టాలు, కన్నీళ్ళు, టెన్షన్లు కాసేపు ఒకరికొకరం చెప్పుకొన్నాం. చెరొక కపచీనో ముందు పెట్టుకొని ఒక రెండు గంటలపాటు మాట్లాడుకున్నాం.

కట్ చేస్తే -

కొన్ని విషయాలు వింటుంటే అసలు మనం ఎక్కడున్నాం అని వొళ్ళు గగుర్పొడుస్తుంది భయంతో. మనకు తెలియకుండా మన చుట్టూనే ఎన్నెన్నో జరుగుతున్నాయి.  

సినిమాల్లో మనం చూస్తున్నది, చూపిస్తున్నది చాలా చాలా తక్కువ.  

We live in society with open eyes, yet move through it blind — seeing everything, understanding nothing.

- మనోహర్ చిమ్మని      

"డబ్బుదేముంది?" అని నీతో ఎవరైనా అన్నారా...


సక్సెస్, మనీ ఉన్నచోటే గుర్తింపు ఉంటుంది, విలువ ఉంటుంది.  

మనీ మాట్లాడుతున్నప్పుడు ఏ గ్రామర్ తప్పు కనిపించదు. 

నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు కాదు. 
నాకు ఇన్ని తెలుసు, అన్ని తెలుసు కాదు. 
నేను ఇంత చదివాను, అంత చదివాను కూడా కాదు.

నీకు మనీ ఉందా? 
సక్సెస్ ఉందా? 

ఉందా... ఓకే. 
లేదా... చల్ హట్! 

కట్ చేస్తే -  

డబ్బు చాలా ముఖ్యం. అది ఉంటేనే మనకు మర్యాద ఉంటుంది. 

దీనికి వ్యతిరేకంగా, "డబ్బుదేముంది?" అని నీతో ఎవరైనా అన్నారా... వెంటనే అక్కన్నించి పారిపో. 

పచ్చి అబద్ధం.  

ఎందుకంటే, డబ్బు సంపాదించినవాడెప్పుడూ ఆ మాట మాట్లాడడు. సంపాదించలేనివాడే ఈ మాట మాట్లాడుతాడు. లేదా, బాగా సంపాదించి, మనుషుల మనసులతో ఆడుకొంటూ టైమ్ పాస్ చేసేవాడే అలా మాట్లాడతాడు.

దురదృష్టవశాత్తూ, ఇలాంటి మాటలు, ఇలాంటి సాంగత్యం నువ్వు వెళ్ళాల్సిన గమ్యం వైపు నిన్ను తీసుకెళ్ళలేవు. 

సక్సెస్, మనీ ఉన్నచోటే గుర్తింపు ఉంటుంది, విలువ ఉంటుంది.   

99% శాతం మందికి ఇది నచ్చదు. హిపోక్రసీ మాస్కు వేసుకొని ఇది తప్పు అంటారు. నిజం కాదు అంటారు. కాని, ఇదే నిజం.

Money is a major area you absolutely must dominate — especially if you’re in cinema or any creative field.

- మనోహర్ చిమ్మని   

Tuesday, 10 February 2026

Comfort Is Killing You


According to a widely cited Pew research insight, a large majority of people live very close to where they grew up. Familiar streets, known faces, predictable routines—comfort quietly becomes a lifetime default.

But growth rarely happens in familiar places.

The most defining moves of life often begin the moment we step away from what feels safe. New cities challenge our identity, stretch our skills, and strip away excuses.

Comfort soothes—but it also limits. Obsession, ambition, and reinvention demand friction.

This truth isn’t limited to the U.S. It applies everywhere. Across cultures, countries, and careers, staying too close to comfort keeps potential dormant.

If you want to become dangerous—in thought, creativity, or courage—change your geography.

Sometimes, the fastest way to find yourself is to leave home.

Where did you grow up—and where is life calling you next? 

- Manohar Chimmani 

"సిండికేట్" సినిమా !!


ఇది ఆర్జీవీ ప్లాన్ చేస్తున్న "సిండికేట్" కాదు...  

ఫిలిం ఇండస్ట్రీలో ఒంటరిపోరాటాలకంటే, ఒక నలుగురైదుగురు లైక్‌మైండెడ్ కలిసి చేసే సినిమాలే బాగా సక్సెస్ అవుతాయని చెప్పే పోస్టు.   

ఒక్క సినిమాలోనే కాదు, ఏ ఫీల్డులో అయినా సరే, "సిండికేట్" అంటేనే సక్సెస్.  

ఒకటే బుర్ర కంటే, నాలుగు బుర్రలు యాక్టివ్‌గా పనిచేస్తూ, పవర్‌ఫుల్ నిర్ణయాలు తీసుకోగలుగుతాయి.  

ఇప్పుడు హేమాహేమీలుగా టాప్ పొజిషన్లలో ఉన్న ప్రొడ్యూసర్లలో ఎక్కువ మంది ప్రొడ్యూసర్లు ప్రారంభంలో ఇలా ఒక సిండికేట్‌గా ఏర్పడి సినిమాలు చేసినవాళ్ళే.

వీరికి ఒంటరిగా చేసే సత్తా లేక కాదు. అదంతే. ఒక పెద్ద పనిని ఒక్కరే చేయటం కంటే, నలుగురు కలిసిచేయడం అన్నివిధాలా సులభంగా ఉంటుంది. 

ఇప్పటికీ మీరు చూడండి... దాదాపు ప్రతిసినిమాలో మెయిన్‌గా ఒక ప్రొడ్యూసర్ ఉన్నా కూడా, దాని సమర్పణ ఒకరు చేస్తారు. నిర్వహణ ఇంకొకరుంటారు. సహనిర్మాత ఇంకొకరుంటారు. వీళ్లంతా ఆ సినిమా నిర్మాణంలో భాగస్వాములే అన్నమాట. 

కట్ చేస్తే -

మంచి కంటెంట్‌తో ఒక చిన్న బడ్జెట్ సినిమా చెయ్యాలంటే ఒక 2 కోట్లు అవుతుందనుకుంటే, దాన్ని ఒక్కరే చేయనవసరం లేదు. ముగ్గురో నలుగురో లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్లు కలిసిచెయ్యొచ్చు. రిస్క్-ఫ్రీ ప్రాజెక్టుతో అత్యధికస్థాయిలో లాభాలు పొందొచ్చు.  

నిజంగా ఈ ఫీల్డువైపు ప్యాషన్ ఒక్కటే కాకుండా, ఒక బిజినెస్‌గా కూడా ఆసక్తి ఉన్న ఇన్వెస్టర్లు ఆలోచించవచ్చు. "సిండికేట్" కావచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ మీడియేటర్స్ కూడా ఈ "సిండికేట్" ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి ఆలోచించవచ్చు. 

Want to know more? DM me.

- మనోహర్ చిమ్మని   

Monday, 9 February 2026

కొన్ని విషయాల్లో లాజిక్కుల జోలికి పోవడం వృధా!


"Religion is a man made thing" అన్న మాటను నేను బాగా నమ్ముతాను. దేవుడు అన్న కాన్‌సెప్ట్ అందులో భాగమే.

పై వాక్యాన్ని ఎంత బాగా నమ్ముతానో, అంత కంటే బాగా నేను నమ్మే నిజం ఇంకోటి కూడా ఉంది.

అది... మనకు తెలియని ఏదో ఒక "శక్తి".

ఆ శక్తి లేకుండా మనమంతా లేము. మన చుట్టూ ఉన్న ఈ అద్భుతమైన ప్రకృతీ లేదు.

ఆ శక్తి రూపం మనకు తెలియదు. ఆ శక్తి ఉద్దేశ్యం ఏంటో కూడా మనకు తెలియదు.

ఎవరికి వారు ఏదో ఒక పేరు పెట్టుకొని ఆ శక్తిని నమ్మడంలో తప్పేమీ లేదు. ఇంకొకరిని ఇబ్బంది పెట్టనంతవరకూ నిజంగా అదొక మంచి డిసిప్లిన్.

నేను కన్వీనియెంట్‌గా ఫీలయ్యి, నాకు నచ్చిన ఒక పేరుతో, ఆ శక్తిని నేనూ నమ్ముతున్నాను. అయితే, ఈ పేరు విషయంలో అప్పుడప్పుడూ నేను కూడా పార్టీలు మారుతుంటాను. అది వేరే విషయం. అది నా కంఫర్ట్.  

ఒక్క దేవుడనే కాదు... ఏ విషయంలో ఐనా అంతే. 
మనం కన్వీనియెంట్‌గా ఫీలైన విషయాలతోనే మనం కనెక్ట్ అవుతాం. మనుషుల విషయంలో కూడా అంతే. మనం కంఫర్ట్‌గా ఫీలైన వ్యక్తులే ఎక్కువగా మన జీవితంలో ఉంటారు. 

ఇదంతా ఎలా ఉన్నా... శతాబ్దాలుగా చాలా మంది మహామహులైన చక్రవర్తులు, రాజులు, రచయితలు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, మేధావులమనుకున్నవారి విషయంలో నేను చదివి తెలుసుకొన్నదీ, ఇటీవలికాలంలో వ్యక్తిగతంగా నేను గమనించినదీ అయిన గొప్ప నిజం కూడా ఇంకోటుంది...   

అసలు దేవుడు అన్న కాన్‌సెప్ట్‌నే నమ్మకుండా, జీవిత పర్యంతం విశృంఖలంగా గడిపిన వీరంతా చివరికి ఏదో ఒక ఆధ్యాత్మిక తత్వానికి లొంగిపోయారు. ఆశ్రమాల్లో చేరిపోయారు.   

అంటే - అందులో ఏదో ఆనందమో, ఓదార్పో, ఇంకేదో మనకు అవసరమైన పాజిటివ్ ఫీలింగో ఉంది. 
 
తప్పకుండా ఉంది. 

సో, మళ్లీ మనం కొత్తగా ఒక చక్రాన్ని కనిపెట్టాల్సిన అవసరం లేదు. అనుభవం మీద అన్నీ మనకే తెలుస్తాయి. 

"నాకే అన్నీ తెలుసు" అని ఎగిరెగిరిపడేవాళ్లకి ఇంకొంచెం ఎక్కువగా తెలుస్తాయి. మరింత లోతైన ఆధ్యాత్మికస్థాయికి వెళతారు.    

అందుకే ఈ విషయంలో అనవసరంగా లాజిక్కుల జోలికి పోవడం వృధా. ఆ సమయాన్ని మరోవిధంగా సద్వినియోగం చేసుకోవడం బెటర్... అని నేననుకుంటున్నాను... 

Logic doesn’t always belong to spirituality.
Nor to cinema.
Some things are meant to be felt.
Accept. Enjoy. Live—
because life is one.

- మనోహర్ చిమ్మని   

Saturday, 7 February 2026

బ్లాగింగ్ నిజంగా అదృశ్యమైపోతోందా?


సోషల్ మీడియా వచ్చాక ఒక్కొక్కటిగా కొన్ని ఫేడవుట్ అయిపోతున్నాయి. వాటిల్లో మొదటిది వెబ్‌సైట్. రెండోది బ్లాగింగ్. 

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 600 మిలియన్ల బ్లాగ్స్ ఉన్నాయి. కాని, అంతకుముందు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు వీటికి లేదు. 

కేవలం కొంతమంది మాత్రం బ్లాగింగ్‌ను మరింత స్పెషలైజ్డ్‌గా తీర్చిదిద్దుతున్నారు. సోషల్‌మీడియా నుంచి బ్లాగ్‌లకు రప్పించుకుంటున్నారు. 

కట్ చేస్తే -

2012 ఆగస్టులో అనుకోకుండా ప్రారంభమైన నా ఈ బ్లాగింగ్ జర్నీ నాకెంతో ఇష్టం.  

నా స్ట్రెస్‌బస్టర్. నా థెరపీ. నా ధ్యానం. నా యోగా. 

"ఇది రాయటం అవసరమా" అని అనిపించిన విషయాలు కూడా ఎన్నో రాశాను నా బ్లాగులో.

అది వేరే విషయం. 

"ఇది పోస్ట్ చేస్తే అందరూ నన్ను ఏమనుకుంటారో అన్న సంఘర్షణ లేకుండా నా బ్లాగులో నేను ఒక్క పోస్ట్ కూడా పోస్టు చెయ్యలేదు" అంటాడు జేమ్స్ ఆల్టుచర్.

సో, ఈ విషయంలో నాకో సోపతి ఉన్నాడనుకున్నాను. 

బైదివే, ఆల్టుచర్ 'ఎక్స్‌'లో నా ఫాలోయర్ కూడా!

కట్ చేస్తే - 

బ్లాగింగ్ మానెయ్యాలని కనీసం ఒక డజన్ సార్లు అనుకున్నాను. కాని, మానుకోలేకపోయాను. తర్వాత నేనే అనుకున్నాను... ఎందుకు మానెయ్యాలి అని. 

అదేంటో గాని, నేను విచ్చలవిడిగా బ్లాగింగ్ చెయ్యటం తగ్గించాక కూడా ఈ మధ్య నా బ్లాగును చాలామంది చదువుతున్నారు! 

- మనోహర్ చిమ్మని  

Thursday, 5 February 2026

చిన్న బడ్జెట్ సినిమాలే రిస్క్-ఫ్రీ !!


100CR Mission. 

సుమారు 2 నుంచి 5 కోట్లు బడ్జెట్ అంటే చిన్న బడ్జెట్ అన్నమాట. ఇప్పుడు ఈ చిన్న బడ్జెట్ సినిమాలే రిస్క్-ఫ్రీ.

మీరు గమనించారా... దాదాపు ప్రతి పెద్ద ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలు కూడా రెగ్యులర్‌గా చేస్తోందని? 

ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే, ఇంకోవైపు చిన్న బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. లేదంటే, బయటి నుంచి ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ చేసిన చిన్న బడ్జెట్ సినిమాల్ని, పెద్ద నిర్మాతలు తీసుకొని, వాళ్ళ బ్యానర్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. 

ఎందుకు?

రొటేషన్. 

భారీ సినిమాలు ఎప్పుడు పూర్తయ్యి, ఎప్పుడు రిలీజ్ అవుతాయో అస్పష్టం. ఈలోగా చిన్న రేంజ్‌లో అయినా మనీ రొటేషన్ కావాలంటే చిన్న సినిమాలే కాపాడతాయి. 

భారీ బడ్జెట్ సినిమాలు గ్యాంబ్లింగ్ అయితే,
చిన్న బడ్జెట్ సినిమాలు రిస్క్-ఫ్రీ.

భారీ బడ్జెట్ సినిమాల్లో పోతే పదులు-వందల కోట్లు పోతాయి. చిన్న సినిమాలు ఫ్లాప్ అయినా, ఓటీటీలు ఇతర రైట్స్ ద్వారా మినిమమ్ గ్యారంటీ ఉంటుంది. ఎంతో కొంత లాభం కూడా తప్పకుండా వస్తుంది. ఎందుకంటే, బడ్జెట్ తక్కువ కాబట్టి.   

ఇప్పుడు నేను ఈ ఒక్క టార్గెట్‌తోనే ముందుకు వెళ్తున్నాను... చిన్న బడ్జెట్ సినిమాతోనే 100 కోట్ల హిట్ కొట్టాలని.

And... This is my 100CR Mission.

- మనోహర్ చిమ్మని    

Wednesday, 4 February 2026

Ayn Rand: From Hollywood Scripts to the Philosophy of the Self


Ayn Rand is often remembered as the fierce philosopher of Objectivism, but before The Fountainhead shook the literary world in 1943, she was already shaping stories in a different arena—cinema and theatre. 

She worked as a screenwriter in Hollywood and even had a play produced on Broadway in 1935–36.

Storytelling was not a detour for Rand. It was her laboratory.

Objectivism—her philosophy of reason, individualism, and creative self-interest—fits cinema like a glove. Films are born from a singular vision fighting odds: producers, markets, trends, fear. Rand believed that the creator must not dilute their truth to please the crowd. In that sense, every filmmaker faces the same choice her heroes did… compromise or conviction.

For artists in films, Rand’s life sends a powerful message. Cinema is not just entertainment. It is a moral statement. A director, writer, or actor who owns their voice, takes responsibility for their choices, and refuses to apologize for ambition is already practicing Objectivism—whether they name it or not.

On her 121st birthday (2nd Feb), Ayn Rand reminds us of this simple, uncomfortable truth... Great films, like great lives, are made by individuals who dare to stand alone.

- Manohar Chimmani 

క్రియేటివిటీపై రాజకీయాల కబ్జా!


ఆ అవార్డు పేరే నాకు నచ్చ లేదు. అతను సినిమాలకు చేసిన సేవ కూడా ఏం లేదు. ఇంక చాలావుంది చెప్పాలంటే కాని, వద్దు.    

కట్ చేస్తే -  

నాకెలాగూ ఆల్రెడీ ఓ నంది అవార్డు ఉంది.

బై మిస్టేక్, మళ్ళీ ఏదైనా అవార్డు గివార్డు తీసుకోవాలనుకుంటే ఫిలింఫేర్, సైమా, ఐఫా లాంటి వాటికోసం పోటీపడతా. 

ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయాను. సినిమాలే నా పూర్తి ఫోకస్. కాబట్టి, బాజాప్త కర్చీఫ్ వేసినట్టే. తప్పకుండా వీటిలో కనీసం ఒక్కటైనా తీసుకుంటా. 

అంతే తప్ప, ఈ లోకల్ అవార్డ్స్ లొల్లి నాకు అవసరం లేదు. ఈ రాజకీయాలు కూడా అంత అవసరం లేదు. 

- మనోహర్ చిమ్మని 

Why Playing Safe Kills Cinema


“I want to risk hitting my head on the ceiling of my talent. I want to really test it out and say, ‘Okay, you’re not that good. You just reached the level here.’ I don’t ever want to fail, but I want to risk failure every time out of the gate.”

Quentin Tarantino

This quote cuts straight to the heart of cinema — and to the soul of every serious filmmaker.

Most people never discover the ceiling of their talent. Not because they lack ability, but because they never jump high enough to hit it. They stay in the safe zone, repeating what works, choosing comfort over curiosity. Cinema, however, doesn’t grow in safe spaces. It grows where ego is bruised, where experiments fail, and where courage is tested.

Tarantino’s mindset reminds us that real artists don’t fear limits — they chase them. They want to know how far they can go, even if the answer hurts. Especially if it hurts. Because that pain reveals truth. And truth is the raw material of powerful cinema.

For a film director, risking failure is not optional — it’s a professional requirement. Every ambitious script, every unconventional shot, every bold casting choice is a gamble. Some will fall flat. Some will confuse. Some will be rejected. But each attempt stretches the filmmaker’s capacity. That’s how voice is discovered. That’s how originality is born.

Cinema doesn’t reward perfection. It rewards those who dare to find their edges.

So aim high enough to hit your limits. Let failure teach you where your real strength lies. Each risk sharpens your instinct, deepens your craft, and brings you closer to your most authentic work.

In the long run, the only real failure is never testing your talent at all.

If you’re a writer or filmmaker, take one creative risk this week — something that scares you a little. Drop a comment saying “I’m risking it” and let’s move forward together.

- Manohar Chimmani 

Monday, 2 February 2026

The Best Way to Stay Poor is — Start Tomorrow.


Tomorrow is the most dangerous word in a filmmaker’s life.

It feels harmless, even responsible. But in reality, it quietly kills scripts, delays shoots, postpones learning, and turns dreams into excuses.

In the cine field, talent is everywhere. What’s rare is action today. 
Many writers keep “polishing” scripts forever. Many directors wait for the perfect producer, perfect budget, or perfect timing. Meanwhile, someone less talented but more decisive starts now — and moves ahead.

For a film director especially, tomorrow is expensive. 
Every delayed film, every postponed pitch, every unrealized experiment is lost experience.

Cinema doesn’t reward intention. It rewards execution.

The industry respects people who are already in motion, not those who are “planning to start.”

Starting today may mean a small film, a rough cut, a low-budget attempt, or even a failed project. But that failure pays dividends — skills sharpen, networks grow, confidence builds. That’s how directors move from survival to sustainability, and from sustainability to success.

So remember... 
You don’t stay poor because you lack money. 
You stay poor because you keep saying “I’ll start tomorrow.”

If you’re a writer or filmmaker, start something today — write one scene, shoot one frame, make one call. 

Comment “START NOW” if you’re done waiting for tomorrow.

- Manohar Chimmani 

గుమ్మడికాయ అందరూ కొట్టలేరు!


సినిమా షూటింగ్ ప్రారంభించిన రోజు పూజ చేసి కొబ్బరికాయలు కొడతారు. షూటింగ్ పూర్తయిన రోజు గుమ్మడికాయ కొడతారు. ఫిలిం ఇండస్ట్రీలో ఇదొక సాంప్రదాయం. ఎప్పటినుంచో ఉంది. 

ప్రతి సంవత్సరం వందల సినిమాలు కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారు. కాని, వాటిలో ఒక 50 శాతం సినిమాలు మాత్రమే షూటింగ్ పూర్తిచేసుకొంటాయి. గుమ్మడికాయ కొడతారు. 

గుమ్మడికాయ కొట్టిన రోజు టీమ్‌లో చాలామందికి ఎమోషనల్‌గా ఉంటుంది. ముఖ్యంగా "ఈ సినిమా నాది" అని భావించినవారికి.

అప్పటివరకూ కలిసిపనిచేసి, "ఇంక రేపటి నుంచి షూటింగ్ ఉండదు, కలవము" అనుకున్నప్పుడు నిజంగానే ఎవరికైనా ఎమోషనల్‌గా ఉంటుంది. 

టీమ్‌లో ప్రతి ఒక్కరూ ప్రొడ్యూసర్, డైరెక్టర్‌ల దగ్గరికొచ్చి "కంగ్రాట్స్" చెప్తూ షేక్ హాండ్ ఇస్తారు. కొందరు హగ్ చేసుకుంటారు. మాటలు కరువైపోతాయి.  

భారీ బడ్జెట్ ప్రాజెక్టులైనా, చిన్న సినిమాలైనా గుమ్మడికాయ కొట్టినరోజు అక్కడ ఈ ఎమోషనల్ సీన్ తప్పదు.    

ఇలా నా మొదటి రెండు సినిమాలప్పుడు జరిగింది. కొందరు ఆర్టిస్టులు అయితే ఏడ్చేశారు.

"అలా" సినిమా గుమ్మడికాయ కొట్టినరోజున మా హీరోయిన్ విదిశ శ్రీవాస్తవ, వాళ్ళ నాన్న (ఆర్మీ ఆఫీసర్) కూడా దాదాపు ఏడ్చేశారు.  

కట్ చేస్తే -

మొన్నీమధ్య మేం షూటింగ్ పూర్తిచేసిన రోడ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా "ఎర్రగులాబి" గుమ్మడికాయ కొట్టిన రోజు మాత్రం ఏ ఒక్కరిలోనూ ఇలాంటి ఎమోషనల్ ఫీలింగ్ నేను చూళ్ళేదు. 

దాదాపు అందరూ ఎప్పుడెప్పుడు ఈ తతంగం అయిపోతుందా, వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉన్నారు. ఈ ఈవెంట్ ప్రాముఖ్యం తెలిసిన కొంతమంది లైట్ మెన్, కెమెరా అసిస్టెంట్స్ లాంటి ఒకరిద్దరు టెక్నీషియన్స్ మాత్రం అదే మూడ్‌లో నాకు కనిపించారు. నాతో అదే ఫీలింగ్‌తో మాట్లాడారు.  

కట్ చేస్తే - 

ఆరోజు నా టీమ్‌లో ఒకే ఒక్కరి ప్రవర్తన మాత్రం నాకు చాలా విచిత్రంగా అనిపించింది.

కనీసం డైరెక్టర్‌కు షేక్ హాండ్ ఇవ్వలేదు. కారెక్కి వెళ్ళిపోతున్న ఇంకొకరికి షేక్ హాండ్ ఇచ్చి, బాయ్ చెప్పడానికి మాత్రం చాలా తపన పడ్డారా వ్యక్తి. 

ఎవరా వ్యక్తి అన్నది నా టీమ్‌లో దాదాపు అందరికీ తెలుసు. ఎందుకంటే, వాళ్ళే ఇదంతా అబ్జర్వ్ చేస్తూ నాకు చెప్పారు. నేనూ చూశాను. 

మార్పు మానవ సహజం కదా? కాని, అది మార్పా... లేదంటే, "ఇంకేముంది పనయిపోయింది కదా" అనుకొని ఆరోజు బయటపడ్డ ఒరిజినాలిటీనా?   

- మనోహర్ చిమ్మని  

సినిమా ఇప్పుడొక కార్పొరేట్ బిజినెస్


వందల కోట్లు పెట్టి తీసే భారీ బడ్జెట్ సినిమాలను పక్కనపెడితే, సినిమాల్లో ఇన్వెస్ట్ చేయడాన్ని గ్యాంబ్లింగ్ అనే రోజులు ఎప్పుడో పోయాయి. 

సినిమా ఇప్పుడొక కార్పొరేట్ బిజినెస్. 
అంతకంటే ఎక్కువ.
ఒక బిగ్ బిజినెస్. 

కార్పొరేట్ బిజినెస్‌లో డబ్బులే వస్తాయి. సినిమాల్లో డబ్బులతో పాటు ఓవర్‌నైట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఫేమ్ వస్తుంది. 

అదే స్థాయిలో పర్సనల్ కాంటాక్ట్స్, బిజినెస్ కాంటాక్ట్స్ రాత్రికిరాత్రే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. 

మీరు సినిమాలు చేస్తూ, ఈ "షో బిజినెస్"లో ఉన్న నేపథ్యంలో - ఈ ప్లాట్‌ఫామ్ ఆధారంగా, మీ ఇతర ఎన్నో బిజినెస్‌లకు సంబంధించిన భారీ ఆర్థిక లావాదేవీలు, అడ్జస్ట్‌మెంట్లు, ఇతర పెద్దపెద్ద పనులెన్నో మీకు అత్యంత సులభంగా అవుతాయి.             

కట్ చేస్తే -

సినిమా ప్రొడక్షన్, సినిమా ఫీల్డు, సెలెబ్రిటీ స్టేటస్ పట్ల ఆసక్తి ఉండి - సినిమాల్లో ఇన్వెస్ట్ చెయ్యాలనుకునే కొత్త ఇన్వెస్టర్లు, ప్రొడ్యూసర్స్‌కు ఇది సరైన సమయం. ఇప్పుడు మీరు ధైర్యంగా మీ మొదటి స్టెప్ వెయ్యొచ్చు. 

చిన్న స్థాయి బడ్జెట్‌తోనే ఒక పైలట్ ప్రాజెక్టులా, కొత్త ఆర్టిస్టులు-టెక్నీషియన్స్‌తో ఒక సినిమా చెయ్యొచ్చు. అన్నీ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్‌పీరియెన్స్‌తో స్టడీ చెయ్యచ్చు. మీరూహించని స్థాయిలో లాభాలు సాధించవచ్చు. 

ఓటీటీలు, మల్టిపుల్ లాంగ్వేజెస్ రైట్స్ వంటివి వచ్చాక, చిన్న బడ్జెట్ సినిమా ఇన్వెస్ట్‌మెంట్‌లో రిస్క్ ఫాక్టర్ అనేది దాదాపు పూర్తిగా అదృశ్యమైపోయింది.
 
మినిమమ్ టెన్-ఫోల్డ్ ప్రాఫిట్స్ ఒక్క చిన్న బడ్జెట్ సినిమాల్లోనే సాధ్యం.

- మనోహర్ చిమ్మని 

PS: మీకు సినిమాలు, సినీఫీల్డు ఇష్టమా? సినిమా బిజినెస్‌లోకి ప్రవేశించాలనుకుంటున్నారా? మీకు సినిమాల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసే ఆసక్తి ఉందా? ఇన్వెస్ట్ చేయించగలరా? వెంటనే నాకు DM చెయ్యండి.  

Sunday, 1 February 2026

మన కోసం కూడా మనం ఆలోచించుకోవాలి


నన్ను "మనూ" అని ప్రేమగా పిలిచే సాదిక్ ఇప్పుడు లేడు. 

సాదిక్ ఓయూలో నాకు సీనియర్. 

మేమిద్దరం కలిసినప్పుడల్లా కనీసం ఒక రెండుమూడు గంటలపాటు ఎన్నో విషయాల మీద చర్చించుకొనేవాళ్ళం. ఇలా మేం చర్చించుకున్నపుడల్లా నాకు కొన్ని విషయాలు కొత్తగా అర్థమయ్యేవి. జ్ఞానోదయం అయినట్టుగా ఫీలయ్యేవాణ్ణి.  

సాదిక్ చనిపోయినపుడు నేను అతన్ని చూడ్డానికి వెళ్ళలేకపోయాను. నాకెందుకో ఆ నిజం నచ్చలేదు. అబద్ధమయితే బాగుండుననిపించింది. 

అంతకుముందు కొన్నిరోజుల క్రితమే మేం దస్పల్లాలో కలిశాం. ఆ తర్వాత బహుశా ఒక వారంలోనే సాదిక్ మరణవార్త విన్నాను. 

కట్ చేస్తే -

ఇప్పుడు సాదిక్ గురించి ఈ బ్లాగ్ రాయడానికి ఒక కారణముంది.    

సాదిక్ రెండు విషయాల్లో నాకెప్పుడూ గుర్తుంటాడు. 

ఒకటి -
ఓ పదేళ్ళ క్రితం నేనొక రొమాంటిక్ హారర్ సినిమా చేస్తున్నప్పుడు, ఒక విషయంలో నేనే షాక్ అయ్యేంతగా అతని నిర్మొహమాటపు నిజాయితీ. అతని మాట తప్పని గుణం. ఇది నాజీవితంలో నేను ఎన్నటికీ మర్చిపోలేని విషయం.  

రెండోది -
ఆ తర్వాత కలిసినప్పుడు ఒకరోజు నాతో ఒక మాట అన్నాడు సాదిక్. 

"మనూ, నేనిప్పుడు ఒకరి మీద పెడుతున్న నా సమయంలో కేవలం ఒక పది శాతం సమయం నా మీద నేను పెట్టుకుంటే సీన్ వేరేలా ఉంటుంది" అన్నాడు సాదిక్. "నువ్వే చూస్తావుగా" అన్నాడు. 

అన్నట్టుగానే - కేవలం కొన్ని నెల్లల్లోనే సాదిక్ తను చెప్పింది చేసి చూపించాడు. 

ముందే నాకు చెప్పి, చేసి చూపించిన సాదిక్ నాకు ఈ విషయంలో పెద్ద ఇన్‌స్పిరేషన్.

ఈ విషయాన్ని నా అతిదగ్గరి మిత్రులు కొందరితో చాలాసార్లు షేర్ చేసుకున్నాను. ఇది కూడా నేను అసలు మర్చిపోలేని విషయం. 

ఇప్పుడు నేను సాదిక్ చెప్పిన ఆ సూత్రం పాటిస్తున్నాను.  

సమయం తిరిగిరాదు. మన కోసం కూడా మనం ఆలోచించుకోవాలి. అది తప్పేం కాదు. 

Love yourself like your life depends on it. 

- మనోహర్ చిమ్మని