Wednesday, 21 January 2026

సినిమా రిలీజైన 17 రోజులకే ఓటీటీలో వేసుకుంటాం !!


సాంకేతికంగా వస్తున్న ఎన్నెన్నో కొత్త మార్పులు ప్రేక్షకుల ఆలోచనా విధానాన్ని ఎప్పటికప్పుడు మార్చేస్తాయి.

కోవిడ్ తర్వాత, సినిమాల విషయంలో అసలు మనిషి జీవనశైలే చాలా మారిపోయింది. 

కట్ చేస్తే -

ఇక్కడ టాలీవుడ్‌లోనే కాదు, హాలీవుడ్‌లో కూడా ఏవో అరుదైన కొన్ని భారీ బడ్జెట్ విజువల్ వండర్ సినిమాలకు తప్ప, ఎవ్వరూ థియేటర్‌కు వెళ్ళి సినిమా చూడాలనుకోవటం లేదు. ఈ ధోరణి ఇంకా పెరిగిపోతుంది. 

భారీ సినిమాలు ఇక మీదట వర్కవుట్ కావు. 


ఎందుకంటే వీటికి రిస్క్ లేదు. హిట్ అయినా, ఫట్ అయినా పెద్ద ఫరక్ పడదు. ఓటీటీలో వచ్చే డబ్బు సరిపోతుంది. లాభాల్లో ఉంటారు. 

ఈ నేపథ్యంలో - అసలు ఇంకో అయిదారేళ్ళకంటే థియేటర్స్‌కు మనుగడ లేదు. 

"ప్రేక్షకులెవ్వరూ థియేటర్‌కు వెళ్ళి సినిమా చూడాలనుకోవడం లేదు" అని నెట్‌ఫ్లిక్స్ సీఈవో ఆల్రెడీ చెప్పాడు. అందుకే సినిమా రిలీజైన 17 రోజులకే ఓటీటీలో వేసుకుంటాం అని డీల్స్ చేసుకుంటున్నాడు. 

ఒప్పుకోక తప్పదు కదా? 

చిన్న సినిమాలవాళ్ళు కూడా ఒక రెండుమూడేళ్ళలో తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే. ఆల్రెడీ కొందరు ఆ పనిచేసేసి, బిల్డర్స్ అయిపోతున్నారు!


- మనోహర్ చిమ్మని 

1 comment:

  1. ఐతే, మరొక మూడు నాలుగు సంవత్సరాల తరువాత సినీమాలు తీసేవారే ఉండరంటారా? భారీసినీమాలు వర్కౌట్ కావు కాబట్టి ఎంతపెద్ధ నిర్మాతలైనా వాటిజోలికి పోరు. ఇక చిన్న సినిమాలవాళ్ళు కూడా ఒక రెండుమూడేళ్ళలో తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే. అందుచేత సినీమాలు ఎవరూ తీయరు.థియేటర్లూ ఓటీటీల పుణ్యమా అని మూతపడతాయి. సో. సినీమాలూ ఉండవూ వాటికోసం థియేటర్లూ ఉండవు. బాగుంది. బాగుంది.

    అవును కానీ ఆ ఓటీటీలు మాత్రం చూపటానికి సినీమాలే లేకపోతే అవీ కుప్పకూలిపోవా? అవీ పోతే జనానికి వినోదం ఎలా అని!!

    ReplyDelete

Thanks for your time!
- Manohar Chimmani