ఇంకెప్పుడైనా ఏదైనా ట్రిప్ వేస్తే, "నో ఎజెండా ట్రిప్" వెయ్యాలని.
ముందే ప్లాన్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకోడాలు, హోటళ్ళు బుక్ చేసుకోడాలు ఉండకూడదు. అనుకున్న క్షణం ఎలా అయితే అలా వెంటనే బయల్దేరాలి. అవసరమైతే బ్రేక్ జర్నీ చెయ్యాలి.
ఎలాంటి ఖచ్చితమైన షెడ్యూల్ ఉండకూడదు. అక్కడికెళ్ళాక, ఆ క్షణం ఏది చెయ్యాలనుకుంటే అది చెయ్యాలి. ఎక్కడికెళ్ళాలనుకుంటే అక్కడికెళ్ళాలి.
ఎన్నిరోజుల ప్రయాణమైనా సరే, రెండే రెండు స్పేర్ టీషర్టులు బ్యాక్‌ప్యాక్‌లో పెట్టుకోవాలి. అంతే. వేసుకున్న జీన్స్ ఒక్కటి చాలు.
పెన్ను, చిన్న నోటింగ్ ప్యాడ్.
జస్ట్ అంతే.
మినిమలిజం.
జీవితం ఒక్కటే.
ఉన్నన్నిరోజులు మాత్రం అనుకున్నది చెయ్యాలి. చెయ్యలేకపోతే పోనీ. స్ట్రెస్ వద్దు. టెన్షన్లు వద్దు. వీటి నుంచి దూరంగా ప్రయాణాలు చేసినప్పుడు అసలు ఎలాంటి ప్లానింగ్ వద్దు.
నో ఎజెండా.
ఆ క్షణం ఎలా అనుకుంటే అలా.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani