"ఈ లోకంలో - ఎవరి ప్రపంచం వారిది. ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి ఐడియాలజీ వారిది. ఎవరి లాబీ వారిది. ఎవరి తుత్తి వారిది."
Tuesday, 31 January 2023
"భయం!" (మనోహర్ చిమ్మని మైక్రో కథలు - 1)
"ఈ లోకంలో - ఎవరి ప్రపంచం వారిది. ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి ఐడియాలజీ వారిది. ఎవరి లాబీ వారిది. ఎవరి తుత్తి వారిది."
Sunday, 29 January 2023
"కోపరేటివ్ ఫిలిం మేకింగ్" అంటే?
నో కాల్ షీట్స్. నో టైమింగ్స్. అంతా రెనగేడ్ ఫిల్మ్ మేకింగ్. గెరిల్లా ఫిల్మ్ మేకింగ్.
కొన్ని సపోర్టింగ్ రోల్స్‌లో కొందరు సీనియర్లు, సీజన్డ్ ఆర్టిస్టులు తప్ప - దాదాపు అంతా కొత్త ఆర్టిస్టులే ఉంటారు. కాస్టింగ్ దాదాపు అయిపోవచ్చింది.
కట్ చేస్తే -
ఈ విషయంలో ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదు.
Friday, 27 January 2023
"గేటెడ్ కమ్యూనిటీ ఫామ్‌లాండ్స్" అంటే ఎందుకంత క్రేజ్?
పొల్యూషన్-ఫ్రీ వాతావరణం, కళ్ళ ఎదుటే పారుతున్న నది, చుట్టూ గ్రీనరీ... ఇవన్నీ ఒక్కచోటే దొరకటం అనేది అంత సులభం కాదు.
ఈ కంపెనీ సిస్టర్ కన్సర్న్ స్వర్ణసుధ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోనే నేను 'ఎండీ'గా పనిచేస్తున్నాను.
ఇంత మంచి అవకాశం మనకు అందిస్తున్న గ్రీన్ లీవ్స్ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ వెంచర్‌కు ఉన్న మరో ప్రత్యేక ఆకర్షణ - రివర్ వ్యూ!
ఇన్ని ప్లస్ పాయింట్స్‌తో ఉన్న గ్రీన్ లీవ్స్ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ వారి ఫస్ట్ వెంచర్ - చైర్మన్ రావూరి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో - ఇప్పటికే "సోల్డ్ అవుట్" అయిపోయింది. సెకండ్, థర్డ్ వెంచర్స్‌లో అమ్మకాలు ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి.
+91 9989578125.
Get connected... And make the best investment decision of 2022!
After all, the best investment on earth is nothing but land...
"Yo!" హీరో మీరేనా?
Stay tuned to my social media... FB, Twitter, Insta.
- మనోహర్ చిమ్మని
Thursday, 26 January 2023
కంగనా, ది ఫైటర్!
కంగనా రనౌత్ ఏ పార్టీ అన్నది నాకు అనవసరం. సక్సెస్ సైన్స్ పాయింటాఫ్ వ్యూలో ఈ పది వాక్యాలు ఆమె గురించి రాస్తున్నాను...
బాలీవుడ్‌లో ఒక టాప్ రేంజ్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. హీరోయిన్‌గా కలెక్షన్స్ రికార్డ్స్ అప్పట్లోనే సాధించింది.
హీరోయిన్‌గా నటిస్తూనే - డైరెక్టర్ అయింది. రైటర్ అయింది. ప్రొడ్యూసర్ అయింది.
3 జాతీయ అవార్డులు, 4 ఫిలిం ఫేర్ అవార్డులు కూడా సాధించింది.
కంగనా సాధించిన ఈ మైల్‌స్టోన్స్ అన్నింటి వెనుక - తన 15 ఏళ్ల ఫిలిం ఇండస్ట్రీ జీవితపు మర్చిపోలేని అనుభవాలున్నాయి. ఘోరమైన అవమానాలున్నాయి. అంతులేని సంఘర్షణ ఉంది.
కట్ చేస్తే -
మరింత పాపులారిటీ, వందల కోట్ల ఆదాయం ఆన్ ది వే...
Wednesday, 25 January 2023
ఒక కొత్త సినిమా, 2 వర్క్‌షాపులు!
Sunday, 22 January 2023
నా క్లాస్‌మేట్, నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి...
Friday, 20 January 2023
బ్లాగింగ్ నాకు చాలా ఇచ్చింది!
అంతే.
"తెలుగు టైపింగ్ ఇంత ఈజీనా?!" అనుకొంటూ వెంటనే ఈ బ్లాగ్ క్రియేట్ చేశాను.
బ్యాక్ టు బ్లాగింగ్.
నా బ్లాగ్ "నగ్నచిత్రం" 11 ఏళ్ళు పూర్తిచేసుకోబోతున్న సందర్భంగా - ఆగస్టు నెలంతా నా బ్లాగ్ గురించి, నా బ్లాగింగ్ అనుభవాల గురించి, ఈ బ్లాగ్ ద్వారా నేను కనెక్ట్ అయిన అద్భుతమైన కొందరు వ్యక్తుల గురించి, ఈ బ్లాగ్ నేపథ్యంగా నేను సాధించిన కొన్ని విజయాల గురించి... క్లుప్తంగా ఒక సీరీస్ ఆఫ్ బ్లాగ్ పోస్టులు ఇదే బ్లాగులో రాస్తాను.
నామట్టుకు నాకు బ్లాగింగ్ ఒక మినీ లేబొరేటరీ. ఒక థెరపీ. ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్. ఒక యోగా. ఒక ధ్యానం. ఒక అంతశ్శోధన. ఒక అంతర్మథనం. ఒక అద్దం. ఒక ఆసరా. ఒక ప్రేయసి. ఒక ప్రణయం. ఒక ప్రయాణం...
Wednesday, 18 January 2023
ఆరంభింపరు...
పోనీ అప్పటికైనా ఊరుకున్నారా? లేదు...
ఈ విషయంలో ఇక్కడితో... ది ఎండ్.
Tuesday, 17 January 2023
"నాటు నాటు" పాటకే ఎందుకు?
... ... ...
ఏజెంట్స్ ద్వారా, పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా హాలీవుడ్ సర్కిల్స్‌లో లాబీయింగ్ వంటి ప్రయత్నాలు ఎలా వున్నా - గోల్డెన్ గ్లోబ్ అవార్డు, క్రిటిక్స్ చాయిస్ అవార్డుల్ని ఇప్పటికే సాధించిన "నాటు నాటు" సాంగ్‌కు దాదాపు ఆస్కార్ వచ్చినట్టే అనుకోవచ్చు.
అది సహజం.
ఈ పాట షూట్ చేస్తున్నప్పుడు రష్యా-యూక్రేన్‌ల మధ్య యుద్ధం లేదు. షూటింగ్ తర్వాత బహుశా కొన్ని నెలలకు యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడా రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో వెన్ను చూపని రియల్ వ్యారియర్‌లా యూక్రేన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ పోరాడుతున్నాడు.
అమెరికా సహా, మొత్తం పశ్చిమ దేశాలన్నీ జెలెన్‌స్కీ వైపున్నాయి.
యూక్రేన్‌లో ఒక టాప్ ఫిలిం ప్రొడ్యూసర్ అన్నా పాలెంచుక్ కూడా ఈ పాట షూటింగ్ కోసం (కొన్ని సీన్స్ కూడా) టీమ్‌కు సహకరించిందని చదివాను. తను కూడా ఇప్పుడు వార్ ఫ్రంట్‌లో పనిచేస్తోంది.
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 12 అయినా - ఈ జనవరి 24 నాటి నామినేషన్స్ ఫైనలైజేషన్ రోజే RRRకు సిసలైన ఎగ్జయిటింగ్ డే అని నేననుకొంటున్నాను.
Saturday, 14 January 2023
ఆస్కార్ దిశగా... RRR!
అది ఫీలైనవారికే తెలుస్తుంది.
గోల్డెన్ గ్లోబ్, న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డులు అందుకున్న సందర్భంగా కూడా రాజమౌళికి నా హార్దిక అభినందనలు.
మొన్నీమధ్యే - జనవరి 4 నాడు, న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ నుంచి RRR దర్శకుడిగా "బెస్ట్ డైరెక్టర్" అవార్డు అందుకున్నాడు రాజమౌళి.
తర్వాత - జనవరి 11 వ తేదీ నాడు RRR సినిమాలోని "నాటు నాటు" పాటకు "బెస్ట్ ఒరిజినల్ సాంగ్"గా గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అవార్డు అందుకున్నారు.
ఈ పాట రాసింది చంద్రబోస్. పాడింది కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్. అద్భుతమైన కొరియోగ్రఫీ అందించింది ప్రేమ్‌రక్షిత్. మరింత అద్భుతమైన సింక్‌తో నటించింది రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీర్.
అంటే - ఆస్కార్ అవార్డుల్లో ఏ సినిమాలకు ఏ అవార్డులు రావొచ్చు అన్న విషయంలో ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డులు కొంతవరకు హింట్ ఇస్తాయన్నమాట.
ఈ లెక్కన - మార్చి 12 నాడు జరగబోతున్న ఆస్కార్ అవార్డుల ఫంక్షన్‌లో RRRకు కూడా ఒక అవార్డు తప్పకుండా వస్తుందని నాకనిపిస్తోంది.
బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం కేటగిరీ కింద ఇండియన్ గవర్నమెంట్ ద్వారా నామినేషన్స్‌కు పంపించిన సినిమా "ఛెల్లో" అని ఒక గుజరాతీ సినిమా. సో, ఈ కేటగిరీలో RRRకు అవార్డు లేదు. ఇతర కేటగిరీల్లో అలా ప్రభుత్వం ద్వారా వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి, వాటికి చాన్స్ ఉంది.
కట్ చేస్తే -
రేపు జనవరి 15 రాజమౌళి టీమ్‌కు చాలా ముఖ్యమైన రోజు.
క్రిటిక్స్ చాయిస్ అవార్డులు ఇస్తారు...
ఈ అవార్డుల కోసం బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సాంగ్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం... ఈ అయిదు కేటగిరీల్లో బరిలో ఉంది RRR.
మళ్ళీ "బెస్ట్ సాంగ్"కే ఈ అవార్డు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాని... బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం అవార్డుల విషయంలో కూడా చాన్స్ ఉందని నా ఇంట్యూషన్ చెప్తోంది.
RRRలో ఈ "నాటు నాటు" పాటనే "బెస్ట్ ఒరిజినల్ సాంగ్" కేటగిరీలో ఎన్నుకోడానికి, దీనికే అవార్డు ఇవ్వడానికి ఒకటి రెండు బలమైన కారణాల నేపథ్యం కూడా ఉపయోగపడి వుంటుందన్నది నేననుకుంటున్నాను. దాని గురించి ఇంకో చిన్న బ్లాగ్ తర్వాత రాస్తాను.
ఈ జనవరి 19 నాడే బ్రిటిష్ ఫిల్మ్ ఎకాడమీ (BAFTA) అవార్డుల నామినేషన్స్ ఎనౌన్స్ చేస్తున్నారు. అందులో RRR కు పక్కాగా ఒక అవార్డు వచ్చే అవకాశముంది. ఎందుకంటే - UK లో ఆల్రెడీ కమర్షియల్‌గా బాగా వసూళ్ళు చేసి ప్రూవ్ చేసుకున్న సినిమా RRR.
కట్ చేస్తే -
తప్పేం లేదు.
కాని, ప్రపంచ సినిమా మార్కెట్‌కు వేదికలయిన హాలీవుడ్, ఆస్కార్ అవార్డుల బరిలోకి వెళ్ళే ప్రయత్నాలు ఎంతమంది చేశారన్నది బిగ్ కొశ్చన్.
ఇప్పుడిదొక భారీ కార్పొరేట్ బిజినెస్.
బిజినెస్ పరంగా, రీచ్ పరంగా రాజమౌళి విజన్ అద్భుతం.
ట్రిపుల్ ఆర్ ఇచ్చిన సక్సెస్‌తో రాజమౌళి ఇంక నేరుగా హాలీవుడ్‌లోకి ఎంటర్ అయ్యే దిశలో ఉన్నాడు. అక్కడ హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేముందు ఈ అంతర్జాతీయస్థాయి అవార్డుల బజ్ అవసరం.
ఇప్పుడదే జరుగుతోంది. అది అవసరం కూడా.
Best wishes to Director SS Rajamouli, the Marketing Mantrik!
Friday, 13 January 2023
నిర్మాణాత్మక విమర్శలు ఓకే... కానీ...
అలాంటి కామెంట్స్ వల్ల మీరేంటో మీ మానసిక స్థాయి ఏంటో అందరికీ తెలిసిపోతుంది.
బి ఆర్ యస్ సోషల్ మీడియా వారియర్స్ చూస్తే ఒక ఆట ఆడుకుంటారు.
కట్ బ్యాక్ టు భజన -
Thursday, 12 January 2023
Spilling the Light
1926 లో చలం "మైదానం" రాశాడు...
నా ఫేవరేట్ ప్రపంచస్థాయి రచయితల్లో చలం ముందు వరసలో ఉంటాడు. ఆకాలంలోనే ఆయన రాయగలిగిన ఆ అందమైన తెలుగు శైలిని ఇప్పుడు 2023 లో కూడా ఎవ్వరూ రాయడం లేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.
ఆధ్యాత్మికత వ్యక్తిగతం.
ఆధ్యాత్మికం కోసం అలా అన్నీ వదిలేయడం తప్పనిసరి అని ఏ శాస్త్రం బహుశా చేప్పదనుకుంటాను.
నాకు తెలిసిన కొందరు చాలా ట్రెండీగా, మాడర్న్‌గా ఉంటారు చాలా విషయాల్లో. ప్రొఫెషనల్‌గా కూడా చాలా బిజీగా వుంటారు. అయితే - సమాంతరంగా వారి జీవితంలో మనం నమ్మలేని ఒక ఆధ్యాత్మిక పార్శ్వం కూడా నడుస్తుంటుంది. వీళ్లేం అన్నీ మానేసిన వృద్ధులు కారు.
... అలా అని నాకనిపిస్తుంది.
కొన్ని పనులు అమ్మాయిలు చేస్తేనే మరింత బాగుంటుంది!
NOTE: నా టీమ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్స్ బాయ్స్ ఆల్రెడీ ఉన్నారు. ఈ యాడ్ బాయ్స్ కోసం కాదు.
కట్ చేస్తే -
కొన్ని పనుల్లో అమ్మాయిలు చూపే అంత సిన్సియారిటీ, పట్టుదల అబ్బాయిలు చూపలేరు. అలాగే కొన్ని పనులు అమ్మాయిలు చేస్తేనే మరింత బాగుంటుంది. ఒక్క డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అనే కాదు, ఎక్కడైనా.
Tuesday, 10 January 2023
BREAKING NEWS... పది లక్షలకే ఫామ్‌హౌజ్!
ఉద్యోగస్తులకు, చిన్న వ్యాపారులకు కూడా ఇదొక మంచి అవకాశం!!
మీరూ ఒక ఫామ్ హౌజ్‌కు యజమాని కండి!!
PS: 242 గజాల్లో 2BHK ఫామ్‌హౌజ్ ఆఫర్ కూడా ఉంది!
సోషల్ మీడియాలో మీ పొజిషన్ ఎక్కడ?
సోషల్ మీడియా పవర్ గురించి సంపూర్ణ అవగాహన ఉండి,
ఒక మంచి సోషల్ మీడియా స్ట్రాటెజిస్ట్ కోసం చూస్తున్న "బిగ్ క్లయింట్స్" కోసం!
సోషల్ మీడియా అనేది – ప్రింట్ మీడియా, ఎలెక్ట్రానిక్ మీడియాలను ఎప్పుడో బైపాస్ చేసేసింది.
ఈ పోటీ యుగంలో అది సరిపోదు. నిజానికి అసలు లెక్కలోకి రాదు.
**ముఖ్యంగా - రానున్న ఎలక్షన్స్ నేపథ్యంలో - సోషల్ మీడియా పవర్ గురించి సంపూర్ణ అవగాహన ఉండి, ఒక మంచి సోషల్ మీడియా స్ట్రాటెజిస్ట్ కోసం చూస్తున్న "బిగ్ క్లయింట్స్" కోసం మేము చూస్తున్నాము.**
Saturday, 7 January 2023
సమయానికి విలువ ఇవ్వలేనివారు ఎవ్వరైనా...
"సోల్డ్ అవుట్" మీడియా!
తెలంగాణలో ఒకవైపు ఉద్యోగాల నోటిఫికేషన్ల వర్షం కురుస్తోంది. ఆ పాజిటివ్ ప్రభంజనం గురించి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఉండవు.
ఆ బ్రేకింగ్ న్యూస్‌లుండవు.
Friday, 6 January 2023
"కంటివెలుగు" పథకం ఆలోచన వెనుక...
"కంటి వెలుగు" కార్యక్రమం పైన మొన్న ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు, సంబంధిత శాఖల అధికారుల బృందం రూపొందించిన బ్లూప్రింట్ ప్రకారం - ఈ కార్యక్రమం కింద నిపుణులైన వైద్యులు తెలంగాణలో అందరికీ కంటి పరీక్షలు చేస్తారు. పరీక్షల అనంతరం - అవసరమైనవారికి సర్జరీ, కళ్ళద్దాలు, మందులు అందజేస్తారు.
Thursday, 5 January 2023
ఒక యాక్సిడెంట్ జీవితాన్ని తల్లక్రిందులు చేస్తుంది!
అలాగని అత్యాశలు, దురాశలేం కావు. అన్నీ నేను సులభంగా చేయగలిగినవే. కాని, చేయలేకపోయాను.
నా ఎదుటివారిని నేను ఎప్పుడూ నాకంటే ఒక పదింతలు ఉన్నతులుగా భావిస్తాను, ఆ గౌరవం ఇస్తాను. అయినా సరే - వర్క్ కల్చర్ పరంగా గాని, సామర్థ్యం పరంగా గాని మన ముందు చేతులు కట్టుకొని నిల్చోడానికి కూడా సరిపోని వ్యక్తులతో మాటలు, అవమానాలు, నీతి వాక్యాలు.
ఒక లీ క్వాన్ యూ, ఒక కేసీఆర్!
గత 8 సంవత్సరాల్లో టీఎస్‌ఐపాస్, ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో తెలంగాణ రాష్ట్రానికి 3.30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.
కొత్తగా ఏర్పడిన ఒక రాష్ట్రంలోనే ఇది సాధ్యమైనప్పుడు - అదే 8 ఏళ్ళ సమయంలో - దాదాపు ప్రపంచంలోని ముఖ్యమైన అన్ని దేశాలు చుట్టివచ్చిన ప్రధాని మోదీజీ నేతృత్వంలో కనీసం ఇంకో వంద రెట్లు ఎక్కువ పెట్టుబడులు ఈ దేశానికి వచ్చి తీరాలి.
కాని, వాస్తవం మరోలా వుంది.
ఉన్న విదేశీ కంపెనీలు పోతున్నాయి. లక్షల మంది భారతీయులు విదేశాలకు వలసపోతున్నారు.
కట్ చేస్తే -
రెండే రెండేళ్ళలో మేం దేశమంతా కరెంటు ఇస్తాం, నీళ్ళూ అందిస్తాం అని తిరుగులేని సవాల్ విసురుతున్నారు కేసీఆర్.
తెలంగాణలో సాధ్యమైన రైతుకి 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు భీమా వంటివి యావత్ దేశంలోనూ ఎందుకు సాధ్యం కాదు అని కేసీఆర్ అడుగుతున్న ప్రశ్నకు ఢిల్లీలో కూర్చుని ప్రభుత్వం నడిపిస్తున్నవారివద్ద జవాబు లేదు. వారి ఫాలోయర్స్, అభిమానుల దగ్గర కూడా - మతిస్థిమితం తప్పిన ఒకానొక మందమెంటాలిటీ ఉపయోగించే వాట్సాప్ ఆయుధం తప్ప వాస్తవాన్ని చెప్పే అధికారిక గణాంకాలు లేవు.
ఎంతసేపూ రాజకీయాలే కాదు. ప్రపంచంలో ఏ దేశం కంటే తక్కువకాకుండా అన్నిరకాల వనరులుండి కూడా, సిగ్గుచేటైన విధంగా 75 ఏళ్ళుగా ఇంకా ఒక "అభివృద్ధిచెందుతున్న దేశం"గానే ఉన్న మన దేశాన్ని ఒక సింగపూర్ లాంటి ధనికదేశంగానో... అమెరికా, చైనా వంటి శక్తివంతమైన దేశాల సరసననో చేర్చగల విజన్, సత్తా ఉన్న నాయకుడు ఇప్పుడు మన దేశానికి కావాలి.
ఇది డిజిటల్-సోషల్ యుగం. మనిషి జీవితంలోని అన్ని కోణాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. ఆ మార్పు మన దేశంలోని రాజకీయాల్లో కూడా రావాల్సిన సమయం వచ్చేసింది.
అలాంటి ఒక గుణాత్మక మార్పు కోసం - మరోసారి మరొక మహోజ్వల ఉద్యమానికి శ్రీకారం చుట్టిన నాయకుడు మన కేసీఆర్ కావడం మనం గర్వించాల్సిన విషయం.
కేసీఆర్‌కు అవసరమైన స్థాయిలో మెదళ్లను ఉపయోగించి, ఈ మహాయుద్ధం విషయంలో ఆయనకు అవసరమైన తోడ్పాటుని అందించగల విద్యావంతులు, రచయితలు, మేధావులు ఆయన పిలుపు కోసం యుద్ధక్షేత్రంలో సైనికుల్లా సర్వదా సిధ్ధంగా ఉన్నారు.
దేశ రైతాంగంలోనూ, ఇతర అన్ని రంగాల్లోనూ తెలంగాణ మాడల్ అభివృద్ధి..., ఈ దూకుడు, ఈ మార్గదర్శకత్వం... జాతీయస్థాయిలో రావటం కోసమే ఇప్పుడు కేసీఆర్ తలపెట్టిన మహాయజ్ఞం... బీఆర్‌యస్ అని ఇప్పుడు దేశమంతా స్పష్టమైంది. భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడుగా ఢిల్లీలో కేసీఆర్ పెట్టబోయే ఒక్క ప్రెస్ మీట్‌తో మరింత విస్పష్టమౌతుంది.
బీఆర్‌యస్ విస్తరణ ఏపీ నుంచే ఆరంభం కావడం విశేషం.
బీఆర్‌యస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన తోట చంద్రశేఖర్ గారికి హార్దిక శుభాకాంక్షలు.
Wednesday, 4 January 2023
"టీ హబ్"కు పర్యాయపదం కేటీఆర్!
కాని, ఆ ప్రపోజల్స్‌ను అర్థం చేసుకొని, వాటిని ప్రోత్సహించే నాయకులే ఉండరు. చెబితే వినరు. చెప్పినా వారికి అర్థం కాదు. అర్థం చేసుకొనే ప్రయత్నం చెయ్యరు.
ఆకాశమే హద్దుగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపులు, అవార్డు, రివార్డులు ఊరికే రావు.
కేటీఆర్ - ఒక బ్రాండ్.
ఆ బ్రాండ్ లేకుండా ఇన్ని వందల కోట్ల, వేల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్ లేవు... ఈ విజయాల్లేవు. ఇది ఎవరైనా సరే ఒప్పుకొని తీరాల్సిన నిజం.
రాకెట్ స్థాయిలో నింగికి దూసుకెళ్ళిన ఏడేళ్ళ టీ హబ్ సక్సెస్ స్టోరీకి కర్తలైన కేటీఆర్ గారికి, వారి బృందంలోని ప్రతి ఒక్కరికీ అభినందనలు.
Tuesday, 3 January 2023
"యాక్టర్స్ ఆడిషన్" కొత్తవారికే... జనవరి 8, 9, 10 తేదీల్లో!
నేను ఇప్పటివరకు డైరెక్ట్ చేసిన సినిమాల్లో - కనీసం ఒక 20 మంది ఆర్టిస్టులను ప్రధానపాత్రల్లో పరిచయం చేశాను. కనీసం ఇంకో 40 మందిని సపోర్టింగ్ రోల్స్‌లో పరిచయం చేశాను.
Monday, 2 January 2023
కొత్త సింగర్స్‌ను ఎందుకు పరిచయం చేస్తున్నాం?
ఇండస్ట్రీకి నేను పరిచయం చేసిన మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్రకు నా లేటెస్ట్ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ 'డే వన్' నుంచి నేనొక విషయం చెబుతూ వస్తున్నాను ...
ఆ నాస్తాల్జియా గురించి మరోసారి రాస్తాను...
మా కొత్త ప్రాజెక్టులకోసం... ఈ నెల 8, 9, 10 తేదీల్లో "న్యూ సింగర్స్" ఆడిషన్స్ కోసం మా మ్యూజిక్ మ్యాజిక్ ప్రదీప్‌చంద్ర మొన్ననే ఒక యాడ్ రిలీజ్ చేశాడు.
ఈ అవకాశాన్ని కొత్త సింగర్స్ తప్పక వినియోగించుకొంటారని నా నమ్మకం.
మీడియాలో, సోషల్ మీడియాలో ఊహించని రేంజ్‌లో వారిని పాపులర్ చేస్తాము.
ఆ ఓపెనింగ్ రోజు స్టూడియోలో పాడేది మీరే కావచ్చు, చెప్పలేం...