సుమారు 6 గంటల క్రితం రాజమౌళి పెట్టిన ఆ ట్వీట్‌లో 2 ఫోటోలున్నాయి. వాటిలో ఒక ఫోటో నిజంగా అద్భుతం.
అది ఫీలైనవారికే తెలుస్తుంది.
అది ఫీలైనవారికే తెలుస్తుంది.
"ఇది కలా, నిజమా... నా కళ్ళముందు ముందు స్టీవెన్ స్పీల్‌బర్గ్!" అన్నట్టుగా ఉంది ఆ ఫోటోలో రాజమౌళి ఫీలింగ్.
"I just met GOD!!!"
స్పీల్‌బర్గ్‌ను కలిసిన తర్వాత రాజమౌళి ఎక్‌జైటింగ్‌గా పెట్టిన ట్వీట్ అది. పక్కనే ఒక 3 "హార్ట్ ఆన్ ఫైర్" ఎమోజీలు...
కట్ చేస్తే -
మొన్నీమధ్యే - జనవరి 4 నాడు, న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ నుంచి RRR దర్శకుడిగా "బెస్ట్ డైరెక్టర్" అవార్డు అందుకున్నాడు రాజమౌళి.
తర్వాత - జనవరి 11 వ తేదీ నాడు RRR సినిమాలోని "నాటు నాటు" పాటకు "బెస్ట్ ఒరిజినల్ సాంగ్"గా గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అవార్డు అందుకున్నారు.
ఈ పాట రాసింది చంద్రబోస్. పాడింది కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్. అద్భుతమైన కొరియోగ్రఫీ అందించింది ప్రేమ్‌రక్షిత్. మరింత అద్భుతమైన సింక్‌తో నటించింది రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీర్.
"హాలీవుడ్‌లో మాస్టర్‌పీస్ సినిమాల గాడ్" స్టీవెన్ స్పీల్‌బర్గ్‌ను కలిసిన సందర్భంగా రాజమౌళికి అభినందనలు.
గోల్డెన్ గ్లోబ్, న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డులు అందుకున్న సందర్భంగా కూడా రాజమౌళికి నా హార్దిక అభినందనలు.
గోల్డెన్ గ్లోబ్, న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డులు అందుకున్న సందర్భంగా కూడా రాజమౌళికి నా హార్దిక అభినందనలు.
మొన్నీమధ్యే - జనవరి 4 నాడు, న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ నుంచి RRR దర్శకుడిగా "బెస్ట్ డైరెక్టర్" అవార్డు అందుకున్నాడు రాజమౌళి.
తర్వాత - జనవరి 11 వ తేదీ నాడు RRR సినిమాలోని "నాటు నాటు" పాటకు "బెస్ట్ ఒరిజినల్ సాంగ్"గా గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అవార్డు అందుకున్నారు.
ఈ పాట రాసింది చంద్రబోస్. పాడింది కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్. అద్భుతమైన కొరియోగ్రఫీ అందించింది ప్రేమ్‌రక్షిత్. మరింత అద్భుతమైన సింక్‌తో నటించింది రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీర్.
ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డులను ఇచ్చేది హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్.
తర్వాత కొద్ది వారాల్లోనే ప్రకటించే ఆస్కార్ అవార్డులకు ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డులు ఒక హింట్ ఇచ్చేవిగా ఉంటాయని అంటారు.
అంటే - ఆస్కార్ అవార్డుల్లో ఏ సినిమాలకు ఏ అవార్డులు రావొచ్చు అన్న విషయంలో ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డులు కొంతవరకు హింట్ ఇస్తాయన్నమాట.
ఈ లెక్కన - మార్చి 12 నాడు జరగబోతున్న ఆస్కార్ అవార్డుల ఫంక్షన్‌లో RRRకు కూడా ఒక అవార్డు తప్పకుండా వస్తుందని నాకనిపిస్తోంది.
బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం కేటగిరీ కింద ఇండియన్ గవర్నమెంట్ ద్వారా నామినేషన్స్‌కు పంపించిన సినిమా "ఛెల్లో" అని ఒక గుజరాతీ సినిమా. సో, ఈ కేటగిరీలో RRRకు అవార్డు లేదు. ఇతర కేటగిరీల్లో అలా ప్రభుత్వం ద్వారా వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి, వాటికి చాన్స్ ఉంది.
కట్ చేస్తే -
రేపు జనవరి 15 రాజమౌళి టీమ్‌కు చాలా ముఖ్యమైన రోజు.
క్రిటిక్స్ చాయిస్ అవార్డులు ఇస్తారు...
ఈ అవార్డుల కోసం బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సాంగ్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం... ఈ అయిదు కేటగిరీల్లో బరిలో ఉంది RRR.
మళ్ళీ "బెస్ట్ సాంగ్"కే ఈ అవార్డు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాని... బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం అవార్డుల విషయంలో కూడా చాన్స్ ఉందని నా ఇంట్యూషన్ చెప్తోంది.
RRRలో ఈ "నాటు నాటు" పాటనే "బెస్ట్ ఒరిజినల్ సాంగ్" కేటగిరీలో ఎన్నుకోడానికి, దీనికే అవార్డు ఇవ్వడానికి ఒకటి రెండు బలమైన కారణాల నేపథ్యం కూడా ఉపయోగపడి వుంటుందన్నది నేననుకుంటున్నాను. దాని గురించి ఇంకో చిన్న బ్లాగ్ తర్వాత రాస్తాను.
ఈ జనవరి 19 నాడే బ్రిటిష్ ఫిల్మ్ ఎకాడమీ (BAFTA) అవార్డుల నామినేషన్స్ ఎనౌన్స్ చేస్తున్నారు. అందులో RRR కు పక్కాగా ఒక అవార్డు వచ్చే అవకాశముంది. ఎందుకంటే - UK లో ఆల్రెడీ కమర్షియల్‌గా బాగా వసూళ్ళు చేసి ప్రూవ్ చేసుకున్న సినిమా RRR.

ఇక - జనవరి 24వ తేదీ రాజమౌళికి ఎక్‌జైటింగ్ డే. ఆరోజే ఆస్కార్ నామినేషన్స్ ఫైనల్ అవుతాయి. ఆస్కార్ బరిలో RRR ఉన్నదా లేదా తెలుస్తుంది.
ఉంటుందనే నా నమ్మకం.
కట్ చేస్తే -
"ఒక్కసారిగా ఈ అంతర్జాతీయ అవార్డుల వెల్లువ ఏంటి" అన్న ప్రశ్న వస్తుంది. అంతకు ముందు ఇంతకంటే గొప్ప పాటలు రాలేదా, గొప్ప సినిమాలు రాలేదా, గొప్ప దర్శకులు లేరా... అనిపిస్తుంది కొందరికి.
తప్పేం లేదు.
కాని, ప్రపంచ సినిమా మార్కెట్‌కు వేదికలయిన హాలీవుడ్, ఆస్కార్ అవార్డుల బరిలోకి వెళ్ళే ప్రయత్నాలు ఎంతమంది చేశారన్నది బిగ్ కొశ్చన్.

సినిమా అనేది బేసిగ్గా ఒక క్రియేటివ్ బిజినెస్.
ఇప్పుడిదొక భారీ కార్పొరేట్ బిజినెస్.
ఇప్పుడిదొక భారీ కార్పొరేట్ బిజినెస్.
భారతీయ మెయిన్‌స్ట్రీమ్ కమర్షియల్ సినిమాను వంద రెండొందల కోట్ల క్లబ్‌లోంచి ఏకంగా 1000 కోట్లు, 1500 కోట్ల బిజినెస్ స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుడు రాజమౌళి.
బిజినెస్ పరంగా, రీచ్ పరంగా రాజమౌళి విజన్ అద్భుతం.
ట్రిపుల్ ఆర్ ఇచ్చిన సక్సెస్‌తో రాజమౌళి ఇంక నేరుగా హాలీవుడ్‌లోకి ఎంటర్ అయ్యే దిశలో ఉన్నాడు. అక్కడ హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేముందు ఈ అంతర్జాతీయస్థాయి అవార్డుల బజ్ అవసరం.
ఇప్పుడదే జరుగుతోంది. అది అవసరం కూడా.
ఈ దిశలో తెలుగు నుంచి రాజమౌళి పయొనీర్ కాబోతున్నాడు.
Best wishes to Director SS Rajamouli, the Marketing Mantrik!
బిజినెస్ పరంగా, రీచ్ పరంగా రాజమౌళి విజన్ అద్భుతం.
ట్రిపుల్ ఆర్ ఇచ్చిన సక్సెస్‌తో రాజమౌళి ఇంక నేరుగా హాలీవుడ్‌లోకి ఎంటర్ అయ్యే దిశలో ఉన్నాడు. అక్కడ హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేముందు ఈ అంతర్జాతీయస్థాయి అవార్డుల బజ్ అవసరం.
ఇప్పుడదే జరుగుతోంది. అది అవసరం కూడా.
టైటానిక్‌లు, అవెంజర్స్, అవతార్‌లు మేమూ తీయగలం అని భారతీయ ఫిలిం డైరెక్టర్స్ చెప్పబోయే రోజులు ముందున్నాయి.
Best wishes to Director SS Rajamouli, the Marketing Mantrik!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani