నాకే ఆశ్చర్యంగా ఉంది. నిజంగా 11 ఏళ్ళ నుంచి రాస్తున్నానా ఈ బ్లాగులో?
ఆగస్టు వరకు ఎలాగూ కొంచెం ఫ్రీ అయిపోతాను కాబట్టి ఆ నెలంతా సెలబ్రేట్ చేసుకోవాలనుకొంటున్నాను. బహుశా ఏ గోవాకో, పాండిచ్చేరికో వెళ్ళి.
కట్ చేస్తే -
నా మిత్రుడొకరికి ఏదో టెక్నికల్ సహాయం చేసే పనిలో ఉన్నప్పుడు - మధ్యలో నాకీ ఆలోచన వచ్చింది.
ఆ సమయంలోనే నాకు "లేఖిని" కనిపించింది.
అంతే.
"తెలుగు టైపింగ్ ఇంత ఈజీనా?!" అనుకొంటూ వెంటనే ఈ బ్లాగ్ క్రియేట్ చేశాను.
అంతే.
"తెలుగు టైపింగ్ ఇంత ఈజీనా?!" అనుకొంటూ వెంటనే ఈ బ్లాగ్ క్రియేట్ చేశాను.
అప్పట్నించీ నాకు రాయాలనిపించిన ప్రతీదీ రాస్తూనే ఉన్నాను. మధ్యలో కనీసం ఒక అరడజన్ సార్లు బ్లాగింగ్ మానెయ్యాలనుకున్నాను. భారీ గ్యాప్స్ తీసుకొన్నాను. కాని, నా వల్ల కాలేదు.
బ్యాక్ టు బ్లాగింగ్.
నా బ్లాగ్ "నగ్నచిత్రం" 11 ఏళ్ళు పూర్తిచేసుకోబోతున్న సందర్భంగా - ఆగస్టు నెలంతా నా బ్లాగ్ గురించి, నా బ్లాగింగ్ అనుభవాల గురించి, ఈ బ్లాగ్ ద్వారా నేను కనెక్ట్ అయిన అద్భుతమైన కొందరు వ్యక్తుల గురించి, ఈ బ్లాగ్ నేపథ్యంగా నేను సాధించిన కొన్ని విజయాల గురించి... క్లుప్తంగా ఒక సీరీస్ ఆఫ్ బ్లాగ్ పోస్టులు ఇదే బ్లాగులో రాస్తాను.
నామట్టుకు నాకు బ్లాగింగ్ ఒక మినీ లేబొరేటరీ. ఒక థెరపీ. ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్. ఒక యోగా. ఒక ధ్యానం. ఒక అంతశ్శోధన. ఒక అంతర్మథనం. ఒక అద్దం. ఒక ఆసరా. ఒక ప్రేయసి. ఒక ప్రణయం. ఒక ప్రయాణం...

మరొకవైపు - నా జీవితం మొత్తంలో తీసుకొన్న రెండే రెండు అతి చెత్త నిర్ణయాలకు సాక్షి పాత్ర కూడా పోషించింది నా బ్లాగ్. ఆ రెంటిలో ఒకదాన్నించి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాను. రెండోదాన్నించి కూడా ఇంకొకటి రెండు నెలల్లో పక్కాగా బయటపడతాను.
నామట్టుకు నాకు బ్లాగింగ్ ఒక మినీ లేబొరేటరీ. ఒక థెరపీ. ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్. ఒక యోగా. ఒక ధ్యానం. ఒక అంతశ్శోధన. ఒక అంతర్మథనం. ఒక అద్దం. ఒక ఆసరా. ఒక ప్రేయసి. ఒక ప్రణయం. ఒక ప్రయాణం...
Sometimes I think of blogging as finger exercises for a violinist; sometimes I think of it as mulching a garden. It is incredibly useful and helpful to my “real” writing.
~ Kate Christensen
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani