నేను ఇప్పటివరకు డైరెక్ట్ చేసిన సినిమాల్లో - కనీసం ఒక 20 మంది ఆర్టిస్టులను ప్రధానపాత్రల్లో పరిచయం చేశాను. కనీసం ఇంకో 40 మందిని సపోర్టింగ్ రోల్స్‌లో పరిచయం చేశాను.
వాళ్లందరి పేర్లు ఇప్పుడు నేను చెప్పడం లేదు. కాని, బహుశా రేపటి నుంచి నేను ప్రారంభిస్తున్న ఒక సీరీస్ ఆఫ్ షార్ట్ బ్లాగ్స్ ద్వారా మీకే వారందరి పేర్లు, వారంతా ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ రేంజ్‌లో ఉన్నారో తెలుస్తుంది.
ఫీల్డులో వున్నవాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు కాని - నాలాగ, అలా పైపైన ఐనా ఫీల్డులో ఉన్నవాళ్లకు, కొత్తవాళ్ళకు కొన్ని నిజాలు తెల్సుకోవడం తప్పకుండా ఆసక్తికరంగా ఉంటుందని నా నమ్మకం.
కట్ చేస్తే -
ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత 2 కొత్త సినిమాలు చేస్తున్నాను. ఆ సినిమాల ప్రి-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో - కొత్త హీరోహీరోయిన్ల కోసం, సపోర్టింగ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కోసం మాత్రమే ఒక చిన్న యాడ్ ఇచ్చాము. ఏజ్ లిమిట్స్ చెప్పాం.
8, 9, 10 తేదీల్లో ఆడిషన్ ఉంటుంది.
అందులో స్పష్టంగా - "ఒక 3 లేటెస్టు ఫోటోలు మాత్రమే వాట్సాప్ ద్వారా పంపించండి" అని చెప్పాం. రీల్స్, వీడియోలు వద్దని చెప్పాం. కాల్స్ చెయ్యొద్దు అని చెప్పాం.
అయినా సరే - 90% మంది కాల్స్ చేస్తున్నారు. లెక్కలేనన్ని ఫోటోలు పంపిస్తున్నారు. రీల్స్, వీడియోలు పంపిస్తున్నారు. "రిప్లై ఇవ్వండి" అని దాదాపు దబాయిస్తున్నారు. 😊
యాడ్‌ను అసలు పూర్తిగా చదవకుండా, పర్‌ఫెక్ట్‌గా ఫాలో అవ్వకుండా మీరు చేసే ఇవన్నీ మిమ్మల్ని ఆడిషన్‌కు ఎన్నిక కాకుండా చేస్తాయి. ఈ విషయం కూడా యాడ్‌లో స్పష్టంగా ఉంది.
All the best!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani