1992 లోనే, హాలీవుడ్‌లో రాబర్ట్ రోడ్రిగజ్ ఇదే పధ్ధతిలో "ఎల్ మరియాచి" తీశాడు. 2011లో ఆర్జీవీ "దొంగల ముఠా" తీశాడు.
కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పధ్ధతిలో - పాతవాళ్లయినా, కొత్తవాళ్లయినా... ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా ముందు ఇవ్వటం అనేది ఉండదు. సినిమా పూర్తయ్యి, రిలీజయ్యి, లాభాలు వచ్చాకే ఆ లెక్కలు! దీనికి ఒప్పుకున్నవాళ్లే సినిమాలో పనిచేస్తారు!!
సినిమాలో పనిచేసే ప్రతి ఒక్కరి ఇన్వెస్ట్‌మెంట్ కంట్రిబ్యూషన్ ఏదో ఒక రూపంలో ఎంతో కొంత ఉంటుంది. ఎందుకంటే - దీనికి ప్రొడ్యూసర్ ఉండడు.
సినిమా బడ్జెట్ కోటి కావచ్చు, రెండు కోట్లు కావొచ్చు. మేం పూల్ చేసుకున్న ఆ కొద్ది బడ్జెట్‌ను మేకింగ్‌కు, ప్రమోషన్‌కు మాత్రమే వాడతామన్నమాట!
నో కాల్ షీట్స్. నో టైమింగ్స్. అంతా రెనగేడ్ ఫిల్మ్ మేకింగ్. గెరిల్లా ఫిల్మ్ మేకింగ్.
నో కాల్ షీట్స్. నో టైమింగ్స్. అంతా రెనగేడ్ ఫిల్మ్ మేకింగ్. గెరిల్లా ఫిల్మ్ మేకింగ్.
చాలా మంచి కాన్‌సెప్ట్ ఇది.
ముఖ్యంగా చిన్న బడ్జెట్ సినిమాలకు సంబంధించి మాత్రం ఇదే చాలా చాలా కరెక్టు.
హాలీవుడ్ నుంచి, టాలీవుడ్ దాకా... ఈ పద్ధతిలో తీసిన ఎన్నో సినిమాలు అద్భుత విజయం సాధించాయి.
హిట్ కాకపోయినా - ఈ సినిమాలు మంచి బజ్ క్రియేట్ చేస్తాయి, మంచి బిజినెస్ చేస్తాయి... ప్రొవైడెడ్, సరైన స్ట్రాటజీతో చేస్తే.
సో, టెక్నికల్‌గా అది కూడా విజయమే.
ఇప్పుడు నేను చేస్తున్న రెండు ఫీచర్ ఫిలిమ్స్ ఈ పద్ధతిలో చేస్తున్నవే. ఈ రెండు సినిమాల ప్రిప్రొడక్షన్ వర్క్ కూడా ఏక కాలంలో జరుగుతోంది.
వీటిలో మొదటిది...
"Yo!"
ఫిబ్రవరిలో పాటల రికార్డింగ్‌తో "Yo!" ఓపెనింగ్ ఉంటుంది.
కొన్ని సపోర్టింగ్ రోల్స్‌లో కొందరు సీనియర్లు, సీజన్డ్ ఆర్టిస్టులు తప్ప - దాదాపు అంతా కొత్త ఆర్టిస్టులే ఉంటారు. కాస్టింగ్ దాదాపు అయిపోవచ్చింది.
కట్ చేస్తే -
హీరోల కోసం చివరి స్పెల్ ఆడిషన్ ఒక్కటి జరగాల్సి ఉంది. దాని కోసమే నిన్నొక యాడ్ రిలీజ్ చేశాము.
పైన మీరు చూస్తున్నది అదే.
అర్హులైన కొత్త హీరోలు యాడ్‌లో చెప్పిన విధంగా అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్‌ను ఈమెయిల్ చెయ్యండి. లేదా, నా ఇన్‌స్టాగ్రామ్‌కు డైరెక్ట్ మెసేజ్ పంపండి.
వాట్సాప్‌లు పంపేవాళ్ళు, కాల్స్ చేసేవాళ్ళు ఆటొమాటిక్‌గా అనర్హులవుతారు.
ఎప్పటికప్పుడు ఆడిషన్‌కు పిలుస్తుంటాము. మీకు మా నుంచి కాల్ రాలేదంటే మా స్క్రిప్టులో మీరు సరిపోరని అర్థం. అంతే కాని, మీకు టాలెంట్ లేదని ఎట్టి పరిస్థితుల్లో మీరు అనుకోవద్దు.
ఈ విషయంలో ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదు.
ఈ విషయంలో ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదు.
ఆడిషన్‌కు సెలక్టయినవాళ్లతో మా టీమ్ టచ్‌లో ఉంటుంది.
బెస్ట్ విషెస్...
- మనోహర్ చిమ్మని
Email: mchimmani@gmail.com
Insta: @manohar_chimmani
PS:
కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పట్ల ఆసక్తి ఉండి, ఈ జర్నీలో నాతో కలిసి ప్రయాణం చెయ్యాలనుకొనేవారు 'మీరెలా ఈ ప్రాజెక్టుకు సపోర్ట్ అవుతారు', 'ప్రిసైజ్‌గా మీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రపోజల్ ఏంటి' తెలుపుతూ, మీ ప్రపోజల్స్‌తో నన్ను కలవ్వొచ్చు. మీ ప్రపోజల్ ఏదైనా సరే, నా ఇన్‌స్టాలో DM చెయ్యండి. కలిసి మాట్లాడుకుందాం.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani