నేను పక్కా కేసీఆర్ అభిమానిని. ఒక రాజకీయవేత్తగా, ఒక దార్శనికునిగా, ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న పనుల గురించి, సాధిస్తున్న విజయాల గురించి, సృష్టిస్తున్న సంచలనాల గురించి నేను తరచూ బ్లాగ్‌లు, పేపర్స్‌కి ఎడిట్ పేజ్ ఆర్టికిల్స్, సోషల్ మీడియా పోస్టులు రాస్తుంటాను.
నేను బి ఆర్ యస్ మౌత్‌పీస్‌ను. కేసీఆర్ సారథ్యంలో దేశ రాజకీయాల్లో రానున్న మలుపుల నేపథ్యంలో - ఆయన స్థాపించిన పార్టీ గురించి, ఆ పార్టీ నడిపిస్తున్న ప్రభుత్వం గురించి, ఆ ప్రభుత్వం క్రియేట్ చేస్తున్న రికార్డుల గురించి కూడా రాస్తుంటాను.
ఒక డైనమిక్ మంత్రిగా, ఒక మల్టి టాలెంటెడ్ వ్యక్తిగా - దాదాపు వారంలో ప్రతి రోజూ - అయితే ఒక కొత్త ఇండస్ట్రీ డీల్ కాని, ఒక భారీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రపోజల్ గాని లేకుండా నిద్రపోని కేటీఆర్ గురించి కూడా తరచూ రాస్తుంటాను. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాను.
నా లాజిక్ ఒక్కటే. బాగా పనిచేస్తున్న వారిని గుర్తించాలి. వారు సాధిస్తున్న అరుదైన విజయాల గురించి రాస్తూ వారిని బాగా ప్రమోట్ చెయ్యాలి. రాజకీయాల్లో ఒక కొత్త గుణాత్మక మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్న కేసీఆర్ లాంటి దార్శనికునికి ఒక పౌరుడిగా ఉడతాభక్తిగానైనా తోడ్పడాలి. అంతే.
నా పుస్తకం "కేసీఆర్ - ది అర్ట్ ఆఫ్ పాలిటిక్స్" పుస్తకం చదివితే ఈ విషయం మీకు ఇంకాస్త బాగా అర్థమవుతుంది.
కట్ చేస్తే -
నా మిత్రులు కొందరు, నాకు తెలీనివారు కొందరు "మీరు బ్లాగ్‌లో, సోషల్ మీడియాలో కేసీఆర్ భజన ఎందుకు చేస్తున్నారు?" అని బాధపడిపోతుంటారు.
క్రియేటివిటీ వేరు. రాజకీయాలు వేరు. నా మనసుకు నచ్చింది నేను చేస్తాను. నేను చేయాలనుకున్నది చేస్తాను. నా ఫేస్‌బుక్, నా వాల్, నా బ్లాగ్, నా ట్విట్టర్, నా ఫీలింగ్స్, నా రాతలు, నా ఇష్టం.
మీకు నచ్చకపోతే సింపుల్‌గా ఒకే ఒక్క క్లిక్‌తో నన్ను అన్‌ఫ్రెండ్ చెయ్యొచ్చు. నా బ్లాగ్ వైపు చూడకుండా ఉండొచ్చు. దట్ సింపుల్.
నేను రాసిన పాయింట్స్ మీద నిర్మాణాత్మక విమర్శలు చేయొచ్చు. ఆహ్వానిస్తాను. అంతే తప్ప - ఏవో పనికిరాని కామెంట్స్, వాట్సాప్ యూనివర్సిటీ రాతలు మాత్రం రాయకండి. నేను అసలు పట్టించుకోను. లేదంటే డిలీట్ చేస్తాను.
అలాంటి కామెంట్స్ వల్ల మీరేంటో మీ మానసిక స్థాయి ఏంటో అందరికీ తెలిసిపోతుంది.
బి ఆర్ యస్ సోషల్ మీడియా వారియర్స్ చూస్తే ఒక ఆట ఆడుకుంటారు.
కట్ బ్యాక్ టు భజన -
అలాంటి కామెంట్స్ వల్ల మీరేంటో మీ మానసిక స్థాయి ఏంటో అందరికీ తెలిసిపోతుంది.
బి ఆర్ యస్ సోషల్ మీడియా వారియర్స్ చూస్తే ఒక ఆట ఆడుకుంటారు.
కట్ బ్యాక్ టు భజన -
మిగిలినవారెవరి విషయమో నాకు తెలియదు. కానీ, నా విషయంలో మటుకు .. భజన వేరు. అభిమానం వేరు.
భజన ఒక భ్రమ. అభిమానం ఒక రియాలిటీ.
భజన వెనుక ఆశలు, కోరికలు, అవసరాలుంటాయి. అభిమానం వెనుక కేవలం ఫీలింగ్స్ ఉంటాయి.
ఈ రెండింటి మధ్య తేడాని గుర్తించలేనివాళ్లే నానా కామెంట్స్, నానా సౌండ్స్ చేస్తుంటారు. అదే అసలైన భజన అని నా ఉద్దేశ్యం.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani