1926 లో చలం "మైదానం" రాశాడు...
నా ఫేవరేట్ ప్రపంచస్థాయి రచయితల్లో చలం ముందు వరసలో ఉంటాడు. ఆకాలంలోనే ఆయన రాయగలిగిన ఆ అందమైన తెలుగు శైలిని ఇప్పుడు 2023 లో కూడా ఎవ్వరూ రాయడం లేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.
అలాంటి చలం... ఆరోజుల్లోనే... ఎంత అగ్రెసివ్, ఎంత అన్‌ట్రెడిషనల్ టాపిక్స్ పైన రచనలు చేశాడో అందరికీ తెలిసిందే. ఆ టాపిక్స్ అప్పుడే కాదు, ఇప్పుడు కూడా సంచలనాత్మకమైనవే!
అలాంటి రచయిత కూడా చివరికి స్పిరిచువాలిటీ అంటూ రమణ మహర్షి ఆశ్రమం చేరాడు.
ఈ స్పిరిచువల్ "ట్రాన్స్‌ఫార్మేషన్" కేవలం క్రియేటివ్ రంగాలవారిలోనే వస్తుందని కాదు. చరిత్రలో అలెక్జాండర్ వంటి రారాజు నుంచి, సాధారణ రొటీన్ మనుషుల విషయంలోనూ జరుగుతుంది.
ఈ విషయంలో ఉదాహరణలు లెక్కలేనన్ని ఉన్నాయి.
లైఫ్ అంతా ఉవ్వెత్తు కెరటాల్లా రకరకాలుగా ఎగిసిపడి, మిడిసిపడి, ఎదిరించి, తెగించి, యుధ్ధాలు చేసి, దేన్నీ లెక్కచేయకుండా ఎన్నోరకాలుగా జీవితాన్ని పీల్చి పిప్పిచేసి, విచ్చలవిడిగా ఎంజాయ్ చేసి, చివరాఖరికి వచ్చేటప్పటికి స్పిరిచువాలిటీ అంటారెందుకు అన్నది నా హంబుల్ కొశ్చన్!
ఆధ్యాత్మికతకు నిజంగా అంత పవరుందా?
తప్పకుండా ఉండే వుంటుంది.
ఆధ్యాత్మికత అనేది మన మనసుకు సంబంధించింది.
ఆధ్యాత్మికత వ్యక్తిగతం.
ఆధ్యాత్మికత వ్యక్తిగతం.
ఎవరి బోధనలు విన్నాము, ఎవరిని ఫాలో అవుతున్నాము, ఏ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము, ఎన్ని ప్రాచీన గ్రంథాలు చదివాము, ఎన్ని ఆధునిక పుస్తకాలు చదివాము అన్నది కాదిక్కడ ప్రశ్న. వాటన్నిటి ద్వారా తెలుసుకున్నదానితో నిన్ను నువ్వు ఏం తెలుసుకున్నావన్నదే సిసలైన స్పిరిచువాలిటీ.
ఈ జ్ఞానోదయానికున్న పవర్ ముందు మరింకే శక్తీ నిలవదంటే అతిశయోక్తి కాదు.
కట్ చేస్తే -
క్రియేటివిటీ, స్పిరిచువాలిటీ... ఈ రెండూ మొదటినుంచీ నాకత్యంత ఇష్టమైన అంశాలు. మొదటినుంచీ అంటే నాకు పుస్తకాలు చదవటం అలవాటైన నా స్కూలు రోజుల నుంచీ అని.
ఈ రెండూ చూడ్డానికి విభిన్నధృవాల్లా అనిపిస్తాయి. కానీ, రెండింటి సోల్ ఒక్కటే.
ఆనందం.
పల్ప్ ఫిక్షన్ రాసే ఒక రచయితలో, కమర్షియల్ సినిమాలు చేసే ఒక దర్శకునిలో ఆధ్యాత్మిక చింతన ఉండకూడదా?
ఆధ్యాత్మిక చింతన ఉన్న ఒక ఆర్టిస్ట్ బొమ్మలువేసి ఎగ్జిబిషన్ పెట్టకూడదా?
భారీ వ్యాపారాల్లో మునిగితేలే ఒక బడా వ్యాపారవేత్త ఒక ఆధ్యాత్మిక చిత్రం నిర్మించకూడదా?
ఎవరి వృత్తి, వ్యాపారం ఏమైనా కావొచ్చు. వారు ఏదైనా చేయొచ్చు. ఏ స్థాయికైనా ఎదగొచ్చు. కానీ, చివరికి అందరి అంతిమ గమ్యం ఆధ్యాత్మికమే అవుతుంది. ఆధ్యాత్మికానందమే అవుతుంది.
ఆ మార్పు తప్పదు.
ఒక అలెగ్జాండర్ కావొచ్చు. ఒక అశోకుడు కావొచ్చు. ఒక చలం కావొచ్చు. ఒక మహేష్‌భట్ కావొచ్చు. అందరూ అంతిమంగా ఆధ్యాత్మికానందం వొడికి చేరినవాళ్లే.
ఈ నిజాన్ని చరిత్ర పదేపదే రుజువుచేసింది.
క్రియేటివిటీ, స్పిరిచువాలిటీ. లేదా... ప్యాషన్, స్పిరిచువాలిటీ. ఈ రెండూ కలిసినప్పుడే మనం కోరుకున్న స్వేఛ్చ, ఆనందం మన సొంతమవుతాయి.
ఈ నిజాన్ని కూడా చరిత్ర పదేపదే రుజువు చేసింది.
అన్నీ వదిలేయడమే ఆధ్యాత్మికం కాదు.
ఆధ్యాత్మికం కోసం అలా అన్నీ వదిలేయడం తప్పనిసరి అని ఏ శాస్త్రం బహుశా చేప్పదనుకుంటాను.
నాకు తెలిసిన కొందరు చాలా ట్రెండీగా, మాడర్న్‌గా ఉంటారు చాలా విషయాల్లో. ప్రొఫెషనల్‌గా కూడా చాలా బిజీగా వుంటారు. అయితే - సమాంతరంగా వారి జీవితంలో మనం నమ్మలేని ఒక ఆధ్యాత్మిక పార్శ్వం కూడా నడుస్తుంటుంది. వీళ్లేం అన్నీ మానేసిన వృద్ధులు కారు.
ఆధ్యాత్మికం కోసం అలా అన్నీ వదిలేయడం తప్పనిసరి అని ఏ శాస్త్రం బహుశా చేప్పదనుకుంటాను.
నాకు తెలిసిన కొందరు చాలా ట్రెండీగా, మాడర్న్‌గా ఉంటారు చాలా విషయాల్లో. ప్రొఫెషనల్‌గా కూడా చాలా బిజీగా వుంటారు. అయితే - సమాంతరంగా వారి జీవితంలో మనం నమ్మలేని ఒక ఆధ్యాత్మిక పార్శ్వం కూడా నడుస్తుంటుంది. వీళ్లేం అన్నీ మానేసిన వృద్ధులు కారు.
మరోవైపు - మామూలుగా యాభై, అరవై దాటితే గాని అసలు ఈ ఆధ్యాత్మికం వైపు తొంగిచూడరు 90 శాతం మంది. అసలు ఆ ఆలోచన కూడా రాదు. దానికి కనెక్ట్ కారు.
జీవితంలో అన్నీ అయిపోయాకనో, లేదంటే జీవిత చరమాంకంలో ఏదైనా ఓ పెద్ద కుదుపు వచ్చాకనో కాకుండా... వయసులో ఉన్నప్పటినుంచే మనిషి తన మనసుని కొంత ఆధ్యాత్మికత వైపు కూడా మళ్ళించుకోగలిగితే మాత్రం... ఆ ఆనందమే వేరు.
... అలా అని నాకనిపిస్తుంది.
... అలా అని నాకనిపిస్తుంది.
కట్ చేస్తే -
పైనంతా ఏం రాశానో నాకే తెలీదు. అలా ఒక ట్రాన్స్‌లో రాసేశానంతే.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani