"ఏమైనా సరే, మీరు ఇప్పుడు ఒక మంచి సినిమా చెయ్యాలి. హిట్ ఇవ్వాలి. అందరూ ఏదేదో అంటున్నారు" అని ఆ మధ్య ఒక మిత్రుడు అన్నాడు నాతో.
అలా ఏదేదో అనేవాడెవ్వడూ మన సినిమాకు ఒక లక్ష రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేయలేడు. "లైట్ తీసుకో" అన్నాను.
కట్ చేస్తే -
నాకు కూడా నిజంగా ఒక హిట్ ఇవ్వాలనే ఉంది. కాని, మంచి బడ్జెట్‌తో దానికి సపోర్ట్ చేసే డైనమిక్ ప్రొడ్యూసర్ ఒకరు దొరకాలి. మధ్యలో చేతులెత్తేయకూడదు. ప్రమోషన్ వాల్యూ తెలిసి ఉండాలి. అడుగడుక్కి క్రియేటివిటీలో వేలు పెట్టకూడదు. అన్నిటికంటే ముఖ్యమైంది... అనుమానాలతో, నెగెటివిటీతో సినిమా మొదలెట్టొద్దు. అసలు సినిమా ఎందుకు చేస్తున్నామో ఒక ఖచ్చితమైన క్లారిటీ ఉండాలి.
అంత ఈజీ కాదు.
నిజంగా దొరకరు.
మనమే క్రియేట్ చేసుకోవాలి.
లేదా, మనమే చెయ్యాలి.
కట్ చేస్తే -
ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ డైరెక్టర్ అయినా సినిమా హిట్ కావాలనే చేస్తారు. ఫ్లాప్ కోసం చెయ్యరు. డబ్బులు పోగొట్టుకోవాలనుకోరు.
కాని, హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా, ఎప్పుడైనా ఎక్కడైనా... ఎక్కువలో ఎక్కువ ఒక 5% సినిమాలు మాత్రమే మంచి బిజినెస్ చేస్తాయి. హిట్ అవుతాయి.
ప్రపంచంలో ఎక్కడైనా ఇదే లెక్క.
ఆ 5% హిట్స్‌లో మనం ఉండాలి.
అదీ అసలు లెక్క.
హెవీ గ్యాంబ్లింగ్.
అయితే...
సుమారు 5 కోట్ల పరిమిత బడ్జెట్లో, న్యూ టాలెంట్‌తో తీసే చిన్న బడ్జెట్ సినిమాల విషయంలో మాత్రం ఈ రిస్క్ దాదాపు లేదు. దీనికి సినిమా జయాపజయాలతో సంబంధం లేదు.
చెప్పాలంటే,
సుమారు 5 కోట్ల పరిమిత బడ్జెట్లో, న్యూ టాలెంట్‌తో తీసే చిన్న బడ్జెట్ సినిమాల విషయంలో మాత్రం ఈ రిస్క్ దాదాపు లేదు. దీనికి సినిమా జయాపజయాలతో సంబంధం లేదు.
చెప్పాలంటే,
ఈ కేటగిరీలో సినిమా అంటే
నిజంగా ఒక బిగ్ బిజినెస్.
ఒక జాక్‌పాట్.
ఒక జాక్‌పాట్.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani