Tuesday, 28 April 2026

అందుకే ఆయన ఒక బ్రాండ్ అయ్యారు


ఏ సందర్భం, ఏ వేదిక, లేదా ఇంటర్యూనా... సరిగ్గా నాకు గుర్తు లేదు. కాని, చాలారోజుల క్రితం యండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక విషయం చెప్పారు...

వీరేంద్రనాథ్ గారిని ఎవరో అడిగారట:   

"మీరు ఇప్పటికీ ఇంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారు? ఏం జాగ్రత్తలు పాటిస్తారు? ఏమిటా సీక్రెట్?" అని. 

"నాకంత టైమ్ లేదయ్యా... ఈ జాగ్రత్తలూ, హాస్పిటల్సూ టెస్టులూ అనుకుంటూ ఎక్కడ కుదురుతుంది చెప్పు?" ఇది వీరేంద్రనాథ్ గారి సమాధానం.   

ఇంక దీని గురించి నేను వివరించి చెప్పే అవసరం లేదనుకుంటాను. 

అందుకే ఆయన ఒక బ్రాండ్ అయ్యారు - 
యండమూరి వీరేంద్రనాథ్. 

కట్ చేస్తే -      

మన సమయం విలువ.
మనం చేస్తున్న పనులు.
మన లక్ష్యాలు.
మన నిర్ణయాలు.
మన స్నేహాలు, బంధాలు. 
మనం తీసుకునే ఆహారం.
మన దినచర్య.

వీటన్నిటి పట్ల ఒక ఖచ్చితమైన స్పష్టత ఉన్నప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఈ రెండూ బాగున్నప్పుడు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేసుకుంటూపోతుంటాం. కొన్ని పనులు అవొచ్చు, కొన్ని అవకపోవచ్చు. అది వేరే విషయం. కాని, ఎప్పుడూ పనిలో ఉంటాం.  

ఇలా ఎప్పుడూ మనకిష్టమైన ఏదో ఒక పనిలో ఉండటం వల్ల కూడా మన ఆరోగ్యం బాగుంటుంది.    

కాని, ఎంతమందికి ఈ స్పష్టత ఉంటుంది?  

'యస్' చెప్పాల్సిన చోట 'నో' చెప్పి, 'నో' చెప్పాల్సిన చోట 'యస్' చెప్పి, జీవితంలోకి ప్రతి నాన్సెన్సునూ ఆహ్వానించి, మన మనసుల్ని మున్సిపాలిటీ చేసుకుంటున్నాం. అనారోగ్యం తన్నుకురాక ఏం చేస్తుంది?  

You can chase success for years, but without health, you won’t have the strength to hold it.

- మనోహర్ చిమ్మని      

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani