Sunday, 12 April 2026

ప్రతి ఒక్కరూ ఒక మీడియా హౌజ్ కిందే లెక్క!


ఇప్పుడు, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రతి ఒక్కరూ ఒక మీడియా హౌజ్ కిందే లెక్క! 

మనకిష్టమైన కంటెంట్ ఏదైనా రాసుకోవచ్చు. పబ్లిష్ చేసుకోవచ్చు. మన ఇష్టం.

అయితే - ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒక ప్రయోజనం తప్పనిసరిగా ఉండాలి.  

ఏం రాస్తున్నాం?
ఎందుకు రాస్తున్నాం?
ఏదైనా లాభముందా?
డబ్బొస్తుందా?
మన లక్ష్యానికి పనికొచ్చే కొత్త లీడ్స్ దొరుకుతాయా? 
ఊరికే వ్యక్తిగత సంతృప్తి కోసమేనా?
రిలాక్స్ కోసమా? జస్ట్ టైమ్ పాసా?
ఏదైనా స్ట్రెస్ నుంచి, సమస్య నుంచి డైవర్షన్ కోసమా?

ఈ క్లారిటీ చాలా అవసరం.

ఈ క్లారిటీ లేకుండా జుకెర్‌బర్గో, ఈలన్ మస్కో చెప్పినట్టు మనం చేస్తున్నాం, వాళ్ళు ఆడమన్నట్టు ఆడుతున్నాం అంటే మాత్రం... మనం వాళ్ళకు ఉపయోగపడుతున్నట్టు లెక్క. కాని, మన మీద బిలియన్స్ సంపాదిస్తున్న మస్క్, బర్గ్‌లను మనం కూడా ఏ కొంచెమో వాడుకోవాలన్నది నా పాయింట్! 

- మనోహర్ చిమ్మని  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani