పాకిస్తాన్ మన కశ్మీర్‌లో కొంత ఆక్రమించుకోవడం... మన దేశంలోకి టెర్రరిస్టులను అదేపనిగా పంపిస్తుండటం... మన జవాన్లను రకరకాలుగా చంపుతుండటం... సరిహద్దుల దగ్గర ఎప్పుడూ ఏదో ఒకటిచేస్తూ నిరంతరం మన ఆర్మీకి, ఇతర సేనలకు నిద్రలేకుండా పని కల్పిస్తుండటం... దేశంలో ఎక్కడో అక్కడ బాంబింగ్స్ చేయిస్తూవుండటం... ఇవన్నీ దశాబ్దాలుగా వింటున్నాం. చూస్తున్నాం.
పాకిస్తాన్ ఒక చిన్న దేశం.
మన దేశం కంటే వైశాల్యంలో నాలుగింతలు చిన్నది.
నిజంగా అనుకుంటే, అమెరికాలాగా ఒకే ఒక్క ఎటాక్‌తో పాకిస్తాన్‌ను మళ్ళీ మన జోలికిరాకుండా దెబ్బతీయొచ్చు. అక్కడ మనకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటుచెయ్యొచ్చు.
మన నాయకులు, గవర్నమెంట్స్ ఇవేవీ చెయ్యవు.
ఇంకో వందేళ్లయినా ఇదే "పాకిస్తాన్ బూచి" కథ ఒక ముగింపు లేని సీరియల్‌లా నడిపిస్తూనేవుంటారు. ఆ బూచిని చూపిస్తూ, ఇక్కడ ఓట్లను ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూనేవుంటారు. చేస్తూ గెలుస్తూనేవుంటారు.
కట్ చేస్తే -
ఇదే పాకిస్తాన్ బూచిని చూపిస్తూ మనవాళ్ళు ఇప్పటికే ఓ 200 సినిమాలు తీశారు. ఇంకా తీస్తున్నారు. తీస్తూనే వుంటారు.
పాకిస్తాన్ - ఒక అంతులేని కథ.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani