తను ఏం మాట్లాడుతున్నది తనకే తెలీక మాట్లాడ్డం వేరు.
"ఆ ఏముందిలే, నా పనైతే అయిపోయిందిగా, లైట్!" అనుకొని, తెలిసి, ఏదిపడితే అది మాట్లాడ్డం వేరు.
ఇది కనుక్కోవడం కొందరి విషయంలో కష్టం. బహుశా అదే వాళ్ళకుండే ఒక మంచి అడ్వాంటేజ్.
ఇది కనుక్కోవడం కొందరి విషయంలో కష్టం. బహుశా అదే వాళ్ళకుండే ఒక మంచి అడ్వాంటేజ్.
కాని, ఎవరిలోనైనా పాజిటివ్ అంశాలనే నేను వెతుక్కుంటాను, ఇష్టపడతాను. అందువల్ల లోపల్లోపల నేను ఎంత హర్ట్ అయినా, అవుతున్నా, దాన్ని లోపలే తొక్కిపెట్టేస్తాను. పైదాకా రానివ్వట్లేదు. రానివ్వను.
ఏమీ అనలేక కాదు. దానివల్ల ఉపయోగం లేదు. వినరు.
ఎదురు మళ్ళీ మనమే ఇంకొన్ని మాటలు అనిపించుకోవటం తప్ప వేరే ప్రయోజనం లేదు.
కట్ చేస్తే -
దేవుడు కొన్ని సందర్భాలను కావాలనే ఇట్లా క్రియేట్ చేస్తాడనుకొంటున్నా.
ఆయన మాట నేను వినట్లేదని, ఇది నా మీద ఆయన ప్రయోగించిన ఆఖరు అస్త్రం అనుకుంటున్నా.
Just leave and walk away from those who cannot honor the respect you give. Your energy is too precious to waste on distractions—focus on what truly deserves your importance.
Just leave and walk away from those who cannot honor the respect you give. Your energy is too precious to waste on distractions—focus on what truly deserves your importance.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani