Monday, 8 September 2025

అనుకోకుండా ఒకరోజు...


మా మ్యూజిక్ కంపోజర్ ప్రదీప్ చంద్ర మూడు-నాలుగేళ్ళుగా అడుగుతూనేవున్నాడు... "యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చెయ్యండి సార్" అని. నేను విన్లేదు. 

"మనకెందుకు ప్రదీప్... ఓ రెండు సినిమాలు చేసుకొని, నాలుగు డబ్బులు సంపాదించుకొని బయటపడదాం" అనేవాణ్ణి. 

ఆ రెండు సినిమాలు ఇంకా చెయ్యలేదు మేము. ఎప్పుడు చేస్తామో తెలీదు. అసలు చెయ్యకపోవచ్చు. అది వేరే విషయం.

మా ఇద్దరికీ ఉన్న తిక్క అలాంటిది. 

కట్ చేస్తే -

మొన్న ఓ పది రోజుల క్రితం అనుకోకుండా "10X మీడియా" పేరుతో అప్పటికప్పుడు ఒక స్టార్టప్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారుచేసి, మా ప్రదీప్‌కు పంపించాను. వెంటనే రిజిస్ట్రేషన్ కూడా పూర్తిచేశాం. ఫండింగ్ కోసం మా స్టార్టప్ రిపోర్ట్‌ను ఓ నాలుగైదు ప్లేస్‌లకు ఫార్వార్డ్ చేశాం. 

కొన్ని గంటల్లోనే యూట్యూబ్ చానెల్లో వీడియోలు అప్‌లోడ్ చెయ్యటం ప్రారంభించాను. 

నా యూట్యూబ్ చానెల్ పేరు నా : Manohar Chimmani. 

ఈ చానెల్లో మూడు విభాగాల్లో వీడియోలు అప్‌లోడ్ చేస్తాము: 
1. Music   
2. Red Wine Time (నా సోలో టాక్స్)
3. The Manohar Chimmani Show 

రెండో చానెల్: 10X Telangana - Just Politics. 
(Link will be posted after the launch.)

ఈ రెండో చానెల్ సంపూర్ణంగా పాలిటిక్స్‌కే అంకితం. ఈ చానెల్ కూడా అతి త్వరలో ప్రారంభమవుతుంది. 

నా సోలో టాక్స్‌తో ఒక రకంగా ప్రాక్టీస్ జరుగుతోంది. మ్యూజిక్, ది మనోహర్ చిమ్మని షో వీడియోల అప్‌లోడ్ కూడా త్వరలోనే ప్రారంభిస్తాము. 

మరోవైపు, నా సోలో టాక్స్‌కు పెద్దగా సెటప్ & ఇక్విప్‌మెంట్ అవసరం లేదు. కాని, 10X తెలంగాణ చానెల్ విషయంలో మాత్రం ముందుగానే ఏర్పాటు చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి.   

ప్రస్తుతం ఆ పనుల్లో కూడా బిజీగా ఉన్నాము.  

నాకిప్పటికే ఆల్రెడీ ఉన్న కొన్ని స్టకప్‌లు, స్ట్రెస్ మధ్య, ఇప్పుడిదొక కొత్త హాబీ-కమ్-యాక్టివిటీ అయ్యింది. కొంచెం ఇబ్బందిగా ఉన్నా, ఎంజాయ్ చేస్తున్నాను. 

కెమెరా వెనకుండి వేరేవాళ్ళకు నేను "యాక్షన్" చెప్పడం వేరు. నేనే కెమెరా ముందుకొచ్చి మాట్లాడ్డం వేరు. కొంచెం కొత్తగా ఉంది.


థాంక్యూ సో మచ్. 

There are no limits—only horizons.

- మనోహర్ చిమ్మని. 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani