Sunday, 28 September 2025

ది మనోహర్ చిమ్మని షో


టిమ్ ఫెర్రిస్, జేమ్స్ ఆల్టుచర్ లాంటి వారి పాడ్‌కాస్టులు విన్న తర్వాత, చూసిన తర్వాత... ఇంచుమించు ఆ స్థాయిలో మన తెలుగులో కూడా పాడ్‌కాస్టులు వస్తే బాగుంటుంది కదా అని ఒక అయిదారేళ్ళ నుంచీ అనుకుంటున్నాను. 

ఈ మధ్యలో తెలుగులో చాలా పాడ్‌కాస్టులు వచ్చాయి. ఒకటి రెండు ఇంటరెస్టింగ్‌గా ఉన్నాయి. 

"మనం కూడా ఒక యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేద్దాం సార్" అని మా ప్రదీప్, నాగ్ ... రెండుమూడేళ్ళుగా ఎన్నిసార్లు చెప్తున్నా విననివాణ్ణి, ఉన్నట్టుండి యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కిందామీదా పడి ఏదో ప్రాక్టీస్ చేస్తున్నాను. 

కాని, నా అసలు లక్ష్యం పాడ్‌కాస్ట్...
The Manohar Chimmani Show.

కట్ చేస్తే - 

కేవలం పొలిటికల్ అంశాలతో ప్రత్యేకంగా "10X తెలంగాణ" అని రెండో యూట్యూబ్ చానెల్ కూడా ప్రారంభించాలనుకొన్నాను. చాలా ప్లాన్ చేశాను ఆ దిశలో. 

కాని, "ది మనోహర్ చిమ్మని షో" ఒక్కటి చాలు. ఇందులోనే అన్నీ వచ్చేట్టుగా చేసుకోవచ్చు. పాలిటిక్స్ కూడా.  

అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తేదీ ఇంకా అనుకోలేదు కాని, అక్టోబర్ లోనే నా పాడ్‌కాస్టు ప్రారంభిస్తున్నాను. 

Podcasts can be thoughtful, connective, and even life-changing — like books. But they can also be addictive, shallow, and manipulative — like cigarettes. With my soon-to-launch podcast, The Manohar Chimmani Show, I aim to create something thoughtful, soulful, and deeply connective — a podcast that can be life-changing, like books. 

- మనోహర్ చిమ్మని   

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani