1. నువ్వెక్కడ జీవిస్తావు?
2. ఎవరితో జీవిస్తావు?
3. ఏం చేస్తూ జీవిస్తావు?
దురదృష్టవశాత్తూ, ఈ క్లారిటీ వచ్చేటప్పటికే 99% మందికి చేతులు కాలిపోతాయి. దశాబ్దాల సమయం వృధా అయిపోతుంది.
కనీసం కొత్త తరం వాళ్లయినా ఈ విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ మూడు విషయాల్లో క్లారిటీ ఉంటే జీవితం నిజంగా అద్భుతంగా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు.
కట్ చేస్తే -
సమయం దాటిపోయిందని ఎవ్వరూ బాధపడనక్కర్లేదు. నిజంగా మీకు గట్స్ ఉంటే ఈరోజు కూడా మీరు ఆ మూడు నిర్ణయాలు తీసుకోవచ్చు. లేదా, ఒక వారం రోజులు తీరిగ్గా, కూల్‌గా, ఒకటికి నాలుగుసార్లు బాగా ఆలోచించి కూడా నిర్ణయాలు తీసుకోవచ్చు.
నిర్ణయాలు తీసుకోవడం అనేది మాత్రం తప్పనిసరి. ఆ దిశలో తగినవిధంగా కృషిచేయడం కూడా తప్పనిసరి.
అప్పుడే మీరు ఆనందంగా జీవిస్తారు. అనుకున్న జీవనశైలిని ఎంజాయ్ చేస్తారు.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani