Wednesday, 17 September 2025

ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, అమెరికా... అన్నిచోట్లా అదే!


యూకే సహా, కొన్ని దేశాల్లో ఇస్లాం మతం వాళ్ళు బాహాటంగా చేస్తున్న కొన్ని ప్రదర్శనలు, పనులు నిజంగా భయపెట్టిస్తున్నాయి. ట్రంప్ అయితే నేనసలు వాళ్లని మా దేశంలోకే ప్రవేశించనీయను అంటున్నాడు.    

అసలు అంత దాకా యూకే ఎందుకు తెచ్చుకుంది? నాకర్థం కాలేదు. ఇటీవలి అంతర్జాతీయ రాజకీయ, మత సంబంధమైన విషయాల్లో నేను ఎంత వెనుకబడి ఉన్నానో నాకు తెలుస్తోంది. కొంతైనా అధ్యయనం చెయ్యాలి. 

ఇదొక భయంకరమైన కోణం కాగా, మరోవైపు, ఇంకొక పెద్ద సమస్య నన్ను నిజంగా డిస్టర్బ్ చేస్తోంది. 

భారతీయులు వెనక్కిపోవాలి అని మొన్న ఆస్ట్రేలియాలో లక్షలాది మంది ఆస్ట్రేలియన్లు రోడ్లమీదకి వచ్చి చేసిన భారీ బహిరంగ నిరసన అస్సలు ఊహించనిది. 

నిన్న ఒక యూట్యూబ్ వీడియోలో బ్రిటన్ వాళ్ళు ఒక భారతీయ సంతతి యువతిని చేజ్ చేస్తూ రేసిజమ్ చూపిస్తున్న దృశ్యం ఇంకా మర్చిపోలేకపోతున్నాను. 

అమెరికాలో ఒక భారతీయున్ని, అతని భార్య, పిల్లల ఎదురుగా నరికి చంపిన వార్త జీర్ణం చేసుకోలేకపోతున్నాను. 

కెనడాలో, యూరప్‌లోని కొన్ని దేశాల్లో కూడా భారతీయుల్ని వెనక్కి వెళ్ళిపొమ్మంటున్నారని చదివాను. చూస్తున్నాను.        

ఇవన్నీ చాలా సున్నితమైన అంశాలు. ఎక్కడికి దారితీస్తాయో అర్థం కావడం లేదు.  

ఆవేశంతో ఒకసారి ఏదైనా జరగరానిది జరిగితే... తర్వాత భారీ ధనప్రాణ నష్టం పరిస్థితి తల్చుకుంటేనే వొళ్ళు గగుర్పొడుస్తోంది. 

What’s happening in countries like the UK, Canada, the US, and Australia — both politically and religiously — shouldn’t have happened. The real reason behind all this tension is nothing but brutal politics. After all, religion is a man-made construct. It should first uphold humanity. Otherwise, there’s no point in following that religion or political party.

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani