Saturday, 31 August 2024

Angry Young Men


"జంజీర్" స్క్రిప్ట్‌కు 'నో' చెప్పిన హీరోలు: ధర్మేంద్ర, రాజ్ కుమార్, రాజేశ్ ఖన్నా, దిలీప్ కుమార్. 

కారణం... హీరోకు పాటల్లేని 'యాంగ్రీ రోల్' అని. 

డైరెక్టర్ ప్రకాశ్ మెహ్రా మాత్రం ఎవ్వరికోసం స్క్రిప్ట్ మార్చలేదు. ఆ స్క్రిప్ట్‌ను అలాగే తీయాలనుకున్నాడు.  

కట్ చేస్తే - 

అమితాబ్ బచ్చన్... 

తెర మీద కొత్తగా ఒక యాంగ్రీమ్యాన్ పుట్టాడు. బాలీవుడ్ బ్రహ్మరథం పట్టింది. 

అలా ఒక అమితాబ్ బచ్చన్ క్రియేట్ కావడానికి కారణమైన ఆ స్క్రిప్ట్ రైటర్సే... ఆ తర్వాత బాలీవుడ్‌లో టాప్ హీరోలకంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నారు. "షోలే" వంటి బ్లాక్ బస్టర్ సినిమా స్క్రిప్టుల్ని సృష్టించారు.

భారత సినీ పరిశ్రమలో మొట్టమొదటిసారిగా ఫిలిం రైటర్స్‌కు క్రేజ్‌ను, పారితోషికాన్ని హీరోలకంటే మించి సాధించుకున్న ఆ రైటర్స్... సలీం-జావేద్.

- మనోహర్ చిమ్మని 

***

(Watch the awesome 'Angry Young Men' in Amazon Prime.)

మన అసలు శత్రువుల్ని మనం పట్టించుకుంటున్నామా?


మనలోని ప్రతి చిన్న నిర్లక్ష్యపు అలవాటు... మన జీవితంలో మనం కోలుకోలేని అతి పెద్ద ఓటములకు ప్రధాన కారణమవుతుందంటే మనం నమ్మలేం.

కాని, నిజం.

కట్ చేస్తే - 

ఈ ఒక్క వాక్యం చెప్పడానికి జేమ్స్ క్లియర్ అనే అతను ఒక పుస్తకమే రాశాడు.

ఆటమిక్ హాబిట్స్.

ఈ ఒక్క పుస్తకం ప్రపంచంలోని 60 ప్రధాన భాషల్లోకి అనువదించబడింది. మిలియన్ల కాపీలు అమ్ముడుపోయింది.

జేమ్స్ క్లియర్ కూడా మిలియన్స్‌లో సంపాదించాడు.  

- మనోహర్ చిమ్మని 

Friday, 30 August 2024

తెలుగులో నా బ్లాగింగ్ ప్రయాణం ప్రారంభించిన రోజు!


ఆగస్టు 30, 2012... 

12 ఏళ్ళ క్రితం, సరిగ్గా ఈరోజే నేను తెలుగులో నా బ్లాగింగ్ ప్రయాణం ప్రారంభించాను! 

కట్ చేస్తే -

థాంక్స్ టు lekhini.org, ఇది నా దృష్టిలో ఆరోజు పడకపోతే ఈ బ్లాగ్ లేదు. నా బ్లాగింగ్ లేదు. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

ఆరోజు నేను తెలుగు టైపింగ్ గురించి సెర్చ్ చేస్తుంటే దొరికిన లింక్... లేఖిని. తర్వాత అరగంటపాటు అదొకటి ఇదొకటి బ్రౌజ్ చేస్తూ, చివరికి నేనీ బ్లాగ్ సృష్టించడానికి ఆరోజు కారణమైంది లేఖిని. 

అలా, నా బ్లాగింగ్ విషయంలో ఒక "బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌"లా పనిచేసిన లేఖిని సృష్టికర్తకు నా వందనాలు. తర్వాత ట్విట్టర్లో కలిసినప్పుడు వారికి ఈ విషయం ఒకసారి చెప్పాను కూడా.  

సినిమాఫీల్డు, క్రియేటివిటీలకు సంబంధించి నాకు తెలిసిన విషయాలను, నేను పంచుకోవాలనుకొనే విషయాలను ఉన్నదున్నట్టుగా రాయడం అన్న అర్థంలో, ముందు నా బ్లాగ్‌కు "నగ్నచిత్రం" అని పేరు పెట్టాను. తర్వాత డాక్టర్ ఉషారాణి అని నా స్టుడెంట్, ఇంకొక ఇద్దరు ముగ్గురు పాఠకులు బ్లాగ్ టైటిల్ గురించి ఇంకోసారి ఆలోచించమని నాకు సూచించారు. కొన్నాళ్ళు "మనోహర్ చిమ్మని" అని నా పేరుకే మార్చాను. కాని, ఓ రెండు నెలల తర్వాత వెంటనే నా బ్లాగ్ ఒరిజినల్ పేరు "నగ్నచిత్రం"కు రివర్ట్ అయ్యాను. చాలామంది మొదటి టైలే బాగా సెట్ అయింది అన్నారు. ముఖ్యంగా నా ఇంకో స్టుడెంట్, "గై ఆన్ ది సైడ్ వాక్" బెస్ట్ సెల్లర్ ఫిక్షన్ రైటర్ భరత్‌కృష్ణ.  

ఈ మధ్యే మళ్ళీ ఒక 20 రోజుల క్రితం నా బ్లాగ్ పేరుని "మనోహరమ్" కు మార్చాను. ఎందుకో అలా మార్చాలనిపించించింది నాకు. 

సినిమాలు, క్రియేటివిటీ వంటి విషయాల్లో నా ప్రయారిటీస్ మారిపోయాయి. నేనూ మారాను. ఇంతకుముందులా పాలిటిక్స్ మీద కూడా అప్పుడప్పుడు బ్లాగ్‌లో ఏదో ఒకటి రాయడం పూర్తిగా మానుకున్నాను. 

ఈ నేపథ్యంలో నా బ్లాగ్‌కు ఈ టైటిలే బాగుంటుంది అనిపించింది... మనోహరమ్.   

నా బ్లాగింగ్ జర్నీలో నాకు కలిసిన ఎందరో మిత్రులు, పాఠకులు... అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు!                

- మనోహర్ చిమ్మని 

Wednesday, 28 August 2024

ఒక్క ఛాన్స్!


ఒక 7, 8 పెద్ద హీరోల సినిమాలు పక్కనపెడితే... సంవత్సరానికి కనీసం ఒక 250 సినిమాలు తెలుగులో నిర్మిస్తున్నారు. ఇంకా ఎక్కువే.   

వీటిలో సగం సినిమాలు కొత్తవాళ్ళతో తీసినా, మిగిలిన 125 సినిమాలకు చిన్నా చితకా హీరోలు, హీరోయిన్స్ కావాలి. సో, ఏ కొంచెం ఫేస్ వాల్యూ ఉన్న చిన్న సపోర్టింగ్ ఆర్టిస్టుకైనా, అతి చిన్న కమెడియన్‌కయినా ఇప్పుడు హీరో-లేదా-హీరోయిన్ అయ్యే చాన్స్ 100% ఉంది. ఇది మీరు ఆల్రెడీ చూస్తున్నారు. 

మీకు నిజంగా ఆసక్తి ఉందా? 

నాకు DM చెయ్యండి: https://x.com/MChimmani 

డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో 'ఒక్క ఛాన్స్' కోసం చూస్తున్నారా?


1. తెలుగు తప్పుల్లేకుండా రాయగలరా?
2. స్క్రిప్ట్ రైటింగ్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉందా?
3. ఇంగ్లిష్‌లో మాట్లాడగలరా?
4. యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేయగలరా?
5. కాన్వా/ఫోటోషాప్ తెలుసా?
6. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారా? రీల్స్ చేయగలరా?
7. ల్యాప్‌టాప్/టాబ్లెట్ గానీ ఉందా?
8. బైక్ ఉందా?
9. మీ వయస్సు 29 లోపలే ఉందా?
10. అప్రెంటిస్‌గా వెంటనే జాయిన్ కాగలరా?

6/10 మీ సమాధానం "అవును" అయితే, నాకు DM చేయండి. వాకిన్ ఇంటర్వ్యూ తర్వాత, అర్హులైనవారిని వెంటనే నా టీమ్‌లోకి తీసుకుంటాను.

29 కంటే తక్కువ వయసున్న అమ్మాయిలకు, అబ్బాయిలకు మాత్రమే ఈ అవకాశం.

ఇది ఉద్యోగం కాదు. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయడానికి అవకాశం మాత్రమే. పై స్కిల్స్ బాగా ఉన్నవారికి మాత్రం మంత్లీ పాకెట్ మనీ ఇస్తాం. టైటిల్ కార్డ్స్‌లో మీ పేరు వేస్తాం.

నాకు మీ పూర్తివివరాలతో DM చేయండి: https://x.com/MChimmani

All the best. 

Tuesday, 27 August 2024

ఓయూ జ్ఞాపకాల్లో మా యాకూబ్@35 !!


అనేకమంది ఉద్దండులయిన కవులూ, రచయితల వ్యాసాలతో కూడిన ఒక ప్రత్యేక సంచిక కోసం నేనేం రాయగలను అని ముందు సందేహించాను. కాని, మా యాకూబ్ జీవితంలోని ఇలాంటి ఒక ప్రత్యేక సందర్భంలో మిత్రుడిగా నేను ఏం రాయకపోవడం అన్నది నా బాధ్యతను విస్మరించడమే అవుతుందని తర్వాత నాకనిపించింది.  

ఇది సాహిత్య వ్యాసం కాదు. కాని, యాకూబ్‌తో ఓయూ క్యాంపస్ కాలంనాటి నా జ్ఞాపకాలు ఖచ్చితంగా అలాంటి సౌరభాన్నే అందించగలవని నా నమ్మకం.  

అందరి విషయాల్లో, అన్ని సందర్భాల్లో... ఒక్క డబ్బు సంపాదనే విజయానికి కొలమానం కాదు. అనుకున్నట్టుగా జీవించటం కూడా విజయమే!    

'యాకూబ్ @ 60' ప్రత్యేక వ్యాసాల సంకలనం కోసం  నేను రాసిన వ్యాసం ఇదీ: 

"యాకూబ్ అంటే నాకిష్టం. ఎమ్మేలో నా క్లాస్‌మేట్, నా మిత్రుడు అనే కాదు… మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇల్లందుకు రొట్టమాకురేవు చాలా దగ్గరవటం వల్ల కూడా కాదు…  

35 ఏళ్ల క్రితం ఓయూ ఆర్ట్స్ కాలేజిలోని మా ఎమ్మే తెలుగు క్లాసులో మొట్టమొదటిసారిగా యాకూబ్‌ను కలిసిన రోజు, అతను మాతో మొదటిసారిగా మాట్లాడిన మాటలు నాకిప్పటికీ గుర్తున్నాయి: 

"నా పేరు యాకూబ్. ఓయూ పీజీ కాలేజీ నుంచి ఆర్ట్స్ కాలేజికి ట్రాన్స్‌ఫర్ చేయించుకొని వచ్చాను."

ఎమ్మే తెలుగులో ఇద్దరం ఒకటే క్లాసు. క్యాంపస్‌లో ఇద్దరం ఒకటే హాస్టల్. అప్పటి మా స్నేహం, నాతోపాటు మా ఎమ్మే మిత్రబృందం అందరితోనూ ఇంకా కొనసాగుతూనే ఉంది.  

క్యాంపస్‌లో యాకూబ్ ఎక్కువగా విద్యార్థినాయకులతో కలిసి తిరుగుతూ కనిపిస్తుండేవాడు. ఆర్ట్స్ కాలేజి మీటింగ్ హాల్ “రూమ్ నంబర్ 57” లో ఏవైనా సమావేశాలు జరిగినప్పుడు, క్యాంపస్ హాస్టళ్ళలో ఏవైనా సమావేశాలు జరిగినప్పుడు పాటలు పాడుతుండేవాడు. స్టుడెంట్స్ ఎలక్షన్స్‌లో కూడా చాలా యాక్టివ్‌గా పాల్గొనేవాడు. 

మేమంతా ఒక్కటే మిత్రబృందం అయినా - మా స్టుడెంట్స్ యూనియన్ యాక్టివిటీస్, ఇష్టాలు విభిన్నంగా ఉండేవి. నేను రాడికల్ స్టుడెంట్స్ యూనియన్ (RSU) రహస్య సమావేశాల్లో పాల్గొనేవాణ్ణి. నా అతి దగ్గరి మిత్రులు కొందరు PDSU లో, ఇంకొందరు ABVP లో తిరుగుతుండేవాళ్ళు. యాకూబ్ ఆరోజుల్లో SFI లో ఒక స్థాయి లీడర్‌నే చెప్పాలి. అప్పట్లో అదంతా వేరే ఒక లోకం.  

ఆ లోకానికి అసలు సంబంధమేలేని విధంగా, పూర్తిగా ఒక భిన్నమైన ఇంకో లోకంలో "Big 5" అని మా క్లోజ్‌డ్ మిత్రబృందం ఒకటి చాలా యాక్టివ్‌గా ఉండేది. ప్రిన్సిపాల్‌గా ఇటీవలే రిటైరయిన దయానంద రావ్, డిప్యూటీ సెక్రెటరీగా రిటైరయిన ప్రతాప్ రెడ్డి, లెక్చరర్-జర్నలిస్టు శేషాద్రి, సీనియర్ జర్నలిస్టు-ఎడ్యుకేషనిస్టు రాందాస్, నేనూ… ఈ బిగ్ ఫైవ్‌లోని ఐదుగురు హార్డ్‌కోర్ మిత్రులం. 

క్లాసులో, కారిడార్లలో, కేంటీన్లలో, పిక్నిక్స్‌లో, విహారయాత్రల్లో ఎప్పుడూ మేం చాలా యాక్టివ్‌గా ఉండేవాళ్లం. క్యాంపస్ పరిసరాల్లోని చెట్లకింద, బండలమీద అర్థరాత్రులు దాటిపోయేదాకా కూర్చొని చాయ్‌లూ, సిగరెట్లూ, ప్రేమలూ వైఫల్యాలూ, భావుకత్వం, పుస్తకాలూ కవిత్వాలూ, పాటలు, జోకులు, కేకలు... మావన్నీ అలా ఒక రేంజ్‌లో నడిచేవి.  

"బిగ్ ఫైవ్ ఏంట్రా మీరు స్పెషల్‌గా...?" అని అప్పుడప్పుడూ మా అయిదుగురిమీద ప్రేమగా మొదలెట్టి, తర్వాత పీక్స్‌కెళ్ళి మాంచి ‘సంస్కృతం’లో అరిచేవాడు యకూబ్. 

తనలోకంలో అలా కొనసాగుతూనే, క్రమంగా మా లోకంలో కూడా కనెక్టయిపోయాడు యాకూబ్. అలా కనెక్ట్ కావడం కావడమే - ఒక మండు వేసవిలో అందరం కలిసి యాకూబ్ ఊరు రొట్టమాకురేవుకి అప్పటికప్పుడు అనుకొని సికింద్రాబాద్ స్టేషన్లో రైలెక్కడానికి దారితీసింది. 

రొట్టమాకురేవు... 

మా జ్ఞాపకాల్లో అదింకా ప్రవహిస్తూనే ఉంది. మా బిగ్ ఫైవ్ మిత్రబృందం, యాకూబ్‌తో కలిసి వెళ్ళిన ఆ నాలుగయిదురోజుల ట్రిప్పులో ప్రతి చిన్న అంశం నాకింకా గుర్తుంది, 35 ఏళ్లు గడిచినా... 

పొడిపొడిగా, తడితడిగా ఉన్న మట్టిదారుల్లో మేమంతా జోక్స్ వేసుకొంటూ, పాటలు పాడుకొంటూ, కేకలూ పెడబొబ్బలు పెట్టుకొంటూ (అతిశయోక్తి కాదు!) నడుచుకొంటూ వెళ్ళి చేరుకొన్న నదీమూలం లాంటి ఆ మట్టిగోడల ఇల్లు, దానిపక్కనే ఎడ్ల చావిడి, చుట్టూ ఒక అతి చిన్న పల్లెటూరి పరిసరాల ఫ్రాగ్రెన్సీ... ఇప్పటికీ నేను మర్చిపోలేని ఒక మంచి అనుభూతి.  

యాకూబ్ ఇంటి నుంచి నాలుగడుగులు నడిస్తే వచ్చే బుగ్గవాగు, వాగులో మా ఈతలూ స్నానాలూ... రొట్టమాకు రేవు నుంచి గేట్ కారేపల్లికి రోజూ మేం నడుచుకొంటూ వెళ్లటం, మధ్యలో కాలువపై ఉన్న రైలుపట్టాల మీదనుంచే మేం ఒకరి వెనుక ఒకరం కాలువదాటివెళ్ళాల్సిన దారి... అన్నీ ఇంకా కళ్ళముందు షాట్ బై షాట్ కనిపిస్తున్నాయి.      

యాకూబ్ వాళ్ల అమ్మ, నాన్న, అన్నదమ్ములు, చెల్లెలు… మమ్మల్ని ఎంతో బాగా చూసుకొన్న ఆ నాలుగు రోజుల్ని ఇప్పటికీ నా కళ్ళముందు రివైండ్ చేసుకోగలుగుతున్నాను అంటే దానికి కారణాలు వేరే ఉన్నాయి… 

అలాంటి స్వచ్చమైన వాతావరణాన్ని, మనుషులను, మనసులను మనం మిస్ అయిపోయి దశాబ్దాలవుతోంది బహుశా. మన అవసరాలూ, ఆర్థిక కోణం చేయించే అనేక తప్పు నిర్ణయాలు, పెరిగిన దూరాలూ, లేచిన అడ్డుగోడలూ, హిపోక్రసీ ముసుగులూ, నగర జీవితపు ఉరుకులూ పరుగులూ… ఇలా ఎన్నెన్నో కారణాలు. 

చివరికి, మనకే అస్పష్టమైన మన గమ్యాలకు మనమే ఎన్నటికీ పెట్టలేకపోతున్న ఫుల్‌స్టాపుల కోసం వెతుక్కొంటూ వెతుక్కొంటూ చాలా కోల్పోయాం. చా..లా..నే కోల్పోయాం.

కారేపల్లిలో యాకూబ్ మిత్రుడు ఒకరు (పేరు వెంకటేశ్వర రావు అనుకుంటాను) మా ఆరుగురికి మాంచి "పార్టీ" ఇవ్వటం గుర్తుంది. ఆ పార్టీ మజాలో సింగరేణి కాలరీస్ ఎండ, వేడి, చమటలు, తడిసిపోయిన మా డ్రెస్సులు... ఇవేవీ అప్పుడు మమ్మల్ని కొంచెం కూడా ఇబ్బంది పెట్టలేకపోయాయి. 

రొట్టమాకురేవులో మేం ఉన్న ఆ నాలుగురోజులూ యాకూబ్‌లో ఎప్పుడూ ఏదో ఒక ఆరాటం, తపన. ఆ చిన్న పల్లెటూళ్ళో మేమెక్కడ ఇబ్బందిపడిపోతున్నామో, ఏదైనా తక్కువయినా కూడా… ‘ఫ్రెండ్‌నని ఏం చెప్పలేకపోతున్నారేమో’ అని ఆ కళ్లల్లో ఏదో ఒక అనవసరపు ఆదుర్దా నాకింకా గుర్తుంది.  

మా ఎమ్మే క్లాస్‌రూమ్‌లో, హాస్టల్ గదుల్లో, మేం గ్రూపుగా అందరం ఒక్కచోట కలిసి కూర్చున్న ప్రతిసారీ - మా ప్రతాప్ రెడ్డి, రమ, శేషాద్రి, యాకూబ్ పాటలు పాడటం అనేది ఒక అతి మామూలుగా జరిగే విషయం. యాకూబ్ "పతితులారా భ్రష్టులారా", "వందేమాతరం" అని (అక్కడ ఏదుంటే దానిమీదే దరువేస్తూ) గొంతెత్తి పాడుతుంటే ఆ కొన్ని నిమిషాలు అందరం ఒక ‘హై’ లోకి వెళ్లేవాళ్లం. 

ఎమ్మే తర్వాత మా మిత్రులందరి దారులు రకరకాలుగా వేరయ్యాయి… 

యాకూబ్ తెలుగు పండిట్ ట్రెయినింగ్‌కు వెళ్ళటం, తెలుగు యూనివర్సిటీలో M Phil, ఉస్మానియాలో Ph D, లక్ష్మి గారితో పరిచయం, వారి ప్రేమ, పెళ్ళి, వారికి సాహిర్ పుట్టడం, అన్వరులులుం కాలేజీలో ఉద్యోగం, కవి యాకూబ్‌గా పూర్తిస్థాయిలో కవిత్వంతో కరచాలనం, వరుసగా కవితా సంకలనాలు, పుస్తకాలు ప్రచురించడం, ఆవిష్కరించడం, ఇప్పటివరకు తెలుగులో రాని ఒక కొత్త రూపంలో "కవి సంగమం" అనే ఫేస్‌బుక్ వేదికకు రూపశిల్పి, సృష్టికర్త, సారథి కావడం… 15 కు పైగా అవార్డులు సాధించడం… అనేకమంది కొత్తతరం కవులకు ప్రోత్సాహం ఇవ్వడం, సీనియర్ కవులతో కలిసేందుకు కవిత్వ సందర్భాలను సృష్టించడం, కవిసంగమం పొయట్రీ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ, జాతీయకవులను ఆహ్వానించడం, వారితో ముఖాముఖి నిర్వహించడం, తెలుగు కవిత్వంలో కొత్త ఒరవడిని సామాజిక మాధ్యమాల ద్వారా నిర్మించడం, ప్రతినెలా 'మూడుతరాల కవిసంగమం',  'ఊరూరా కవిసంగమం' నిర్వహించడం ద్వారా కొత్తతరం కవులను భాగస్వామ్యం చేసి, వారికి లాంచింగ్ ప్యాడ్ లా కవిసంగమంను రూపొందించడం… ఆధునిక తెలుగు కవిత్వచరిత్రలో కవిసంగమం సృష్టికర్తగా తనకూ, తన కవిసంగమానికీ కలిపి ఒక ప్రత్యేక పేజీ లిఖించుకోవడం... ఈమధ్యే అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగ విరమణ చేయడం... అన్నీ ఒక న్యూస్‌రీల్‌లా చకచకా జరిగిపోయాయి.

యాకూబ్ కవిత్వంపై మధురై కామరాజ్ యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పరిశోధన జరగడం… గ్రామాలు సాహిత్య సాంస్కృతిక కేంద్రాలుగా రూపొందాలనే స్ఫూర్తితో, కేరళలోని తుంచన్ మెమోరియల్ సెంటర్ తరహాలో స్వగ్రామం రొట్టమాకురేవులో Rottamaku Revu Poetryspace Foundation (RRPF) స్థాపించడం... నా పర్సనల్ కలెక్షన్‌లోని చాలా పుస్తకాలను RRPF ‌కు నేను విరాళంగా అందించే అవకాశం రావడం... తన జీవితంలో ప్రేరణనిచ్చిన తండ్రి షేక్ మహమ్మద్ మియా, చదివించిన కే ఎల్ నరసింహారావు, స్ఫూర్తినిచ్చిన మామగారు పురిటిపాటిరామిరెడ్డి గార్ల పేరిట 'రొట్టమాకురేవు కవిత్వ అవార్డు' లను ఆరేళ్లక్రితం స్థాపించి కొనసాగిస్తూండటం... ఇవన్నీ కూడా ఒక మిత్రుడిగా యాకూబ్ పట్ల నేను చాలా గర్వంగా ఫీలయ్యే అంశాలు. 

అయితే - శిలాలోలిత (లక్ష్మి) అనే స్నేహశీలి అయిన ఒక మంచి వ్యక్తి, కవయిత్రి యాకూబ్ జీవితంలో లేకుండా ఇదంతా ఊహించలేం అన్న నిజాన్ని యాకూబ్ కూడా ఒప్పుకొంటాడు.       

ఆమధ్య నా మిత్రులు ఒక్కొక్కరే రిటైరయిపోతుంటే నేను నమ్మలేకపోయాను. అలాగే యాకూబ్ రిటైర్మెంట్ విషయంలో కూడా.  
ముందు "కవి యాకూబ్@60" అన్న శీర్షిక నాకు నచ్చలేదు. 

అసలు కవికీ, సృజనతో రాత్రింబవళ్ళు సరాగాలాడేవారికీ వయసుతో పనేంటి?… వయసు గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరమేంటి??

Age is just number. అంతకంటే ఏంలేదు…  
  
"మా యాకూబ్‌కు అప్పుడే 60 ఏళ్ళా?!" అన్నది నాకు ఇప్పటికీ ఒక పెద్ద ఆశ్చర్యం. 

కాగా, “ఇంకో నాలుగైదేళ్ళలో నాక్కుడా కదా!!" అన్నది నాకింకో అత్యంత ఇబ్బందికరమైన ఇష్టంలేని నిజం.  

అయితే కొన్ని నిజాల్ని ఒప్పుకొనితీరాలి. అలాగని అక్కడితో ప్రపంచం ఆగిపోదు, అంతా అయిపోయినట్టూ కాదు. యాకూబ్ జీవితంలో ఇది ఇంకో ముఖ్యమైన మైలురాయి. అంతే. 

దాదాపు ఓ 10 నెలలుగా కరోనా వైరస్ తెచ్చిన లాక్‌డౌన్ సమయంలో - మన కళ్ళముందే ఎందరో పిట్టల్లా టపటపా రాలిపోయారు. ఎవరం ఎన్నాళ్లుంటామో తెలీదు. ఉన్నన్నాళ్ళుమాత్రం - లేనిపోని ఈగోలు, హిపోక్రసీలు, ఒత్తిళ్ళు వీలైనంత తగ్గించుకొని బిందాస్‌గా బ్రతకడం మాత్రం చాలా అవసరం. కవులకూ, రచయితలకూ అప్పుడప్పుడూ చిన్న రిలీఫ్ అవసరం. నా దృష్టిలో యాకూబ్ సృష్టించిన కవిసంగమం అలాంటి ఒక మంచి రిలీఫ్‌నిచ్చే "స్ట్రెస్ బస్టర్" కూడా.        

వ్యక్తిగత జీవితంలో ఎంతో స్ట్రెస్ ఉన్నా - కొత్త సమస్యలు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్నా- వాటి ట్రాక్‌ను వాటికి వదిలి… సాహిత్యం విషయంలో, కవిత్వం విషయంలో తనకు చేతనయింది ఏదో చేయాలన్న తపన యాకూబ్‌కు లేకపోతే “కవి సంగమం” అనే మాట మనం విని ఉండేవాళ్లం కాదేమో. అత్యంత విజయవంతంగా 2012 నుంచీ కవి సంగమం వివిధరూపాల్లో ఇంకా కొనసాగుతోందంటే దాని వెనుక యాకూబ్‌లో ఉన్న నిరంతర తపనే కారణమని నేను గట్టిగా నమ్ముతాను.  

ఇప్పుడు తాజాగా "కవి సంగమం" వెబ్ పత్రిక కోసం కూడా యాకూబ్ పనిచేస్తున్నట్టు మొన్నొక ఫేస్‌బుక్ పోస్టు ద్వారా తెలిసింది. బహుశా ఈ యాకూబ్@60 సంచిక వచ్చేలోపే కవిసంగమం వెబ్ పత్రిక కూడా మనం చూస్తాం.       

కట్ చేస్తే -

అనేకమంది ఉద్దండులయిన కవులూ, రచయితల వ్యాసాలతో కూడిన ఒక ప్రత్యేక సంచిక కోసం నేనేం రాయగలను అని ముందు సందేహించాను. కాని, మా యాకూబ్ జీవితంలోని ఇలాంటి ఒక ప్రత్యేక సందర్భంలో మిత్రుడిగా నేను ఏం రాయకపోవడం అన్నది నా బాధ్యతను విస్మరించడమే అవుతుందని తర్వాత నాకనిపించింది.  

ఇది సాహిత్య వ్యాసం కాదు. కాని, యాకూబ్‌తో ఓయూ క్యాంపస్ కాలంనాటి నా జ్ఞాపకాలు ఖచ్చితంగా అలాంటి సౌరభాన్నే అందించగలవని నా నమ్మకం.  ఆ నమ్మకంతోనే ఇవ్వాళ ఉదయం వైజాగ్ నుంచి హైద్రాబాద్ వస్తూనే యాకూబ్‌కి వాట్సాప్ చేశాను… 

"బ్లాగ్ రాసినట్టు రాస్తాను. ఏం అనుకోవద్దు" అని. 

“Yes. As you wish” అని రిప్లై ఇచ్చాడు.

ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది…  ఈ ప్రత్యేక సందర్భంలో నా మిత్రుడు యాకూబ్ కోసం ప్రవహించే జ్ఞాపకాల్లో నేనూ ఒక మంచు బిందువు అవుతున్నందుకు. 

స్కూలురోజుల్లోనే - వేసవి సెలవుల్లో, మండుటెండల గోదావరిఖనిలో ఐస్క్రీమ్ బండి తోసుకొంటూ ఐస్క్రీమ్‌లు అమ్మిన మా యాకూబ్ గురించి నాకు తెలుసు. చదువుకోసం పార్టీ ఆఫీసులో బాయ్‌గా పనిచేసిన యాకూబ్ నేపథ్యం నాకు తెలుసు. చాలాసార్లు క్యాంపస్‌లో ఆదివారం రాత్రి మెస్‌లో భోజనం లేనప్పుడు, మా జేబులో ఉన్న పైసలతోనే నర్సిమ్మ క్యాంటీన్లో కలిసి చాయ్ త్రాగి, కబుర్లు చెప్పుకొని, హాస్టల్లో ఎవరి రూములకి వాళ్లం వెళ్ళి హాయిగా పడుకున్నవాళ్ళం. అప్పటి యాకూబ్ కూడా నాకింకా గుర్తు.

35 ఏళ్ల క్రితం యాకూబ్ నన్ను "మనూ" అని ఎలా పిలిచేవాడో ఇప్పుడూ అంతే. అదే పిలుపు. వాడికి మనసు లోపలా బయటా అని ఏం లేవు. అంతా ఒక్కటే. అదే ఆత్మీయత, అదే ఆర్ద్రత. ఆ గొంతులో అప్పుడూ ఇప్పుడూ అదే తడి. 

అందుకే యాకూబ్ అంటే నాకిష్టం. మా ఎమ్మే మిత్రుల్లో కూడా అందరికీ ఇష్టం. 

- మనోహర్ చిమ్మని 

***

This was written by me for Palapitta Magazine's special issue on my friend #KaviYakoob, sometime back. 

- Manohar Chimmani

మా ఎమ్మే వాట్సాప్ గ్రూప్ లొల్లి!


డియర్ ఫ్రెండ్స్!

మీ అందరితో చాలా చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత, మళ్ళీ జనజీవనస్రవంతిలోకి వస్తూ, నేను చేసిన మొట్టమొదటి పని... మీ అందరితో టచ్‌లో ఉండాలనుకోవడం. వెంటనే ఈ గ్రూప్ క్రియేట్ చేశాను. 

It's wonderful to reconnect with all of you on this platform after such a long time. Thank you all for being here.  

కట్ చేస్తే - 

మనం అందరం కలవటం అనేది ఎప్పుడో కాని జరగదు. ఓయూలో మన ఎమ్మే జ్ఞాపకాలు, ఫోటోలు షేర్ చేసుకుంటూ, కనీసం ఇలా వాట్సాప్ గ్రూపులోనైనా వీలైనంత రెగ్యులర్‌గా పలకరించుకుంటూ టచ్‌లో ఉందాం అన్న ఉద్దేశ్యంతో నేను ఈ గ్రూప్ ప్రారంభించాను. 

చాలామంది రిటైర్ అయ్యారు. ఉద్యోగం బిజీ ఉండకపోవచ్చు, కాని రిటైర్ అనంతర బాధ్యతలు కూడా కొన్ని ఉంటాయనుకుంటాను. మొత్తానికి చాలా మంది బాగానే బిజీగానే ఉన్నారని అర్థమవుతోంది. 

ఇది మన ప్రి-క్లైమాక్స్ స్టేజ్. టైమ్ మనచేతుల్లో ఉండదు. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. ఉన్నన్నాళ్ళూ వీలైనంత హాప్పీగా-సరదాగా-స్ట్రెస్ లేకుండా ఉంటే మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. ఈ కోణంలో అయినా మిత్రులంతా యాక్టివ్‌గా గ్రూపులో పాల్గొంటే బాగుంటుంది కదా! 

ఒక లైక్, ఒక స్మైల్, ఒక కామెంట్, చెత్త పోస్టు ఎవరైనా పెడితే తిట్టొచ్చు, నవ్వుకోవచ్చు, మేం మర్చిపోయిన జ్ఞాపకాల్ని మీరూ గుర్తుచేయొచ్చు. మీ దగ్గరున్న ఫోటోలు షేర్ చెయ్యొచ్చు. మీ ఇంట్లో శుభవారతలు, మీరు సాధించిన విజయాలు, మీరు మాతో షేర్ చేసుకోవాలనుకొనే విషయాలు, మీ రచనలు, మీ కవితలు, మీ విమర్శలు... వాట్ నాట్... డీసెంట్‌గా డిగ్నిఫైడ్‌గా మనం దాదాపు ఇంకా మన ఎమ్మే క్లాస్‌లోనే ఉనంట్టుగా ఈ గ్రూపులో ఉండొచ్చు. 

కాని, ఎందుకో కొంతమంది మిత్రులు అసలు సైలెంట్‌గా ఉంటున్నారు. నా వైపు నుంచి ఏదైనా పొరపాటు జరిగితే చెప్పండి. కరెక్ట్ చేసుకుంటాను. సజెషన్స్ ఇవ్వండి. అమలు చేద్దాం. కాని, యాక్టివ్‌గా ఉండండి... అని సవినయ మనవి!

If participating in this group is causing any issues for you, I won’t force anyone to stay. I'll make a decision based on my intuition tomorrow.

Best wishes, always!😎💐🙏💖🤝🤞🥁🥁🥁🥁

కట్ చేస్తే - 

My post next day... 👇

Hi Friends!

గ్రూప్ క్రియేట్ చేశాను. 
ఎందుకు చేశానో చెప్పాను. 
ఇక మీ ఇష్టం, 
తాంబూలాలిచ్చాను... 

ఒక వారం పదిరోజులు నా ప్రాజెక్టు పనుల్లో కొంచెం బిజీ నేను. 
అప్పటిదాకా గ్రూపును ఉండనిస్తారనే నమ్మకం! ;-)   

You rock... 💐😎🤞

- Manohar Chimmani 

Friday, 23 August 2024

ఒకరికోసం ఒకరు మారటం అనేది పెద్ద హంబగ్!


ఎవరో ఏదో అనుకుంటారన్న మొహమాటంతో మళ్ళీ అదే మనకి నచ్చని పనులు చేస్తూ సమయం వృధా చేసుకోవడం, మన ఆలోచనులు వృధాచేసుకోవడం కంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. 

ముఖ్యంగా - మన ముందు చేయాల్సిన పనులు ఎక్కువగా ఉండి, చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు అసలు ఈ కోణంలో ఆలోచించనే వద్దు. అన్ని ప్లాన్లూ పనులూ పేకమేడలా కూలిపోతాయి. 

ఒక్కొక్కరి నేపథ్యం ఒక్కోలా ఉంటుంది. ఒక్కొక్కరి ఆలోచనా విధానం ఒక్కోలా ఉంటుంది. జీవితాన్ని చూసే పద్ధతి కూడా ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. ఎవరికి వారే యూనిక్. అలాంటప్పుడు... "నువ్విలాగే ఉండాలి", "నువ్విలా చేయాల్సింది" వంటి మాటలు ఎదుటివారిని నిజంగానే ఇబ్బంది పెడతాయి. ఆ పొరపాటు నేను చేయలేను.   

ఒకరికోసం ఒకరు మారటం అనేది కూడా పెద్ద హంబగ్. నిజమైన స్నేహం, ప్రేమ ఉన్నచోట ఇలాంటి ఆలోచనే రాదు. మనకు నచ్చినవారిని యాజిటీజ్‌గా నచ్చటం కంటే ఆనందం ఇంకేముంటుంది? అసలు ఏ ప్రేమైనా, స్నేహమైనా పుట్టేది అలాగే కదా?

ఈమధ్య మా యూనివర్సిటీ మిత్రుల గ్రూప్‌లో వివిధకోణాల్లో కొంత అలజడి చూసిన తర్వాత ఎందుకో ఇది రాయాలనిపించింది. 

కలిసామా, కలిసినంతసేపు వీలైనంత హాయిగా, బిందాస్‌గా ఉన్నామా... దట్సిట్. 

కట్ చేస్తే -

జీవితం ఒక్కటే. 

మన కోసం మనం, కనీసం కొన్నేళ్ళయినా, మనం ఉండాలకున్నట్టు ఉండాలి. చెయ్యాలనుకున్నది చేసెయ్యాలి.  

మిగిలిందంతా జస్ట్ బుల్‌షిట్!   

- మనోహర్ చిమ్మని 

Monday, 19 August 2024

జ్ఞాపకాలే బాగుంటాయ్!


మా అమ్మానాన్నలకు మేం అయిదుగురం అబ్బాయిలమే. 

నాకు కూడా ఇద్దరూ అబ్బాయిలే.  

ఇది ఒక లోటు అని మా పేరెంట్స్ ఇద్దరూ బాగా ఫీలవుతుంటే నేను లైట్ తీసుకునేవాణ్ణి. కాని, ఇంట్లో ఒక అమ్మాయైనా లేకపోవడం నిజంగా లోటేనని కొన్ని కొన్ని సందర్భాల్లో లోపల్లోపలే బాగా ఫీలయ్యేవాణ్ణి.

కొన్ని షేర్ చేసుకోడానికో, కొన్ని దాచుకోడానికో, కొన్ని సలహాలు తీసుకోడానికో, కొన్ని సహాయాలు అడగడానికో... ఒక అక్కో చెల్లో నిజంగా అవసరం. 

నా జీవితాన్నే సంపూర్ణంగా మార్చివేయగలిగిన ఒకటి రెండు అతి ముఖ్యమైన సందర్భాల్లో... నేనిది చాలా పెద్ద లోటుగా ఫీలయ్యాను. కాని, ఎప్పుడూ ఎవ్వరిదగ్గరా బయటపడలేదు.  
 
కట్ చేస్తే - 

మా చిన్నప్పుడు (వరంగల్లో) మా చిన్నమ్మల కూతుళ్ళు... ఇందిర, మంజుల... ఇద్దరూ ప్రతి రాఖీ పండుగకు టంచన్‌గా టైమ్‌కు మా ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడొస్తారా అని ఎదురుచూసేవాళ్ళం. ఈసారి ఏ మాడల్ రాఖీలు తెస్తారా అని గెస్ చేస్తుండేవాళ్లం.

కొత్త రాఖీలు పట్టుకొని మా చెల్లెళ్ళు వస్తున్నారన్న ఆ ఊహ... ఆ ఎదురుచూపు కూడా చాలా ఆనందంగా ఉండేది.

మా అందర్నీ వరుసగా పీటలమీద కూర్చోబెట్టి, బొట్టుపెట్టి, నోట్లో చక్కెర పోసి... తర్వాత రాఖీలు కట్టేవాళ్ళు మా ఇందిర, మంజుల.  

వాళ్లకి మా అమ్మ రాఖీ పండుగ కట్నం డబ్బులు ఇచ్చేది. కొన్నిసార్లు బట్టలు పెట్టేది. అది పద్ధతి. 

ఇక ఆ రోజంతా మాకు పండగే.  

ఇలాంటిదే - ప్రతి మూడేళ్ళకో, నాలుగేళ్ళకో ఒకసారి "కుడుకలు ఇవ్వటం" అనే పండుగ ఒకటి వచ్చేది. ఇందిర, మంజుల వచ్చి మాకు కుడుకలు ఇచ్చి, నోటి నిండా చక్కెర పోసేవారు. ఈ పండుగ సమయంలో కూడా మా ఇందిర, మంజుల ఎప్పుడొస్తారా అని ఎదురుచూసేవాళ్లం మేము. 

ఈ రెండు సందర్భాల్లోనూ ఇందిర, మంజులకు డబ్బులు ఇవ్వటం, బట్టలు పెట్టడం ఇవన్నీ పద్ధతి ప్రకారం మా అమ్మ బాగా చేసేది. 

థాంక్స్ టు మన సంప్రదాయం, సంసృతి, మన సనాతన ధర్మం... నిష్కల్మశమైన అప్పటి ప్రేమలు అంత అద్భుతంగా, అంత ఆనందమయంగా ఉండేవి.      

కట్ చేస్తే - 

1983లో నేను వరంగల్ వదిలేసి హైద్రాబాద్‌కు వచ్చాను...

హైద్రాబాద్‌లో నేను హెచ్ ఎం టి లో మెషినిస్టుగా పనిచేస్తున్నప్పుడు నా రూమ్‌కు పోస్ట్ ద్వారా వచ్చేవి రాఖీలు.

తర్వాత యూనివర్సిటీలో చదువుకొంటున్నప్పుడు ఓయూలో నా హాస్టల్‌కు కూడా పోస్ట్‌లో వచ్చేవి రాఖీలు.

తర్వాత నేను నవోదయ విద్యాలయ, గుంటూరులో పనిచేస్తున్నప్పుడు... ఆలిండియా రేడియో ఎఫ్ ఎం కర్నూల్లో పనిచేస్తున్నప్పుడు కూడా మా ఇందిర, మంజుల రాఖీలను పోస్టులో కనీసం రెండురోజుల ముందుగానే చేరేలా పంపేవాళ్ళు.

నా పెళ్లయిన కొత్తలో కూడా ఒకటి రెండేళ్ళు రాఖీలు పోస్టులో వచ్చాయి నాకు. 
 
అంతే. నాకు అంతవరకే గుర్తుంది.

క్రమంగా రాఖీలు పోస్టులో రావడం ఆగిపోయింది. కుడుకలు ఇచ్చే పండుగ గురించి పూర్తిగా మర్చిపోయాను. 

తర్వాత్తర్వాత మేము కలుసుకున్నది కూడా చాలా తక్కువసార్లే. 

వరంగల్‌లోని మా బంధువులందరితో దాదాపు నా కనెక్షన్ కట్ అయిపోయింది. ఏ స్థాయిలో కట్ అయిపోయిందంటే - అక్కడ వరంగల్లో ఏదైనా ఫంక్షన్ అయితే పిలవడానికి కూడా నేను వారికి గుర్తుకురానంతగా! 

కట్ చేస్తే - 

ఎవరు ఎలా మారినా, ఏవి ఎలా మారినా... అవన్నీ చిన్నప్పటి నా జ్ఞాపకాలను ఏ మాత్రం మార్చలేవు. 

ఆ తర్వాత కూడా, నా జీవితంలోని ప్రతి దశలోనూ, నేను ఏరి కోరి ప్రోదిచేసుకున్న నాకిష్టమైన ఇంకెన్నో జ్ఞాపకాలను కూడా ఎవ్వరూ మార్చలేరు.  

ఆ జ్ఞాపకాలు చాలు నాకు.    

అందుకే -
మళ్ళీ ఇంకొక్కసారి, 
ఈ జన్మలో చివరిసారి,
నేను నేనుగానే మారి, 
నన్ను నేను పునర్నిర్మించుకొంటూ 
మళ్ళీ ప్రేమించడం మొదలెట్టాను...
నా జ్ఞాపకాలనూ,
ఆ జ్ఞాపకాలకు కారణమైనవారినీ. 

***

అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు! 
- మనోహర్ చిమ్మని 

Sunday, 18 August 2024

ఇన్‌ఫ్లుయెన్సర్ నుంచి ప్రభాస్ హీరోయిన్ దాకా!


ఇమాన్వి.

థాంక్స్ టు ప్రభాస్ ఎఫెక్ట్... ఒక్క రోజులో స్టార్ అయిపోయింది. మిలియన్ల మంది ప్రభాస్ ఫ్యాన్స్ ప్రపంచమంతా ఆమె ఎవరు, ఎక్కడ, ఏంటి అని సెర్చ్ చేశారు.

ఆల్రెడీ కొందరికి ఆమె తెలుసు... ఒక యూట్యూబర్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, ఒక కొరియోగ్రాఫర్‌గా. 

ఢిల్లీ అమ్మాయి. ఎం బి ఏ చదివింది. యు యస్‌లో కూడా వివిధ నృత్యరీతుల్లో డాన్స్ నేర్చుకొందని తెలిసింది. బహుశా ఇమాన్వి తల్లిదండ్రులు అమెరికాలో ఉంటారేమో.    

ఎవరో ఇందాక ఆమె పాకిస్తానీ, యు యస్‌లో పుట్టింది... అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు! అది నిజం కాకపోవచ్చు. 

కట్ చేస్తే -

ఇమాన్వి అని మన డైరెక్టర్ ఆమె పేరు మార్చి ఉంటాడు. ఆమె అసలు పేరు ఇమాన్ ఇస్మాయిల్. 

అందంగా ఉంది.
డాన్స్ బాగా చేస్తోంది.
ఎక్స్‌ప్రెషన్ నిన్ననే ఇచ్చేసింది! 

ఇంకేం కావాలి? 
ప్రభాస్ పొటెన్షియాలిటీకి ఇమాన్వి అందం తోడయ్యింది. 
హను పీరియడ్ సినిమా హిట్!  

- మనోహర్ చిమ్మని