Saturday, 31 August 2024

Angry Young Men


"జంజీర్" స్క్రిప్ట్‌కు 'నో' చెప్పిన హీరోలు: ధర్మేంద్ర, రాజ్ కుమార్, రాజేశ్ ఖన్నా, దిలీప్ కుమార్. 

కారణం... హీరోకు పాటల్లేని 'యాంగ్రీ రోల్' అని. 

డైరెక్టర్ ప్రకాశ్ మెహ్రా మాత్రం ఎవ్వరికోసం స్క్రిప్ట్ మార్చలేదు. ఆ స్క్రిప్ట్‌ను అలాగే తీయాలనుకున్నాడు.  

కట్ చేస్తే - 

అమితాబ్ బచ్చన్... 

తెర మీద కొత్తగా ఒక యాంగ్రీమ్యాన్ పుట్టాడు. బాలీవుడ్ బ్రహ్మరథం పట్టింది. 

అలా ఒక అమితాబ్ బచ్చన్ క్రియేట్ కావడానికి కారణమైన ఆ స్క్రిప్ట్ రైటర్సే... ఆ తర్వాత బాలీవుడ్‌లో టాప్ హీరోలకంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నారు. "షోలే" వంటి బ్లాక్ బస్టర్ సినిమా స్క్రిప్టుల్ని సృష్టించారు.

భారత సినీ పరిశ్రమలో మొట్టమొదటిసారిగా ఫిలిం రైటర్స్‌కు క్రేజ్‌ను, పారితోషికాన్ని హీరోలకంటే మించి సాధించుకున్న ఆ రైటర్స్... సలీం-జావేద్.

- మనోహర్ చిమ్మని 

***

(Watch the awesome 'Angry Young Men' in Amazon Prime.)

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani