12 ఏళ్ళ క్రితం, సరిగ్గా ఈరోజే నేను తెలుగులో నా బ్లాగింగ్ ప్రయాణం ప్రారంభించాను!
కట్ చేస్తే -
థాంక్స్ టు lekhini.org, ఇది నా దృష్టిలో ఆరోజు పడకపోతే ఈ బ్లాగ్ లేదు. నా బ్లాగింగ్ లేదు. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఆరోజు నేను తెలుగు టైపింగ్ గురించి సెర్చ్ చేస్తుంటే దొరికిన లింక్... లేఖిని. తర్వాత అరగంటపాటు అదొకటి ఇదొకటి బ్రౌజ్ చేస్తూ, చివరికి నేనీ బ్లాగ్ సృష్టించడానికి ఆరోజు కారణమైంది లేఖిని.
అలా, నా బ్లాగింగ్ విషయంలో ఒక "బటర్‌ఫ్లై ఎఫెక్ట్"లా పనిచేసిన లేఖిని సృష్టికర్తకు నా వందనాలు. తర్వాత ట్విట్టర్లో కలిసినప్పుడు వారికి ఈ విషయం ఒకసారి చెప్పాను కూడా.
సినిమాఫీల్డు, క్రియేటివిటీలకు సంబంధించి నాకు తెలిసిన విషయాలను, నేను పంచుకోవాలనుకొనే విషయాలను ఉన్నదున్నట్టుగా రాయడం అన్న అర్థంలో, ముందు నా బ్లాగ్‌కు "నగ్నచిత్రం" అని పేరు పెట్టాను. తర్వాత డాక్టర్ ఉషారాణి అని నా స్టుడెంట్, ఇంకొక ఇద్దరు ముగ్గురు పాఠకులు బ్లాగ్ టైటిల్ గురించి ఇంకోసారి ఆలోచించమని నాకు సూచించారు. కొన్నాళ్ళు "మనోహర్ చిమ్మని" అని నా పేరుకే మార్చాను. కాని, ఓ రెండు నెలల తర్వాత వెంటనే నా బ్లాగ్ ఒరిజినల్ పేరు "నగ్నచిత్రం"కు రివర్ట్ అయ్యాను. చాలామంది మొదటి టైలే బాగా సెట్ అయింది అన్నారు. ముఖ్యంగా నా ఇంకో స్టుడెంట్, "గై ఆన్ ది సైడ్ వాక్" బెస్ట్ సెల్లర్ ఫిక్షన్ రైటర్ భరత్‌కృష్ణ.
ఈ మధ్యే మళ్ళీ ఒక 20 రోజుల క్రితం నా బ్లాగ్ పేరుని "మనోహరమ్" కు మార్చాను. ఎందుకో అలా మార్చాలనిపించించింది నాకు.
సినిమాలు, క్రియేటివిటీ వంటి విషయాల్లో నా ప్రయారిటీస్ మారిపోయాయి. నేనూ మారాను. ఇంతకుముందులా పాలిటిక్స్ మీద కూడా అప్పుడప్పుడు బ్లాగ్‌లో ఏదో ఒకటి రాయడం పూర్తిగా మానుకున్నాను.
ఈ నేపథ్యంలో నా బ్లాగ్‌కు ఈ టైటిలే బాగుంటుంది అనిపించింది... మనోహరమ్.
నా బ్లాగింగ్ జర్నీలో నాకు కలిసిన ఎందరో మిత్రులు, పాఠకులు... అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు!
- మనోహర్ చిమ్మని
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani