Thursday, 10 September 2026

The Rich Monk Hits a Million


A million thanks! ❤️

To all my dear blog readers, followers, and friends who have been part of this journey—

My #RichMonk blog crossed 1,000,000 page views today! 🎉

A million views is a number.
But behind that number are a million moments of your time, attention, and love.

Thank you for reading.
Thank you for following.
Thank you for being here.

This journey means a lot to me.

With gratitude. 🙏❤️

— Manohar Chimmani 
richmonk.me

Wednesday, 9 September 2026

NO DEADLINE


There's no deadline
for becoming who you really are.

Be who you are.
Now.

Nothing has to stop you.

Not your films.
Not your filmy commitments.
Not your family.
Not your friends.
Not your goals.
Not your bucket lists.

Those are your external life.
They will keep moving
on their own track.

But your soul
has another track.

Your thoughts.
Your silence.
Your dreams.
Your truth.

They don't need permission
from your calendar.

You don't have to wait
for the right time
to become yourself.

You are you.

Be you.

There is no separate deadline.

Now.

— Manohar Chimmani 

ప్రయాణం చెయ్యి... కొత్త ఆలోచనలొస్తాయ్!


జీవితంలో ఏదైనా మంచి జరిగిందా? 
ప్రయాణం చెయ్యి.
సెలబ్రేట్ చేసుకో. 

ఏదైనా చెడు జరిగిందా?
ప్రయాణం చెయ్యి. 
మామూలు మనిషి అయిపో.

అసలేమీ జరగలేదా?
ప్రయాణం చెయ్యి.
కొత్త ఆలోచనలొస్తాయి. 
కొత్తగా మొదలెట్టు... సాధించు.

కట్ చేస్తే -

ఒక్కసారి గుర్తుకుతెచ్చుకోండి. వేల ఏళ్ళ కింద గాని, ఇటీవలి చరిత్రలో కాని, ఇప్పుడు నడుస్తున్న చరిత్రలో కాని... గొప్ప గొప్ప విజయాలు సాధించినవాళ్ళలో దాదాపు 80 శాతం మంది ప్రయాణాలు చేస్తూ సాధించినవాళ్ళే. 

దేశాలను కనుక్కొన్నవాళ్ళు, శాస్త్రాలను రాసినవాళ్ళు, వివిధ రంగాల్లో కొత్త కొత్త ఆవిష్కరణలను సాధించినవాళ్ళంతా కూడా నిరంతరం ప్రయాణాలు చేసినవారే. 

మీకు తెలుసా... బిల్ గేట్స్ కూడా తరచుగా "థింక్ వీక్" పేరుతో ఒక వారం రోజులు పసిఫిక్ నార్త్-వెస్ట్‌లో ఎక్కడో ఎవ్వరికీ తెలియనంత లోపలికి వెళ్తాడు. 

ఆయన వెంట రెండు మూడు బ్యాగుల్లో బుక్స్, ప్రింటెడ్ నోట్స్, తెల్లకాగితాలు, పెన్నులు తీసుకెళ్తాడు. ఫోన్లు, కంప్యూటర్స్, టాబ్లెట్స్, టీవీలు, మొబైల్స్ లాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఒక్కటి కూడా ఉండదు. వైఫై అసలుండదు. 

రోజూ కొన్ని గంటలు చదువుతాడు.
కొత్త ఐడియాల మీద కొన్ని గంటలు వర్క్ చేస్తాడు.
కొన్ని గంటలు తెల్లకాగితాల మీద పెన్‌తో నోట్స్ రాసుకుంటాడు.
ఒక గంట వాకింగ్ చేస్తాడు. 
అసలేమీ చెయ్యకుండా కొన్ని గంటలు గడుపుతారు.

సంవత్సరాలు గడిచినా దొరకని పరిష్కారాలు, ఇలాంటి థింక్ వీక్స్‌లో దొరుకుతాయి. 

ఎన్నడూ రాని ఆలోచనలు ఇలాంటి ప్రయాణాల్లో అనుకోకుండా వస్తాయి. 

ఉన్నచోట ఎంతకూ కదలని పనులు, బయటకెళ్ళినప్పుడు చాలావేగంగా పూర్తవుతాయి. 

ఉదాహరణకు, సినిమాఫీల్డులో కొందరు డైరెక్టర్స్ స్క్రిప్టు రాసుకోడానికి గోవా, బ్యాంకాక్, బాలి లాంటి ప్రదేశాలకెళ్తారు. మొబైల్ ఆఫ్ చేసేస్తారు. రూంలో టీవీ ప్లగ్ పీకేస్తారు. అంతే. 

ఇక్కడ లోకల్‌గా ఆరునెలలయినా కదలని స్క్రిప్టు, అక్కడ అయిదారు రోజుల్లో అయిపోతుంది.    

డీప్ వర్క్ అన్నమాట. 

ఎప్పుడూ నాలుగు గోడలమధ్యే కాకుండా, అప్పుడప్పుడూ ప్రయాణం కూడా చేస్తుండాలి. ఇలాంటి ఒంటరి ప్రయాణాల్లోనే కొత్త ఆలోచనలొస్తాయి. కొత్త పరిష్కారాలు దొరుకుతాయి. కొత్త అధ్యాయాలు ప్రారంభిస్తాం. కొత్త విజయాలు సాధిస్తాం.

- మనోహర్ చిమ్మని 

పి యస్: అలా ప్రయాణం చేసినప్పుడు వచ్చిన ఒక కొత్త ఆలోచనతోనే, మొన్న వైజాగ్ నుంచి రాగానే ఒక కొత్త పుస్తకం రాశాను. అది ఈ నెల్లోనే పబ్లిష్ అవుతోంది. వివరాలు త్వరలో.   

Tuesday, 8 September 2026

సైన్స్ కాదనిపించే సైన్స్


"కొందరికి కొన్ని కలిసివస్తాయి, కొందరికి కలిసిరావు." 

ఇది కొంతవరకు నిజం. ఇక్కడ లక్ ఫాక్టర్ ఉండొచ్చు. మనకు కనిపించని అదృష్టం పనిచేయవచ్చు. 

కట్ చేస్తే - 

"కొందరు కొన్నిటిని కలిసివచ్చేలా చేసుకోగలుగుతారు, కొందరు అలా చేసుకోలేరు." 

ఇది పూర్తిగా నిజం. 

నైపుణ్యం, సామర్థ్యం కంటే ఎక్కువగా ఇక్కడ పనిచేసేది... ఏమైనా సరే, నేనిది సాధించితీరాలి అన్న సంకల్పం. సాధించగలను అన్న నమ్మకం. సాధించే కిల్లర్ ఇన్‌స్టింక్ట్, మైండ్‌సెట్. 

ఇవన్నీ ఎలైన్ అవుతూ ఒకే దిశలో పనిచేయాలి. పనిచేసేలా చేసుకోగలగాలి.  

క్లుప్తంగా, స్వచ్ఛమైన తెలుగులో చెప్పాలంటే... ఒక వేటగాడి మనస్తత్వం. విల్లు ఎక్కుపెట్టాడంటే అవతల దిగాల్సిందే. 

విన్నర్స్, వేటగాళ్ళు వేర్వేరు కాదు. 
వాళ్ళకు ప్లాన్-బి ఉండదు.          

- మనోహర్ చిమ్మని   

Saturday, 5 September 2026

ఒక దశ దాటాక, నిర్ణయాలు మన చేతుల్లో ఉండాలి!


ప్రయోగాలు నాకు కొత్త కాదు. 

కొన్ని ఫెయిల్ అవుతాయి, 
కొన్ని నచ్చవు. 
కొన్ని సక్సెస్ అవుతాయి, 
కొనసాగిస్తాం. 

సక్సెస్ అయినా,
బోర్ కొడితే కొన్ని వదిలేస్తాం.

అదంతే. 
ఇదొక సైకిల్. 

కట్ చేస్తే -

ఈమధ్య కొందరిని చాలా దగ్గరగా అధ్యయనం చేశాక నాకో విషయం అర్థమయింది...

రచయిత మల్లాది అయినా, యండమూరి వీరేంద్రనాథ అయినా, అమితాబ్ బచ్చన్ అయినా... నిరంతరం ఏదో ఒక పనిలో వాళ్ళని వాళ్ళు బిజీగా ఉంచుకోవడం ద్వారా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆరోగ్యంగా ఉంటున్నారు. 

55+ దాటాక ఇది చాలా ముఖ్యం.

యాక్టివ్‌గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మనచుట్టూ ఎంత నెగెటివిటీ ఉన్నా, మనం సాధ్యమయినంత పాజిటివ్‌గా ఉండగలగాలి. మనం ఖాళీగా ఉంటే, మన మనసు ఖాళీగా ఉండదు. ఏవేవో ఆలోచిస్తుంటాం. అవన్నీ మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు. 

అందుకే - అవసరం ఉన్నన్ని రోజులు, లేదా, బోర్ కొట్టేదాకా కొన్ని సినిమాలు చేస్తాను. ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాను. నో టెన్షన్. నో స్ట్రెస్. నా మిగిలిన సమయం అంతా రాయడానికే కెటాయిస్తాను. ఇప్పుడు ప్రారంభించబోతున్న ఒక కొత్త ప్రయోగానికి కూడా. 

జీవితంలో ఒక దశ దాటాక, మనం ఏం చేసినా, నిర్ణయాలు తీసుకునేది మనమే అయ్యుండాలి. అలా కానప్పుడు, ఆ పని చెయ్యకపోవడమే బెటర్. 

- మనోహర్ చిమ్మని  

Thursday, 3 September 2026

What Are You Addicted To?


Your phone?
Your distractions?
Other people's opinions?

Or your dream?

Be addicted to your passions, not your distractions.

Your attention is your most valuable currency. Whatever gets most of it eventually gets most of your life.

Give it to scrolling, and you'll consume.

Give it to comparison, and you'll doubt.

Give it to your passion, and you'll create.

The difference isn't time.

It's what you choose to obsess over.

Choose your addiction carefully.

Because what you repeatedly give your attention to eventually becomes your life.

- Manohar Chimmani 

Wednesday, 2 September 2026

Kill Your Limiting Beliefs


Most of the walls in your life aren't real.

They are beliefs.

I can't.
I'm not good enough.
It's too late.
People like me don't do that.
What will they think?

You learned these limits somewhere along the way.

Now it's time to unlearn them.

Stop asking, “What am I capable of?”

Ask, “What if I stopped limiting myself?”

You don't need permission to become who you were meant to be.

Kill the limiting beliefs.
Drop the borrowed identity.
It's time to be YOU.

- Manohar Chimmani 

Tuesday, 1 September 2026

పుస్తకం విలువ సినిమా టికెట్ కంటే తక్కువా?


మల్టీప్లెక్స్‌లో ఒక సినిమా టికెట్ ధర 395/- ఉంది. కొన్ని సినిమాలకు ఇంకా ఎక్కువే. కొన్నిసార్లు ఇది 1000/- వరకు కూడా వెళ్తుంది. 

రెండున్నర గంటలో, మూడు గంటలో సినిమా చూస్తాం. అక్కడితో అయిపోతుంది దాని కథ. 

కాని, మనకు నచ్చిన పుస్తకం ధర 200/-, 300/- లకే "ఇంత ఎక్కువ ధరా?" అనటం వింటున్నాం.   

"అంత ధర పెట్టి పాఠకులు పుస్తకాల్ని కొనరు" అంటారు పబ్లిషర్స్, బుక్ సెల్లర్స్. 

నిజంగా చాలా విచిత్రం.

పుస్తకం మనకు నచ్చిందే కొంటాం. మనం చదవాలనుకున్నదే కొంటాం. ఫిక్షన్ కావచ్చు, నాన్-ఫిక్షన్ కావచ్చు. ఒక పుస్తకం విలువ తప్పకుండా సినిమా కంటే ఎక్కువే. 

సినిమా ఒకసారి చూడటంతో అయిపోతుంది. పుస్తకాన్ని మనం చదివిన తర్వాత కూడా మన బుక్ ర్యాక్స్‌లో ఎంతకాలమైనా ఉంటుంది. చదవాలనుకున్నప్పుడు మళ్ళీ చదవచ్చు. ఆసక్తి ఉన్న ఫ్రెండ్స్‌కు చదవమని ఇవ్వొచ్చు. చాలు అనుకుంటే ఏదైనా లైబ్రరీకి డొనేట్ చెయ్యచ్చు.

ఏ కోణంలో చూసినా, ఒక పుస్తకం విలువ సినిమా టికెట్ కంటే ఎక్కువే. 

అలాంటప్పుడు పుస్తకం రేటుని ఎందుకని సినిమా టికెట్ కంటే చాలా తక్కువ రేటుకి అమ్ముతున్నారు? పబ్లిషర్‌కు, బుక్ సెల్లర్‌కు ఎలా మెయింటెనెన్స్ వస్తుంది? రైటర్‌కు అసలు రాయాల్టీ అంటూ ఏమన్నా వస్తుందా? వచ్చినా అదేమైనా పనికొస్తుందా? 

ఒక యండమూరి, ఒక మల్లాది వంటి పాపులర్ రచయితలకు తప్ప, ఏ రచయితలకూ పెద్దగా రాయాల్టీ రాదు. అతికొద్ది మందికి ఏ కొంచెమో వచ్చినా అది దేనికీ ఉపయోగపడదు.  

కట్ చేస్తే - 

బుక్ లాంచింగ్, బుక్ ప్రమోషన్, ఆన్‌లైన్ మార్కెటింగ్ వంటివి తెలుగు పబ్లిషింగ్ రంగంలో కూడా ఇంకా రావాలి, ఊపందుకోవాలి. పుస్తకాల రీడబిలిటీ కూడా చాలా ముఖ్యం. 

ఇవి లేకుండా, ఈ సమస్యకు పరిష్కారం అసాధ్యం అని నాకు అనిపిస్తోంది. 

A book is not an object you buy. It is an idea you carry—and an idea can change a life.

- మనోహర్ చిమ్మని 

Sunday, 30 August 2026

నా కొత్త పుస్తకం ఎడిక్షన్లో...


ఇప్పుడే నా కొత్త పుస్తకం బుక్ కవర్, బ్యాక్ కవర్ కంటెంట్ వర్క్ పూర్తిచేశాను. 

పుస్తకం కంటెంట్ ఫైన్ ట్యూనింగ్ మొదలుపెట్టాను. ఇంకో పదిరోజుల్లో మొత్తం పీడీయఫ్ ఫైల్ మా పబ్లిషర్ మిత్రుడు గుడిపాటికి  అందివ్వబోతున్నాను. 

సెప్టెంబర్‌లోనే విడుదల. 
పుస్తక ఆవిష్కరణ ఉండవచ్చు. 

ఒకవేళ ఉంటే, అదే నా మొట్టమొదటి బుక్ లాంచ్ ఈవెంట్ అవుతుంది.

బుక్ ఫస్ట్ లుక్, టీజర్ ఉంటాయి. 
పూర్తి వివరాలు త్వరలో. 

కట్ చేస్తే -  

బోర్ కొట్టేదాకా కొన్ని సినిమాలు చేయడం.
రెగ్యులర్‌గా కథలూ, ఫిక్షన్, నాన్-ఫిక్షన్ రాయడం. 
అంతే. 
ఇప్పుడింక వేరే పనుల్లేవ్.                

Doing one creative thing a day makes you feel good. Irrespective of all chaos.

- మనోహర్ చిమ్మని  

నిత్య జీవితంలో పనికొచ్చే పుస్తకాలు కూడా పుస్తకాలే!


ఒక్క అమెజాన్‌లోనే, 2025లో, ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 మిలియన్ల ప్రింటెడ్ బుక్స్ సేలయ్యాయి. 

ఈ 300 మిలియన్ల పుస్తకాల్లో 50% పుస్తకాలు కొని చదివింది అమెరికన్ పాఠకులే కావడం మనం గమనించాల్సిన ముఖ్యమైన అంశం. 

'కిండిల్ బుక్స్' లాంటి డిజిటల్ బుక్స్, ఆడియో బుక్స్ అంకెలు వేరే. 

కట్ చేస్తే -

ప్రపంచపటంలోని అభివృద్ధి చెందిన ఏ దేశాన్నయినా తీసుకోండి. ఆ దేశ ప్రజలు, పాలకులు, కంపెనీల సీఈవోలు... ఖచ్చితంగా మంచి పాఠకులైవుంటారు. పుస్తకప్రియులైవుంటారు. వీళ్ళల్లో చాలామంది రైటర్స్ కూడా ఉంటారు. 'న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్' స్థాయిలో మంచి మంచి పుస్తకాలు రాసివుంటారు. 

అంతెందుకు, అమెరికా ప్రసిడెంట్ ట్రంప్ కూడా రచయితగా, సహరచయితగా ఒక డజన్ బుక్స్ రాశాడన్న విషయం మీకు తెలుసా? 2004-2017 వరకు, "ది అప్రెంటిస్" పేరుతో ట్రంప్ ఒక రియాలిటీ షో కూడా హోస్ట్ చేశాడు. అది వేరే విషయం. 

ట్రంప్ కూడా మంచి పాఠకుడే.  

పుస్తకాలు చదవటం అనే అలవాటు మనిషిలోని ఆలోచనా శక్తిని, విజువలైజేషన్ పవర్‌ను ఎప్పటికప్పుడు పెంపొందిస్తుంది. పాఠకుల్లో ఒక స్థాయి క్రమశిక్షణకు మూల కారణమవుతుంది. ఈ రెండూ ఉన్నప్పుడే ఎవరైనా ఏ ఫీల్డులోనైనా ఎదగగలుగుతారు. 

వ్యక్తుల ఉన్నతస్థాయి ఎదుగుదల, పరోక్షంగా వారి దేశ ఉన్నతికి ఉపయోగపడుతుంది.     

మనమెక్కడున్నాం మరి? 

యూట్యూబ్ కనిపెట్టిన దేశపౌరుల కంటే కంటే ఎక్కువగా మనదేశంలోని వ్యూయర్సే ఆ వీడియోల్ని పనీపాటా పక్కనపెట్టి ఎగబడి చూస్తున్నారు. యూట్యూబ్ ద్వారా వారికి భారీ ఆదాయం రావడానికి కారణమవుతున్నారు. 

యూట్యూబ్ వీడియోలు చూడటం తప్పు కాదు. ఎలాంటి వీడియోలు చూస్తున్నామన్నది పాయింట్. పనికిరాని టైం పాస్ వీడియోలు చూస్తూ, ఎంత టైం వృధా చేసుకుంటున్నామన్నది పాయింట్. 

యూట్యూబ్‌లోని వీడియోలు చూడ్దానికి అలవాటుపడటం ద్వారా... పరోక్షంగా మనలోని ఆలోచనా శక్తిని, ఊహాశక్తిని, విశ్లేషణాశక్తిని, విజువలైజేషన్ పవర్‌ను ఊహించని స్థాయిలో కోల్పోతున్నాం. 

పుస్తకాలే కాదు, అసలు చదివే అలవాటునే పూర్తిగా మర్చిపోతున్నాం.  
 
ఇది నిజం కాదా?

మనలో ఎంతమంది పెన్ను, పేపర్ పట్టుకొని గత 24 గంటల్లో ఏదైనా రాశారు? అసలు మనలో ఎంతమంది ఏదైనా ఒక పుస్తకం పట్టుకొని ఎన్నిరోజులైంది?

"ఇప్పుడంతా డిజిటల్ యుగం, పుస్తకాలు అవుట్‌డేటెడ్" అనే ముందు, ఈ పోస్టు ప్రారంభంలో నేను రాసిన అమెరికా ఉదాహరణ ఇంకోసారి చదవండి. 

మన దేశంలో పబ్లిషింగ్ వ్యవస్థ ప్రపంచస్థాయి ప్రమాణాల్లో ఎందుకు లేదు?... మన దేశంలో 99.99% రచయితలు ఎందుకు రాయటం ద్వారా కనీసం బ్రతికే అంత డబ్బు కూడా ఎందుకు సంపాదించుకోలేరు?... ప్రొఫెషనల్ రైటర్స్‌గా ఎందుకు బ్రతకలేరు?... 

ఇలాంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం కూడా ఒక్కటే. 

మనం పుస్తకాలు చదవటం లేదు.     

పుస్తకాలంటే కేవలం కథలు, కవిత్వం, సాహిత్యం మాత్రమే కాదు. నిత్య జీవితంలో పనికొచ్చే పుస్తకాలు కూడా పుస్తకాలే. అవి కూడా ఎక్కువగా రావాలి. పాఠకులకు నిత్యజీవితంలో ఉపయోగపడాలి.  

ఫిక్షన్ కావచ్చు, నాన్-ఫిక్షన్ కావచ్చు... చదివించే గుణం ఉన్న పుస్తకాల్ని మాత్రం మన రచయితలు కూడా ఎక్కువగా రాయటం లేదు.  

బహుశా, అందుకే మనవాళ్ళు పుస్తకాలు కొనటం లేదు. 
తెలుగులో అయితే ఇది మరీ ఎక్కువగా ఉంది. 
ప్రచురణ కర్తలు మాత్రం ఏం చేస్తారు?  

Great nations are built by great minds.
And great minds are awakened by great books.

Every great nation has leaders who write, readers who think, and publishers who put ideas into people’s hands.

Because a nation is first built in silence—
not in noise, but in the turning of a page.

- మనోహర్ చిమ్మని